banner 6 1

101

తులసి మహిమ

తులసిని నాటుటవలననూ, పెంచుటవలనూ, నీళ్ళుపోసి తడుపుట వలననూ, తాకుటవలననూ మనోవాక్కాయ కర్మలచేత చేసిన పాపములన్నియు దహించబడును.

తులసీ చెట్టు మొదలునుండుమట్టిని తిలకముగాధరించిన వారివైపు చూచుటకు మృత్యు దేవతయే భయపడును. తులసీవృక్షమునకు ప్రద క్షణము చేయుచున్న యెడల సమస్త పుణ్యక్షేత్రములు దర్శించి సంతటి పుణ్యము కల్గును. తులసీదేవి గల తావున త్రిమూర్తులు నివసించును. తులసీ దేవికి వందనము చేసెడివారికి సర్వశుభములు చేకూరును. గృహావరణయందు తులసీదేవిని నెలకొల్పిన అప్లైశ్వర్య ములు, ఆయురారోగ్యములు, సుఖసంతోషములు, కూడుటయే గాక మోక్షమునకు అర్హులగుదురు

తులసి ఆకు రసము రాసిన శోభి తగ్గును.

తులసి ఆకు రసము పిండిన చెవిపోటు తగ్గును.

తులసి వేరు రసము రాసిన తేలు బాధ తగ్గును.

తులసి ఆకురసము కుష్ఠువ్యాధికి సర్వోత్తమమైనది.

తులసి వేరును నేతితో సేవించితే ఓజస్సు, బలము పెరుగున

తులసి ఆకురసము మేధస్సు పెంచును.

తులసికోట నిర్మాణము

వాస్తుశాస్త్రమున ద్వారములు లక్ష్మి ప్రదములు, పవిత్రములు కాన గృహముయొక్క వెనుక ద్వారమున తులసి కోట నిర్మించుకొని పూజ జరిపించుకొనిన సంపద, సౌభాగ్యము” పాతియ ప్రత్యము వృద్ధిపొందును,