banner 6 1

113

ఉపగృహములు – ఫలితములు

ప్రధాసగృహములు శాస్త్రానుకూలముగావుండి ఉపగృహ ములు శాస్త్రాసుకూలముగా లేనియెడల అశుభఫలితములు కలుగ జేయును.

ఈశాన్యభాగమున ఉపగృహము వున్న యడల శుభఫలితము నియ్యజాలవు. ప్రధానగృహముకన్నా ఎత్తుగను ఈశాన్యం మూసి యున్న అష్టకష్టములు మనోవ్యాకులత ధన, సుత, సంసార భంగము మొదలగు దుష్ఫలితములు కలుగును,

తూర్పుభాగమున ఉపగృహము వున్న అశాంతి సుఖహీనత పుత్ర పౌత్ర విద్యా వివేశాభివృద్ధి కాటంకములు కల్గును.

ఆగ్నేయ భాగమున ఎత్తుగా నుండి తూర్పు ఆగ్నేయమానిన విధముగా వుపగృహమున్న మంచి శుభ ఫలితములు కలుగజేయును.

ఆగ్నేయభాగము పల్లముగను ప్రధానగృహమున కానుకొని ఉపగృహమున్న యడల ఆపార ధననష్టము దురభ్యాసములు అనా రోగ్యము ఋణాధిక్యత కలుగును.

దక్షిణభాగమున ఫ్లోరింక్ రూఫింగ్ ప్రధానగృహముకన్నా ఎత్తుగానున్న ధనాదాయము, ధైర్యము, ఆరోగ్యము, పురుషాధిక్యత మొదలగు శుభ ఫలితములు కలుగును.

దక్షిణభాగము నున్న ఉపగృహము పల్లముగా నున్న భూత ప్రేత పిశాచములబాధ, మూర్ఛలు మొదలగు దీర్ఘ అనారోగ్యములు కలుగును

నైరృతి భాగమున వున్నతముగా పుపగృహమువున్న పరిసర వాస్తు దోషములు తొలగబడి రాహుకళా ప్రభావితులె ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధివంతులవుదురు.

నైరృతి భాగము ఎత్తు తక్కు వగను ప్రధాన గృహముననాని గాని నైరృతి వుపగృహమున్న క్రిమినల్ కేసులందు యిరుక్కొనుటి, దీర్ఘ అనారోగ్యములు పడరానియాతనలు పడుట మొదలగు దుష్ఫలితములు కలుగ జేయును.

పడమటి భాగమున వుపగృహములు వున్నతముగను ప్రధాన గృహమునకు అనినవిధముగా నున్న శుభఫలితములును పల్లముగా నున్న పనికి రాని పనులు చేయుటయందు ప్రమేయము కలిగించు దుష్ఫలితములు కలుగజేయును,

వాయవ్య భాగమున ప్రధాన గృహమునకు ఫ్లోరింగ్ సమాంతరముగను ఉ త్తరము మూయని విధముగను ఉపగృహమున్న ధన ధాన్య పశుసంవృద్ధి కీర్తి ప్రతిష్ఠలు రాజకీయ సుఖ జీవనము మొదలగు శుభ ఫలితములు కలుగ జేయును.

వాయవ్యం పల్లముగను ఉత్తరం మూసినవిధముగను ప్రధాన గృహమున కానిన విధముగా వుపగృహమున్న అధిక శతృత్వము అనారోగ్యము, కోర్టు వ్యాజ్యములు, అధికవ్యయము మొదలగు దుష్ఫలితములు కలుగ జేయును,

ఉత్తర భాగమున వుపగృహము వున్న పరపెత్తనము ఆర్థిక మొదలగు దుష్ఫలితములు సష్టము స్త్రీమనోభివృద్ధికి ఆటంకము కలుగజేయును. ఉత్తరంఅని ఉత్తరభాగమున ఎత్తుగా ఉపగృహములున్న యెడల ఉపద్రవములు – ఆకస్మికార్థికనష్టము కలుగజేయును,