banner 6 1

100

వంట గది – ప్రాముఖ్యము

మానవుని మనుగడకు ఆహారము అతి ప్రాముఖ్యము. అట్టి ఆహారము పక్వము సేయు పాఠశాలలు పవిత్రముగను, వాస్తు శాస్త్రానుకూలముగా నిర్మించవలయును. భారతదేశమున వంటనిమిత్తము గృహభవనములందు నిర్మించు ఆగ్నేయభాగమున ఆగ్నేయదిశయందు గాని ఆగ్నేయ ఉపగృహమందు పొయ్యి తూర్పు గోడకు తగలని విధముగా ఆగ్నేయమూలనే, వంటచేయువారి ముఖము తూర్పుగా నుండురీతి నిర్మించుకొనిన ఆ గృహమందు ఆరోగ్యము, ఐశ్వర్యము సంతానసౌఖ్యము అన్ని శభఫలితము లొసంగును. పొయ్యి దక్షిణ మున్న యెడల ఆ యింట నిరంతరము స్త్రీ పురుషుల కనారోగ్యము కల్గును. యమధర్మ రాజున కెదురుగా వంట చేయుటవలన ఆ యింట అపజయము, విరోధములు సంభవించును.

రృతి భాగమున వంటగది నిర్మించుకొనవచ్చును. నైరృతి భాగమైనను వంటవండువారి ముఖము తూర్పుగా ఉండునట్లు నిర్మించు కొనవలెను. ఫ్యాక్టరీలలో నైరృతి భాగమున పొయ్యున్న యెడల ఆ ఫ్యాక్టరీలలో సమ్మెలు, గవర్నమెంటుతనిఖీలు ఎల్లప్పుడును జరుగవు. పడమట దిశన వంటిల్లున్న యెడల ఆయింట ఆడవారు ధనము విస్తారముగా ఖర్చు చేయుటయును, బరువు బాధ్యతలన్నియు ఆడవారే మోయుటయు జరుగుసు. ఆ ఇంట పేరు ప్రఖ్యాతులు కూడా ఆడ వారికే దక్కును. వాయవ్య దిశన వంటిల్లున్న యెడల ఆ యింట నివాసించు వారలకు కోర్టు వ్యవహారములు అధిక వ్యయము సంభవించును. ఉత్తరము పొయ్యున్నయడ లాయింట నిరంతరం స్త్రీల – కనారోగ్యము కల్గి ధనము వ్యయమగును. నిరంతరము దుఃఖము కల్గిం చును. ఉత్తరము పొయ్యి పెట్టి నిప్పు ముట్టించుచున్నయడల “ఏకులు పొయ్యిలో దాచి పెట్టిన” అను సామెత సనుసరించి ఎంతటి కోటీశ్వరుడే సను ధనము హరించి బీదవాడగును. ఈశాన్యమున పొమ్యున్న యడల ఆ యింట నివశించువారలకు మనస్థాపము, ధర నష్టము, పరస్పర విరోధము భార్యభర్తలకి అన్యోన్య ప్రేమ లేక పోవుట, తండ్రికి పిల్లలకు ఐక్వత లేకపోవుట ఆ ఇంట పిల్లలకు విద్యావివేకమునసించుట, మొదలగు గుణములు సంభవించి చివరికి పిచ్చి వారై పోవుట సంభవించును. తూర్వ భాగమున పొయ్యున్న యడల ఆ యింట సుఖము లేనివారై కష్టములు ననుభవింతురని తెలియవలయుసు. కాన వాస్తుశాస్త్రానుకూలముగా తూర్పుగోడలకు పొయ్యి తగలని విధముగా నిర్మించుకొని “ఆరోగ్యమే మహాభాగ్యము” అను సామెతనహా సరించి మీరు అప్లైశ్వరములను, ఆయురారోగ్యములను పొందగలుగుదురు.

ఈశాన్య వంటశాల : అలక్ష్మీశాల

ఆగ్నేయవంటశాల : అష్టలక్ష్మి నాట్యశాల”ఖానే వాలాకే నామ్ దానే దానే పర్ లిబాహై. “

వాయవ్య వంటశాల : అధిక వ్యయశాల

నైరృతి వంటశాల : వదియాడిగి కర్రశాల,