banner 6 1

107

ద్వారములు తలుపులు – విధానము :-

సింహద్వారమునకు అమర్చు తలుపులు తెరుచునపుడు వాటంతటవి పడుచున్న యెడల యజమానికి మలిచాంచల్యము కలువు, ద్వారముయొక్క తలుపులు వాటంతటవే పడుచున్న యెడల ప్రాణ నష్టము, వంశహాని కలుగును. తలుపులు కష్టతరముగా పడుచున్న యడల మతిభ్రంశము కలుగును. తలుపులు లోపలికి వంగిపడుచున్న యెడల సంపదలు నశించును. వెలుపలికి వంగి పడుచున్న యెడల గృహయజమాని అన్యప్రదేశములందు తిరుగుచుండును. తలుపులు మూయునపుడు, తెరచునపుడు ధ్వని కలుగుచున్న యెడల, చోరభీతి కల్లును. తలుపులు తీయనపుడు ఒక రెక్క వెనుకకు, ముందుకు పోయినయెడల, ఆ గృహమున భార్యాభర్తలకు చిన్న చిన్న కలహములు, పెడగా మాట్లాడుట కలుగును. తలుపులు నెట్టినపుడు వెనుకకు పోయి కొద్దిగా ముందునకువచ్చి ఆగినయడల ఆ గృహములో అందఱు యజమానురాలి మాట గృహములో నున్నంతవఱకు వినవలసివచ్చును. అట్లనే అన్ని ద్వారములు వర్తించును. సింహద్వా రము తలుపులు వాని లక్షణములు గృహ యజమానునకు వర్తించును. అట్లనే సింహద్వారమునకు ఎదురు వాకిలి వాని లక్షణములు యజమానురాలికి వర్థించును. దక్షిణవువై వు ద్వారములు కుమారులకును, ఉత్తరపు వైపు ద్వారములు కుమార్తెలకును, వాయవ్య దిశ ద్వారములు అల్లుండ్రకును, ఆగ్నేయ భాగపు ద్వారములు కోడండ్రకును, నైరృతిభాగపు ద్వారములు ఆ గృహమున ముసలి (పెద్ద) వారికి ఈశాన్యభాగవు ద్వారములు చిన్న పిల్లలకును ఇట్టి ఫలితములు కలుగజేయును. కాన ద్వారములకు అమర్పు తలుపులను వాస్తు శాస్త్రానుకూలముగా నిర్చించుకొనవలయును. ఉత్పత్తి, వ్యాపార సంస్థలయందైనను ద్వారములకు తలుపులు శాస్త్రాను కూలము లేనియెడల మాటపట్టింపులు, సెకులు, గవర్న మెంటు వత్తిడులకు లోనగుట జరుగును,

మూడు ద్వారముల ఫలితములు

ఒక గృహముపకుకాని, భవనమునకు కాని చిన్న కుటీరమునకు గాని మూడుద్వారములు పెట్టరాదు. అట్లు పెట్టిన ధననష్టము సంసార భంగము మనోవ్యాకులత కలుగును. వాస్తువున ఒక గృహమునకు వెలుపలికి కాని లోపలకాని ఒకేవరుససకాని దృష్టికి కాని దిశకుశాని గదికి గాని గదులకు గాని మూడుద్వారములు నెలకొల్పిన ఈశ్వరుని కృష్టికలిగి అందు నివసించు గృహస్థులను అష్టకష్టములపాలు జేయును.

ఒక గృహముసకు ఒకేవరుసన మూడుద్వారములు పెట్టిన ఆ ఇంట అత్తాకోడళ్ళు కాపురము చేయుట కష్టము.

గృహములోని గదులకు దక్షిణపు మూడు ద్వారములు. ఉన్న పురుషులకు కడుపునొప్పివంటి వ్యాధివలస ఆపరేషను జరుగును.

గృహములోని ఉత్తరవైపున గదులకు మూడు ద్వారములు ఉన్న యెడల స్త్రీలకు కడుపునొప్పివంటి వ్యాధివలన ఆపరేషను చేయించుకొనుట తప్పని సరిగా జరుగును.

ఈశాన్యభాగమున గదులకు మూడుద్వారములున్న అపార ధననష్టము భయము, దుఃఖము, మనోవ్యాకులత కలిగించును,

నైరృతి భాగమున గదికి మూడుద్వారములున్న యెడల ప్రాణభయము, మాటపట్టింపులు, వ్యవహార నష్టము, ఆర్థికనష్టము కలుగును.

ఆగ్నేయభాగము గదికి మూడుద్వారములున్న స్త్రీకి అనా రోగ్యము.

వాయవ్య భాగమున గదికి మూడు ద్వారములున్న యెడల వ్యవహార సరళి సరిగా సాగకుండుట ధననష్టము వ్యవహారసష్టము కలుగును.

తూర్పు భాగమున ఒకదృష్టికి మూడు ద్వారములు పెట్టిన అందు నివసించువారలకు ధన, సుత, సుఖ, నష్టము, పదవీ, ఉద్యోగ కష్టము గలుగును.

దక్షిణపుదిశకు ఒకేగోడకు అడ్డుగోడలు లేకుండగ మూడుద్వారములు పెట్టినయెడల మరణభయము, శతృవృద్ధి, ఆనారోగ్యము

పడమర దిశన మూడు ద్వారములు పెట్టినయెడల కీర్తి నష్టము కర్తవ్యనిర్వహణను ఒనర్పలేకుండుట, ఋణాధిక్యము,

ఉత్తరదిశకు మూడు ద్వారములు పెట్టిన యెడల స్త్రీ సుఖజీవకమునకు నష్టము వాటిల్లును. ధవసంపదల రాబడి తగ్గి పేదవా రగుదురు.

ఒక గృహమునకు ఏదిక్కున వెలుపలకు మూడు ద్వారములు ఉన్న యెడల ధనము ఎంతవచ్చినను ఖర్చు అధికమై ఋణగ్రస్తులగుదురు.

వాస్తుశాస్త్రానుకూలముగా ద్వారములను ఉత్పత్తి వ్యాపారసంస్థల యందైనను మూడుద్వారములు నెలకొల్పిన వాటాదారులకు విభేదము, ధననష్టము, మాటపట్టింపులు, స్ట్రైకలు మొదలగునవి జరుగును.

ద్వారములు ఈశాన్యము ఎత్తుగా యున్నయెడల ఆకస్మిక ప్రమాదములు అప మృత్యు దోషములు కల్గుసు

ద్వారములు నెరృతి భాగము వల్లముగా యున్న యడల పర పెత్తనం కల్గును.

ద్వారముల కెదురుగా ఉన్నవాని ఫలితములు

ద్వారముల కెదురుగా ఏవిధమైన కట్టడములు, కాలువలు, దేవాయములు, స్థంభములు, దూములు, చెట్లు, మెట్లు ఉండరాదు.

  1. ఎదుట ద్వారమున కెదురుగా ఎదుటి వారి గోడ మొత్తయున్న వీధి తగాదాలు, ధనము ఇచ్చిపుచ్చుకొను విషయములందు తగాదాలు, మాటవిభేదము వచ్చును.
  2. వెనుకద్వారముగుండా ఎదుటివారి గోడ మొత్త మూల ఏవిధమైన కట్టడములున్నను, మూత్రస్థానమున వ్యాధులు కలుగును. (గ్యాస్ ట్రబులు, మొలలు)
  3. ఎదుటి ద్వారమున కెదురుగా కాలువ ఉన్న యెడల గృహస్థులకు దుఃఖము నిచ్చును. వెనుక ద్వారమున కెదురుగా కాలువ ఉన్న యెడల బహిష్టు జబ్బులు, స్త్రీ) దుఃఖము జరుగును.
  4. ఎదుటి ద్వారమున కెదురుగా బావి ఉన్న యెడల ఆకస్మిక మరణములు నిర్వీర్యము, ధనకష్టము, జరుగును. వెనుక ద్వారమున కెదురుగా బావి ఉన్న యెడల కేన్సరు. భయంకర సుఖవ్యాధులు కలుగును,
  5. ద్వారమున కెదురుగా వెన్నుగాడి ఉన్న యెడల సంసార భంగము కలుగును.
  6. ద్వారమున కెదురుగా దూలమున్న యెడల ఆ గృహమున భార్యాభర్తలకు నిరంతరము తగాదాలు జరుగుచుండును. ద్వారముల కెదురుగా చెట్టు ఉన్న యెడల సంతాన నష్టము, సంతానము లేకపోవుట కలుగును, ద్వారమున కెదురుగా దేవాలయ శిఖరమున్న యెడల స్త్రీల వికాసమునకు భష్టము,
  7. ద్వారమున కెదురుగా పొయ్యి ఉన్న యెడల ధననష్టము నిరంతరము తగాదాలు జరుగును.
  8. ద్వారమున కెదురుగా మెట్లున్న యడల ప్రమాదములు జరుగును.
  9. ద్వారమున కెదురుగా లెట్రిన్ టాంకులు ఉన్న యెడల ధన నష్టము అనారోగ్యము కలుగును.
  10. ద్వారమున కెదురుగా పుట్టలున్న అశాంతి, అనారోగ్యము.
  11. ద్వారమున కెదురుగా స్థంభము ఉన్న యెడల మనోవ్యాకులత, నీచప్రవర్తన కలుగును.

గృహభవనములకు నాలుగుదిశల ద్వారములుండుట శ్రేష్ఠము. ప్రాకారమునకు ఒకేద్వారము ఉండుట శ్రేష్టము.

గృహభవనములకు ఒక సింహద్వారము పెద్దది మిగతావి చిన్నద్వారము లుండుట శాస్త్రసమ్మతము,

తూర్పు ఉత్తర ఈశాన్యము చిన్న ద్వారము దక్షిణ పడమకను పెద్దద్వారములు ఏర్పాటు గానించుకొనవలెను.

భవనములయందు క్రింద అంతస్థుపె అంతస్థు ద్వారములు ఒకేసారిగా ఏర్పాటు గావించుకొనవలయును.

ద్వారములకు రెండుప్రక్కల మొత్తలువచ్చునట్లు నిలుపపలెను లేనియెడల మనోవిశ్చలత లేకుండుట జరుగును. 

గోడలు పగుళ్ళు కల్గిన ఫలితములు

సింహద్వారము పై గోడపగిలిన ఆ ఇంటియజమానికి నష్టము కల్లును. ఉత్తర సింహద్వారము గల యింటికి సింహద్వారము పై గోడపగిలిన గృహయజమాని పిచ్చి వాడగును. పశ్చిమునింహద్వారము పై గోడపగిలినయడల యజమాని జీవితమునకు అపాయము కల్గును. దక్షిణ సింహద్వారముపై గోడ పగిలినయడల యజమానికి మారకము తెలియజేయును.

గృహభవనములు, ప్రాకారముల ఈశాన్యమూల గోడ పగిలినయడల విజ్ఞానహీనులైన సంతతి కలుగును. ఆగ్నేయము గోడ పగిలినయడల పుట్టిన సంతతిలో రెండవసంతానమునకు నష్టము కల్గును లేదా అంగ వెకల్యము జరుగును, లేదా యజమానికి అతి విచారము కల్లును, వాయవ్యపుగోడపగిలినఎడల మూడవనంతాసమునకు విజ్ఞాన శూన్యతకల్లును, లేదా కుబుంబములో నుంచి చీలిపోవును. కుటుంబమునకు విరోధి అవును. గ్రామములో కూడా విరోధి అవును, మండువాయింటికి దక్షిణ గోడ పగిలిన తప్పకాయింటివారిలో ఒకరికి అంగ వైకల్యము జరుగును, పడమరగోడ పగిలిన స్త్రీ సంతతికి అంగ వైకల్యముగాని రోగప్రదురాలగుటగాని సంభవించును, ఉత్తర గోడ పగిలిన సిరిసింపదలు తరుగును. తూర్పు గోడ పగిలిన విజ్ఞాన శూన్యులగుదురు.

కిటికీలకు బీరువాలకు పైన గోడలు పగిలిన ఎడల గృహమున దృష్టికి దోషము కలుగును. గృహ గర్భము నేల బీల్లువారిన గర్భస్రావము మొదలై న గర్భదోషములు కల్లును.

ద్వారములు దక్షిణమున పల్లము, ఉత్తరము మెరక యున్నయెడల ధన సంపత్తి తగ్గును.

ద్వారములు తూర్పు మెరక, పడమర పల్లముగా యున్నయెడల కష్టములు మాట పట్టింపులు జరుగును.

ద్వారముల మండెగములు భూమిలోనికి పాతుకుపోయిన గృహమునందు పరాధికము వచ్చును.

ద్వారముల సంఖ్యాఫలములు

గృహమునకు ఒక ద్వారము శుభము. రెండు ద్వాగములు మేలు. మూడు ద్వారములు ధననష్టము. నాలుగు ద్వారములు జయ క్రదము. ఐదు ద్వారములు నిరంతర దేశ సంచారము, చిన్న చిన్న దొంగతనములు చేయుట. ఆరు ద్వారములు గృహమునకు అన్ని వస్తువులు సమకూర్చును. పుత్రలాభముకలుగును. ఏడు ద్వారములు రోగభయము, మృత్యుభయము. ఎనిమిది ద్వారములు అప్లైశ్వర్య భోగముల నిచ్చుచును. తొమ్మిదిద్వారములు కీర్తి నాశనము, యజమానికి నష్టము, పది ద్వారములు స్త్రీ) నాశనము, పదకొండు ద్వారములు దుఃఖము, పండ్రెండు ద్వారములు ధనపుత్రాది వ్యాపార పదమూడు ద్వారములుండిన మనోవ్యధ. పదునాలుగు ద్వారములుండిన సర్వసంపదలు కలుగును. పదేను ద్వారములు గృహనాశనము, పదునాఱు ద్వారములు పుత్రపౌత్రాభివృద్ధి, ధనలాభము, సుఖానందము కలిగించును. పదునేడు ద్వారములు యజమానికి కీడు, ధననష్టము, గృహనాశనము కలుగును. పదునెనిమిది ద్వారములు ధైర్యసాహసముల నిచ్చును. పందొమ్మిది. ద్వారముల వల్లన ఫలశూన్యము, ఇరువదిద్వారములు అపజయము, ఇరవై ఒక్క ద్వారములవలన రోగప్రదములు. ఇరువది రెండు ద్వారముల వలన సంతానాభివృద్ధి. జయము కల్గును. ఇరువది మూడు ద్వారములు దుఃఖము, ఇరువది నాలుగు ద్వారములవలన వంశవృద్ధి, గౌరవమర్యా దలతో అభివృద్ధి పొందును,