చుట్టిల్లు – దాని సంగ్రహ స్వరూపము
బోడితలంత భోగము లేదని వాడుక చుట్టిల్లంత సుఖము, వాక్యము కలదు. వాస్తుశాస్త్రమున వాస్తుదోషములు గల గృహముల సంస్కరించుటయందు యంత్ర, తంత్ర, మంత్రముల కన్నను చుట్టిల్లు వేయిరెట్లు శుభఫలితములిచ్చును. ఆగ్నేయభాగమున స్థలావరణ యందుగాని స్థలములు విస్తారముగా పెరిగి యున్న యెడల అందు చుట్టిల్లు ఏ ప్రహరీగోడను తగలనివిధముగా, చూరులేకుండగ ఓపరుగా (గోపురముగా) చుట్టూ పొగపోవులాగున నిర్మాణము గావించుకొని వంట చేసుకొనిన గృహమునగల వాస్తు దోషములు హరించి మంచి శుభఫలికము లిచ్చును. నైరృతి భాగముకూడా కోణకోణములుగా గాని విస్తారముగాగాని స్థలము పెరిగియున్న యెడల ఆ భాగమున ఏ గోడలను తగలనివిధముగను అన్ని గదులకంటె ఎత్తుగను, ఎప్పుడు పడి పోనివిధముగను చుట్టూ పొగపోవువిధముగను నిర్మాణము గావించుకొని ఉపయోగించుదున్న యెడల ఆగృహమన గల సమస్త వాస్తు దోషములను నివారిచి మంచి ధైర్యము, జయము, మనోనిశ్చలతయిచ్చి కాపాడుదురు. వాయవ్య ఈశాన్యములయందు చుట్టిల్లు ఎంతమాత్రము తగదు. అట్లు ఏర్పరచిన నష్టకష్టములు కల్గును.
చుట్టిల్లు దక్షిణపుకోడకు అనియున్న యెడల ఆ ఇంట నివసించు వారలకు పిరికితనము, అనారోగ్యము, గుండెకు సంబంధించిన జబ్బులు, ధనవ్యయము, అపజయము కలుగును,
నైరృతిభాగమున చుట్టిల్లు అని యెడల అపఖ్యాతిపాలగుట భయంకరవ్యాధులు కలుగును, ధనవ్యయము. ఆగ్నేయభాగమును చుట్టిల్లు అని యెడల ఋణగ్రస్తుని చేయును తూర్పుభాగము చుట్టిల్లుఅనిన కండ్ల జబ్బులు స్త్రీల బహిష్టు జబ్బులు, పిరికితనము మొదలుగాగల దుష్ఫలితములు జరుగును.

