భారతదేశముయొక్క నైసర్గిక స్వరూపము
భారత దేశమునకు తూర్పున బంగాళాఖాతం, దక్షిణమున హిందూమహాసముద్రమును పడమట అరేబియా సముద్రమును, ఉత్తరమున ఎత్తైన హిమాలయ పర్వతశ్రేణులును ఎల్లలుగా గలవుఉత్తరభాగమున ఎత్తుగా నుండుటవలన యితర దేశములనుండి ఋణం తెచ్చుకోనుట జరుగుచున్నది. తూర్పుభాగము పల్లముగా నున్నందున మన సంస్కృతి కీర్తి, పాడిపంటలు,ప్రపంచ దేశములయందు ప్రథమశ్రేణిగా లెక్కించబడుచున్నవి. దక్షిణభాగము పల్లముగా ఉన్నందున శత్రువులవలన భయము పర రాజుల పెత్తనము మనదేశమున ఎక్కువగా తురుష్కులు యింగ్లీష వారలు పరిపాలించుట జరిగినది. పడమర పల్లముగా నున్నందున మతపరమైన వివాదములు ఆడువారి పెత్తనము మొదలుగా గల ఫలితములు తటస్థించినవి. చదువరులారా ! భారత దేశమునకు రాష్ట్రములకు, పట్టణములకు, గ్రామములకు, అన్నింటికి వాస్తు వాస్తవికతను ఋజువు చేయుచున్నవి.
మన దేశమే కాదు, ఎన్నో విషయాలను వాస్తు పరంగా పరిశీలన చేస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఉత్తరంలో బరువులు ఉండడం మంచిది కాదు. ఆర్థిక పతనానికి ఇదొక ముఖ్యకారణం నైఋతిలో బరువులు అనేక విధాలా శుభములు కలిగిస్తాయి. మనదేశానికి హిమాలయాలు ఉత్తరంలో ఉండడం, ఈ హిమాలయాలే చైనాకు నైఋతి కావడం, చూశారా విచిత్రం ! ఎన్నింటిలోనో మా అంత గొప్పవాళ్ళు లేరు అనే అమెరికా వాళ్ళను సైతం చైనీయులు వారి తెలివి తేటల ద్వారా కనిపెట్టిన కొత్త వస్తువుల ద్వారా రాత్రిళ్ళు నిద్దర్లు లేకుండా చేస్తున్నారు.భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత కూడా లేని జపాన్ దేశస్థులు ఈనాడు ఎంత అభివృద్ధి చెందారో మనందరికీ ఎరుకైన విషయమే. ప్రపంచాన్ని సాంకేతిక నైపుణ్యంతో ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నారు. సూర్యుడు ఉదయించిన తక్షణము మొదటిగా సూర్య కిరణాలు జపాన్ దేశం మీద పడుతున్నాయి. ఆ తరువాతఅవి ప్రసారమవుతూ మిగతా దేశాల మీద ప్రసరిస్తున్నాయి. ఏ స్థలం మీద అయితే మొదటిగా సూర్య కిరణాలుపడతాయో అక్కడ అభివృద్ధి తథ్యం. కావుననే ఈశాన్య భాగం గృహస్థులు ఇతరుల కన్ననూ అభివృద్ధి స్థానంలోఉంటారు. సూర్య కిరణాలు మొదటిగా ఈశాన్యం భాగం పైననే పడతాయి. అంతవరకూ ఎందుకు కొన్ని వేలసంవత్సరాల క్రితం నుండే మన భారతీయులు సూర్యుడు ఉదయించక పూర్వమే సూర్య నమస్కారాలు చేసుకుంటూసూర్య భగవానుని తొలి కిరణం పడిన తక్షణం అర్ఘ్యం వదులుతూ కొలుస్తున్నారు. శాస్త్రీయంగా సూర్యభగవానుని ఉషా కిరణాలు చాలా శుభకరమని శాస్త్రజ్ఞులు తెలిపారు. ఇతరుల కన్నా సూర్య నమస్కారాలు చేసినవారు ఎక్కువ జ్ఞానమును కలిగి ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాము. విద్యలో వీరు అధిపతులు అవుతున్నారు.
సూర్య కిరణాల గురించి ఇంకొక ఉదాహరణ కూడా. పాలు తాగే పిల్లలను సూర్యోదయాత్ సూర్య కిరణాలువారిపై పడేలాగ పెద్దలు పిల్లలను బయటకు తీసుకువచ్చి ఎత్తుకొని కాసేపు అయ్యాక లోనికి వెళ్తారు. కారణంసూర్య కిరణాల శక్తిని పిల్లలకు అందించాలని.కావుననే ఈశాన్య భాగంకు ఇంత విలువిస్తూ ఉన్నాము. ఈశాన్యములో ఎక్కువ భాగం ఖాళీ ఉంటే సూర్య కిరణాలు బాగా పడతాయి. వారికి అభివృద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ వీధి గృహం వారైనా ఈశాన్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు ఈశాన్య విషయం శాస్త్రీయంగా ఋజువైనది. ఇక మిగిలిన ద్వారములు, ఎత్తు పల్లాలు, బరువులు, పల్లములు అన్నిటికీ శాస్త్రీయత ఉంది.
ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూవము
ఆంధ్రప్రదేశమునకు తూర్పున విశాలమై లోతైన బంగాళా ఖాతమును పడమర ఎత్తైన పర్వతములును దక్షిణమున ఎత్తైన పర్వతములును ఉత్తరమున విశాలమైన ఖాళీస్థలమును కలిగి పడమరనుండి తూర్పునకు ప్రవహించు జీవసదులుకల్గి వాస్తుశాస్త్రమున కనుకూలముగా నున్నది. కావున ఆంధ్రప్రదేశము పాడిపంటలకు నిలయమై “రత్నగర్భ”, “అన్నపూర్ణ” అను నామధేయములు సార్థకమై ప్రపంచ దేశములందు కీర్తి నార్జించి సుస్థిరమైన ప్రభుత్వము లలిత కళలయందు కీర్తి అప్లైశ్వర్యం విరాజిల్లుచూ వాస్తుశాస్త్రమునకను కూలముగా అలరారుచున్నది.

