banner 6 1

103

గృహము – వృక్షములు

గృహావరణయందు తులసీ, మందార, మల్లె, దేవదారు, కొబ్బరి చెట్లు పోక చెట్లు మొదలుగా గల మంచి ఫలితముల నిచ్చు పూలచెట్లు నాటుకొనవలెను. గృహావరణ లోపల తీగలతో ప్రాకే చెట్లు ఎంతమాత్రము పనికిరాదు. తీగలతో ప్రాకే చెట్లవలన గౌరవ భంగము, అనారోగ్యము సంభవించును. ఉత్తరము తూర్పు భాగములందు ఎత్తైన చెట్లు ఉన్న ధవనష్టము, పిరికితనము, నిర్వీర్యత్వము, శత్రుత్వము మొదలగు దుష్ఫలితములు. ఆగ్నేయ భాగమున ఏ విధమయిన చెట్లున్నను, ఆ యింట నివసించువారలకు అనారోగ్యము, నిర్వీర్యము, బలక్షయము ఏర్పడును. నైరృతిభాగమున ఏ విధమయిన పూల మొక్క నిర్మించి నీరుపోయుచున్న యెడల ఆ యింట బలవన్మర ణములు, మూర్చ, (బి. పి.) రక్పోటు మొదలగు దుష్పలితములు సంభవించును. పడమటి దిశయందు పలువిధములగు పూల మొక్కలు నిర్మించి నీరుపోయుచున్న యడల కీరి భంగము, ఆడవారికి అనారోగ్యము వెంటాడును. వాయవ్య భాగమున వివిధమైన పూలచెట్లు పెట్టి నీరుపోయుచున్నను ఆ ఇంట నివసించు వారలకు వ్యవహార జ్ఞానము నశించును. ఉత్తరమున ఉద్యానవనము నెలకొల్ప వచ్చును. ఉత్తరమున ఉద్యానవనము ఏర్పరచుకొనినయెడల ఆ ఇంట లక్ష్మీ దేవి స్థిరనివాస ముండును. ఆ యింటాడవారి ఆరోగ్యము బాగుగా ఉండును. ఈశాన్యభాగమున పూలతోట ఏర్పాటు చేసి కొనిన యెడల ఆ ఇంట నివసించువారలకు మనస్సు స్థిమితము లేకపోవుట, పిచ్చి మొదలగు దుష్ఫలితములు సంభవించును. తూర్పున పూలతోట ఉన్న జనవిరోధము సుఖహీనత సంభవించును. గృహమునందు పూలతోటలు, వృక్షములను కడు జాగరూకతతో ఏర్పాటు గావించుకొని సుఖించవలెను.

చింత చెట్టువలన శోకము సంప్రాప్తించును. మారేడు, తాటి – చెట్లవలన అకారణకలహములు కల్గును. నిమ్మ, నేరేడు చెట్ల వలన గౌరవకీర్తి ప్రఖ్యాతులు నశించును రేగు చెట్లు, ముళ్ల చెట్ల వలన అగ్ని భయము, తగాదాలు సంభవించును. జీడిమామిడి, కుంకుడు చెట్ల వలన సుఖానందములు తోలగును. మద్ది, రావి, అవిశ, జువ్వి, చెట్ల వలన దుఃఖము కల్గును, గృహములో దానిమ్మ, తంగేడు చెట్ల వలన భార్యకు శరీరపీడ, ఔషధసేవజరుగును. యింటి ముందు మొలగ యింటి వెనుక వెలగ ఉండరాదు. పాలుగారువృక్షములవల్ల ధననాశనము పశు నాశనము కల్గును. ముండ్లుగల వృక్షములు వ్యవహారభీతి శత్రుభయము కల్గించును. కాన వాస్తు శాస్త్రానుకూలము గాకుండా పై వృక్షములను పెంచరాదు. (ఆగ్నేయభాగమున ఎర్రపూల చెట్లు పెట్టిన స్త్రీలకు అనారోగ్యము కల్గును. )