banner 6 1

104

నీళ్ళ కుండీలు

భవనములందుగాని గృహములందుగాని, ఉత్పత్తి వ్యాపార సంస్థలందుగాని నీటి కుండీలను వాస్తు శాస్త్రానుకూలముగా నిర్మించు “కొనవలయును. నీళ్ళకుండీలు ఏగోడలకు ఆనుకొనకుండునట్లు ఏర్పాటు గావించుకొనిన మంచి శుభఫలితములు కలుగజేయును. తూర్పుగోడకు నీటికుండీలానుకొనిపయెడల దీర్ఘ రోగములపాలు చేయును. పడమర దిశ లందు గోడలకు అనినఎడల అనారోగ్యము, అపఖ్యాతిపాలు చేయును. ఉత్తరపు గోడలకు అనినయడల స్త్రీలకు మనోవ్యాకులత, దుఃఖము కలుగజేయును. కాన నీటికుండీలు గదులందుగాని గృహములందు గాని గోడలకు ఆనకుండా ఏర్పాటు చేయవలెను. దక్షిణ పడమర దిశ లందుగృహమున శత్రుత్వమును కలుగ జేయును. కాన తూర్పు, ఉత్తర ఈశాన్యములందు ఏర్పాటు గావించికొనిన మంచి శుభఫలితములు తెలుగ జేయును.

భవనములపై నీరు నిల్వయుంచు టాంకులు (watter tanks) ఈశాన్యతూర్పు ఆగ్నేయభాగములందు ఎంతమాత్రము పనికి రాదు. నిర్మింపరాదు. పడమట వాయస్యభాగములందు నిర్మించిన శుభఫలితములు కలుగజేయును. నైరృతి భాగముస అధిక ఖర్చు బలక్షయము ఏర్పడును. ఆగ్నేయ భాగము స్త్రీ దుఃఖము, బలక్షయము కల్గును. దక్షిణ భాగము స్త్రీల కనారోగ్యము శత్రు ప్రాబల్యము కల్గును. కాన నీరు నిల్వవుంచు వాటరుటాంకులు పడమట భాగమున గాని వాయవ్య భాగము లందుగాని ఏర్పాటు గావించిన గృహములకు వ్యాపార సంస్థలకు మంచి ఫలితములు కలుగజేయును.