వాపీ, కూప, తటాక, జలాశయ ఫలితములు
తూర్పు భాగమునకు ఇంద్రుడు అధిపతై యున్నాడు. తూర్ప భాగమున నూతులు త్రవ్వించి ఆ జలమును సేవించుచున్న సుఖ హీనత పిరికితనము కల్లును, కాని వీరు పట్టుదలతో నేపనినైనను చేయగల్గుదురు, వీరికి సంపదలు కల్లును
ఆగ్నయభాగముభకు అగ్ని దేవుడు అధిపతై యున్నాడు. అట్టి ఆగ్నేయభాగమున నూతులు గోతులు త్రవ్వించి నీరు సేవించుచున్న యెడల ఆ గృహయజమానురాలికి అనారోగ్యము ఆర్థిక నష్టములు కలుగును. నిప్పుపై నీరు పెట్టిన ఆ గృహము ముందుకు సాగగలదా? పరమపావనమైన గంగాదేవి అగ్నిదేవుని వొడిలో మనగలదా ! శ్రీ తిరుపతి వెంకటేశ్వరుని దేవాలయంలో ఆగ్నేయమున బావి కలదు. ఆ బావి వల్లన మహాసాధ్వి అయిన పద్మావతీ దేవి అలిగిపోయి, మంగాపురంలో నివాసమున్నట్లు విశదమగుచున్నది.
మధురలోని మీనాక్షి దేవాలయమును పరిశీలించిన ఆగ్నేయ భాగమున కోనేరు వుండుటవలన సుందరేశ్వరస్వామి మరొకచోట నెలకొని వున్నారు. ఆగ్నేయభాగమున జలాశయములు ఎన్నడును త్రవించి వాడుకొనరాదు. అట్లు వాడుకొనిన అందు నీరు ఉషజలో పేతమై, స్త్రీలకు బహిష్టు జబ్బులు హిసీరియా కేన్సర్ లాంటి భయంకర వ్యాధులు సంభవించును ఆగ్నేయమున జలాశయములు వున్న వెంటనే పూడ్చి వేయవలెను. ఆగ్నేయ జలాశయములు అతివల ఆరోగ్యానందమునకు అంతరాయములు
దక్షిణదిశకు యమధర్మ రాజు అధిపతియైయున్నాడు. ఆ యములకు హంతకుడు అను పేరు కలదు. దక్షిణభాగమున బావిత్రవ్వి వాడు కొనుట ఎంతమాత్రం పనికిరాదు. ధర్మరాజు దిశ్పాలకు అందరిలోను వున్నతుడు ఆ దిశన పల్లముగావున్న దుష్ఫలితములు సంభవించును. దక్షిణభాగమున జలాశయము ఆ ఇంట నివసించువారలకు బలవన్మరణములు, దీర్ఘ వ్యాధులు, మూర్ఛ, బొల్లి వంటి భయంకరవ్యాధులు గలును.
నైరృతి భాగమునకు నిరృతి మృత్యుదేవత అధిపతియై యున్నాడు. నైరృతిభాగమున జలాశయము ఎంతమాత్రం పనికి రాదు. ఈ భాగమున బలాశయం ఏర్పాటుగావించినయడల ఆ జలము విష జలముగామారి భయంకర దీర్ఘవ్యాధులుకల్లి ఆ ఇంట యజమానికి గాని పెద్దకొడుకునకుగాని పక్షవాతం, ఉబ్బసం, అపస్మారకములు, రక్త మాంసములు శుష్కించు రోగములపాలగుదురు. స్త్రీలు నిరంతరం దుఃఖములనుభవించుదురు. వారలకు ఎంతటిబలాధ్యులైనను బలహీనులుగామారుట శతృభయము పిరికితనము మరణం కలుగును.
పశ్చిమ దిశకు వరుణుడధిపతై యున్నాడు. వరుణుడు కీర్తి కధిపతి. కావున పశ్చిమమువ నూతులుపనికి రావు, పశ్చిమమున నూతులున్న యెడల అపకీర్తిపాలగుట ఆడవారికి పెత్త నమువచ్చుట ఆడపిల్లల వివాహములాలస్యముగా జరుగుట స్త్రీ కనారోగ్యము దుఃఖము కలుగును.
వాయవ్య భాగమునకు వాయుదేవుడధిపతిగానున్నాడు. వాయవ్య భాగమున నూతులు నిర్మించుకొని ఆ జలము నేవించుచున్న యడల అధిక శతృత్వము అ కీర్తి దూరప్రయాణములు కోర్టు వ్యవహారములు కలుగుట మొదలగు అయింట సంతానమును నిరంతరం అనారోగ్యం కలుగును,
ఉత్తర భాగమున కుబేరుడధిపతిగాయున్నాడు. కుబేరుడు ఈశ్వరునకు అత్యంత సన్నిహితుడు. కాన ఉత్తరభాగమున వాస్తువున ఉత్తరమంతయు స్త్రీ స్థానము లక్ష్మీస్థానము కనుక ఉత్తర భాగమున నూతులు యేర్పాటు గావించుకొనుటు ఉత్తమము. ఉత్తరపు నీరు ససవృద్ధి, మనోవిశాసముసు, శ్రీ) ఆయురార్యోగాభివృద్ధి కల్గును.
ఈశాన్యమునకు ఈశ్వరుడు అధిపతై యున్నాడు. ఆయన భార్య శ్రుంగాదేవి. అట్టి పరమపవిత్రమైన గంగాదేవిని పరమేశ్వరుడు తలపై నిడుకొని ఉన్నాడు. కనుక ఈశాన్యమున బావిత్రవ్వించి ఆ నీళ్ళు సేవించుటుత్తమము,
ఈశాన్యపు నీరు సేవించుటవలన జీవనాడులయందు పుష్టి, గలము వృద్ధి పొంది, దీర్ఘాయురారోగ్యము కలుగచేయును. ఈశాన్యపు నీరుకు ధనమునకు దగ్గరసంబంధము కలదు. కాన, ఈశాన్య భాగమున నూతులుగాని కుళాయిలుగాని, నీటి కుండీలుగాని ఏర్పాటు గావించుకొన్న యెడల వంశవృద్ధి, పుత్రపౌత్రాభివృద్ధి, ధనధాన్యాభి, కీర్తి ప్రతిష్ఠలు, భోగభాగ్యములు మొదలగు శుభములు కలుగ చేయును.
ఈశాన్య భాగమైనను తూర్పు ఉత్తర ఈశాన్యముల గోడలకు ఆననివిధముగాను, తూర్పు ఉత్తరములు రవి స్థానము వదలి జలాశయ నూతులపై కప్పు వేసిన. శుభఫలితములు యివ్వజాలవు.
జలాశయములయందు, గృహభవనములయొక్క స్తంభములు గాని, దూలములుగాని, గోడలుగాని, మూలకోణములుగాని, మెట్లు గాని, ప్రయాణము చేయరాదు. ఆట్లు ప్రయాణముచేసిన మందులకు నయముగాని వ్యాధులు కలుగును.

