రోళ్ళనుంచు విధానము
గృహము నందుగాని గృహావరణలోగాని భూమిలోపల రోళ్ళనేర్పాటుగావించరాదు. అట్లు గృహమధ్యభాగమున రోళ్ళను నిర్మించిన వంశ క్షయము ధనష్టము కల్గును. ఈశాన్య భాగమున రోళ్ళనేర్పాటు గావించిన యెడల మనఃశాంతి కోల్పోవుదురు. అగ్నేయ భాగము రోళ్ళు పెట్టుటకు శుభస్థానము. దక్షిణమున రోళ్ళు పెట్టిన యడల నిరంతరము తగాదాలు సంభవించును. నైరృతి భాగమున రోళ్ళు పెట్టినయడల మంచి ఫలితములిచ్చును. పడమట భాగమున రోళ్ళుంచిన శుభఫలితములుండును. వాయవ్య భాగమున రోళ్ళు పెట్టినయడల కించిత్తు వ్యవహారనష్టము కలుగచేయును. ఉత్తరము రోళ్ళుంచినయ రోళ్ళుంచినయడల ధనక్షయము స్త్రీలకనారోగ్యము కలుగజేయును.
చల్ల కవ్వము ఉంచు విధానము
చల్ల కవ్వము తూర్పుదిశయందు వుంచుట ఉత్తమము. పాడి అభివృద్ధి చెందును. ఈశాన్య భాగమున కవ్వముంచుట మంచిది. ఉత్తరభాగమునందు శ్రేష్ఠము, పడమరభాగమున పనికి రాదు. దక్షిణ భాగమున చల్ల చిలికిన పాడి క్షీణించును. నైరృతి భాగమున చల్ల చిలికిన పాడి అభివృద్ధి చెందదు. ఆగ్నేయ భాగమున చల్ల చిలికిన కాన తూర్పు ఉత్తరముల ఆగ్నేయ మందు పొడి అభివృద్ధియగును.

