banner 6 1

112

తూర్పుదిశ మెరక పల్లము

తూర్పు భాగము పడమర నైరృతి దక్షిణదిక్కులకన్న పల్లము గను ఉత్తరముతో సమానముగ నున్న యడల ఆగృహమున నివసించు గృహస్థులకు సమస్త సుఖములు కలుగును. రాజపూజ్యత ఐశ్వ ర్యము, సంతాన కుటుంబవృద్ధి గౌరవనీయమైన ఉద్యోగములు దాన దాసీజనులు కలిగి దినదినాభివృద్ధి చెందును.

తూర్పు భాగము యితర దికులకన్న మెరకగా ఉన్నా యెడల సంతాన నష్టము సుఖహీనత అనారోగ్యము మనఃస్థిమితము లేకపోవుట మొదలగు దుష్ఫలితములు కలుగజేయును. అనుభవముఖతూర్పుభాగము మెరకగనున్న గృహమున భర్తపోయి, భార్య మిగులుటయును, పురుష సంతానము విద్యావిహీనులై అక్కరకు రాకపోవుటయును విశదమగుచున్నది.

ఉత్పత్తి వ్యాపారసంస్థలయందు తూర్పుదిశ మెరకగా వున్న యెడల మిషనులు విరిగిపోవుట, నమ్మెలు, వుమ్మడి వ్యాపార విభే డములు, మొదలగు దుష్ఫలితములు కలుగును.

ఆగ్నేయదిశ మెరక పల్లములు

నైరృతిదిశ పడమర దక్షిణదిశ మెరకగను ఆగ్నేయ వాయవ్య భాగముతో సమానముగను ఉత్తర ఈశాన్య తూర్పు భాగములకన్న మెరకగనూ వున్న యడల మంచి ధైర్యసాసములు, ధవలాభము ఆరోగ్యమును కలుగజేయును. యితర దిశలకన్న పల్లముగా వున్నయడల అమితవ్యయము మనోవ్యాకులత శతృత్వము స్త్రీలకు దీర్ఘ రోగములు మొదలగు అరిష్టములు కలుగును.

దక్షిణదిశ మెరక పల్లములు

దక్షిణభాగము ఉత్తర ఈశాన్య తూర్పుభాగములకన్న మెర కగా వున్న యడల ఐశ్వర్యారోగ్యములు ఆయుర్వృద్ధి దాత్రృత్వము మంచినడవడి కలుగజేయును.

దక్షిణభాగము యితరదిశలకన్న పల్లముగావున్న బలవన్మరణములు దీర్ఘ రోగములు సుఖహీనత ఆరిష్టములు మొదలగు దుష్ఫలితములు కలుగజేయును.

ఉత్పత్తి వ్యాపార సంస్థలయందు దక్షిణభాగము వల్లముగా వున్న యడల ఋణాధిక్యత గవర్నమెంటు వ త్తిడులకు లోనగుట యజమానికి బలక్షయము కలుగును.

నైరృతి దిశ మెరక పల్లములు

నైరృతిదిశ దొరకపల్లములు వాస్తుశాస్త్రమున ఆత్యంత ప్రాధాన్యత కలదు. నైరృతిభాగము అన్నిదిక్కులకన్నను ఎత్తుగా నుండుట శ్రేయస్కరము: అట్లు మెరకగానున్న గృహసులకు కీర్తి అయురారోగ్యములు మంచి ధైర్య సాహసములు, రాహుకళ ప్రసాదించబడి నన్ని పనులయందు రాణింతురు.

నైరృతి భాగము యితరదిక్కులకన్న వల్లముగానున్న అవ కీర్తి అనారోగ్యములు దీర్ఘరోగములు కలుగుట, ఆ గృహస్థులకు ప్రతిపని నిరాటంకముగా జరగక ఆటంకములు కలుగుట జరుగును.

ఉత్పత్తి వ్యాపార సంస్థలయందుగాని నైరృతిభాగము పల్లముగా వున్నయడల వ్యాపారసంస్థలు గవర్నమెంటు వత్తుడులకు లోనగుట వుమ్మడి వ్యాపారము కలతచెంది దెబ్బతిని సాగక మూశ పదును,

పడమటిదిశ మెరక పల్లములు

నేరృతి ఎత్తు దక్షిణదిశతో సమానముగనూ దిశలకన్న మెరకగనూనున్న ఎడల ఆ గృహస్థులు పరాక్రమోపేతమయిన గుణములు కలుగుట పుత్రపౌత్రాభివృద్ధి ధనధాన్యాభివృద్ధి కల్గజేయును,

పడమటిదిశ అన్ని దిక్కులకన్న పల్లముగా నున్న యడల అందు నివసించు స్త్రీలు అనారోగ్యవంతులగుట ఆ గృహమున పాడి వంటలు నశించుట ఆడపిల్లల వివాహములు ఆలస్యముగా జరుగుట పలువిధములైన కష్టనష్టములు యేర్పడజేయును,

ఉత్పత్తి వ్యాపారసంస్థలయందు పడమటి దిశపల్లముగా నున్న యెడల నాణ్యతగల వస్తువులు తయారుచేయలేకపోవుట తయారయిన వస్తువులు సరయిన ధరలకు విక్రయించలేకపోవుట వ్యాపారము సరిగా నడవక ప్రతిబంధకము లేర్పడి నిర్బంధం కల్గించును.

“పడమటి పల్లం అభివృద్ధికి నిరోధం.”

వాయవ్యదిశ మెరక పల్లములు

నైరృతి దక్షిణ పడమర ఎత్తు వాయవ్య ఆగ్నేయభాగముతో సమానముగను, ఉత్తర ఈశాన్య తూర్పు భాగముకన్న మెరకగా నున్న యెడల కీర్తి ధనధాన్యాభివృద్ధి రాజకీయ ప్రాబల్యము కల్గును.

వాయవ్య భాగము యితర దిక్కులకన్న వల్లముగా నున్న యెడల నవకీర్తి, అనారోగ్యము, కోరువ్యవహారములు అజీర్ణ వ్యాధులు శతృప్రాబల్యము కలుగును,

ఉత్పత్తి వ్యాపార సంస్థాలు యందెనను వాయవ్వభాగము పల్లముగా నున్న యడల గవర్నమెంటు వారి వత్తుల్లకు లోనగుట ఋణగ్రస్థంయిన వ్యాపారంచేయుట మొదలగుదుష్పలితములు కలజేయును,

“వాయవ్య పల్లము జగడాలకు దారి”

ఉత్తరదిశ మెరక పల్లములు

ఉత్తర భాగమునపల్లముగనూ తూర్పుభాగమునకు సమానముగ వున్న యడల ఆ గృహమున నెప్పుడు ధనము నిల్వయుందును. గృహస్థులు సుఖ సంతోషములతో జనపూజిత కలిగి భోగభాగ్య ములు సనుభవింతురు,

ఉత్తరదిశ యితరదిశలకన్నా మెరకగా వున్న యడల లక్ష్మీ దేవిని నా యింటికి వద్దు అవినవారగుదురు. ఉత్తరము మెరకగా వున్న యడల గృహస్థులు ఋణగ్రస్తులగుదురు. స్త్రీల కనారోగ్యము దుఃఖము దారిద్ర్యము గలుగును,

ఈశాన్యదిశ మెరక పల్లములు

ఈశాన్యభాగమున మెరక పల్లములకు వాస్తుశాస్త్రమున సత్యంత ప్రాముఖ్యత కలదు. ఈశాన్యము అన్ని దిక్కులకన్నా పల్లముగా నున్న గృహమున నివసించు గృహస్థులు ధర్మప్రవర్త సపరులై సంతానకుటుంబవృద్ధి కల్గిమంచి పేరు ప్రఖ్యాతులు పొందెదరు.

ఈశాన్యభాగమున మెరకలో యున్న యడల రోగ బాధలు సంతాన నష్టములు నవకీర్తి సంతానమునకు దుర్వ్యసనములు అశాంతి కల్గును.

2 ఉత్పత్తి వ్యాపారసంస్థలయందు ఈశాన్య భాగము మెరకగా నున్నయడల ఉత్పత్తి వ్యాపారసంస్థలు కొనసాగక మూతపడియో యుండును.

“ఉత్తరం పల్లము వృద్ధిపొందించును, స్త్రీ వికాశము.”

“ఈశాన్య పల్లము తులతూరు సిరిసంపదలు.”