స్నానశాలలు – వాని విధము
స్నానశాలలు తూర్పు భాగమున యేర్పాటు గావించుకొనవలసినదిగా వాస్తుశాస్త్ర విజ్ఞానవంతులు అందఱును తెల్పినారు,
తూర్పున స్నాశ శాలవలన సూర్యరశ్మి దేహమునకు తగిలి స్వేదరంధ్రములు విప్పారి స్నానము చేయువారి మురికి శుభ్రముగా పోయి దేహము ఆరోగ్యవంతముగా నుండును. తూర్పు భాగమున స్నానశాలలు ఉత్తమము. ఆగ్నేయభాగమున స్నానశాలలు ఆడ వారి కనారోగ్యము కల్గించును. దక్షిణదిశ స్నానశాలలు గృహస్థులకు ఆరోగ్యమును మనశ్శాంతిని కోల్పోవును. నైరృతిస్నానశాలలు అనారోగ్యము, విరోధము కీర్తి సష్టము కల్గించును. పడమట స్నాన శాలకు ధనధాన్యాభివృద్ధి కలుగజేయును. వాయవ్య భాగమున స్నాన శాలలు కించిత్తు వివాదము కల్గును. ఉత్తరభాగమున స్నానశాలలు ధనధాన్యాభివృద్ధిని, స్త్రీ) ఆరోగ్య మనోవికాసమును కలుగజేయును, ఈశాన్య భాగమున సానశాలలు అశాంతి విద్యా వివేక నష్టము కలుగజేయును. నైరృతి భాగమందు స్నానశాలలు నిర్మించుట మంచిది కాదు.
స్నానము చేయునవుడు ఈ క్రింది శ్లోకములను పఠించవలెను :-
శ్లో ! గంగేచ యమునే కృష్ణ గోదావరీ సరస్వతి 3 నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ॥
3 అను శ్లోకమును చెప్పిన తరువాత స్నానము చేయుచు
శ్లో ! గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనాం శతె రవీ ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి ! L
స్నానము చేయునపుడు గోవింద గోవింద అనుచూ నెత్తి మీద నీరు చల్లుకొని స్నానము చేయవలెను.
శ్రీ, పురుషులు దిశ మొలతో స్నానము చేయరాదు.
మరుగుదొడ్ల విధానము
గృహభవనములయందు మరుగుదొడ్లు (లెట్రిన్స్) శాస్త్రాను కూలముగా ఏర్పాటుగావించుకొనిన మంచి శుభఫలితములు కలును,
తూర్పు భాగమున మరుగుదొడు ఏర్పాటుగావించుకొని యువ యోగించిన యెడల గృహస్థులకు గౌరవభంగము, పదవీ వుద్యోగులకు నష్టము, సుఖసంతోషములను కోల్పోవుదురు.
దక్షిణభాగమున మరుగుదొడ్లు నిర్మించుకొనినయెడల అనారోగ్యము, అస్థిరత్వము, సుఖహీనత కల్గును.
నైరృతిభాగమున మరుగుదొడ్లు ఏర్పాటు గావించుకొనిన కీర్తకి సష్టము, ఆర్థిక, ఆరోగ్యములయందు దినదినాభివృద్ధి చెండ కుండుట, పెద్దసంతానమునకు అనారోగ్యము, మనశ్శాంతి లేకుండుట, అనవసరపు ఖర్చులు కల్గి గృహస్థులను క్రమేపి కృంగదీయును. ఉత్పత్తి వ్యాపార సంస్థలయందును నైరృతిభాగమున మరుగుదొడ్లుయున్న యడల అడ్డంకులు కల్గి సాగక మూతపడును.
పడమటి భాగమున మరుగుదొడ్లు ఏర్పాటు గావించుకొన్న యడల కీర్తి నష్టము, అశాంతి, అనారోగ్యము, మొదలగు ఫలితములు కల్గును.
ఉత్తరపు భాగమున మరుగుదొడ్లు ఏర్పాటు గావించుకొనిన స్త్రీలకు అనారోగ్యము, హిస్టీరియా, మూర్ఛలవంటి భయంకర వ్యాధులు కల్గును.
ఈశాన్య భాగమున మరుగుదొడ్లు ఏర్పాటు గావించుకొని వుపయోగించుచున్న యడల ఆగృహమున పిల్లలకు విద్యావివేకములు నశించి, మనస్థిమితము లేక దుష్టప్రవర్త నకు లోనగుదురు. ఈ శాన్యమునకు శుంభుడు అధిపతియై యున్నాడు, (శుంభుడు అనగా సుఖము నిచ్చువాడనిఅర్థము.) భస్మాసురునివై ఖరివలె సుఖము నిచ్చువానిపై న మలమూత్ర విసర్జన చేయరాదు. ఉత్పత్తి వ్యాపార సంస్థల యందై నను ఈశాన్యము మరుగుదొడ్లున్న యడల అశాంతి, ధన కష్టము మొదలగునవి కల్గును.
ఆగ్నేయభాగమున మరుగుదొడ్లు ఏర్పాటు గావించుకొనవచ్చును. అగ్ని దేవుడు సర్వరక్షకుడు భక్షకుడు. అగ్ని దేవునికి పవిత్రుడనునామధేయముకలదు. (పవిత్రముచేయువాడు), కాస తూర్పుగోడకు అనని విధముగా ఆగ్నేయమున మరుగుదొడ్లు ఏర్పాటు గావించు కొనవలెను.
వాయవ్య భాగమున మరుగుదొడ్లు ఏర్పాటు గావించుకొనవచ్చును. వాయుదేవునకు విశ్వవ్యాపి అను కీర్తి గలదు గాన సర్వత్ర పరిశుభ్రముగా యుండును. అనుభవమున కూడ వాయువ్యమున మరుగుదొడ్లు నిర్మించిన శుభఫలితములిచ్చుచున్నవి.
వాయువ్యమున అయినను మరుగుదొడ్లు ఉత్తరపు ప్రాకారమునకు ఆననివిధముగా ఏర్పాటు గావించుకొనవచ్చును. మరుగుదొడ్లు వక్రమముగా నిర్మించుకొనుటవలన ఆరోగ్యమే మహాభాగ్యము అనుపదము నిజము చేసుకొన గల్గుదుము.
ఈశాన్య పాయఖాన _ యింటివారికి దవాఖానా.
దక్షిణ మరుగుదొడ్లు – ధన ఆరోగ్య హానికరములు,
నైరృతి మరుగుదొడ్లు – నైతిక ఆర్థికారోగ్యము
మరుగుదొడ్లు – గుంటలు
మరుగుదొడ్లు గుంటలు ఉత్తరవాయువ్యమున తూర్పు ఆగ్నేయము, తూర్పు, ఉత్తరము లందు మాత్రమే ఏర్పాటుగావించవలయును.
దక్షిణ, నైరృతి, పడమర, ఈశాన్యము లందు ఏర్పాటుగావించిన దుష్ఫలితములు కల్లును,
మరుగుదొడ్ల గుంటలు మూలకోణములయందు ఏర్పాటు గావించరాదు.
గృహభవన ప్రాకారములకు గుంటలు అనియుండరాదు.
గృహభవన, ప్రాకారముల గోడల ప్రయాణము గుంటలలో పడరాదు. అట్లు గోడలు ప్రయాణము పడినయెడల దీర్ఘ వ్యాధులు కల్గును.

