1. తూర్పుసింహద్వార గృహములు – వాటిఫలితములు
తూర్పు సింహద్వారములు తూర్పున విస్తారమైన ఖాళీ ఉంచి తూర్పు చూచులాగున ఏర్పాటు గావించుకొనిన గృహ భవనముల యందు నివసించువారికి సుఖ సంతోషములు, సంతాన వృద్ధి, విద్యా వివేకములు, జయము, కుటుంబములో అందఱు కలసి మెలసి, కలసి గట్టుగా మాటలాడుట, విశాలహృదయము, సంఘశ్రేయస్సు కొఱకు పాటుపడుట, గౌరవ ప్రదమైన ఉద్యోగములు లభించుట మొదలగు శుభ ఫలితములు కలగజేయును
ఉత్పత్తి వ్యాపార సంస్థలయందైనను తూర్పుసింహద్వారములు గల సంస్థలు మంచి పేరు ప్రఖ్యాతులను ఆర్జించుట, మంచి నాణ్యముగల వస్తువులు తయారుచేయుట వ్యాపారములు కష్టతరములు కాకుండ సులభతరముగా నుండుట మొదలగు శుభఫలితములు కలుగజేయును,
పురాణేతిహాసములను పరికించిన శ్రీమన్నారాయణుని గృహమునకును స్వర్గ పాలకుడైన ఇంద్రుని గృహమునకును ద్వాపర యుగమున ద్వారకలోని శ్రీకృష్ణ పరమాత్ముని గృహమునకును ఈ యుగమున తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుని దేవాలయమునకును పరమై శ్వర్యములు నొసగు తూర్పు సింహద్వారములు కలవని విశదమగు చున్నది.
మాజీ రాష్ట్రపతి డా శ నీలం సంజీవరెడ్డిగారి జస్మగృహము తూర్పు సింహద్వారము,
2. ద క్షిణ సింహద్వార గృహములు – వాటిఫలితములు
దక్షిణ సింహద్వార గృహములు దక్షిణదిశను చూచులాగున దక్షిణము ఖాళీస్థలము తక్కువగా నుంచి, ఏర్పాటు గావించుకొనిన, గృహభవనములయందు నివసించు వారలకు పౌరువము, స్వతంత్రత్వము గౌరవము వీరి ప్రధాన గుణములు. వీరు ఒకరిని కాపాడుట యందు కడు సమర్థులు అగుదురు. ధార్మిక బుద్ధి ఆధ్యాత్మికశక్తి వీరికి అధికము. మనో ధైర్యము ఆయురారోగ్యము గొప్ప పేరు ప్రఖ్యా తులు మొదలగు శుభ ఫలితములు కలుగును.
దక్షిణ సింహద్వార గృహములు అసిధార వ్రతమువంటివి, ఈ గృహములు వాస్తు శాస్త్రానుకూలముగా లేని యెడల గృహస్థులను ఆపదలపాలు చేయును.
ఉత్పత్తి వ్యాపార సంస్థల యందైనను దక్షిణ సింహద్వారము గల సంస్థలు క్రమబద్ధమైన వ్యాపారము చేయుట గవర్నమెంటు వత్తి డులకు లోనుగాకుండా వ్యాపారముచేయుట, మంచి పేరు ప్రఖ్యా తులు ధన సంపదలు రాబడి కల్గును.
పురాణేతిహాసములను పరికించిన యమధర్మరాజు, రావణాసురుడు వారల గృహములకు దక్షిణ సింహద్వారము కలిగి ఉదార గుణ సంపన్నులై వారి కీర్తి ఇప్పటికిని కీర్తింపబడుచున్నది.
భారత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మ గృహము, మద్రాస్ ముఖ్యమంత్రి M. G. రామచంద్రన్ నివాస గృహములు దక్షిణ సింహద్వారములు.
3. పడమర సింహద్వారములు- వాటిఫలితములు
పడమర సింహద్వారము పడమర దిశ ఖాళీ స్థలము వదిలి పెట్టి, పడమర దిశ చూచులాగున ఏర్పాటు గావించుకొనిన గృహభవనముల యందు నివసించు వారలకు పరాక్రమోపేతమైన పనులయందు నిపుణత, నిశ్చితాభిప్రాయము, గంభీర హృదయము కలవారై, ఆలోచనాపరులై న్యాయబద్ధులై జీవింతురు. వీరుచేయు పనులయందు వ్యక్తి త్వము కొట్టవచ్చినట్లు కనిపించును. వీరు కార్యసాధకులు అన్ని పనుల యందును నేర్పరులు వీరు కష్టపడి పని చేయుదురు. సంఘములో పలుకుబడి కలిగియుండి, మంచి గుణములు కలిగి కార్య దక్షులై వెలుగొందుచుందురు.
ఉత్పత్తి వ్యాపార సంస్థలయందు నై పుణ్యముగా వ్యాపా రము చేయుట, క్రొత్త కొత్త వస్తు నిర్మాణము యందు నిపుణత న్యాయబద్ధమైన వ్యాపారము చేయుట మొదలగు మంచిఫలితముల నిచ్చును. పడమర సింహద్వారము నైరృతి వాయవ్యములకు తిరిగి యున్న యడల అనేక కష్టనష్టములు కలుగ జేయును,
పురాణేతిహాసములను పరికించినయెడల బలిచక్రవర్తి, శిబి చక్రవర్తి, జరాసంధ చక్రవర్తి మొదలగు చక్రవర్తుల గృహములకు పడమర సింహద్వారములు కలిగి, నేటికిని జగద్విఖ్యాత మగుచున్నవి.
భారత ప్రధాని ఇందిరాగాంధి నివాసమున్న గృహము పడ మర సింహద్వారము,
హర్యాన ముఖ్యమంత్రి దేవిలాల్, పశ్చిమబెంగాల్ ముఖ్య మంత్రి జ్యోతిబస్ నివాసగృహము పడమర సింహద్వారము,
4. ఉత్తర సింహద్వార గృహములు – వాటిఫలితములు
ఉత్తర సింహద్వార గృహములు ఉత్తరము ఖాళీస్థలము విస్తా రముగా నుంచి ఉత్తరము చూచులాగున ఏర్పాటు గావించుకొనిన గృహభవనముల యందు నివసించువారలకు న్యాయవర్తనము సాధు వర్తనము కలిగి, సామాన్యస్వల్పవిషయములకైనను అధైర్యపడుటయు ధన ధాన్యాభివృద్ధి కలిగి, కుటుంబము సుఖజీవనముగా ఉండును. ఆడపిల్లలకు మంచి విద్యకలిగి, మంచి వివాహ సంబంధ ములు లభించును. వీరికి కించిత్ అనారోగ్యము కల్గును. వీరికి ఎప్పు డును ధనధాన్యముల రాబడి హెచ్చుగ నుండును,
ఉత్పత్తి వ్యాపార సంస్థల యందును ధనధాన్యముల రాబడి హెచ్చు కల్గి, వ్యాపారము వృద్ధి అగును. ఉత్పత్తి వ్యాపారసంస్థలు ఎట్టి వత్తిడులకు లోనుగాకుందుట, సాత్విక వ్యాపారముతో మంచి పేరు ప్రఖ్యాతులు కలుగును,
పురాణేతిహాసములను పరికించిన, ధనాధిపతియైన కుబేరుని నివాసగృహమున ఉత్తర సింహద్వారముఉండుట వలస ధనేశుడుగా రాణించెను.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యన్.టి. రామారావు నివాస గృహము హైదరాబాద్ నందు ఉత్తర సింహద్వార గృహము,
5. తూర్పు ఆగ్నేయద్వారములు – వాటిఫలితములు
గృహ భవనములకు గాని, ప్రాకారములకు గాని ఉత్పత్తి వ్యాపారసంస్థలయందుగాని, తూర్పు ఆగ్నేయద్వారముఖ ప్రవేశించుచున్న వారలకు సుఖహీనత, ఋణాధిక్యత, మంచి చేసినను, చెడు వచ్చుట, వీధిలో పెద్దమనిషిగా ఉన్నను, ఇంట్లో మాత్రం పెద్దమనిషీగా చెలామణి కాజాలకపోవుట, స్త్రీలకు అనారోగ్యము కలిగి, వివాదములు మాట పట్టింపుల వలన ధననష్టము, సంసార భంగము వాటిల్లును. కాన, తూర్పు ఆగ్నేయద్వారములు ఎంతమాత్రము పనికి రావు.
ఉత్పత్తి వ్యాపారసంస్థల యందైనను తూర్పు ఆగ్నయద్వారమున్న యెడల ఋణాధిక్యత ఇచ్చిపుచ్చుకొను విషయములందు తగాదా వ్యాపారము సరిగా సాగక మూతపడును.
చారిత్రకాంశములను పరిశీలించిన మహమ్మద్ ఘోరీ దండెత్తి ధ్వంసము చేసిన సోమనాధ్ దేవాలయమునకు తూర్పు ఆగ్నేయ ద్వారమేనని తెలియుచున్నది.
6. దక్షిణ ఆగ్నేయద్వారములు – వాటిఫలితములు
గృహ భవనములకుగాని, ప్రాకారములకు ఉత్పత్తి వ్యాపార సంస్థలయందుగాని దక్షిణ ఆగ్నేయ ద్వారమున ప్రవేశించుచున్న వారలకు బలమైన సద్గుణములు కల్గి, ఒకరికి అడ్డముపోవుట, పురుషులు దురభ్యాసములకు లోనగుట, ధనము ఇచ్చి పుచ్చుకొనుట యందు మాటతప్పుట అనారోగ్యము అధికవ్యయము ఋణాధిక్యము మొదలగు ఫలితములు కలుగును. సొంతపనులయందు అజాగ్రత్త, ఆగ్నేయ ద్వారములు ఆరోగ్య ఐశ్వర్యములకు ఆటంకములు,ఇతరుల పనులయందు నీ పుణ్యము చూపుట ఆడపిల్లల సంసారముల యందు అశాంతి కల్గుట మొదలగు దుష్ఫలితములు కల్గును.
దక్షిణ ఆగ్నేయ ద్వారమున ప్రవేశించుచున్న ఉత్పత్తి వ్యాపార సంస్థలు వాటాదారులకు విబేధము కలుగుట, ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవుట, ఋణాధిక్యతమీదనే వ్యాపారము నడు చుట జరుగును.
పురాణేతిహాసముల పరికించిన సహజ కవచకుండలధారి మహా బలవంతుడు అయిన దాన కర్ణుకు దక్షిణ ఆగ్నేయద్వారము గల భవభమున నివాసముండి కౌరవులకిచ్చిన వాగ్దాసము నెరవేర్చలేక పోయినట్లు విశదమగుచున్నది.
దక్షిణ ఆగ్నేయ ద్వారము శివకంచి యందు ఈశ్వర దేవా లయమున కలిగి నిరంతరము మతపరమైన తగాదాలకు గురియగు చున్నది.
7. దక్షిణ నైరృతిద్వారములు – వాటిఫలితములు
గృహ భవనముల యందుగాని, ఉత్పత్తి వ్యాపార సంస్థల యందుగాని దక్షిణ నైరృతి ద్వారములయందు ప్రవేశించుచున్న యడల, దీర్ఘ రోగములు, బలవన్మరణములు, అధిక శత్రుత్వము, ఎంతటి బలవంతుడైనను ఒకరికి తలఒగ్గి జీవించుట పనికి రాని పనులు చేయుట, దొంగతనములు జరుగు, క్రిమినల్ మొదలగు కేసులు తగులుకొనుట మొదలగు దుష్ఫలితములు సంభవించును.
ఉత్పతి వ్యాపార సంస్థలయందు మిషన్లు విరిగిపోవుట దొంగతనములు జరుగుట, గవర్నమెంటు వత్తిడులకు లోనగుట, మొదలగు ఫలితములుకల్గి ఆ కర్మాగారములు నాణ్యమైన వస్తువులు తయారు చేయలేవు,
చారిత్రకాంశములను పరిశీలించిన యెడల విజయనగర సామ్రాజ్యముసకు దక్షిణనైరృతి ద్వారములు ఉండుటవలన అసతి కాలములోనే శత్రు వశమైనది కాన, నైరృతిద్వారములు వాస్తు శాస్త్రమునకు ఎంతమాత్రము పనికిరావు.
శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి మఠ ప్రాకారమునకు ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో దక్షిణ నైరృతి ద్వారము కలిగి ఉండుటవలన దినదినాభివృద్ధి చెందుటలేదు.
8. పశ్చిమ నైరృతి ద్వారములు – వాటిఫలితములు
గృహభవనముల యందుగాని ఉత్పత్తి వ్యాపార సంస్థల యందుగాని పశ్చిమ నైరృతి ద్వారములయందు ప్రవేశించుచున్న యెడల కీర్తికి భిన్నమగుపనులు చేయుట, ఆడవారి పెత్తనము, ఆడ పిల్లలకు వివాహమైనను ఇంటివద్దనే ఉండుట కోర్టు వ్యవహారముల యందు ఇరొక్కొని బయటకు రాలేకపోవుట అక్కరకురాని పనులు చేయుట అధికవ్యయము అనవసరపు ఖర్చులుచేయుట మొదలగు దుష్ఫలితములు కలుగును.
ఉత్పత్తి వ్యాపార సంస్థలయందు మిషన్లు విరిగిపోవుట గవర్నమెంటు వత్తిడులకు లోనగుట నాణ్యమైన వస్తువులు తయారు చేయలేకపోవుట ఎంతచేసినను కలిసిరాకుండుట జరుగును.
9. పశ్చిమ వాయవ్య ద్వారములు – ఫలితములు
ఉత్పత్తి వ్యాపార సంస్థలయందుగాని పశ్చిమ వాయవ్య ద్వారముల గృహ భవనముల యందుగాని ప్రాకారములయందుగాని యందు ప్రవేశించుచున్న యెడల కపతరమైన పనులు ఆచరించుట చేయట, స్థిరమైన బుదిలేక మనస్సు మార్పు చెందుట దురాశపరులై అక్రమ వ్యాపారములు సాగించుట అక్రమ సంపాదన యందు, నీచకార్యములకు ప్రలోభపడుట .
పశ్చిమ వాయవ్య ద్వారములుగల ఉత్పత్తి వ్యాపారసంస్థలు అ క్తమ వ్యాపారములు చేయుట, వ్యాపారము ఎగుడు దిగుడుగా నడచుట వ్యాపారములు దురాశతో ఎక్కువ వ్యాపారములు చేసి ఇరికించును. ఒకసారి భారీ వ్యాపారము, మరొకసారి వ్యాసారము సాగకుండుట మొదలగు ఫలితములు సంభవించును.
చారిత్రకాంశమున పరికించగా బొబ్బిలికోటను ఆంగ్లేయులకు పట్టి ఇచ్చిన విజయరామరాజు గృహమునకు ఉత్తర వాయువ్య ద్వారము కలదు.
10. ఉత్తర వాయవ్య ద్వారములు – వాటిఫలితములు
గృహ భవనముల యందుగాని ప్రాకారములయందుగాని ఉత్పత్తి వ్యాపార సంస్థలయందుగాని ఉత్తర వాయవ్య ద్వారముల ప్రవేశించుచున్న యెడల స్థిరమైన బుద్ది ఉండక నీచ కార్యములు అవలంబించుట, నిజము నిష్ఠూరముకైవ, తెలపకుండుట. ఇతరులకు తలయొగ్గి జీవించుట, శనగలు తింటూ ఉలవలు చేరిలో పెట్టుట, ఆడవారు అపనిందలు పాలగుట మొదటిగు దుష్ఫలితములు కలుగును.
ఉత్తర వాయవ్య ద్వారములు గల ఉత్పత్తి వ్యాపారసంస్థలు ఎంత చేసినను కలసిరాక పోవుట అంతయు లాభము వచ్చినట్లు కనపడినను చివరకు నష్టమేర్పడును. ఇచ్చు వుచ్చుకొను వ్యవహారముల యందు మాటతపంట వ్యాపారము చేతులుమారుట మొదలగు ఫలిత ములు సంభవించును.
11. తూర్పు ఈశాన్యద్వారములు – ఫలితములు
గృహభవసముల యందుగాని, గృహముల యందుగాని ఉత్పత్తి వ్యాపార సంస్థలయందుగాని తూర్పు ఈశాన్యద్వారముల యందు ప్రవేశించుచున్న యెడల, వంశవృద్ధి పుత్రపౌత్రాభివృద్ధి, సర్వకార్యసిద్ధి, ధనప్రాప్తి, ఎల్లర సహకారము ప్రాప్తించి సంఘ గౌరవముకల్గి, జయప్రదముగా ఉండురు, మగపిల్లలకు మంచి విద్యా వివేకములు కలుగును.
తూర్పు ఈశాన్య ద్వారములుకల ఉత్పత్తి వ్యాపారసంస్థలు ఐకమత్యము, గొప్ప పేరుప్రఖ్యాతులు, ధనసంపద, రాబడి, అభివృద్ధి పొందును.
చారిత్రికాంశము పరిశీలించిన ఎన్నో వాస్తు దోషములున్నప్పటికిని కాళహస్తీశ్వరుని ఈశ్వరాలయమునకు తూర్పు ఈశాన్య ప్రవేశద్వార ముండుటవలన కీర్తి ప్రతిష్టలు కలిగియున్నవి.
12. ఉత్తర ఈశాన్య ద్వారము ఫలితములు
గృహ భవనములయందుఁగాని, ప్రాకారములయందుగాని ఉత్తర ఈశాన్యద్వారముల గుండా ప్రవేశించుచున్న యెడల భోగ భాగ్యములు, సర్వకార్యసిద్ధి, ఎల్లర సహకారము ధనధాన్య ప్రాప్తి కలిగి గౌరవసుఖములు కలుగును. ఆడపిల్లలకు మంచి విద్యా, వివాహములు జరుగును.
ఉత్తర ఈశాన్య ద్వారములుకల ఉత్పత్తి వ్యాపారసంస్థలు ధనసంపదలు రాబడికలిగి వృద్ధినొందును.
భువనేశ్వరములోని భువ నేశ్వరి ఆలయమునకు ఉత్తర ఈశాన్య ద్వారముకలిగి దినదినాభివృద్ధి చెందుచున్నది.
13. నవగ్రహ ద్వారములు ఫలితములు
గృహ భవనములకుగాని, ఉత్ప త్తి వ్యాపారసంస్థలకుగాని, ప్రాకారములకగాని ద్వారములు నిలువునపుడు ఒక్కొక్క దిశకు గల గ్రహ భాగములయందు ద్వారములకుగలుగు శుభాశుభ ఫలిత ములు, ఎఱుంగవలయును. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణపు దిక్కులకుగల ఒక్కొక్కదిశకు తొమ్మిది గ్రహములచొప్పున, నాలుగు దిశలకు నవగ్రహములు అమరిమారును కర్తలై ఉండి ఫలా ఫలము లొసంగుచున్నారు.
ఈ శాన్యము మొదలు ఆగ్నేయమువరకు గల తూర్పు భాగమునకు ఈశాన్యమునుండి 1) రవి 2) చంద్రుడు 3) కుజుడు 4) బుధుడు5) గురుడు 6) శుక్రుడు 7) శని 8) రాహు 9) కేతువు గ్రహములు వరుసగా ఆధిపత్యమువహించుచు, గృహస్తులకు ఫలితములు కలుగ జేయుచున్నారు.
దక్షిణ భాగమునకు ఆగ్నేయమునుండి నైరృతివరకు రవినుండి కేతువువరకు తొమ్మిది గ్రహములు అమరి ఆధిపత్యము సహించు చున్నారు.
నైరృతిభాగమునుండి పడమటిదిశన వాయవ్యము వరకు అదే విధముగారవి నుండి కేతువువరకు అమరి ఆధిపత్యము వహించు చున్నారు.
ఉత్తర భాగమునకు వాయవ్యమునుండి ఈ శాన్యము రవినుండి కేతువువరకు నవగ్రహములు అమరి ఫలాఫలముల నిచ్చుచున్నారు.
కాన నవగ్రహద్వార శుభఫలితముల నెరిగి గృహ భవనముల యందు ఉత్పత్తి వ్యాపార సంస్థలయందుగాని ద్వారములునిలిపిన మంచి శుభ ఫలితములు కలుగజేయును.
14. తూర్పుదిశ నవగ్రహ ద్వారఫలితములు
మూడవ భాగమున ఈశాన్యము నుండి ఆగ్నేయమువఱకు గల తూర్పు భాగమున ఈశాన్యమునుండి ఒకటవ భాగమున ద్వారములు పెట్టిన అగ్నిభయము, స్త్రీలకు అనారోగ్యము, చిన్న వారికి పెత్తనమువచ్చుట జరుగును. రెండవభాగముఖ ద్వారములు పెట్టిన స్త్రీల ఆరోగ్యము బాగుగా నుండును, సిరిసంపదలు సుఖము ఇచ్చును. మూఢవ భాగమున ద్వారములు పెట్టిన మంచి ధైర్యసాహసములు, కలహములు కలుగ జేయును, పాడిపంటలు భూములు విస్తారముగా పండును. నాల్గవ భాగమున పెట్టిన ధనధాన్య పశువృద్ధి, జ్ఞాన విజ్ఞాన శాస్త్రముల యందు ప్రావీణ్యత కల్గును. ఐదవభాగమున ద్వారములు పెట్టిన విద్యాధిక్యము, ధన ధాన్యాభివృద్ధి పుత్రలాభము, జీవనవృత్తి నిచ్చును. ఆఱవ భాగముఖ ద్వారములు నెలకొల్పిన దైవభక్తి, విద్యావిలాసము, స్త్రీ సంతోష సౌఖ్యము గృహాలంకారముల యందు ప్రాముఖ్యము, అధికార ముద్రణ కలుగును. ఏడవ భాగమున ద్వారము పెట్టిన అయుహినత, దుఃఖము పిల్లలకు మాటలు రాక పోవుట, మందగమనము ఏర్పడును. ఎనిమిదవ భాగమున ద్వారములు పెట్టిన అపవాదులు, చోరభీతి, పనికిరాని రాజకీయ ప్రమేయము ఈద్రము కలుగును. తొమ్మిదవ భాగమున ద్వారము పెట్టిన అశాంతి భూత భయము వ్యయప్రయాసము మూఢభక్తి కలుగును,
15. దక్షిణ దిశ నవగ్రహ ద్వారఫలితములు
అగ్నేయమునుండి నెరృతి వరకుగల దక్షిణ భాగము అగ్నేయమునుండి ఒకటవ భాగమున ద్వారము పెట్టిన హాని, రెండవ కుమారునకు బలమైన గుణములుకల్గి, ఇల్లువిడిచి వెళ్ళిపోవుట, అపజయము, దుఃఖముకలుగును, రెండవభాగమున ద్వారము నెలకొల్పిన, ఆడపిల్లల బరువు మోయుట, ఆడువారికి అనారోగ్యము కలుగును, మూడవ భాగమున ద్వారము పెట్టిన యెడల బంధనము, కోపము, కలుగును. ధనధాన్యముల రాబడి విస్తారముగానుండును. నాల్గవ భాగమున ద్వారము నెలకొల్పిన యుక్తాయు కవివేకములతో నడుచుకోనుట ధనధాన్యాభివృద్ధి ఆయుర్బలము పెరుగును. ఐదవ భాగమున ద్వారము నెలకొల్పిన సంఘగౌరవము, ధార్మికబుద్ధి, తపశ్శక్తి, సంపద, సౌభాగ్యములు కలుగును. ఏడవ భాగము దుఃఖము ఆయుర్ హీవత కలుగును, ఎనిమిదవ భాగమున చోరభీతి, అపవాదులు, దీర్ఘ రోగములు దరిద్రపు రాజకీయ ప్రమేయముకలుగును. తొమ్మిదవ భాగమున ఆశాంతి, కలతలు, చోరభీతి, స్త్రీ) పెత్తనము దుష్ఫలితములు కల్గును.
16. పడమర దిశ నవగ్రహ ద్వార ఫలితములు
నైరృతి నుండి వాయవ్యమునకు గల పడమటిభాగమున నైరృతి మూలనుండి ఒకటవ భాగమున ద్వారము నెలకొల్పిన పుత్రహాని శత్రువృద్ధి, కీర్తినష్టము, స్త్రీ పెత్తనము కలుగును, రెండవ భాగమున తేజస్వంతమైన సంతానముకల్గి స్త్రీలు సంపూర్ణ ఆరోగ్య వంతులై మంచి పేరు బడయుదురు. మూడవభాగమున ద్వారములు పెట్టిన భూదానము, చెరువులు, బావులత్రవ్వకములను దానముచేయు గుణములుకల్గుట విస్తారముగా పంటలు పండుట, స్త్రీలవలన కలహములు ఏర్పడుట, నాల్గవభాగమున ధనధాన్యాభివృద్ధి, దైవభక్తి యుక్తా యుక్త వివేకశక్తి, నైపుణ్యము కలిగియుందురు. ఐదవ భాగమున పుత్రపాత్ర సంతానవృద్ధి, పట్టుదల, పొరువ పరాక్రమములు, ఆరోభాగమున విద్యావివేకము, స్త్రీలు విద్యావంతులగుట, గృహాలంకార వస్తువులకు ధనమును ఖర్చుచేయుట, జరుగును. ఏడవభాగమున దుఃఖము స్త్రీల నాశనము, ఆడపిల్లలకు వివాహము కాకపోవుట, ఎనిమదవ భాగమున స్త్రీలకు అనవసరపు రాజకీయ ప్రమేయము కల్గుట, దరిద్రము అధికవ్యయము కల్గును. తొమ్మిదవ భాగమున కోర్టువ్యవహారములు మనఃస్థిమికము లేకపోవుట ఋణాధిక్యము. గలుగును.
17. ఉత్తర దిశ నవగ్రహ ద్వార ఫలితములు
వాయవ్యము నుండి ఈశాన్యమునకుగల ఉత్తరభాగమున వాయవ్యమునుండి ఒకటవ భాగమున ద్వారము పెట్టిన భార్యాభర్తల అన్యోన్య ప్రేమ లేకపోవుట, స్త్రీలు అపవాదులపాలగుట, మనః స్థిమితము లేకపోవుట, భార్యావియోగము కల్గుట జరుగును. రెండవ భాగమున సుఖహీనత స్త్రీలకు పెత్తనముకల్గును, మూడవ భాగమున ఇతరుల ఆస్తిపాస్తులు కలియుట, కోర్టులలో తగాదాలు పాలగుట నాల్గవభాగమున ధనధాన్యాభివృద్ధి, పశుసంపద సిరిసంపదలు, జ్ఞాన విజ్ఞాన శాస్త్రప్రావీణ్యత కల్గును. ఐదవ భాగమున ఆడవారికి మంచి భారీగుణములు, ఆడపిల్లలకు పురుషసంతాన ఆధిక్యము, సంఘ గౌరవము, భోగభాగ్యములు కలుగును. ఆరవభాగమున సంపద సౌభాగ్యములు, వజ్రవైఢూర్య మాణిక్యములతో తులతూగుట పలుకుబడి, ఏడవభాగమున స్త్రీలకు అనారోగ్యము. ధననష్టము మంద గమనము కలుగును. ఎనిమిదవ భాగమున రాజకీయ ప్రమేయము, అనారోగ్యము దుఃఖము తొమ్మిదవ భాగమున ఉత్తరకేతువు గురు ఫలమునిచ్చును.

