banner 6 1

109

తూర్ప ప్రాకార ఫలితములు

తూర్పు ప్రాకారము వంకరలు లేకుండగా ఈ శాన్యము పెరుగు వివిధముగా నిర్మాణము గావించుకొనిన తూర్పుదిశానాధుడు రవి కేవుడు ఆ దిశాపాలకుడైన ఇంద్రుడు ఆ దిశ నమరియున్న సవగ్రహములు వాస్తు పురుషునకు వొసగూడి గృహస్థులకు శుభఫలితములు నొసంగును.

వాస్తువున తూర్పు ప్రాకారము పురుష సంతానము, బంధు, చిత్ర సుఖనంతోషములకును, గౌరవములు గల పదవులకును సంబంధించినదై యున్నవి.

తూర్పు ప్రాకారమునకు లోపలగాని వెలుపలగాని నూతులు గోతులు ఆనియున్న యడల పదవీభ్రష్టులను చేయుట, పనికిరాని వ్యవహారములయందు యిరికించుట, (స్త్రీ) మనస్సు వ్యాకులత, అనారో గ్యము గల్గును. ఆగ్నేయ భాగమున నూతులు గోతులు ఆనియున్న యెడల ఆ గృహమందు నిరంతరము తగాదాలు, స్త్రీలకనారోగ్యము, దుఃఖము కల్గును.

ప్రాకారమునకు ఈశాన్య భాగమున నూతులు గోతు లాని యుస్నయడల అశాంతి, మనోవ్యాకులత నిష్ప్రయోజన వ్యవహార మందు తలదూర్చుట తూర్పు ప్రాకారమునకు గాబులాని (Water tanks) యున్న యడల గర్భస్రావములు, ప్రసవవేదనములు కల్గును.

తూర్పు ప్రహరీ గోడ దక్షిణదిశల నూతులు గోతులు లోనికి ప్రయాణము చేయుచున్న యడల రెండవ సంతానమునకు మందులచేత నయముకాని దీర్ఘ వ్యాదులు కల్గును. అదే ప్రహరీగోడ ఉత్తరదిశన నూతులు గోతులు లోనికి ప్రయాణము చేయుచున్న చిన్న పిల్లలకు దీర్ఘ వ్యాధులుకల్గి మనశ్సాంతిని కోల్పోవుదురు.

 ప్రాకారముపై ముళ్ళతీగలువంటి చట్టు పాకినయడల పిల్లల విద్యా విషయములయందు పరీక్షలలో ఉత్తిర్నాథ సాధించలేరు, శరీర వ్యాధులు మనోవ్యాకులత కల్గును, తూర్పు ప్రాకారము ముందుకు వెనుకకు పెంచి కోణకోణములుగా కట్టినెడల యాక్సిడెంట్సు, వైకల్యముగల సంతానము కల్గుట జరుగును. ప్రాకారము అగ్నేయము, పెరిగి ఉన్న యడల ఆ గృహమున నివసించు పురుషులకు బలమైన గుణములు కల్గి ప్రతివిషయమునందును తెలివిగల వారమని విర్రవీగుచు సంఘమునకు పనికిమాలిన పనులు చేయుదురు.

తూర్పు ప్రహరీగోడ సగముండి సగము లేకుండిన దిశానాధుల ప్రభావముతగ్గి, పిల్లలాగృహము వదలి వెళ్ళి పెట్టిపోవుట అధికవ్యయము కల్గి సుఖశాంతులు నశించి పిచ్చివారగుట సంభవించును. తూర్పు ప్రాకారమునకు మరుగుదొడ్లు అనియున్నయడల గుండె జబ్బులు ఆకస్మిక మరణములు కల్లును, తూర్పు ప్రాకారము పై ఏ విధమైన కట్టడములు నిర్మించినను “ఎంతటి పౌరుషవంతుడై నను వొకరికి తల వొంచి జీవించుట దీర్ఘరోగములుకల్లుట అంగవైకల్యము గల సంతా నము, పురుషాధిక్యత కోల్పోవుట మొదలగు దుష్ఫలితములు కల్గును.

ఉత్పత్తి వ్యాపార సంస్థలయందుగాని చలనచిత్రములయందు గాని తూర్పు ప్రాకారముపై ఏ విధమైన కట్టడములున్నను సమ్మెలు యంత్రములు సరిగ్గా పనిచేయకపోవుట, అశాంతి, నాణ్యమైన వస్తువులు తయారు చేయలేకపోవుట, తయారైనను సరైనధరలకు విక్రయించలేకపోవుట జరుగును. తూర్పు ప్రాకారము ఆగ్నేయము పెరిగినయడల ఋణాధిక్యతతో కర్మాగారము నడపవలసివచ్చును.

తూర్పు ప్రాకారము దక్షిణ పశ్చిమ దిశ గోడలకన్న ఎత్తు మందము తక్కువగను, ఆగ్నేయము పెరగకుండగను, ఈశాన్యము పెరుగులాగును వంకరలు లేకుండగను, ఉత్తరంగోడ సమానముగను, దక్షిణము నుండి ఉత్తరం కించితు వాటముగను భవనములయందు గాని గృహములయందుగాని వ్యాపార సంస్థలయందుగాని నిర్మించుకొనవలెను.

దక్షిణపు ప్రాకార ఫలితములు

దక్షిణ ప్రాకారము సమాంతరముగా నిర్మాణముగావించు కొనిన దిశానాధుడు కుబదేవుడు ఆ దిశాపాలకుడైన యమధర్మ ఆ దిశ సమరియున్న నవగ్రహములు వాస్తుపురుషునకు కొపగూడి గృహస్థులకు శుభ ఫలితములు కలుగజేయును .

వాస్తువున దక్షిణ ప్రాకారము నడువడి, ఆరోగ్యము పురుష బంధువులకు సంబంధించినదై యున్నది.

ప్రాకారమునకు లోపలగాని, వెలుపలగాని నూతులు గోతు లానియున్న బలవన్మరణములు, దీర్ఘ రోగములు కల్గును. ఆగ్నేయ భాగమున బావి అనియున్న టీ. బి. కాన్సర్ వంటి భయంకర వ్యాధులు సంభవించి స్త్రీలు ముందుగా మృతినొందుదురు. నైరృతి భాగమున బావి ఆనియున్న యడల ఉబ్బసము, బొల్లి, కుష్టు వంటి భయంకర వ్యాధులు కల్గి ఆ గృహమున పెద్దవాళ్ళు దీర్ఘ కాలము కృంగి కృశించుచుందురు. దక్షిణ ప్రహరీగోడకు గొబులానియున్న యడల బీపి, షుగర్ వంటి దీర్ఘవ్యాధులు సంభవించును. దక్షిణ ప్రహరీగోడ వెలువల పడమర దిశన బావులలోనికి ప్రయాణము చేయుచున్న యడల ఆ గృహమున గల పెద్ద సంతానమునకు మందులకు నయముగాని వ్యాధులు కల్గును. అదే ప్రహరీగోడ తూర్పుదిశకు బావిలోనికి ప్రయాణము చేయుచున్న యడల ఆ గృహమున రెండవసంతానమునకు మందులకు నయము గాని వ్యాధులుకల్గును. దక్షిణ ప్రహరీగోడ వంకర వంకర్లుగా వున్న ఆ గృహమున నివసించు యజమానునికి మూర్ఛ, పక్షవాతము సరముల బలహీనత వంటి వ్యాధులు కల్గును, దక్షిణ ప్రాకారముపై చెట్లు ప్రాకిన పురుషులకు శరీరవ్యాధులు అశాంతి మనోవ్యాకులత కల్గును. దక్షిణ ప్రాకారము సగమునుండి కోణాకృతినాగ్నేయమునకు పెరిగియున్న ఆయింటయజమానికి కాని, రెండవకుమారునికి గాని భార్యయుండగానే మరొకస్త్రీతో అక్రమ సంబంధము పెట్టుకొనుటగాని రెండవవివాహము చేసుకొనుట జరుగును.

ప్రాకారము ఆగ్నేయమునకు పెరిగియున్నయడల ఆగృహ మందు నివసించువారలకు బలమైనగుణములు కల్గుట, అధిక వ్యయము ఋణగ్రస్థులగుట జరుగును. దక్షిణ ప్రాకారము నైరృతికి కోణాకృతిగా పెరిగిన గృహయజమానికి గాని పెద్ద సంతానమునకుగాని భార్యా భర్తల సంబంధము సక్రమముగా లేకపోవుట, సంఘమునకు పనికి మాలిన పనులుచేయుట వొకరికి అడ్డముపోయి యిబ్బందుల పాలగుట జరుగును. దక్షణ దిశ ప్రాకారము సగముండి సగము లేనియెడల భార్యయుండగ భర్త మృతినొందుట, బలవన్మరణములు, పురుషులు గృహము వదిలి వెళ్ళిపోవుట గవర్నమెంటు వత్తిడులకు లోనగుట జరుగును.

ఉత్పత్తి వ్యాసంస్థలందైనను దక్షిణ ప్రాకారము సక్రమముగా లేనియెడల గవర్నమెంటు వత్తిడులకు లోనగుట , సమ్మెలు వాటాదారులు మారుట మొదలగు దుష్ఫలితములు కల్గును.

దక్షిణ ప్రాకారం తూర్పు ఉత్తర ప్రాకారంకన్న బలముగను, పడమరగోడలకు సమానముగను, నైరృతి ఆగ్నేయభాగము పెరగకుండగను, సమాంతరముగను, పడమర నుంచి తూర్పు కించిత్తు వాటము ను నిర్మించుకొనవలెను,

దక్షిణ ప్రాకార గేట్ల పై ఆర్చీలు ఏర్పాటు గావించుకొనిస దాతృత్వము ధనాధిక్యత కలుగజేయును.

దక్షిణపు గోడ వంకరలు – ఆరోగ్య ఆటంకములు.

దక్షిణపు ప్రాకారపు దక్షిణపువాలు వరండా చూరుకన్నా ఎత్తు యుండవలయును.

దక్షిణ ప్రాకారపు గేటు పల్లముగాయున్న యడల ధనహీనత కలుగ జేయును

పశ్చిమ ప్రాకార ఫలితములు

పశ్చిమ గావించుకొనిన దిశానాధుడు శనిదేవుడు. ఆ దిశాపాలకుడై న వరుణ దేవుడు ఆ దిశనమరియున్న నవగ్రహములు వాస్తుపురుషులకు వొనగూడి గృహస్థులకు శుభఫలితములు కలుగజేయును. ప్రాకారము సమానాంతరముగా నిర్మాణము

వాస్తువున పశ్చిమ ప్రాకారము పరువు, ప్రతిష్టలు కీర్తి, కర్తవ్యనిర్వహణకు స్త్రీ) బంధువర్గమునకు సంబంధించిన దైయున్నది.

ప్రాకారమునకు వెలుపలగాని లోపలగాని నూతులు, గోతులానియున్న యడల వివాదములు, హత్యలు, కోర్టువ్యవహారములు, స్త్రీ కనారోగ్యము మొదలగు దుష్ఫలితములు జరుగును. ప్రాకారమునకు (Water tanks) గా బులానియున్న యడల స్త్రీ) మనోవ్యథ అత్తకోడండ్రుల తగాదాలు, అపకీర్తి జరుగును.

దక్షిణదిశ వెలుపల నూతులు గోతులులోనికి పడమర ప్రాకారము ప్రయాణము చేయుచున్న యడల స్త్రీలకు మందులచే నయముగాని వ్యాధులు కల్గుట, గవర్నమెంటు వ్యవహ్యాములందు చిక్కుకొని బయట పడలేకపోవుట జరుగును. ఉత్తరదిశన నూతులుగోతులు లోనికి పడమర ప్రాకారము ప్రయాణము చేయుచున్న యడల ధనసంపదలు నొకరికిచ్చిన సరిగా తిరిగి రాకుండుట కోర్టు వ్యవహారములు, అధిక వ్యయము మూడవ సంతానమునకు అనారోగ్యము కలుగజేయును.

పడమర ప్రాకారము వంకర వంకరలుగ ఉన్న యెడల అపకీర్తి ఆడపిల్లల వివాహాటంకములు మాటపట్టింపులు జరుగును. పడమర ప్రాకారము కోణకోణములుగా నైరృతి భాగమునకు పెరిగియున్న యడల మోటారాక్సిడెంట్సు ఎంతకష్టించినను కలిసిరాకపోవుటయే గాక బలవంతులు బలహీనులగుట అపఖ్యాతి పాలగుట అడపిల్లలు వివాహమైనను అత్తవారింటికెళ్ళక పుట్టింటయుండుట జరుగును, 

ఆ ప్రాకారం వాయవ్య దిశకుకోణకోణములుగా పెరిగిన రాజకీయ ప్రాబల్యముకలుట, కల్లివను పదవులుమారుట లేక కోల్పోవుట దూర ప్రాంతములకు విస్తారముగా తిరుగుట జరుగును.

పశ్చిమ ప్రాకారము సగముండి సగము లేనియడల మోటా రాక్సిడెంట్సు, బలవస్మరణములు ఆ దిశానాధుల ప్రభావము తగ్గి “మూడు మూసి ఆరతికిన” అను సామెతన అధికవ్యయము అపకీర్తి కల్గి ఆ గృహము వృద్ధిలోనికి రాక క్షీణించును.

పశ్చిమ ప్రాకారముపై తీగలు వంటి చెట్లు ప్రాకిన మనో వ్యాకులత ఏదో విషయమున విచారగ్రస్థులగుట జరుగును.

ఉత్పత్తి వ్యాపారసంస్థలందైనను పడమట ప్రాకారము సక్రమముగా లేకుండిన మిషన్లు విరిగిపోవుట నాణ్యమైనవస్తువులు తయారు చేయలేక అభివృద్ధిలోకి రాకపోవుట జరుగును

పడమర ప్రాకారము ఉత్తర తూర్పు ప్రాకారముల కన్నా బలముగను, ఎత్తుగల, నైరృతి వాయవ్యం పెరగకుండగను వంకరలు లేకుండగను, దక్షిణగోడ సమానముగను దక్షిణమునుండి ఉత్తరమునకు కించిత్తు వాటముగను నిర్మించుకొనవలెను.

పడమరప్రాకారగేట్లపై ఆర్చీలు యేర్పాటు గావించుకొనిన పరాక్రమోపేతమైన పనులు కల్లజేయును.

పశ్చిమపుగోడ వంశరలు పరాక్రమమునకు ఆటంకములు.

పశ్చిమప్రాకారము పశ్చిమవాలు వరండా చూరుకన్నా ఎక్కువ ఎత్తుయుండవలయును.

పడమర పాకారగేటు పల్లముగా ఉన్న యడల గృహసులను బలహీన’లను చేయును.

ఉత్తరపు ప్రాకార ఫలితములు

ఉత్తరపు ప్రాకారము ఉత్తర ఈశాన్యమున స్థలము పెరుగు విధముగా నిర్మాణము గావించుకొనిన ఆ దిశానాధుడు బుధదేవుడు ఆ దిశాపాలకుడు కుబేరుడు దిశ సమరియున్న నవగ్రహములు వాస్తు పురుషునకు వొనగూడి గృహస్థులకు మంచి శుభ ఫలితములు కలుగును.

వాస్తువున ఉత్తర ప్రాకారము సిరి సంపదలకు స్త్రీ బంధువులకు తల్లి తోడబుట్టినవారు, భార్య, కుమార్తెలు, అందరికి సంబంధించి నదై యున్నది.

ఉత్తర ప్రాకారము లోపలగాని వెలుపలగాని నూతులు, గోతులు యున్న యడల స్త్రీలకు హిస్టీరియా, ఫిట్స్, అపస్మారకము లాంటి వ్యాధులుకల్గుట, ధనము యితరులకు యిచ్చినను సరిగా తిరిగి రాక వివాదాస్పదములు కల్గును, వాయవ్య భాగమున గోడకునూతులు గోతులు యున్నయడల కోర్టు వ్యవహారములు మనస్సు వ్యాకులత గల్గును. ఈశాన్యభాగమున నూతులు గోతులానియున్న యడల చిన్న పిల్లలకు మనస్తాపము కల్గుట ధనము యితరుల కిచ్చినను సక్రమముగా రాక యిబ్బందుల పాలగుదురు

ఉత్తర ప్రాకారమునకు గాబు (Water tanks) లానియున్న యడల స్త్రీలకనారోగ్యము ప్రనవ వేదనకల్లును. ఉత్తర ప్రాకారము పడమర దిశను నూతులుగోతులులోనికి ప్రయాణముచేయుచున్న యెడల ఆగృహ ముందు స్త్రీలకు మందుల చేతనయముగాని వ్యాధులుకల్లి ఋణగ్రస్తులదురు ఉత్తర దిశ ప్రాకారము తూర్పుదిశను నూతులు గోతులలోనికి ప్రయాణము చేసినయడలు ఆడపిల్ల లకు అపస్మారకములు చిన్న పిల్ల లకు దీర్ఘ వ్యాధులు బలవన్మరణములు కలుగును.

ఉత్తర ప్రాకారము వంకర సంకర్లుగ నున్న యడల ఆ గృహమందు పరుల పెత్తనము జరుగును.

ఉత్తరప్రాకారము వెలుపలకు వొంగిన ధనవ్యయము కల్లును, ఆ గృహమందు స్త్రీలు తీర్థయాత్రలు యితరప్రయాణములు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడును. ఉత్తర ప్రాకారము లోపలకు వంగిన ధనము లభ్యము గాక పోవుట, స్త్రీ మనోవ్యాకులత, ఆడపిల్లలు అత్త వారింటికి పోకుండ పుట్టింట నివాసముండుదురు. ఉత్తర ప్రాకారము భిన్నాభిన్నములుగా పగిలినయడల ధనవిషయము యందు కోర్టుల పాలగుట అధిక ధనవ్యయము మొదలగు దుష్ఫలితము కలుగును,

ఉత్తరపు ప్రహరీగోడకు దిమ్మెలు చేతిపనులు కోణాకృతిగా ముందునకు వెనుకకు పెంచి నిర్మాణము గావించిన ఆడపిల్లల విద్యా వివాహములందు ఆటంకములు జరుగును. ఉత్తరప్రాకారము సగముండి సగము లేనియడల “మూడు మూసి ఆ రతికిను ” అను సామెత చొప్పున ఆ దిశానాధుల ప్రభావము తగ్గి అధికవ్యయము, (స్త్రీలు ముందుగా మృతిచెందుట జరిగి “స్త్రీ లేనిదే సిరి లేదని యును” సౌఖ్యహీనులై భోగభాగ్యములు ప్రశించును.

ఉత్తర ప్రాకారమున తీగలుండి చెట్లు పాకినయడల స్త్రీలకు మనోవ్యాకులత అనారోగ్యము శరీర వ్యాధులు కలుగును. ఉత్తర ప్రాకారము వాయవ్యమునకు పెరిగిన ఆ గృహస్థులు అంతటి కష్టమైనను వోర్పుగాభరించుటయును, ధనధాన్యముల రాబడితగ్గి క్రమేణా బీద వారగుదురు, ఉత్తర ప్రహరీగోడ ఉత్తర ఈశాన్యము పెరిగినయడల ఆ దిశా పాలకునకు గల ధన + ఈశ్వరుడు = ధనేశ్వరుడను పేరును అనుసరించి అపార ధనసంపదలు కల్గజేయును.

ఉత్తర ప్రాకారమునకు ఆనించిన కట్టడముల వలన అధిక శతవత్వము స్త్రీలకు గృహబాధ్యత వహించి నిరంతరము దుఃఖము సనుభవింతురు. “స్త్రీ) దుఃఖించినింట సిరి నిలువదు” అను సామెత తనుసరించి ధనధాన్యాభివృద్ధి తగ్గి పెక్కు కష్టములపాలు గావించును.

ఉత్పత్తి వ్యాపార సంస్థల యందుగాని చలనచిత్ర పరిశ్రమల యందుగాని ఉత్తరప్రాకారము పై ఏ విధమైన కట్టడములున్నను ఋణాధిక్యత లేర్పడి సాగక మూలపడును. ఉత్తరప్రాకారము వంకర వంకర్లుగా వున్నాయడల ఆ వ్యాపారసంస్థలు ధనమునందు లోపము, యాజమాన్యం చేతులు మారుట జరుగును.

ఉత్తర ప్రహరీగోడ దక్షిణ పడమర గోడలకన్న ఎత్తు. మందము తక్కువగను తూర్పుగోడ సమానముగను ఈశాన్యస్థలము పెరుగులాగున వంకర వంకర్లుగా లేకుండగను. పడమరనుండి తూర్పు కించిత్తు వాటముగను నిర్మాణము గావించుకొనవలెను,

ఉత్తరపు ప్రాకారము గృహముయొక్క చూరుకన్న తక్కువ వుండవలయును.

ఉత్తర ప్రాకారముపై ఏ విధమైన ఆర్చీలు ఏర్పాటు గావించు కొనరాదు. అట్లు ఏర్పాటు గావించుకొనిన అవసరము లేకున్న అప్పు చేయవలపి వచ్చును,