banner 6 1

116

జెముడు మొక్క  కంచకు శ్రేష్టం, రేగడినేల చేనుకి శ్రేష్టం.
జోడీ లేని బ్రతుకు, తాడులేని బొంగరం ఒకటే.
డబ్బు లేనివాడు ముందే దోనెక్కి కూచున్నాడుట!
డబ్బులేనివాడు డుబ్బుకి కొరగాడు…
“డాబుసరి బావా” అని పలకరిస్తే, “డబ్బులేవి మరదలా” అంటూ చెయ్యి చాపాడుట…
దిల్లీ దిల్లీయే, గల్లీ గల్లీయే!
డిల్లీ వెళ్లి ఉల్లిగడ్డ తెచ్చాడుట…
తన్నితే బూరెలగంపలో పడ్డాడుట.
తగినట్లు కూర్చెరా తంపులమారి బ్రహ్మ…
తగిలించుకోడం సులభం, వదిలించుకోడం కష్టం.
తడిగుడ్డతో గొంతుక్కోసినట్లు …
తన అన్నం తాను తింటూ, లోకులకు భయపడాలి.
తనకంపు తనకి ఇంపు, ఇతరుల కంపంటే ఏవగింపు.
తనకు కానిది పండితేనేమి, మండితేనేమి…
తనకు మాలిన ధర్మం, మొదలు చెడిన బేరం …
తనకు లేదని ఏడిస్తే ఒకకన్ను, ఎదురివానికి ఉందని ఏడిస్తే మరోకన్ను పోయాయిట!
తనకోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష…
తన గుణము మంచిదైతే ఇంకొకర్ని తప్పుపట్టాలనిపించదు.
తనదాకా వస్తేగాని తలనొప్పి బాధ తెలియదు.

అంకపొంకాలు లేనిది శివలింగం

శివలింగానికి   అంకము (సంఖ్యా విలువ ) కానీ పొంకము (గర్వము ఉండవు అని అర్థం). అంటే అది మిక్కిలి గొప్పది అని మానవ సంఖ్యా శాస్త్రం లేదా సాధారణ గర్వానికి అతీతం అని వివరణ .వాడుక

ఈశ్వరుని గొప్ప తనాన్ని తెలియచేయుటకు వాడుతారు.

అంకెకు రాని ఆలి – కీలెడలిన కాలు

భార్య అంటే భర్తను అర్థం చేసుకొని భర్తకు అణిగిమణిగి ఉండాలి అని నానుడి అలా ఉండకపోతే కాపురం నిలువదు అని అందుకే భార్య అంకెకు రావడం (వశమగు ఉండడం) మంచిది. అలా వశమవ్వకపోతే, ఎడలి పోయిన (విడిపోయిన) కీలు లాగ బాధిస్తూ ఉంటది అని వివరణ ఆ కాలితో ముందుకి సాగలేము వెనక్కు వెళ్లలేము.

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు

అర్ధం

సాధారణంగా అల్లుడంటేనే విశేష గౌరవ మర్యాదలు చూపడం మన సంప్రదాయం. ఇక విందు భోజనాలకి చెప్పనవసరం లేదు కాని ఎన్ని చేసిన ఏదోకారణంగా అల్లుడు తినలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి అన్నీ అందుబాటులో ఉన్నా అనుభవించటానికి ఏదో కారణంగా ఆటంకాలు ఉంటాయి. అలాంటి సమయంలో ఈ సామెతని వాడుతుంటారు. ఈ జాతీయానికి సరైన అర్ధం మనకు అన్ని రకాల అవకాశాలు ఉన్నా ఏ అవకాశం అందని పరిస్థితి. అంగడి అంటే సరుకులు అమ్మే చోటు. కొత్త అల్లుడు అత్తవారి ఇంటికి వచ్చినపుడు మర్యాదలు సహజం. కొన్నాళ్ళకు పాతబడ్డ ఆ అల్లుడు అత్తవారి ఇంట్లోనే తిష్ట వేస్తే ఆ మర్యాదలు పెద్దగా జరగవు. అప్పుడు అంగట్లొ అన్నీ ఉంటాయి కాని అత్త వారింట్లో ఎవరూ వాటిని కొనరు. అల్లుడికి పెట్టరు. అలా రూపొందినదే ఈ సామెత. ప్రభుత్వ నిధులు ఎన్ని ఉన్నా ఆ ఫలాలు సామాన్యులకు అందవు. ఈ సందర్భంలో కూడా ఈ సామెతను గుర్తు చేసుకోవచ్చు.వాడుక

మన దేశంలో అన్ని వనరులూ పుష్కలంగా ఉన్నాయి. కాని లంచగొండితనం వలన దేశం అభివృద్ధి కావడం లేదు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది

అంగటి వీధిలో అబ్బా అంటే, ఎవరికి పుట్టావురా కొడకా అన్నట్లు

దీనికి పెద్దగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంగట్లో (ఇంటి బయట లేదా దారిలో) ఏదయినా దెబ్బ తగిలి అబ్బా అంటే ఏ అబ్బని తలిచావురా అని అన్నట్టు. దీనిని నలుగురిలో మాట్లాడేప్పుడు భాషా విశేషాలను గుర్తించి మాట్లాడాలి లేదంటే దానిని గుర్తించి కించపరిచే వాళ్ళు వేచి ఉన్నారు అని లేదా ఒకడి నొప్పి ఇంకొకడి వెటకారానికి నాంధి అనికూడా చెప్పుకోవచ్చు.

అంగట్లో అరువు – తల మీద బరువు

అరవు అనగా అప్పు అని అర్థము అంగట్లో అప్పువుంటే తలమీద బరువు వున్నట్లే అని అర్థము

అంగట్లో అష్ట భాగ్యం – అల్లుని నోట్లో అష్ట దరిద్రం

అన్నీ వున్నాయి కాని అల్లుని నోట్లో శని వున్నది అనే సమానార్థంతో ఈ సామెతను వాడుతారు.

అంగట్లో ఎక్కువైతే ముంగిట్లో కొస్తుంది

ఏదైనా సరకులు అవసరానికి వాటిని కొనేవారికన్న తక్కువైతే ఆ వస్తువుకొరకు అందరు ఎగబడి అంగడికి ఎగబడతారు…. అప్పుడు దాని ధర కూడా అమాంతం పెరిగి పోతుంది. అవే వస్తువులు అవసరానికన్నా ఎక్కువయితే అవే వస్తువులు అనేక రాయితీలతో మన ఇంటిముంగిటకే వస్తాయనే అర్థంలో ఈ సామెతను వాడుతారు.

అంగిట బెల్లం – ఆత్మలో విషం

పయోముఖ విష కుంభం అనే సంస్కృత సామెత లాంటిదే ఇది కూడాను. నోటితో తియ్యని మాటలు మాట్లాడుతున్నా…. మనసులో మాత్రంచాల చెడు భావన వున్నదని అర్థం.

అంగిట విషం – మున్నాలిక తియ్యదనం

ఇది కూడా పై సామెత లాంటి అర్థాన్నే ఇస్తుంది. పైపైన మంచిగా మాట్లాడుతు లోన చెడు భావన కలిగి వున్న వారినుద్దేశించి ఈ సామెతను వాడుతారు.

అంగడి అమ్మి గొంగళి కొన్నట్లు

అంగడి బియ్యం – తంగేటి కట్టెలు

అంగరక్ష లెన్నివున్నా శ్రీరామరక్ష వుండాలి

స్వంతంగా ఎంత బలం వున్నా….. ఎన్ని వున్నా దైవ బలం కూడా వుండాలని దీని అర్థం.

అంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే

ఉల్లిపాయ

అంచు డాబే గాని కోక డాబు లేదు

కోక అనగా చీర అని అర్థం. దానికున్న అంచు మాత్రం మహా బాగావుండి అసలు చీరలో పస లేదు అని అర్థం. ఇలాంటి సమానర్థంలో మరొక సామెత కూడా ఉంది. పైన పఠారం లోన లొఠారం

అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటదు

అంటే ఆరడి – అనకుంటే అలుసు

అంటుకోను ఆముదం లేకుంటే మీసాలకు సంపెంగ నూనెట

ఇదే అర్థంలో మరొక సామెత వుంది: అది: మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె

అంటే ఆరడి – అనకుంటే అలుసు

అండ ఉంటే కొండనైనా బద్దలు కొట్టవచ్చు

ఒంటరిగా కన్నా మరొకరి తోడుతో పనులను చక్కగా అవుతాయి ఆదుకొనేవారుంటే ఎంతటి కష్టమైన పనినైనా సులభంగా చెయొచ్చని ఈసామెత అర్థం. దీనికి సమానర్థంతో ఐకమత్యమే మహా భలము అనే సామెతకూడ ఉంది.

అండలుంటే కొండలు దాటవచ్చు

సహాయంగా ఎవరైనా వుంటే ఎంతపనైనా చేయ వచ్చు అనే అర్థంలో ఈ సామెతను వాడుతారు. ఐక మత్యమే మహాబలము అని దీకిని గూడార్థము.

అంతనాడు లేదు, ఇంతనాడు లేదు,సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు

సాధారణంగా ఏటువంటి అలంకారాలు చేసుకోనివారు ఏమైనా ఉత్సవాలు, ఊరేగింపులు, పదిమందిలో కలిసే పెళ్ళిళ్ళలో మాత్రం విశేషంగా అలంకారాలు చేసుకొని అందరిలోకి ప్రత్యేకంగా కనిపించాలని ప్రయత్నాలు చేస్తుంటారు.ఒకామె చిన్నప్పుడుగానీ, మరీ వయస్సులో ఉన్నప్పుడుగానీ, మరి ఏ ఇతర సందర్భాలలోగానీ పెద్ద కొప్పు పెట్టి, అందంగా కనిపించడానికి ప్రయత్నం చేయలేదట. ఆ ఊరిలో సంత జరుగుతుందని తెలిసి ఆ సంతలో ఎంతోమంది కొత్తకొత్త వారు వస్తారని వారందరి చూపు తనపైన పడాలని అందంగా పెద్దగా ఉండే కొప్పు పెట్టుకొని వెళ్ళిందట. సందర్భానుసారంగా మాత్రమే అలంకరించుకోవాలని ఈ సామెత

అంత ఉరుము ఉరిమి ఇంతేనా కురిసేదన్నట్టు

అమితంగా వాగ్దానాలు చేసి చాలా స్వల్పంగా దానాలు చేసేవారిని గురించి, ఎంతెంతో పనిచేస్తామని చెప్పి చాలాకొద్దిగా పనిచేసేవారిని గురించి, ఎక్కువగా హెచ్చులు చెప్పి తక్కువ పని చేసే పద్ధతి సందర్భంగా వాడె సామెత ఇది. ఇలాంటిదే మరొక సామెత: ఇంత ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు

అంత లావున్నావు తేలు మంత్రం కూడ తెలియదా

లావుగా వున్నంత మాత్రాన అన్ని విద్యలు తెలిసివుండవు. ఒక అమాయకుడు లావుగా వున్నతన్ని చూసి ఇతడు అంత లావున్నాడు కనుక అన్ని విద్యలు తెలిసి వుంటాయని భావించి తనకు తేలు కుట్టింది మంత్రం వేయమని అడిగాడట. ఆ లావుటతను తనకు తెలియదనగా “అంత లావున్నావు తేలు మంత్రం కూడ తెలియదా” అని వెళ్లి పోయాడట అమాయకంగా.

అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు

ఒక పనిని మొదలుపెట్టే ముందు దాని పర్యవసానాలు బాగా ఆలోచించి, ముందుగానే ఊహించి, సంబంధిత వ్యక్తులతో దానిని గురించి చర్చించి మొదలుపెట్టమని చెప్పేందుకు ఉద్దేశించినదే ఈ సామెత. కీడెంచి మేలెంచమనే సామెతకు ఇది కాస్త దగ్గరగా ఉంటుంది.

అందని పండ్లకు అర్రులు చాచినట్లు

మనకి అందవు లేదా దొరకవు అని తెలిసినా వాటి మీద ఆశ పెట్టుకోడం అనేది అందని పండ్లు కోసం అర్రులు చాచటం లాంటిది అని అర్థం.

అందని ద్రాక్షలు పుల్లన

ఒక నక్క ఒక రైతు యొక్క ద్రాక్ష తోటలోకి ప్రవేశించింది.అక్కడ దానికి ఎత్తయిన పందిళ్ళకు చక్కటి ద్రాక్షలు వేలాడుతూ కనపడ్డాయి.ఆ పండిన ద్రాక్షలను చూసిన నక్కకు, నోరు ఊరి, ఎట్లాగయినా సరే ఆ పళ్ళను తినాలని నిర్ణయించుకున్నది. మామూలుగా అయితే ఆనక్కకు పళ్ళు అందవు. అందుకని, అది తన ముందు కాళ్ళ మీద లేచి ఆ పళ్ళను అందుకోబోయింది. కానీ, పాపం దానికి ద్రాక్ష పళ్ళు అందలేదు. ఆపైన నక్క ఎగిరి అందుకోవాలని తెగ ఆరాటపడింది. ఎంత ఎగిరినా దానికి ఆయాసం వచ్చింది కానీ, ద్రాక్ష పళ్ళు మాత్రం అందలేదు. ఎగిరి, ఎగిరి ఆయాసంతో ఇక యెగరలేక విసిగి, “ఛీ ఛీ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయట నేను తినడమేమిటి?” అని గొణుక్కుంటూ వెళ్ళిపొయింది. అలాగే, ఎవరైనా ఏదో పొందాలని ప్రయత్నించి అది దొరకక పోతే, అప్పటివరకు దేని కోసం అయితే తీవ్ర ప్రయత్నం చేశామో అది ఎంత చెత్తదో, ఎంత పనికిరాదో చెప్పటం మొదలుపెడతాము. అప్పుడు అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని నలుగురు నవ్వుకుంటారు.

అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం

తాము శ్రీవైష్ణవులము, మాంసాహారం తినము అని చెప్పుకుంటూ బుట్టలో చేపలన్నీ ఖాళీ చేసారు అని అర్ధం. అందరూ గొప్పవాళ్ళే కాని చేసేవన్ని తప్పుడు పనులే. ఎవరికి వారే తమకి తాము గొప్ప వాళ్ళమని చెప్పుకుంటారు కాని ఎవరి తప్పులు వారికే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ సామెత వాడుతార

అందితే జుట్టు అందక పోతె కాళ్లు

అవకాశవాది తన పని పూర్తి చేసుకోటానికి ముందు గడ్డం పట్టుకు బ్రతిమిలాడతాడు, అయినా పని కాకపోతే కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడతాడటానికి కూడా వెనకాడడు. ఈ సామెత ఒక అవకాశవాది తత్వాన్ని తెలియచేస్తోంది.

అండ వున్నవానిదే అందలం

ఐకమత్యమే మహా భలము అని దీనికి అర్థము.

అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత

అంత నీతే వుంటే ఇంత సంతెందుకు?

అంత పెద్ద పుస్తకం చంకలో వుంది పంచాంగం చెప్పలేవా?

ఇదే అర్థంలో మరొక సామెత వున్నది: అది. ఇంతలావున్నావు తేలు మంత్రం తెలియదా?

అంతా తెలిసినవాడూ లేడు, ఏమీ తెలియనివాడూ లేడు

మానవులలో ప్రతి విషయము పూర్తిగా తెలిసిన వాడున్నూ, ఏవిషయము కొంతైనా తెలియని వాడున్నూ లేడని దీని అర్థము.

అంతా బాపలే, మరి కోడిపెట్ట ఏమైనట్లు?

దీనికి సమానమైన అర్థంలో మరొక సామెత ఉంది. అందరూ వైష్ణవులే ………. బుట్టలో రొయ్యలు మాయం అయ్యాయి బాపన వాళ్లైనా చాటు మాటుగా మాంసం తింటారని దీనికి గూఢార్థము.

అంతా మావాళ్ళేగానీ అన్నానికి రమ్మనే వాళ్ళు లేరు

[చూపులకు చుట్టాలు రమ్మంటే కోపాలు ] అనే సామెత లాంటిదే ఈదీను.

అందం చందం నావంతు – ముద్దూ మురిపెం నీవంతు అన్నదట

అందం చందం లేని మొగుడు మంచం నిండా వున్నట్లు

అకార పుష్టి నైవేద్య నష్ఠి అనే సామెత లాంటిదే ఇదీను.

అందముంటే సరా! అదృష్టముండొద్దూ!

అందని మ్రానిపండ్లకు అఱ్ఱులు చాచినట్లు

మనకి అందవు లేదా దొరకవు అని తెలిసినా వాటి మీద ఆశ పెట్టుకోడం అనేది అందని పండ్లు కోసం అర్రులు చాచటం లాంటిది అని అర్థం.

 ఎంత ఏడ్చినా,అత్తగారింటికి వెళ్ళడం తప్పదు

అందరికీ శకునం చెప్పే బల్లి తాను బోయి కుడితి తొట్లో పడ్డట్లు

అందరికి రాబోవు కష్టాలను చెప్పేవారు తమకు రాబోవు కష్టాలను ఎరుగరు అని దీని అర్థము. అనగా ఈ శకునాలు వట్టి భూటకమని అర్థము.

అందరికీ అన్నం పెట్టే వాడు రైతే

అందరినీ మెప్పించడం అలవి గాని పని

అందరినీ మెప్పించడము ఎంతమాత్రము వీలుకాదని దీని అర్థము. ఎంత మంచి విషయమైనా దాన్ని కూడా వ్వతిరేకించే వాడొకడుంటాడని దీని భావము.

అందరూ అందలమెక్కితే మోసేవారెవ్వరు?

అందరూ ఒక ఎత్తు – అగస్త్యుడు ఒక్కడూ ఒక ఎత్తు

అందానికి పెట్టిన సొమ్ము ఆపదకు అడ్డం వస్తుంది

అందాల గంధాలు, అధరాల మధువులు కౌగిలింతల పాలన్నట్లు

అందాల విందులు, అధరాల మధువులు నీకే అన్నదట

అందాలు నావి – సంబరాలు నీవి అందిట

అందితే సిగ/జుట్టు అందకపోతే కాళ్ళు

అవకాశాన్ని బట్టి ఎదిరించడమో, కాళ్ల బేరానికి రావడమో చేసె వారిగురించిన సామెత ఇది. ఇదే సమానార్థంలో మరొక సామెత…. ఏ ఎండకాగొడుగు పట్టినట్టు. అంకెకు రాని ఆలిని ఆరుగురు బిడ్డల తల్లయినా విడవాలి/ ఏ ఎండకు ఆ గొడుగు పట్టి నట్టు సమానర్థంలో మరొక సామెత

అందితే తియ్యన అందకుంటే పుల్లన

[అందని ద్రాక్ష పళ్ళు పుల్లన ] అనే సామెతకు సమానర్థంలో ఈ సామెతను వాడుతారు. ఎంత ప్రయత్నించినా ద్రాక్ష పళ్ళు అందక పోతే….. తన ప్రయత్నము విపలమైనదని ఒప్పుకోక ఆ ద్రాక్ష పళ్ళు పుల్లనివి అని తన ఓటమిని కప్పి పుచ్చుకునే ప్రయత్నం ఇది.

అందీ అందని పరువాలు ఉసికొలిపే కాముని కవ్వింతలు

అంధుడికి అద్దం చూపించినట్లు

కొంతమంది ఎంత వివరంగా విషయాన్నంతా చెప్పినా గ్రహించలేరు. అలాంటి వారి జ్ఞానాన్ని సూచించడానికి ఈ సామెత ఉపకరిస్తుంది. అలాగే మరికొన్ని సందర్భాల్లో ఎంత శ్రమపడినా శ్రమను ఎదుటివారు గుర్తించక నిర్లిప్తంగా, నిరాసక్తంగా తోసివేసినప్పుడు కూడా ఈ సామెతను సందర్భానుసారం చెప్పటానికి ఉపయోగపడుతుంది. అంధుడికి ఎంత మాత్రమూ ఎదుటి వస్తువులు కనిపించక పోవటం సర్వసాధారణం. అటువంటిది అందాన్ని ఒకటికి పది సార్లు చూసుకోడానికి నేత్ర దృష్టి బాగా ఉన్నవారు ఉపయోగించే అద్దాన్ని అంధుడి ముందు పెట్టి చూసుకోమంటే దానివల్ల అంధుడికి కలిగే ఆనందం శూన్యం. అతడి ముందు అద్దాన్ని ఉంచడం వల్ల పడిన శ్రమ కూడా వృథా అవుతుంది. ఈ సామెతలో అద్దం విజ్ఞానంతోను, పాండిత్యంతోనూ కొంతమంది పోల్చి చెబుతుంటారు. అంధత్వమనేది అజ్ఞానానికి, పామరత్వానికి నిదర్శనం. అద్దంల్లాంటి పాండిత్యం కలిగిన వారు, అంధుడిలాంటి అజ్ఞాని ముందు తన పాండిత్యాన్ని ప్రదర్శించడం వల్ల ఫలితం శూన్యమనేది సామెత భావన.

అంధుడికి అద్దం చూపించినట్లు

అంధుడి ముందు పెట్టి చూసుకోమంటే దానివల్ల అంధుడికి కలిగే ఆనందం శూన్యం. అతడి ముందు అద్దాన్ని ఉంచడం వల్ల పడిన శ్రమ కూడా వృథా అవుతుంది. ఈ సామెతలో అద్దం విజ్ఞానంతోను, పాండిత్యంతోనూ కొంతమంది పోల్చి చెబుతుంటారు. అంధత్వమనేది అజ్ఞానానికి, పామరత్వానికి నిదర్శనం. అద్దంల్లాంటి పాండిత్యం కలిగిన వారు, అంధుడిలాంటి అజ్ఞాని ముందు తన పాండిత్యాన్ని ప్రదర్శించడం వల్ల ఫలితం శూన్యమనేది సామెత భావన..

అంబటిలోకి ఉప్పే లేకుంటే పిండి వంటల మీదకు పోయిందట మనసు

తాను తాగే అంబలిలో ఉప్పు తక్కువైనందున అందులో ఉప్పు కూడా తెచ్చి వేసుకోలేని వాడు పిండి వంటలు కోరుకున్నట్లు…… అని దీనికి అర్థము.

అంబలా అంటే ముఖాలే చెప్తాయి అన్నట్లు

అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు

గంజి తాగేవానికి మీసాలు ఎగబట్టేవాడొకడన్నట్టు వంటిదే ఈ సామెత. తన స్థాయికి మించి పనులు చేసే వారినుద్దేశించి ఈ సామెతను వాడుతారు.

అంబరాన బిడ్డ పుడితే ఆముదం పెట్టి ముడ్డి కడిగిందట

లేక లేక పుట్టిన పిల్లలను గారాబంగా పెంచినప్పుడు ఈ సామెత వాడతారు

అంభంలో కుంభం ఆదివారంలో సోమవారం అన్నట్లు

“అ – ఆ” లు రావు గానీ అగ్రతాంబూలం కావాలట

అనర్హులు కూడా అందలం ఎక్కాలనే ప్రయత్నం చేయడాన్ని ఈ సామెత తెలియ జేస్తుంది.

“అ – ఆ” లు రావు గానీ అమరం చదువుతాడట

అకట వికటపు రాజుకు అవివేకపు ప్రధాని, చాదస్తపు పరివారము

అక్క ఆరాటమే గానీ బావ బ్రతకడన్నట్లు

అక్క కాపురం అడగక్కర లేదు – చెల్లెలి కాపురం చెప్పక్కర లేదు

==అక్కచెల్లెళ్ళకు అన్నం పెట్టి లెక్క వ్రాసినట్లు సొంత వాళ్లకు, అయిన వాళ్లకు పెట్టిన ఖర్చును కూడా లెక్కగడితే.. ఇలాంటి సామెతలు వాడతారు.

అక్క పగ, బావ మంచి

అక్క మనదైతే బావ మన వాడవుతాడా?

అక్క మొగుడు కుక్క

అక్కర వున్నంతవరకూ ఆదినారాయణ – అక్కఱ తీరిన తర్వాత గూదనారాయణ

దీనికి సమానర్థంలో మరికొన్ని సామెతలు: 1. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం. 2. ఏరు దాటునంత వరకు ఓడ మల్లయ్య గారు….. ఏరు దాటాక బోడి మల్లయ్య.

అక్కరకురాని చుట్ట మెందుకు?

ఇది సుమతీ శతక పద్యంలోని భాగము….. అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీయని వేల్పు, యుద్ధమునందు పారిపోయిన గుర్రము మొదలగు వాటిని వదిలి పెట్టాలని దీని అర్థము.

అక్కరకు వచ్చినవాడే మనవాడు

అక్కర తీరితే అల్లుడు అశుద్ధంతో సమానమన్నట్లు

అక్కరకు రానిది అవనిలో లేదు

ప్రతి వస్తువు కూడా పనివచ్చేదే అనే అర్థంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. (శ్రీ శ్రీ కవితలోని కొన్ని మాటలను ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు: అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ కాదేది కవితకనర్హం…. …..

అక్కా పప్పు వండవే చెడేవాడు బావ ఉన్నాడు గదా?

అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం

అగడ్త అనేది పూర్వం కోటల పరిరక్షణకు ప్రహారి చట్టూ తీసిన గొయ్యి లాంటిది. అగడ్తలు చాలా లోతుగా ఉంటాయి. అగడ్తలో పడ్డ పిల్లి అదే సర్వసం అనుకుంటుంది. ఇదే అర్థములో మరొక సామెత ఉంది. అగడ్తలో పడ్డ కప్పకు అదే వైకుంఠం

అగడ్తలో పడ్డ కప్పకు అదే వైకుంఠం

అగసాలిని, వెలయాలిని నమ్మరాదు

సమాజంలో ఉన్న కులాలకు సంబంధించినది ఈ సామెత/ అగసాలి అనగా బంగారపు పని చేసే కంసాలి అని, వెలయాలు అనగా వేశ్య అని అర్థము.

అగసాలి పొందు, వెలమల చెలిమి నమ్మరాదు

ఇది సమాజములోని కొన్ని కులాలకు చెందిన సామెత: అగసాలి అనగా బంగారపు పని చేసే కంసాలి. వెలమ అనగా సమాజములో ఒక ఉన్నత కులము.

అగ్గి చూపితే వెన్న అడక్కుండా కరుగుతుంది

అగ్గిమీద గుగ్గిలం లాగా

అగ్నిచెంత వెన్న ఎంత తడవాగో ఆడవారి కోపము అంత తడవాగు

అగ్ని చెంతే వెన్న వెంటనే కరిగి పోతుంది. అదే విధముగా ఆడవారి కోపము కూడా అతి స్వల్ప కాలమే అని ఈ సామెతకు అర్థము.

అగ్నిదేవుడు చలికాలంలో చిన్నవాడు ఎండాకాలంలో ఎదిగినవాడు

అగ్నిలో ఆజ్యం పోసినట్లు

[ అగ్నికి వాయువు తోడైనట్లు] అనే సామెత లాంటితే ఈ సామెత కూడాను.

అగ్నిలో మిడత పడ్డట్లు

అగ్నిశేషం, ఋణశేషం, శత్రుశేషం ఉంచరాదు

అగ్ని పూర్తిగా ఆర్పకుంటే తిరిగి రగులుకుంటుంది, అప్పు పూర్తిగా తీర్చకుంటే వడ్డీ రూపంలో ఎక్కువ తీర్చవలసి వస్తుంది. అలాగే ఒక్క శత్రువు మిగిలివున్నా ప్రాణానికి ముప్పు తప్పదు. అందుకే దేని శేషాన్ని మిగల్చకూడదు.

అగ్గిపక్కన వెన్న ఆడవారి కోపం ఒకటే

పురుషుడికి కోపం వస్తే ప్రతీకారం తీర్చుకొనేదాకా వూరుకోడు. కానీ స్త్రీల కోపము తాత్కాలికమే వేడి తగిలిన వెన్నలాగా స్త్రీ మనస్సు కరిగిపోతుంది అని ఈ సామెతకు అర్థము.

అగ్నికి వాయువు తోడైనట్లు

అగ్నిని ఎవరైన చల్లార్చడానికే ప్రయత్నిస్తారు. అలాంటి అగ్నికి వాయువు తోడైతే చల్లార్చడం చాలా కష్టం. మన కోపాన్ని అగ్నితో పోలుస్తారు. ఎవరైనా ఎవరి మీదైనా అగ్నిలాంటి కోపంతో ప్రజ్వరిల్లుతూ ఉన్నప్పుడు పక్కన ఉండే వాళ్ళు కావలసినవాళ్ళైతే ఆ కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తారు కాని మధ్యన ఉండేవాళ్ళు కానివాళ్ళు ఐతే ఆ కోపాన్ని ఉన్నవీ లేనివి చెప్పి పెంచడానికి చూస్తారు. ఇలాంటి సమయంలో ఈసామెతని వాడుతారు. అగ్నిలో ఆజ్యం పోసినట్లు అనే సామెతను కూడా ఇలాంటి సందర్భంలో వాడుతారు.

అగ్గువ అయితే అంగడికి వస్తుంది అన్నాడట

అగ్రహారం పోతే పోయింది గానీ చట్టం మొత్తం తెలిసింది

అచ్చట్లు – ముచ్చట్లు – ఎదనిండా వెన్నెల్లు అన్నట్టు

అచ్చట్లు, ముచ్చట్లు దుప్పట్ల ముసుగులో అన్నదట

అచ్చమ్మ పెళ్ళిలో బుచ్చమ్మ శోభనం అన్నట్లు

అచ్చివచ్చిన భూమి అడుగైనా చాలు

గంగి గోవు పాలు గరిటెడైనా చాలు అన్న సామెత లాంటిదే ఇదీను.

అచ్చివచ్చే కాలానికి నడిచివచ్చే కొడుకు పుడతాడట

అచ్చు పోసిన ఆబోతువలె

గతంలో కొన్ని పల్లెల్లో ఒక కోడెను ఇది ఆబోతు అని పేరు పెట్టి వూరి మీదకు వదిలి పెడతారు. అది అందరిదీను. అది ఎక్కడ తిరిగినా….. ఎవరింటికి వెళ్ళినా దానిని ఏమీ అనరు. ఇది ఆనాటి ఆచారము. ఏపనీ లేకుండా ఊరు మీద పడి తిరిగే వారిని ఈ సామెతతో పోల్చి చెపుతుంటారు.

అజీర్ణానికి లంఖణం మందు

అజీర్ణము అనగా తిన్నది అరగక పోవడము. దానికి మందు ఏమిటంటే…… ఉపవాసముండడమే అని అర్థము.

అటునుండి నరుక్కు రా

వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు అమరావతిని పాలించే కాలంలో దోపిడీ దొంగల బెడద ఎక్కువగా ఉండేది. వారి బారి నుండి ప్రజలను కాపాడేందుకు ఆయన ఆ దోపిడీ దొంగలను పట్టి, బంధించి, వారందరినీ వరసగా నిలబెట్టి తలలు నరకమని తలారులను ఆజ్ఞాపించాడు. ప్రాణాలు కాపాడుకునే దారి లేక ఆ దొంగలు ‘అటు నుండి నరుక్కు రా’ అంటే ‘కాదు అటు నుండే రా’ అని ఆ తలారిని ప్రాధేయ పడ్డారట. కొంత మందిని నరికిన తరువాతైనా ప్రభువుకు జాలి కలిగి మిగిలిన వాళ్ళను క్షమించక పోతాడా, ఆ విధంగా ప్రాణాలు దక్కక పోతాయా అని వారి ఆశ అన్నమాట. ఆ విధంగా ఈ సామెత పుట్టింది. (ఈ విషయమై వివరాలకు మంగళగిరి పేజీ చూడండి.) ఒక పనిని ఒక పద్ధతిలో చెయ్యడం కుదరకపోతే వేరే విధంగా చెయ్యమని చెప్పే సందర్భంలో ఈ సామెతను ప్రస్తుతం వాడుతున్నారు.

అటైతే కందిపప్పు – యిటైతే పెసరపప్పు

అటైతే వైద్యకట్నం – యిటైతే వైతరిణీ గోదానం

అట్టే చూస్తే అయ్యవారు కోతిలా కనబడతారు

అట్లు వండినమ్మకు ఆరుగురు అమర్చాలి

అట్లు వండే అత్తకు అరవైఆరు ఎత్తులు పెట్టినట్లు

అడక్కుండా చెప్పులిచ్చాడు అడిగితే గుర్రం యిస్తాడేమో అన్నట్లు

అడక్కుంటే జోలె అడుక్కుపోతోంది

అడవి పత్రి – వాన నీరు

అడవిలో తిని ఆకుతో తుడుచుకున్నట్లు

అడిగిందే పాపం – అనుగ్రహించటం తన స్వభావం అన్నట్లు

అడిగింది రొట్టె – యిచ్చింది రాయి

అడిగితే చిరాకు – అడగకపోతే పరాకు

అడిగేటంత అన్యాయానికి లోబడతానా?

అడవిలో పడ్డట్లుగా

అడుసు త్రొక్కనేల కాలు కడగనేల

కావాలని కష్టాలు తెచ్చుకోనేల? ఆ తర్వాత బాధ పడనేల?… అని అర్థం.

అడకత్తెరలో పోకచెక్క

అడకత్తెరలో చిక్కిన పోకచెక్కకి వత్తిడి రెండు వైపుల ఉండి తప్పించుకోలేని పరిస్థితి కలుగుతుంది. అలాగే జీవితంలో బాగా కావలసిన ఇద్దరు వ్యక్తుల కలతల మధ్య చిక్కుకొని ఎటూ చెప్పలేని పరిస్థితిలో ఈ సామెత వాడుతుంటారు.

అడగందే అమ్మైనా (అన్నం) పెట్టదు

ఆకలి తెలుసుకొని అన్నం పెట్టేదే అమ్మ.కాని అమ్మ ఐనా కొన్ని సందర్భాలలో ఆకలి తీర్చడం మరచి పోవచ్చు.మొగమాటంతో అమ్మ పెడ్తుందిలే అని ఊరుకుంటే ఆకలి తీరేదెలా.అమ్మ దగ్గర మొగమాట పడేవాళ్ళు ఎవరి దగ్గరా చొరవగా ఉండలేరు.చొరవ తీసుకుని అడగక పోతే ఏ పని జరగదు.అన్నిటికీ మొగమాట పడేవారిని చూసి చెప్పే సామెత ఇది.

అడవిలో కాచిన వెన్నెల…. ముదిమిన చేసిన పెళ్ళి రెండు ఒకటే

అడవిలో కాచిన వెన్నెల ఉపయోగం లేనట్లే ముసలి వానికి పెళ్ళి చేస్తే ఫలితం ఉండని దీని అర్థం. ఏదైనా నిరుపయోగము అని చెప్ప దలిస్తే ఈ సామెతను వాడుతారు. అడవిలో కాచిన వెన్నెల మానవులకు ఉపయోగము కాదు….. వయస్సు మీరిన తర్వాత చేసిన పెళ్ళి కూడా అక్కరకు రాదు అని దీని అర్థము.

అడిగేవాడికి చేప్పేవాడు లోకువ

ఎవరైనా ఎవరిని అయినా ఎదైనా అడిగితే వారు చెప్పేటప్పుడు వీడు నాకు చెప్పేదేంటి అనే భావన ఉంటుంది. అందుకే అడిగేవాడికి చెప్పే వాడు లోకువ అంటారు.

అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు

ఇంట్లో వంట చేసుకునే వారికి ఒకటి లేదా రెండు కూరలూ… అదే అడుక్కునే వాడికి అరవై ఆరు కూరలు అని అర్థం. ఇలాంటిదే మరొక సామెత: అద్దెకుండే వానికి అరవై ఇండ్లు, స్వంతగానికి ఒకటే ఇల్లు.

అడుక్కునేవాడిదగ్గర గీక్కునేవాడు

ఆకులు నాకే వాడి దగ్గర మూతులు నాకే వాడు

అడుక్కుతినేవాడికి అరవై వూళ్ళు

ఇదే అర్థము మరొక సామెత వున్నది: అది: అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు ఇంట్లో వంట చేసుకునే వారికి ఒకటి లేదా రెండు కూరలూ… అదే అడుక్కునే వాడికి అరవై ఆరు కూరలు అని అర్థం. ఇలాంటిదే మరొక సామెత: అద్దెకుండే వానికి అరవై ఇండ్లు, స్వంతగానికి ఒకటే ఇల్లు.

అడుక్కుతినేవాడికి ఆలయ్యేకంటే ధనవంతుడికి దాసి అయ్యేది మేలు

అడుక్కోవటానికి ఈ గడప కాకపోతే యింకో గడప

అడుసు తొక్కనేల కాలు కడగనేల

అడుసు అంటే బురద (బాడి). బురదను ముట్టుకుంటే అంటుకుంటుంది. ఈ విషయం తెలిసీ దాన్ని తొక్కటం ఎందుకు, తర్వాత అంటుకుంది అని బాధపడి కడుక్కోవటం ఎందుకు అని పూర్తి అర్ధం. అంటే, తెలిసి తప్పు చేయటం ఎందుకు తర్వాత బాధపడటం ఎందుకు అనే అర్ధం కోసం వాడతారు.

  • పంకప్రక్షాళనన్యాయము

అడుగు తప్పితే పిడుగు తప్పుతుంది

అడుగు దాటితే అక్కర దాటుతుంది

అడుగు పెట్టగానే పిడుగు పడ్డట్లు

అడ్డ జామీనులకు పోతే తెడ్డు దెబ్బలు తప్పవు

అడ్డం దిడ్డం తిరిగే తెడ్డుకు రుచేం తెలుసు?

కూరలలో తిప్పే గరిటెను తెడ్డు అని అంటారు. అది కూరలలో తిరుగుతున్నా…. ఆ కూర రుచి దానికి తెలియదు అని అర్థము.

అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలా!?

ఉయ్యాలలో ఉన్నప్పుడైతే మాట వింటారు గానీ, గడ్డాలు, మీసాలు వచ్చిన తరువాత వింటారా? అని మొక్కై వంగనిది మానై వంగునా

అడ్డెడు తినేవాడికి ఆలెందుకు? యిద్దుము మోసేవానికి ఎద్దెందుకు

అడ్డెడు వడ్ల ఆశకు పోతే తూమెడు వడ్లు గొడ్డు తినిపోయిందిట

అతడెంత ఘనుడైనా అడుగక తప్పదు

అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న

ఎవరికి వారు తామె గొప్పవారమని విర్ర వీగుతుంటారు. ఒకరికి మించిన వారు మరొకరు వుంటారని వారు ఎరుగరు. అలా విర్ర వీగే వారి గురించి ఈ సామెత వాడతారు. అలాంటిదే మరో సామెత ఉంది. అది. తాడిని తన్నే వాడుంటే….. వాడి తలను తన్నే వాడు మరొకడుంటాడు.

అతిచేస్తే మతి చెడుతుందన్నట్టు

ఏ పనైనా ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. హద్దులను పాటించాలి. అలా కాకపోతే అన్నీ అనర్థాలే

అతికించిన కోరమీసం ఎంతసేపు నిలుస్తుంది?

అతి వినయం ధూర్త లక్షణం

అవసరం అయిన దానికన్నా అధికంగా వినయాన్ని చూపేవారి గురించి ఈ సామెత వాడతారు. ఇలా అతి వినయం చూపుట దుష్టుల యొక్క లక్షణం అని అర్ధం. హృదయంలో లేని గౌరవాన్ని ప్రవర్తనలో చూపెట్టేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో కూడా వాడతారు. నక్క వినయం అనే జాతీయం దీనికి దగ్గరగా ఉంటుంది.

అతితెలివికి ఆకలెక్కువ

అతివృష్టయినా అనావృష్టయినా ఆకలిబాధ తప్పదు

వర్షము ఎక్కువైనా…….. అసలు వర్షము లేకపోయినా కరువు తప్పదని దీని అర్థము.

అతిరహస్యం బట్టబయలు

ఏదైనా విషయం రహస్యంగా ఉంచే ప్రయత్నంలో అతిగా ప్రయాసపడి, అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే, ఆ రహస్యం కాస్తా బట్టబయలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించటానికి ఈ సామెతను వాడుతారు.

అతి సుకుమారం – కటిక దరిద్రం

అత్త అడుక్కొని తింటుంటే అల్లునికి మనుగుడుపా?

అత్త అప్పుతీరే – అల్లునికి భ్రమతీరే

అత్త కాలము కొన్నాళ్ళు – కోడలి కాలము కొన్నాళ్ళు

అత్తకు అల్లుడాశ – అల్లుడికి అత్తాశ

అత్తకు మంచి లేదు – చింతకు పచ్చి లేదు

అత్తకు లేక చస్తుంటే అల్లుడు వచ్చి దీపావళి పండగన్నాడట

అత్త కొట్టిన కుండ అడుగోటికుండ, కోడలు కొట్టిన కుండ క్రొత్తకుండ

ఇదే అర్థాన్నిచ్చె మరొక సామెత ఉంది. అది. ఉంటే లిక్కి…… పోతే కొడవలి అత్త పగలగొట్టిన కుండ ఓటుది అని….. కోడలు పగల గొట్టిన కుండ….. ఓటుదైనా అది కొత్త కుండ అని అత్తగారు కోడలిని దెప్పి పొడుస్తుందని భావము.

అత్త చేసిన పనికి ఆరళ్ళు లేవు

అత్తను ఉంచుకున్నవాడు దరిద్రుడు

ఇది ప్రాసకొరకు వున్న సామెత మాత్రమే…………………. కాని అర్థవంతమైనది కాదు.

అత్తను కొట్టి అటకెక్కింది – మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కింది

అత్త పెట్టే ఆరళ్ళు కనబడతాయిగానీ, కోడలి కొంటె పనులు కనబడవు

అత్త పేరు పెట్టి కూతుర్ని కొట్టినట్లు

అత్త మంచీలేదు – వేప తీపీలేదు

ఆత్తలందరూ చెడ్డవారని ఈ సామెతకు అర్థము.

అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు

ఒకరి మీద కోపమొస్తే చేతిలోని వస్తువులను విసిరికొట్టడము మానవ సహజము. అదే విధంగా ఒక కోడలు తన అత్తమీద కోపంతో చేతిలోనున్న దుత్తను పగలగొట్టిందట. దుత్త అనగా ఒక చిన్న మట్టి కుండ.

అత్తముండ కన్న ఉత్తముండ మేలు

అత్త మెత్తన, కత్తి మెత్తన ఉండవు

అత్త మంచీలేదు – వేప తీపీలేదు అనే సామెత లాగే ఈ సామెతకు ఆత్తలందరూ చెడ్డవారని ఈ సామెతకు అర్థము.

అత్త రంకుకు పోతూ కోడలికి బుద్ధి చెప్పిందట

[ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులున్నాయి] అనే సామెత అర్థము దీనికి వర్తిస్తుంది. అత్త చెడు పనులు చేస్తూ తన కోడలికి చెడు పనులు చేయకు అని చెప్పి నట్లు.

అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకున్నట్లు.

దుత్త అంటే మట్టితో చేసిన చిన్న కుండ. మజ్జిగ వంటి వాటిని నిలవ ఉంచేందుకు వాడుతారు. కోడలికి అత్త మీద కోపం వచ్చిందంట, కానీ ఏమి చేస్తుంది పాపం అత్తేమో పెద్దావిడ, ఏమన్నా అందామా అంటే మొగుడు ఊరుకోడు అందుకని ఆ కోపాన్ని చేతిలో ఉన్న దుత్త మీద చూపుతూ విసిరి పగలకొట్టిందట. అందుకనే సాధారణంగా ఒకరి మీద కోపం మరొకరి మీద చూపించినప్పుడు అంటారు, “అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు” అని. ఉదాహరణకు ఆఫీసులో బాసు తిట్టాడని ఇంట్లో భార్యని విసుక్కునేవారు.

అత్తవల్ల దొంగతనము, మొగుడి వల్ల రంకుతనం నేర్చుకున్నట్లు

అత్తవారింటి అల్లుణ్ణీ ఆముదాల చేలో ఆబోతునూ చూడాలి

అత్తవారింటి ఐశ్వర్యంకన్న పుట్టింటి గంజి మేలు

అత్తవారింటి లేమి అల్లుడెరుగు

అత్తవారింటి సుఖం మోచేతి దెబ్బ వంటిది

అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు

తనది కాని సొమ్మును దానమిచ్చు వారిని ఉద్దేశించి ఈ సామెత చెప్పబడింది. ముడ్డి తనది కాకపోతే గోదావరి దాక దేక మన్నాడట అనే సామెత దీనికి సమానార్థము.ఒకరి సొమ్ముని వేరొకరు ఖర్చు పెట్టినా, ఒకరి సొమ్ముని వేరొకరు ఇంకొకరికి దానంగా ఇచ్చినా ఈ సామెతనుపయోగించి ఎక్కిరించడం అలవాటు, బహుశా ఇల్లరికం వచ్చిన అల్లుళ్ళ గురించి మొదట ఈ సామెత మొదలయి ఉండవచ్చు!

అత్తరు పన్నీరు గురుగురులు దాని దగ్గరకు పోతే లబలబలు

మొగలి పూల సువాసనలు గుబాళింపులు అత్తరు పన్నీరుల గుబాళింపుల లాగానే ఉంటాయి. అయితే ఆ మొగలి పూల పొద దగ్గరకు వెళ్లాలంటేనే ముందు భయం వేస్తుంది. ధైర్యం చేసి మొగలి పూవును ఎలాగో ఒకలాగా తెచ్చుకున్నా ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మొగలిపూవుకు ఉండే ముళ్లలాంటివి గుచ్చుకుని లబలబలాడాల్సి వస్తుంది.

అత్తా! నీ కొంగు తొలిగిందన్నా తప్పే, లేదన్నా తప్పే

అత్తింటి కాపురం కత్తి మీద సాములాంటిది

అతి తెలివి అరవై రకాలు

అతిథి కోసమే తిథులు ఉన్నట్లు

అతిథి అంటే తిథి, వారం, వర్జ్యములు లాంటివి ఏమీ చూడకుండా, అనుకోకుండా వచ్చేవాడు అని. ఇది కొంచెం వ్యంగ్యంగా, అలాంటి వాళ్ళకోసమే తిథులుంటాయి అని వచ్చిన సామెత.

అదును లేని పైరు – ముదిమిలోని బిడ్డ ఒక్కటే

అదనుకు అనగా సమయానికి పైరు వేయక పేతే సరైన ఫలితమివ్వదు. అలాగే ముసలి వయస్సులో పిల్లలు పుడుతే వారు తల్లి దండ్రులకు సేవ చేసే వయసులో వుండరు అని ఈ సామెతకు అర్థం.

అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు

కోడలు ఎంత ఉత్తమురాలైనా అత్త మెప్పు పొందడం అరుదు. అదే అత్త లేని ఇంట్లో కోడలిదే పెత్తనం కాబట్టి ఇక ఆమెకు ఎదురేముంటుంది? ఇక ఆమె ఏం చేసిన గొప్పే! అత్త లేని ఇంట మంచి పేరు తెచ్చుకోవడం కోడలికి బహు సులువు. అదే విదంగా కోడలిని ఆరళ్ళు పెట్టని అత్తలూ అరుదే. కోడలు కాపురానికి రానంతవరకూ అత్తలందరూ గుణవంతులే.. కోడలు వస్తే గానీ అత్తల గుణం బయట పడదు. అత్తలేని కోడల్ని, కోడలులేని అత్తని ఎవరైనా మెచ్చుకుంటే ఆ అదృష్టానికి నోచుకోని కొందరు అక్కసు వెళ్ళబుచ్చుతూ ఈ సామెతని వాడతారు. ఒక జానపద గేయం ఈ సామెతతో మొదలవుతుంది. దంపుడు పాటగా బాగా ప్రసిద్ధి చెందింది. ఘంటసాల గానం చేసిన రికార్డు బాగా జనాదరణ పొందింది.ఆహూ ఊహూ … అత్త లేని కోడలుత్తమురాలూ కోడల్లేనత్త గుణవంతురాలూ .. ఆహూ ఊహూ..కోడాల కోడాల కొడుకు పెళ్ళామాపచ్చిపాలమీద మీగడేమాయె కోడలావేడిపాలమీద వెన్న ఏమాయే కోడలాఅత్తమ్మ ఊరకే ఆరళ్ళు గానీపచ్చిపాలమీద మీగడుంటుందావేడిపాలమీద వెన్న ఉంటుందాఉట్టీ మీదున్న సున్నుండలేమాయె కోడలాఇంటికి పెద్దయిన గండుపిల్లుండగాఇంకెవరు వస్తారె అత్తమ్మా

గయ్యాళి అత్త పాత్ర తెలుగు సాహిత్యంలోనూ, తెలుగు సినిమాలలోనూ, ప్రత్యేకించి జానపద సాహిత్యంలో అతి సాధారణం.

అత్తా ఒకింటి కోడలే

ప్రస్తుతము అత్తగా వున్న అకామె గతంలో ఒక ఇంటి కోడలే అనే విషయం మరచిపోయి ప్రవర్తించడాన్ని ఈ సామెత తెలియ జేస్తుంది.

అతుకుల కాపురం – చితుకుల మంట

అతుకుల బొంత – గతుకుల బాట

అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు

అసలు అక్కడ జరిగేది ఏమి లేకుండానే, ఏదో ఉందని చెప్పే వారి పక్కన దానికి మరో నాలుగు కలిపి చెప్పే వాళ్ళు ఉంటారు. అదిగో తెల్లకాకి అంటే ఇదిగో దానికి పుట్టిన పిల్ల కాకి అని, ముందు చెప్పినదే పెద్ద తప్పు దాన్ని సమర్థిస్తూ చెప్పేది ఇంకాపెద్ద తప్పు చెప్పే వారు కూడా ఉంటారు.

అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు

ఒక అసత్యం గురించి, లేని విషయం గురించి ఒకరు చెప్పే విషయాన్ని మరొకరు గుడ్డిగా నమ్మి అది నిజమేననేందుకు ఋజువులు వెదకడం, లేక దొరికే ప్రతిదాన్నీ ఋజువుగా భావించే సందర్భంలో ఇలా అంటారు. అబద్ధం వ్యాప్తి జరిగే విధానం ఇది. అయితే ఇందులో అమాయకత్వం, తెలియనితనం కనిపిస్తాయే గానీ కావాలని ఇతరులను వంచించే ప్రయత్నం కాదు. తాము విన్నదీ, కన్నదీ అబద్ధమని తరువాత తెలుసుకున్నపుడు అనుకుంటారు అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లయిందని కావాలని అబద్ధాన్ని నిజంగా చూపే ప్రయత్నాన్ని వర్ణించడానికి ఒక సామెత ఉంది: ఎద్దు ఈనిందని ఒకడంటే, దూడను గాట కట్టెయ్యమని మరోడన్నాడంట

అదిగో అంటే ఆరునెల్లు

అతి నిదానంగా పని చేసె వారిని గురించి ఈ సామెత వాడతారు. అలాంటి వారు ఇప్పుడే వస్తా నని మరలా రారు. అలాంటి వారి గురించి ఈ సామెత వాడతారు.

అద్దం అబద్ధం ఆడుతుందా !

అద్దంలో చూస్తే చూచిన వారి ముఖం ఎలా వుందో అదేవిధంగా కనబడుతుంది కాని… అంతకన్నా అందంగానో…. లేదా అంద విహీనంగానో కనబడదు. అందుచేత అద్దం అబద్ధం చెప్పదంటారు.

అద్దెకు తెచ్చిన గుర్రం అగడ్త దాటుతుందా

అద్దెకు గాని, అరువుకు గాని ఉచితంగా గాని పనులకు తెచ్చుకొన్న వస్తువులు పెద్ద పెద్ద పనులకు ఉపయోగించవని ఈ సామెతకు అర్థం>

250px One Of The Moad Vellore Fort
వెల్లూరు కోట అగడ్త

అదే పతకవైతే అమ్ముకు తిననా?

ఒక వస్తువును ఉపయోగించడానికి వీలులేకపోతే ఎంత విలువైనదైనా ఏం ప్రయోజనం? ఏమీలేదు; అనే అర్థంలో వాడతారు. ఆడాళ్లు ఈ సామెత ఉపయోగిస్తే విపరీతమైన అర్థం స్ఫురిస్తుంది.

అనగా అనగా రాగం తినగా తినగా రోగం

సాధనతొ ఏదైనా సాధ్యమే అని దీని భావం. పాడగా పాడగా సంగీతం / రాగం వస్తుంది. అలాగే అతిగా తింటూ కూర్చుంటే రోగాలు వస్తాయని అర్ధం. ఈ అర్థానికి దగ్గరగా వేమన పద్యం ఒకటి ఉంది: అనగననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగతినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ

అని అనిపించుకోవలెనా అత్తగారూ!

ఒకరిని ఒక అనరాని మాట అని వారిచే నాలుగు మాటలు అనిపించుకోవడమనే తెలివి తక్కువ పని తెలియ జేస్తుంది ఈ సామెత.

అన్నం పెట్టిన చెయ్యిని నరికినట్లు

ఉపకారికి అపకారము చేసినట్టి సందర్భంలో ఈ సామెతను చెబుతారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లు అనే మరొక సామెత ఇలాంటిదే.

అన్నం అడిగిన వాడికి సున్నం పెట్టినట్లు

నిరంతరం ద్రోహచింతనతో ఉండేవారి గురించి.ఉపకారం చేయమని అడగటానికి వెళ్ళిన వ్యక్తికి ఉపకారం చేయకపోగా చేస్తున్నట్లు నటించి అపకారం చేసి అవమానించటం.అందని పూలు దేవుడికి అర్పణం అన్నట్టు. స్వార్థపరులు, అవకాశవాదుల మనస్తత్వం .

అన్నదమ్ముల పొత్తు చిన్నప్పుడు, అప్పచెల్లెళ్ళ పొత్తు పెద్దప్పుడు

అన్నదీక్షే కానీ అక్షర దీక్ష లేదు

అన్నం పెట్టిన చెయ్యిని నరికినట్లు

అన్న ద్వేషం, బ్రహ్మ ద్వేషం పనికిరావు

అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట

లేని దానికోసం కక్కుర్తి పడటం ఒక జంట పక్క ఊరు వెళ్ళేందుకు బట్టలు సర్దుకొని ప్రయాణము అవుతారు. దారిలో మరొక జంట వీరిని కలిసి, ఇప్పుడే వస్తాము మా సామాను చూస్తూ ఉండమని చెప్పి పాత బట్టలు ధరించి కొత్త బట్టలను మూట గట్టి ఆ మూటను చూస్తూ వుండమని చెప్పి వెళ్తారు. వెళ్ళిన వాళ్ళు కొత్త బట్టలు తీసుకొని వస్తారు! ఇది చూసి ఆశ్చర్యపోయిన మన పాత జంట “ఏమిటి విషయము” అని అడిగితే.., ఫలానా జమిందారు పేదవారికి అన్న వస్త్రాలు దానం చేస్తున్నాడు అని చెప్పి, అందుకనే మేము పేదవారిలాగా వెళ్ళి అతను ఇచ్చిన కొత్త బట్టలు తెచ్చుకున్నాము అని చెప్తారు. దీనితో మన జంటకి కూడా ఆశ పుట్టి బట్టలన్నీ మూట కట్టి వారికి అప్పగించి పాత దుస్తులు ధరించి వెళ్తారు. వెళ్తే ఏముంది.., జమీందారూ లేడు.. కొత్త బట్టలూ లేవు. ఈసురోమంటూ వెనక్కి వచ్చి చూస్తే.. వాళ్ళ దుస్తులు తీసుకుని కొత్త జంట ఎప్పుడో ఉడాయించారట. మేలు జరుగుతుందని ఆశపడివెళితే అనుకున్న మేలు జరగకపోగా మరికొంత కీడు వచ్చిపడటం. ఓ వ్యక్తి దరిద్రంతో బాధపడుతూ తనకు కావలసిన అన్నం, వస్త్రాలు ఎవరో దానం చేస్తానంటే వెళ్ళాడట. కానీ అక్కడి పరిస్థితి మారిపోయి ఆ ప్రదేశంలో ఎదురైన కొంతమంది ఉన్న వస్త్రాన్ని కూడా లాక్కున్నారట. లాభం వస్తుందనుకున్నప్పుడు ఆశించిన లాభం రాకపోగా అనుకోని నష్టం ప్రాప్తించటం.

అన్నవారూ, పడినవారూ బాగున్నారు, మధ్యవారు పడిచచ్చారు

ఇరు వర్గాల మధ్య పోట్లాట జరిగితే………… తీర్పు చెప్పడానికి మద్యలోకి వెళితే వారికి జరిగే అపనింద గురించి ఈ సామెత పుట్టింది. మాటలు అన్నవారుగాని, పడిన వారుగాని బాగుంటారు…………. మద్యలో వెళ్ళినవారు నింద మోయాల్చొస్తుందని దీని అర్థం. కోడెల పోట్లాటలో దూడలు నలిగినట్లు అనే సామెతతో దీనికి పోలిక ఉంది.ఎవరైనా వేరే వాళ్ళని తిడితే, అలా తిట్టాకూడదని సర్దిచెప్పే వారు మధ్యలో తిట్లుతింటారు. అటు అన్న వాళ్ళని ఎవరూ ఏమి అనరు ఇటు తిన్న వాళ్ళని ఎవరు ఏమి అనరు కాని మధ్యలో తగువు తీర్చటానికి వచ్చిన వాళ్ళు మాత్రం మాటలు పడతారు. దానివలన మధ్యలో వెళ్ళిన వ్వక్తి ఆ ఇద్దరికి శత్రువౌతాడు. ఈ సామెత అర్థం అదె.

అన్యాయపు ఊరిలో ఆలూ మగలకే రంకు

అన్యాయపు సంపాదన ఆవిరై పోతుంది

అన్యాయంగా సంపాదించిన సొమ్ము అక్కర తీర్చదని దీని అర్థము. ధన సంపాదనకు అన్యాయ మార్గాన్ని ఎంచుకోరాదని ఇందులోని గూడార్థం.

అన్నీవేసి చూడు …. నన్ను వేసి చూడు… అన్నదట ఉప్పు

అన్ని దినుసులు వేసినా ఉప్పు వేయక పోతే వంటలకు రుచి రాదు అనే అర్థంలో ఈ సామెతను వాడుతారు.

అన్నీ సాగితె రోగమంత భోగం లేదు

రోగికి అన్ని సపర్యలు సక్రమంగా సాగి పోతుంటే….. రోగమె మంచిదని ఈ సామెత అర్థం.

అన్ని కార్తెలు తప్పినా హస్త కార్తె తప్పదు

అన్ని దానాలలో అన్నదానం మిన్న

అన్ని పైర్లకూ ఆషాఢం

అన్ని రోగాలకు వాతలు పెట్టే వైద్యుణ్ణి దూరంగావుంచాలి

అన్నీ అమర్చిన తర్వాత అత్తగారు వేలు పెట్టినట్లు

అన్నీ అయిన తర్వాత అగ్ని వైద్యం

అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి దణ్ణం పెట్టేవాడు దూరంగా ఉన్నా పర్వాలేదు

పని ఇఛిన వాణ్ణి దగ్గరగా ఉంచు, భజనపరులను దూరంగా ఉంచు అన్న మాటను ఈ సామెత తెలియచేస్తుంది.

అన్నం చొరవే గానీ అక్షరం చొరవ లేదు

తినే తిండి మీద ఉన్న యావ లేక శ్రద్ధ చదవాల్సిన చదువు మీద లేదు అని ఈ మాటకు అర్థం.

అన్నం తిన్నవాడు తన్నులు తిన్నవాడు మరచిపోడు

ఉపకారం పొందినా అపకారం పొందినా మరచిపోవటం సాధ్యం కాదని

అన్నిదానాల్లోకి నిదానమే గొప్పదన్నాడట

కొంతమంది బద్ధకస్తులు తాము చేసిన పనులను సమర్ధించుకుంటూ ఎదుటి వారెవరైనా ఈ పని చెయ్యటంలో ఆలస్యం ఎందుకయిందని ప్రశ్నించినప్పుడు నిదానమే ప్రధానమని దబాయిస్తుంటారు.

అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది

కొందరు తమకు ఏమీ తెలియకపోయినా అన్నీ తమకే తెలుసునన్నట్లుగా ఏకథాటిగా మాట్లాడుతూ ఊదరగొడుతూ ఉంటారు. వారిని గురించి ఈ సామెత వాడతారు. కొందరు తమకు అన్నీ తెలిసినా మౌనంగా ఏమీ తెలియనట్లుగా ఉంటారు.

అన్నీ తెలిసినమ్మ అమావాస్యనాడు చస్తే ఏమీ తెలియనమ్మ ఏకాదశినాడు చచ్చిందన్నట్టు

చాంద్రమానాన్ని పాటించే తెలుగువారు అమావాస్య మంచిదికాదని ఆ రోజున మరణించటం మంచిది కాదని భావిస్తారు.ఏకాదశి మాత్రం ఉత్తమమైన తిథి, శుభకరమైనది ఆ రోజున మరణిస్తే వైకుంఠం ప్రాప్తిస్తుందంటారు. ఇన్నీ తెలిసినామె అమావాస్యనాడే పోతే ఈ విషయాలేవీ తెలియని ఆమె మాత్రం ఏకాదశినాడే ప్రాణం విడిచిందట. అన్నీ తెలిసినవారు చేయకూడని తప్పు చేస్తారని, ఏమీ తెలియని వారు మాత్రం మంచే చేస్తుంటారని.బాగా చదువుకున్న వాళ్లు లేదా అన్ని విషయాలు బాగా తెలుసనుకున్నవారు తప్పు చేసినట్లు.

అన్నీ సాగితే రోగంమంత భోగము లేదు

ఎవరికైనా జబ్బు చేసినప్పుడు వారి అవసరాలని కనిపెట్టుకుని చూసేవారుంటే, రోగంతో బాధపడుతున్నప్పటికీ రోజులు మాత్రం సుఖంగా గడిచిపోతాయని చెప్పటానికి ఈ సామెతను వాడుతారు.

అన్నీ ఉన్నాయి కాని అల్లుడి నోట్లో శని ఉంది

అనుమానం పెనుభూతం

అన్నింటిని అనుమానించే వాడు ఏ పని చేయలేడు. అనుమానమే వాడిని కుంగ దీస్తుంది. అదెంత మాత్రము పనికిరాదని దీనర్థం.

అనుకున్న పని అంగవస్త్రంలో అయినట్లు

అనుమానం ముందుపుట్టి ఆడది తర్వాత పుట్టింది

ఆడడి అన్ని విషయాలను అనుమానిస్తుందని ఈ సామెత అర్థం.

అనుభవం ఒకరిది – ఆర్భాటం, ఆయాసం ఇంకొకరివంతు

అనూరాధ కార్తెలో అనాథ కర్రయినా ఈనుతుంది

అనూరాధకు తడిస్తే మనోరోగాలు పోతాయి

అనూరాధలో అడిగినంత పంట

అనూరాధ కార్తెలో పంట వేస్తే పుష్కలంగా పండుతుందని రైతుల నానుడి.

అనూరాధలో తడిస్తే ఆడది మగాడౌతుంది

అనూరాధ కార్తెలో పడిన వర్షంలో తడిస్తే పౌరుషం పెరుగుతుందని దీని అర్థం.

అన్నం అరిగిపోతుంది – ఆదరణ శాశ్వతంగా వుంటుంది

అన్నదానం చాల ఉత్తమ మైనదని అంటారు గాని తిన్న ఆ అన్నం ఒక పూటలో అరిగిపోతుంది. తిరిగి రెండో పూటకు ఆకలౌతుంది. కాని ఆపదలో వున్నవాడిని ఆదరిస్తే అతడు ఆ ఆదరణను తన జీవితాంతం గుర్తుంచుకుంటాడు.

అన్నం కన్నా ఆదరణ ముఖ్యం

అన్నం అరిగిపోతుంది – ఆదరణ శాశ్వతంగా వుంటుంది. అన్నదానం చాల ఉత్తమ మైనదని అంటారు గాని తిన్న ఆ అన్నం ఒక పూటలో అరిగిపోతుంది. తిరిగి రెండో పూటకు ఆకలౌతుంది. కాని ఆపదలో వున్నవాడిని ఆదరిస్తే అతడు ఆ ఆదరణను తన జీవితాంతం గుర్తుంచుకుంటాడు.

అన్నం వుడికిందో లేదో చూడాలంటే అంతా పట్టి చూడక్కరలేదు

అన్నం కోసం వచ్చి కంచం కోసం పోట్లాడుకున్నట్లు

అన్నం వండని ఆడదీ, మంచం నేయని మగవాడూ వుండడు

అపనింద అవతలకిపోతే, నింద వచ్చి తలమీద పడిదట

అపుత్రుడికి గతి లేదు

అప్పచెల్లెలు బ్రతక గోరితే తోడికోడలు చావు కోరుతుంది

దీనికే, బావలు బ్రతుకు కోరతారు , దాయాదులు చావు కోరతారు అనే రూపాంతరం కూడా ఉంది.

అప్ప సిరి చూసుకుని చెల్లెలు మడమలు విరగ త్రొక్కుకుందట

అప్పటి కోపం అన్యాయ మెరుగదు

అప్ప సంపాదించిన ఆస్తి మనుమడితో మట్టిపాలు

అప్పిచ్చే నాకొడుకుంటే దొంగతనం ఎందుకు?

అప్పు అదనుకు, ఆకటికీ రాదు

అప్పు ఆదా కాదు – వాపు బలుపూ కాదు

అప్పు ఆరు తెన్నులు – ముప్పు మూడు తెన్నులు

అప్పు యిచ్చి చూడు – పిల్ల నిచ్చి చూడు

అప్పు గాని, పిల్లను గాని మరొకరికిస్తే అవి తిరిగి రావనే అర్థంలో ఈ సామెతను వాడుతారు

అప్పు ఇచ్చినవాడు బాగు కోరితే తీసుకున్నవాడు చెడు కోరతాడు

అప్పు చేసి కొప్పు తీర్చినట్లు

అప్పుచేసి పప్పు కూడు

అన్నీ సాగితే రోగంమంత భోగము లేదు

ఎవరికైనా జబ్బు చేసినప్పుడు వారి అవసరాలని కనిపెట్టుకుని చూసేవారుంటే, రోగంతో బాధపడుతున్నప్పటికీ రోజులు మాత్రం సుఖంగా గడిచిపోతాయని చెప్పటానికి ఈ సామెతను వాడుతారు.

అపానవాయువును అణిచిపెడితే ఆవులింతలు ఆగుతాయా?

అప్పటికి దుప్పటిచ్చాముగానీ కలకాలం ఇస్తామా?

ఏదో చలికి బాధ పడుతున్నాడని దుప్పటి ఇచ్చారు. దానిని ఆసరాగా చేసుకొని ఇంకా కొన్ని సౌకర్యాలు కావాలని కోరే వారి గురించి ఈ సామెత వాడతారు.

అప్పనుచూడబోతే రెప్పలు పోయినై

అప్ప సిరిచూసుకొని మాచి మడమలు తొక్కింది

అప్పిచ్చువాడు వైద్యుడు

సుమతీశతకం సృష్టించిన జాతీయాలు, సామెతల్లో ఇది ఒకటి. శతకం చెప్పిన రూపం మారిపోయి దీనికి మరో అర్థం తోడవుతున్న సమయమిది. పద్యమిలా ఉంది.అప్పిచ్చువాడు వైద్యుడుఎప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడున్చొప్పడిన యూరనుండుముచొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ

పై పద్యానికి అర్థం తెలిసిపోతూనే ఉంది. అప్పిచ్చేవాడు, వైద్యుడు, సమృద్ధిగా నీరు, బ్రాహ్మణుడు మొదలైనవి దొరికే ఊళ్ళోనే ఉండాలి. అవి లేని ఊళ్ళో ఉండరాదు. అయితే, ప్రస్తుతం మొదటి పాదానికి అర్థం మారిపోతూంది. వైద్యుడంటే అప్పిచ్చేవాడనే అర్థంలో కొందరు వాడుతున్నారు. పద్యం తెలిసినవారు శ్లేషార్థంలో వాడుతుంటే.., పూర్తి పద్యం తెలియనివారు వైద్యుడికి అప్పిచ్చే బాధ్యత కూడా ఉంది కామోసనీ, అప్పిచ్చేవాడు వైద్యుడితో సమానం కాబోలనీ, వైద్యుడికి అప్పిచ్చే బాధ్యతను ఎందుకు పెట్టారబ్బా మనవాళ్ళు..? అనీ అనుకుంటూ ఉంటారు.

అప్పిచ్చి చూడు ఆడపిల్లనిచ్చిచూడు

అప్పు నిప్పులాంటిది…

నిప్పు ఎలా అయితే ముట్టుకుంటే కాలుతుందో అలాగే అప్పు కూడా. నిప్పుని ముట్టుకోకుండా ఉండడం లాటిదే అప్పు చెయ్యకుండా ఉండడం కుడా.

అప్పు పత్రానికి ఆన్సరుందిగానీ చేబదులుకి ఉందా?

అప్పు ఇచ్చేటప్పుడు ప్రోనోటు లాంటి వ్రాత పూర్వక రుజువు వుండాలని చేప్పేదే ఈ సామెత.

అప్పు చేసి కొప్పు తీర్చిందట

అప్పు చేసి సంబరాలు చేసుకోకూడదని ఈ సామెతకు అర్థం.

అప్పుచేసి పప్పు కూడు తినడం

ఆడంబరంగా జీవించడం వివేకమైన విషయం కాదు. ఆడంబరం అనేది వ్యసనం లాంటిది దానికి అలవాటు పడిన వాళ్ళు సంపదను శీఘ్రంగానే కోల్పోతారు. స్వంత ధనంతో ఆడంబరంగా ఉన్నని రోజులు అంతగా పట్టించుకోరు కాని అప్పు చేసి ఆడంబరంగా జీవించేవారిని సమాజం గౌరవించదు.

అప్పు తీసుకుంటే చెప్పు చేతలలో ఉండాలి

అనవసరంగా అప్పులు చేయవద్దని హెచ్చరిక.అప్పు నిప్పు.అప్పుంటే ముప్పు . ఆర్థికపరంగా జాగ్రత్తపడమని, అనవసరమైన ఖర్చులు చేసి అప్పులపాలు కావద్దని, అప్పు తీసుకుంటే ఆత్మాభిమానాన్ని వదులుకొని చెప్పిందే చేయాల్సి వస్తుందని

అప్పులేని వాడే అధిక సంపన్నుడు

అప్పులేని వాడు సుఖంగా ఉన్నది తిని సుఖంగా నిద్ర పోతారు. కాని అప్పు వున్నవాడికి నిద్రలోకూడ అప్పు సంగతి గుర్తుకు వచ్చి సరిగా నిద్ర పట్టదు. ఆ విషయం చెప్పేదే ఈ సామెత.

అప్పులవాడిని నమ్ముకొని అంగడికి, మిండమగడిని నమ్ముకొని జాతరకు పోకూడదు

మన దగ్గర అప్పు తీసుకున్న వాణ్ణి నమ్ముకుని (అంటే వాడు ఇస్తాడని నమ్ముకుని) బజారుకెళ్ళి వస్తువులు కొనుక్కొంటే, వాడు ఇవ్వకపోతే కష్టం. అలాగే, ఉంచుకున్న మొగుడితొ జాతరకెళ్తే తెలిసినవాళ్ళు చూస్తారని సిగ్గుతో ఆ మొగుడు అటు ఇటు పరుగెత్తుతుంటే చాలా కష్టం.

అప్పులున్నాడితోను చెప్పులున్నాడితోను నడవొద్దు

బాగా అప్పులు చేసే వాడితో స్నేహం చేస్తే , వాడి అప్పులు తీర్చటానికి మనల్ని అప్పు అడుగుతాడు. అలాగే చెప్పులున్నవాడు కూడా ముళ్ళున్నా నడిచి వెళ్ళతాడు. కనుక వీళ్ళతో నడవొద్దు

అబద్ధము ఆడితే అతికినట్లుండాలి

అబద్ధము ఆడుచున్నట్లు ఇతరులు గ్రహించిన సందర్భము

అబ్బడి నెత్తి దిబ్బడు కొడితే దిబ్బడి నెత్తి సుబ్బడు కొట్టాడన్నట్లు

తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. ఎవరూ ఎవరికంటే అధికులు కారని, తామే గొప్ప అని ఎవరూ ఎప్పుడూ గర్వాహంకారాలకు పోకూడదని ఈ సామెతకు అర్థం.

అభిరుచులా మస్తు – అంగస్తంభన నాస్తి

అభ్యాసం కూసువిద్య

తప్తపరశుగ్రహణన్యాయము=క్రమక్రమముగ వేడివస్తువులను పట్టుకొనుట అలవాటు చేసిన చివఱకు కాలుచూఉన్న ఇనుపగొడ్డలిని కూడా పట్టు కొనవచ్చును

అమరితే ఆడది – అమరకుంటే గాడిద

అందని ద్రాక్షపండ్లు పుల్లన అనే సామెతకు సమానార్థం ఈ సమెతకు ఉంది.

అమావాస్యకు అట్లు – పున్నానికి బూరెలు

అమ్మ కడుపు చూస్తుంది – భార్య జేబు చూస్తుంది

తల్లి తన కొడుకు వచ్చాడంటే ఎప్పుడు తిన్నాడో, ఏం తిన్నాడో నని అతని కడుపుని, అనగా ఆకలిని గమనిస్తుంది. కాని అతని భార్య…… ఇంటికొచ్చిన భర్థను ఎంత డబ్బు తెచ్చాడని అతని జేబును చూస్తుంది అని అర్థము.

అమ్మ కళ గుమ్మంలోనే తెలుస్తుంది

అమ్మకు నోటి వాడి – అయ్యకు చెయ్యి వాడి

అమ్మ గూటికి – అయ్య కాటికి

అమ్మ గృహ ప్రవేశం – అయ్య అగ్ని ప్రవేశం

అభ్యాసము కూసువిద్య

నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరును అని ఈ సామెత అర్థము. ఈ సామెతను వివరించే పద్యం వేమన శతకంలో ఒకటి ఉన్నది – అనగననగ రాగ మతిశయిల్లుచు నుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన

అమ్మ పుట్టిల్లు ఘనత మేనమామకు తెలియదా?

అమ్మ పుట్టింల్లు మేనమామ ఇల్లే కనుకు అమ్మ పుట్టింటి గురించి మేనమామ దగ్గర గొప్పలు చెబితే ఎలా ఉంటుందో మన గురించి అన్ని తెలిసిన పాత పరిచయస్తులకు కల్పించి లేనిపోని గొప్పలు చెప్పినప్పుడు అలానే ఉంటుంది. అలాటి సమయంలో ఈసామెతను వాడుతూ ఉంటారు.

అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు

కొందరు మనకు సహాయం చెయ్యకపోగా, వేరే మార్గాల ద్వారా కూడా సహాయం పొందనీయరు. ఈ సందర్భాలలో ఈ సామెతను ఉపయోగిస్తారు. తానూ చేయక, ఇతరులనూ చెయ్యనివ్వక అడ్డుపడే వారిని ఉద్దేశించి ఈ సామెతను వాడతారు.

అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు

ఆచరించవలసిన ధర్మం నిర్వర్తించకుండా అన్య ధర్మాలు పాటించేవాళ్ళనుద్దేశించిన సామెత ఇది. మన తల్లికి కనీసావసరమైన తిండి ఇవ్వడం మన కనీస కర్తవ్యం. మన పెద్దమ్మ (అమ్మకి అక్క) బాగోగులు మన ప్రాథమిక కర్తవ్యం కాదు. మనమీద ఆధారపడిన వాళ్ళ సంగతి చూసాక చేయవలసిన పని. కాని, తల్లికి కూడు పెట్టకుండా, పెద్దమ్మకి బట్టలు కొనడం ఎంత ఉచితం? ఈ సామెతకి ఇంకో రూపాంతరం ఉంది. అది: అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతాడా? అసలు ధర్మమే నిర్వర్తించని వాడి నుండి వేరేమి ఆశించగలం అని భావం.

అమ్మబోతే అడవి కొనబోతే కొరివి

ఇది రైతులకుసంబందించిన సామెత. తాము ఉత్పత్తి చేసిన సరుకులు అనగా కూరగాయలు, ధాన్యం మొదలగు వాటిని అమ్మబోతె సరకు నాణ్యత లేదని, ఇప్పుడు ధరలు లేవని ఎన్నో సాకులు చెప్పి వ్వాపారస్తులు వాటికి అతి తక్కవ ధరకు కొంటారు. కాని రైతులు తమకు కావలసిన వస్తువులు కొనబోతె, ఆ వస్తువుల గొప్పదనాన్ని, వాటి రూపు రేఖలను వర్ణించి చెప్పి అమాయకులైన రైతులను నమ్మించి అధికరకు విక్రయిస్తారు. ఆ సందర్భంలో పుట్టినది ఈ సామెత.

అయితే అంగలూరు కాకపోతే సింగలూరు

అయిదుగురు పట్టంగ ముఫ్పై ఇద్దరు రుబ్బంగ ఒకడు తొయ్యంగ గుండువెళ్ళి గుండావతిలో పడింది

కంచంలో ఉన్న అన్నాన్ని చేతికున్న అయిదువేళ్ళు కలిసి ముద్దచేసి నోట్లోపెడితే నోట్లో ఉన్న ముఫ్పై రెండుపళ్ళు ఆ అన్నం ముద్దను బాగా రుబ్బితే ఆ రుబ్బిన ముద్దను నాలుక లోపలికి తోస్తుంది. అప్పుడు అన్నంముద్ద అగ్నిగుండంలాంటి పొట్టలోపడుతుంది.

అయిదోతనం లేని అందం అడుక్కుతిననా?

అయిదోతనం అంటే భర్తను కలిగి ఉండటం. భార్య అందచందాలు భర్తకు మోదం కలిగించేందుకే. ఐదోతనమే లేనప్పుడు అంటే భర్తే లేనప్పుడు ఇంక ఆ అందం ఉండీ ప్రయోజనం లేదు అని ఈ సామెత భావం. ఏ లక్ష్యం కోసం ఓ పనిచేస్తున్నామో ఆ లక్ష్యం ఉనికిలోనే లేనపుడు ఆ పని నిరర్థకం అని చెప్పదలచిన సందర్భంలో ఈ సామెతను వాడతారు.

అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో

ఐనోళ్లకి అన్నమ్, కానోళ్లకి కన్నమ్

అయ్యకు రెండు గుణాలే తక్కువ – తనకు తోచదు, చెబితే వినడు

అయ్యవారు ఎందుకు కొరగాడని అర్థంలో ఈ సామెతను వాడుతారు.

అయ్యకు వణుకు ప్రాయం – అమ్మకు కులుకు ప్రాయం

అయ్యగారికి ఆరు ఎడ్లు, మూడు దొడ్లు

అయ్యగారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా?

ఒకరికొరకు సమయము ఆగదు అనే అర్థం ఈ సామెతలో ఉంది. పూజలకొరకు పంతులుగారిని పిలిస్తే అయ్యవారు తీరుబడిగా వస్తే అంతవరకు అమావస్య ఆగదు గదా…..

అయ్య దాసర్లకు పెడితే అమ్మ జంగాలకు పెట్టిందట

అయ్య దేశ సంచారం – అమ్మ గ్రామ సంచారం

అయ్య వాత పెట్టనూ బర్రె బ్రతుకనూనా?

అయ్యవా రంతంత – అయ్యవారి పెళ్ళాం ముంతంత

అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు

అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు

అయ్యవారు అంటే ఉపాధ్యాయుడు అని అర్థం. ఇతరుల తప్పులు దిద్దవలసిన వ్యక్తి తాను చేసిన తప్పులను తానే దిద్దుకొనే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆతనిని ఉద్దేశించి ఈ సామెతను వాడుతారు.

అయ్యవారు వచ్చునంతవరకు అమావాస్య అగదు

వారు ఎంతటి వారైనా కాలము వారిగురించి ఆగదు అని చెప్పడాని ఈ సామెత వాడతారు.

అయ్యవారులకు ఐదు వరహాలు వారి పిల్లలకు పప్పుబెల్లాలు

దసరా సందర్భంగా ప్రాథమిక పాఠశాల ఉపాద్యాయులు విద్యార్థులను వెంట పెట్టుకొని విద్యార్థుల అందరి ఇళ్ళకు వెళ్ళి మామూలు పుచ్చుకోవడం మామూలే. ఈ సమయంలో వెదురు కర్రతో చేసి రంగు కాగితాలతో అలంకరించిన బాణాలు విద్యార్థులు పట్టుకుని అయ్యవారి వెంట వస్తారు. విద్యార్థులు ఏదయా మీ దయా మామీద లేదు, ఇంత సేపుంచుటా ఇది మీకు తగునా .. అయ్యవారికి చాలు అయుదు వరహాలు, పిల్ల వాళ్ళకు చాలు పప్పు బెల్లాలు అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ అయ్యవారి వెంట వస్తారు. గృహస్తులు అయ్యవారికి ధనరూపంలోనూ, పిల్ల వాళ్ళకు పప్పు బెల్లం రూపంలోనూ కానుకలు ఇస్తారు. సంవత్సర కాలంలో సేవలందిచిన వారు గృహస్తును మామూళ్ళు అడగటం వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే. దీనిని దసరా మామూలు అంటారు.

అయినవాడని ఇంటికి రానిస్తే ఇంటి దానికి కన్ను కొట్టాడట

అయినవారు లోపలకు తోస్తే కానివారు బయటకు తోస్తారు

అయినవాళ్ళకు ఆకుల్లోనూ కానివాళ్ళకి కంచాల్లోనూ

అయోమయం అడవి మొద్దు

అయ్యోపాపం అంటే ఆరు నెలల పాపం పైన పడ్తుంది

ఎదుటి వాడిపై జాలి తలిస్తే…………… వాడే తనకు నష్టం కలిగిస్తాడని ఈ సామెత అర్థము.

అరకాసు పనికి ముప్పాతిక బాడుగ ఖర్చు

ఆవు పాతిక బందె ముప్పాతిక, అనే సామెతకిచ్చే అర్థమే ఈ సామెతకు కూడా వర్తిస్తుంది.

అరగదీస్తే గంధపు చెక్కకు వాసన పోతుందా?

అరగని కూడు – జరగని మాట

అరఘడియ భోగం ఆర్నెల్ల రోగం

వేశ్యాలోలుడు అరగడి సుఖం కొరకు వెళ్ళి రోగం తెచ్చుకొని జీవిత మంతా బాదపడుతారని హెచ్చరించే సామెత ఇది.

అరచేతిలో వైకుంఠం చూపినట్లు

మోసగాళ్ళు మాట్లాడే మాటలను ఈ విధంగా ఈ సామెతను వర్తింప జేస్తూ అంటుంటారు.

అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యికోసం వూరంతా తిరిగినట్లు…

మతిమరుపు మనుషుల నుద్దేశించి ఈ సామెతను వాడుతారు. ఇదే అర్థంలో మరో సామెత: సంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు.

అరటిపండు ఒలచి చేతిలో పెట్టినట్లు

అరటిపండు తినాలనుకుంటే ఎవరైనా తొక్క ఒలుచుకుని తినాల్సిందే. కానీ ఎవరైనా తొక్క ఒలిచి మన చేతిలో పెడితే ఆ పాటి శ్రమ కూడా తప్పుతుంది. అదే విధంగా మనం చేయవలసిన పనులను ఎవరైనా మనకు బాగా సులభతరం చేసినప్పుడు ఆ ప్రక్రియ అరటిపండు ఒలిచి చేతిలో పెట్టడం వంటిదని చెబుతూ ఈ సామెతను వాడుతారు. అవసరమైన వస్తువు మన దగ్గరే ఉన్నప్పటికీ గాభరా పడి, అయోమయ పడి, అంతటా వెదికి చివరగా “అయ్యో మన దగ్గరే ఉంది కదా!” అని తెలుసుకోవటానికి ఈ సామెత వాడుతారు. కళ్ళజోడు, పెన్ను, టెలివిజన్ రిమోట్ వంటి వస్తువులను వెతికేవారికి ఈ అనుభవం తరచు ఎదురవుతుంటుంది. ఇలాంటిదే మరొక సామెత: ‘చంకలో బిడ్డ నుంచుకుని, ఊరంతా వెతికినట్లు

అరసుడిని నమ్మి పురుషుణ్ణి పోగొట్టుకున్నట్టుంది

అరసుడు అంటే వుంచుకున్నవాడు, పురుషుడు అనగా భర్త అని అర్థము: వుంచుకున్నవాడిని నమ్మి అసలు భర్తను పోగొట్టుకున్నదట. తెలివి తక్కువ పని అర్థము.

అరిచే కుక్క కరవదు

కొన్ని కుక్కలు మనుషులు కనపడగనే తీవ్రంగా అరుస్తాయి, దగ్గరికి వెళ్తే కరుస్తాయి అని భయం వేస్తుంది. తీరా దగ్గరకు వెళితే పారిపొతాయి. అలాగే కొంతమంది ఏదైన విషయంలొ కొపం వస్తే వాడిని కొడతాను, వీడిని తిడతాను, రక్తం కళ్ళచూస్తాను అని అరుస్తారు. తీరా సందర్భం వచ్చినపుడు ఏమీ మాట్లాడరు. ఇటువంటివారిని అరిచే కుక్కలతొ పోలుస్తూ ఈ సామెత వాడతారు

ఆరగించగా లేనిది అడిగితే వచ్చిందా!

ఆరాటపు పెళ్ళి కొడుకు పేరంటాళ్ళ వెంట పడ్డాడట

ఆరాటమేగానీ పసలేదన్నట్లు

ఆరాటాల పెళ్ళాం – ఆయాసాల మొగుడు

ఆరికకు చిత్త గండం – ఆడదానికి పిల్ల గండం

ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ

ఆరు కార్తెలకు పోతు ఆరుద్ర కార్తె

అన్ని కార్తెలకన్నా ఆరుద్ర కార్తె రైతులకు/పంటలకు చాల మంచిదని దీనర్థం.

ఆరుద్ర కార్తె విత్తనానికీ – అన్నం పెట్టిన యింటికీ చెరుపు లేదు

ఆరుద్ర కురిస్తే ఆరు కార్తెలు కురుస్తాయి

ఆరుద్ర కురిస్తే దారిద్ర్యం లేదు

ఇది వ్యవసాయ దారుల సామెత. ఆరుద్ర కార్తెలో వర్షం కురిస్తే పంపటలు బాగ పండతాయని అర్థం.

ఆరుద్ర చిందిస్తే అరవై దినాల వరపు

ఆరుద్ర మొదటి పాదాన ఎత్తితే ఆరంభాలు చెడతాయి

ఆరుద్రతో అదను సరి

ఆరుద్రలో అడ్డెడు చల్లితే, సులువుగా పుట్టెడు పండుతుంది

పంటలు బాగా పండాలంటే ఆరుద్ర కార్తే చాల మంచిదని ఈ సామెతకు అర్థం.

ఆరుద్ర వాన అదను వాన

ఆరుద్ర కార్తెలొ కురిసిన వర్షం రైతులకు/పంటలకు చాల మంచిదని దీనర్థం.

ఆరుద్రకు ఆమ్లాలు కూడా పండుతాయి

ఆరు నెలలకు చచ్చేవాడికి అరుంధతి కనపడదు

ఆరునెలల సహవాసం చేస్తే వారు వీరవుతారు

ఆరు నెలలు సాము చేసి మూలనున్న ముసలమ్మతో యుద్ధం చేసినట్లు

ఆరు రాజ్యాలను జయించవచ్చు కానీ అల్లుడిని జయించలేం

ఆర్భాటపు ఆడదానికి ఆరుగురు మొగుళ్ళు

ఆర్చేవారే గానీ తీర్చేవారే లేరు

ఆలిఅలుక అరవైఏండ్లు, మగనిఅలుక ముప్పై ఏండ్లు, బాలప్రాయం పదేళ్ళు

ఆలికి అదుపు – ఇంటికి పొదుపు

అర్జీలకు పనులు కావు

ఏదైన ఒక పని కొరకు ప్రభుత్వ కార్యాలల్లో అర్జీ పెట్టుకుంటారు. ఆ అర్జీని పరిశీలించి తగిన సహాయము చేయాలి ప్రభుత్వ అధికారులు. ఇది పద్దది. కాని ఈ కాలంలో అర్జీ పెట్టుకున్నంత మాత్రానా పనులు కావు….. దాని వెంబడి పడి అధికారులకు లంచ మిచ్చి పని చేయించు కొంటేనే గాని పనులు కావని ఈ కాలపు పరిస్థితిని తెలియ జెప్పే సామెత ఇది.

అర్ధరాత్రి మద్దెల దరువు

అర్ధరాత్రి అందరూ ఆదమరచి నిద్రపోవలసిన సమయం. ఆసమయంలో ఎవరైనా అనవసర విషయాలకు హడావిడి చేస్తుంటే ఇలా ఈ సామెతను కొంచెం విసుగ్గాను చిరాకుగాను చెప్తారు.

అలకాపురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా…

ధనానికి అధిపతి అయిన కుబేరుడు అలకాపురి నగరానికి రాజు. ఎంతటి ధనవంతుడయిననూ అవసరమును మించి ధనమును ఖర్చు చేయకూడదు అన్న నీతిని అడ్డూఅదుపూ లేకుండా ధనమును విచ్చలవిడిగా ఖర్చు చేసే ఓ డబ్బుగల వానిని ఉద్ధేశించి ఈ సామెతను వాడుట ద్వారా మన పూర్వులు తెలియజేసినారు.

అలంకారం కంటే అయిదవతనం మేలు

అలకపాన్పు మీద అల్లుడలిగితే అత్తగారు కంగారు పడినట్లు

అలకాపురం కొల్లగొట్టినా అదృష్టహీనునికి దక్కేదేమీ వుండదు

అలలు నిల్చేదెప్పుడు? స్నానం చేసేదెప్పుడు?

అలక మీరితే అమృతమైనా విషమే

అలికిన యింట ఒలికినా అందమే

అలిగే బిడ్డతోనూ – పొడిచే గొడ్డుతోనూ కష్టం

అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం

పదే పదే సమస్యలు సృష్టించే వారిని ఉద్ధేశించి ఈ సామెతను వాడతారు. అలిగే బిడ్డ, చెలరేగే గొడ్డు ఈ కోవలోకి వస్తారు. అందుకే ఈ సామెతలో వాటిని ప్రస్తావించారు.

అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట

ఇది అజ్ఞానానికీ, అతి తెలివికీ పరాకాష్టగా చెప్పే సామెత. తెలియక పోయినా తెలిసినట్లు నటించేవారి అంటించే చురక. అల్లం కారంగా, ఘాటుగా ఉంటుంది; బెల్లం తీయగా ఉంటుంది. ఇక పుల్లగా ఉండేవి వేరే పదార్ధాలున్నాయి. అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటది అని ఎవరైనా అంటే వారికి అల్లం రుచి తెలియదు. బెల్లం రుచి తెలియదు. పుల్లగా ఉండేదేమిటో తెలియదు. కనుక ఒకటి అడిగితే మూడు విషయాలు తెలియవని చెప్పుకున్నారు. కనీసం తన తెలియనితనాన్ని దాచుకోవాలన్న జ్ఞానం కూడా వారికి లేదన్న మాట. ఇదే అర్ధంలో చెప్పే మరొక సామెత: పంచపాండవులెందరంటే మంచం కోళ్ళలాగ ముగ్గురు అని రెండు వేళ్ళు చూపినట్లు.

అవ్వాకావలెను బువ్వా కావలెను

అవసరానికి ఏదో ఒకటి సర్థగలరు పుణ్యానికి.. కాని అన్నీవ్వలేరు గదా…. ఆ విషయాన్ని చెప్పేదే ఈ సామెత.

అయ్యే మంటే ఆరు నెలల పాపం తగులు కొందట

ఒకడు కష్టాలలో వున్నాడని సాయం చేయబోతె వాడి కష్టాలు వీడికి తగిలించాడట. అది దీనర్థం.

అసలే కోతి,ఆపై కల్లు తాగినట్టు

మామూలుగానే కోతి ఒక అతి చంచలమయిన జంతువు. ఇక అటుపై అది కల్లు (తాడి చెట్టు నుండి లభించు ఒక మత్తును కలిగించు ద్రవ పదార్థము) త్రాగినచో, దాని ప్రవర్తన అత్యంత విచిత్రముగా, విధ్వంసకరముగా ఉండును. ఇదే విధమయిన లక్షణములు గల వ్యక్తిని ఉద్ధేశించి ఈ సామెతను వాడెదరు. కోతికి అసలే చిలిపి చేష్టలు ఎక్కువ. కల్లు తాగిన తరువాత ఆ మత్తులో అది చేసే చిలిపి పనులు ఇంకా ఎక్కువ అని అర్థము. ముఖ్యంగా చిన్నపిల్లల అల్లరిని ఉద్దేశించి ఈ సామెత వాడడం జరుగుతుంది.వాడుక

  • ఈ సామెత లోని అర్థానికి మరింత గాఢతనిస్తూ ఇలా కూడా చెప్తారు – అసలే కోతి, పైగా పిచ్చెక్కింది, ఆపై కల్లు తాగింది, ఆపై నిప్పు తొక్కింది.
  • ఒకో మారు ఆఫీసులో బాసు ప్రవర్తన (మరీ రెచ్చిపోయినట్లు ఉంటే) కూడా ఈ సామెత వాడుతారు.
  • ఎక్కువగా వాడుకలో అసలే కోతి అని చెప్పి ఆపేస్తారు. తక్కిన భాగం అర్ధం చేసుకోవాలన్నమాట. (కొందరు సందర్బాను సారంగా సామెతలను ఉటంకిస్తూ…. సగం సామెతనే చెప్పి ఆపేస్తారు. మిగతా సామెతను ఊహించు కోవలసినదే…… ఈ పద్దతి….. మొత్తం సామెత చెప్పిన దానికన్న చాల గొప్పగా వుంటుంది)

అసలే లేదంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట

తన యొక్క వాస్తవ పరిస్థితితో నిమిత్తం లేకుండా, గొంతెమ్మ కోర్కెలు కోరే వాణ్ణి ఉద్ధేశించి పలికే సామెత ఇది. ==అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని వున్నట్లు. చేతిలో ధనం వున్నా … కొనాలన్న ఆలోచన లేని వాళ్ల గురించి ఈ సామెత పుట్టింది.

అలెగే బిడ్డ చెలిగే గొడ్డు ఒకటే

ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం

{{ఒకడు తనకు ఇంకా వివాహం కాకముందే వివాహం అయినట్లు, తన భార్య గర్భం దాల్చినట్లు, ఆమెకు సుఖ ప్రసవమై ఒక బాలుడు జన్మించినట్లు, ఆ బాలుడికి సోమలింగం అని పేరు పెట్టినట్లు కలలుకంటూ కల్లలైన ఆ ఆలోచనలను నిజమైనవిగా ప్రచారం చేసుకుంటూ గడపడటం. ఈ కథలోని వ్యక్తిలాగే వ్యర్థంగా మాటలు చెబుతూ కాలం గడిపే వారిని వ్యంగ్యధోరణిలో విమర్శిస్తున్నట్లు ఈ సామెత కనిపిస్తుంది}}

ఆస్తికొక కొడుకు – ప్రేమకొక కూతురు

ఆహారం పట్ల వ్యవహారం పట్ల మొగమాటం పనికిరాదు

అంకపొంకాలు లేనిది శివలింగం

అంకెకు రాని ఆలి – కీలెడలిన కాలు

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు

అర్ధం సాధారణంగా అల్లుడంటేనే విశేష గౌరవ మర్యాదలు చూపడం మన సంప్రదాయం. ఇక విందు భోజనాలకి చెప్పనవసరం లేదు కాని ఎన్ని చేసిన ఏదోకారణంగా అల్లుడు తినలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి అన్నీ అందుబాటులో ఉన్నా అనుభవించటానికి ఏదో కారణంగా ఆటంకాలు ఉంటాయి. అలాంటి సమయంలో ఈ సామెతని వాడుతుంటారు. ఈ జాతీయానికి సరైన అర్ధం మనకు అన్ని రకాల అవకాశాలు ఉన్నా ఏ అవకాశం అందని పరిస్థితి. అంగడి అంటే సరుకులు అమ్మే చోటు. కొత్త అల్లుడు అత్తవారి ఇంటికి వచ్చినపుడు మర్యాదలు సహజం. కొన్నాళ్ళకు పాతబడ్డ ఆ అల్లుడు అత్తవారి ఇంట్లోనే తిష్ట వేస్తే ఆ మర్యాదలు పెద్దగా జరగవు. అప్పుడు అంగట్లొ అన్నీ ఉంటాయి కాని అత్త వారింట్లో ఎవరూ వాటిని కొనరు. అల్లుడికి పెట్టరు. అలా రూపొందినదే ఈ సామెత. ప్రభుత్వ నిధులు ఎన్ని ఉన్నా ఆ ఫలాలు సామాన్యులకు అందవు. ఈ సందర్భంలో కూడా ఈ సామెతను గుర్తు చేసుకోవచ్చు.

వాడుక

మన దేశంలో అన్ని వనరులూ పుష్కలంగా ఉన్నాయి. కాని లంచగొండితనం వలన దేశం అభివృద్ధి కావడం లేదు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది

అంగటి వీధిలో అబ్బా అంటే, ఎవరికి పుట్టావురా కొడకా అన్నట్లు

అంగట్లో అరువు – తల మీద బరువు

అరవు అనగా అప్పు అని అర్థము అంగట్లో అప్పువుంటే తలమీద బరువు వున్నట్లే అని అర్థము

అంగట్లో అష్ట భాగ్యం – అల్లుని నోట్లో అష్ట దరిద్రం

అన్నీ వున్నాయి కాని అల్లుని నోట్లో శని వున్నది అనే సమానార్థంతో ఈ సామెతను వాడుతారు.

అంగట్లో ఎక్కువైతే ముంగిట్లో కొస్తుంది

ఏదైనా సరకులు అవసరానికి వాటిని కొనేవారికన్న తక్కువైతే ఆ వస్తువుకొరకు అందరు ఎగబడి అంగడికి ఎగబడతారు…. అప్పుడు దాని ధర కూడా అమాంతం పెరిగి పోతుంది. అవే వస్తువులు అవసరానికన్నా ఎక్కువయితే అవే వస్తువులు అనేక రాయితీలతో మన ఇంటిముంగిటకే వస్తాయనే అర్థంలో ఈ సామెతను వాడుతారు.

అంగడి అమ్మి గొంగళి కొన్నట్లు

అంగడి బియ్యం – తంగేటి కట్టెలు

366 అంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే ఉల్లిపాయ

అంగరక్ష లెన్నివున్నా శ్రీరామరక్ష వుండాలి

స్వంతంగా ఎంత బలం వున్నా….. ఎన్ని వున్నా దైవ బలం కూడా వుండాలని దీని అర్థం.

అంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే

ఉల్లిపాయ

అంచు డాబె గాని కోక డాబు లేదు

కోక అనగా చీర అని అర్థం. దానికున్న అంచు మాత్రం మహా బాగావుండి అసలు చీరలో పస లేదు అని అర్థం. ఇలాంటి సమానర్థంలో మరొక సామెత కూడా ఉంది. పైన పఠారం లోన లొఠారం

అండ ఉంటే కొండనైనా బద్దలు కొట్టవచ్చు

ఒంటరిగా కన్నా మరొకరి తోడుతో పనులను చక్కగా అవుతాయి ఆదుకొనేవారుంటే ఎంతటి కష్టమైన పనినైనా సులభంగా చెయొచ్చని ఈసామెత అర్థం. దీనికి సమానర్థంతో ఐకమత్యమే మహా భలము అనే సామెతకూడ ఉంది.

అంతనాడు లేదు, ఇంతనాడు లేదు,సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు

సాధారణంగా ఏటువంటి అలంకారాలు చేసుకోనివారు ఏమైనా ఉత్సవాలు, ఊరేగింపులు, పదిమందిలో కలిసే పెళ్ళిళ్ళలో మాత్రం విశేషంగా అలంకారాలు చేసుకొని అందరిలోకి ప్రత్యేకంగా కనిపించాలని ప్రయత్నాలు చేస్తుంటారు.ఒకామె చిన్నప్పుడుగానీ, మరీ వయస్సులో ఉన్నప్పుడుగానీ, మరి ఏ ఇతర సందర్భాలలోగానీ పెద్ద కొప్పు పెట్టి, అందంగా కనిపించడానికి ప్రయత్నం చేయలేదట. ఆ ఊరిలో సంత జరుగుతుందని తెలిసి ఆ సంతలో ఎంతోమంది కొత్తకొత్త వారు వస్తారని వారందరి చూపు తనపైన పడాలని అందంగా పెద్దగా ఉండే కొప్పు పెట్టుకొని వెళ్ళిందట. సందర్భానుసారంగా మాత్రమే అలంకరించుకోవాలని ఈ సామెత

అంత ఉరుము ఉరిమి ఇంతేనా కురిసేదన్నట్టు

అమితంగా వాగ్దానాలు చేసి చాలా స్వల్పంగా దానాలు చేసేవారిని గురించి, ఎంతెంతో పనిచేస్తామని చెప్పి చాలాకొద్దిగా పనిచేసేవారిని గురించి, ఎక్కువగా హెచ్చులు చెప్పి తక్కువ పని చేసే పద్ధతి సందర్భంగా వాడె సామెత ఇది. ఇలాంటిదే మరొక సామెత: ఇంత ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు

అంత లావున్నావు తేలు మంత్రం కూడ తెలియదా

లావుగా వున్నంత మాత్రాన అన్ని విద్యలు తెలిసివుండవు. ఒక అమాయకుడు లావుగా వున్నతన్ని చూసి ఇతడు అంత లావున్నాడు కనుక అన్ని విద్యలు తెలిసి వుంటాయని భావించి తనకు తేలు కుట్టింది మంత్రం వేయమని అడిగాడట. ఆ లావుటతను తనకు తెలియదనగా “అంత లావున్నావు తేలు మంత్రం కూడ తెలియదా” అని వెళ్లి పోయాడట అమాయకంగా.

అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు

ఒక పనిని మొదలుపెట్టే ముందు దాని పర్యవసానాలు బాగా ఆలోచించి, ముందుగానే ఊహించి, సంబంధిత వ్యక్తులతో దానిని గురించి చర్చించి మొదలుపెట్టమని చెప్పేందుకు ఉద్దేశించినదే ఈ సామెత. కీడెంచి మేలెంచమనే సామెతకు ఇది కాస్త దగ్గరగా ఉంటుంది.

అందని పండ్లకు అర్రులు చాచినట్లు

మనకి అందవు లేదా దొరకవు అని తెలిసినా వాటి మీద ఆశ పెట్టుకోడం అనేది అందని పండ్లు కోసం అర్రులు చాచటం లాంటిది అని అర్థం.

అందని ద్రాక్షలు పుల్లన

ఒక నక్క ఒక రైతు యొక్క ద్రాక్ష తోటలోకి ప్రవేశించింది.అక్కడ దానికి ఎత్తయిన పందిళ్ళకు చక్కటి ద్రాక్షలు వేలాడుతూ కనపడ్డాయి.ఆ పండిన ద్రాక్షలను చూసిన నక్కకు, నోరు ఊరి, ఎట్లాగయినా సరే ఆ పళ్ళను తినాలని నిర్ణయించుకున్నది. మామూలుగా అయితే ఆనక్కకు పళ్ళు అందవు. అందుకని, అది తన ముందు కాళ్ళ మీద లేచి ఆ పళ్ళను అందుకోబోయింది. కానీ, పాపం దానికి ద్రాక్ష పళ్ళు అందలేదు. ఆపైన నక్క ఎగిరి అందుకోవాలని తెగ ఆరాటపడింది. ఎంత ఎగిరినా దానికి ఆయాసం వచ్చింది కానీ, ద్రాక్ష పళ్ళు మాత్రం అందలేదు. ఎగిరి, ఎగిరి ఆయాసంతో ఇక యెగరలేక విసిగి, “ఛీ ఛీ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయట నేను తినడమేమిటి?” అని గొణుక్కుంటూ వెళ్ళిపొయింది. అలాగే, ఎవరైనా ఏదో పొందాలని ప్రయత్నించి అది దొరకక పోతే, అప్పటివరకు దేని కోసం అయితే తీవ్ర ప్రయత్నం చేశామో అది ఎంత చెత్తదో, ఎంత పనికిరాదో చెప్పటం మొదలుపెడతాము. అప్పుడు అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని నలుగురు నవ్వుకుంటారు.

అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం

తాము శ్రీవైష్ణవులము, మాంసాహారం తినము అని చెప్పుకుంటూ బుట్టలో చేపలన్నీ ఖాళీ చేసారు అని అర్ధం. అందరూ గొప్పవాళ్ళే కాని చేసేవన్ని తప్పుడు పనులే. ఎవరికి వారే తమకి తాము గొప్ప వాళ్ళమని చెప్పుకుంటారు కాని ఎవరి తప్పులు వారికే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ సామెత వాడుతార

అందితే జుట్టు అందక పోతె కాళ్లు

అవకాశవాది తన పని పూర్తి చేసుకోటానికి ముందు గడ్డం పట్టుకు బ్రతిమిలాడతాడు, అయినా పని కాకపోతే కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడతాడటానికి కూడా వెనకాడడు. ఈ సామెత ఒక అవకాశవాది తత్వాన్ని తెలియచేస్తోంది.

అంగిట బెల్లం – ఆత్మలో విషం

పయోముఖ విష కుంభం అనే సంస్కృత సామెత లాంటిదే ఇది కూడాను. నోటితో తియ్యని మాటలు మాట్లాడుతున్నా…. మనసులో మాత్రంచాల చెడు భావన వున్నదని అర్థం.

అంగిట విషం – మున్నాలిక తియ్యదనం

ఇది కూడా పై సామెత లాంటి అర్థాన్నే ఇస్తుంది. పైపైన మంచిగా మాట్లాడుతు లోన చెడు భావన కలిగి వున్న వారినుద్దేశించి ఈ సామెతను వాడుతారు.

అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటదు

అంటుకోను ఆముదం లేకుంటే మీసాలకు సంపెంగ నూనెట

ఇదే అర్థంలో మరొక సామెత వుంది: అది: మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె

అంటే ఆరడి – అనకుంటే అలుసు

అండలుంటే కొండలు దాటవచ్చు

సహాయంగా ఎవరైనా వుంటే ఎంతపనైనా చేయ వచ్చు అనే అర్థంలో ఈ సామెతను వాడుతారు. ఐక మత్యమే మహాబలము అని దీకిని గూడార్థము.

అండలేని ఊళ్ళో ఉండ దోషం – ఆశలేని పుట్టింట అడగ దోషం

అండ ఉన్నవానిదే అందలం

ఐకమత్యమే మహా బలము అని దీనికి అర్థము.

అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత

అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు

అంత నీతే వుంటే ఇంత సంతెందుకు?

అంత పెద్ద పుస్తకం చంకలో వుంది పంచాంగం చెప్పలేవా?

ఇదే అర్థంలో మరొక సామెత వున్నది: అది. ఇంతలావున్నావు తేలు మంత్రం తెలియదా?

అంతా తెలిసినవాడూ లేడు, ఏమీ తెలియనివాడూ లేడు

మానవులలో ప్రతి విషయము పూర్తిగా తెలిసిన వాడున్నూ, ఏవిషయము కొంతైనా తెలియని వాడున్నూ లేడని దీని అర్థము.

అంతా బాపలే, మరి కోడిపెట్ట ఏమైనట్లు?

దీనికి సమానమైన అర్థంలో మరొక సామెత ఉంది. అందరూ వైష్ణవులే ………. బుట్టలో రొయ్యలు మాయం అయ్యాయి బాపన వాళ్లైనా చాటు మాటుగా మాంసం తింటారని దీనికి గూఢార్థము.

అంతా మావాళ్ళేగానీ అన్నానికి రమ్మనే వాళ్ళు లేరు

[చూపులకు చుట్టాలు రమ్మంటే కోపాలు ] అనే సామెత లాంటిదే ఈదీను.

అందం చందం నావంతు – ముద్దూ మురిపెం నీవంతు అన్నదట

అందం చందం లేని మొగుడు మంచం నిండా వున్నట్లు

అకార పుష్టి నైవేద్య నష్ఠి అనే సామెత లాంటిదే ఇదీను.

అందముంటే సరా! అదృష్టముండొద్దూ!

అందని మ్రానిపండ్లకు అఱ్ఱులు చాచినట్లు

మనకి అందవు లేదా దొరకవు అని తెలిసినా వాటి మీద ఆశ పెట్టుకోడం అనేది అందని పండ్లు కోసం అర్రులు చాచటం లాంటిది అని అర్థం.

అందరి కాళ్ళకు మ్రొక్కినా అత్తగారింటికి పోకతప్పదు

పెళ్ళికూతురు పెళ్ళైయ్యాక అత్తావారింటికి వెళుతూ అందరి కాళ్ళకు మొక్కుతుంది. కాని చివరకు అత్తవారింటికి వెళ్ళక తప్పదు…….

అందరికీ శకునం చెప్పే బల్లి తాను బోయి కుడితి తొట్లో పడ్డట్లు

అందరికి రాబోవు కష్టాలను చెప్పేవారు తమకు రాబోవు కష్టాలను ఎరుగరు అని దీని అర్థము. అనగా ఈ శకునాలు వట్టి భూటకమని అర్థము.

అందరికీ అన్నం పెట్టే వాడు రైతే

అందరినీ మెప్పించడం అలవి గాని పని

అందరినీ మెప్పించడము ఎంతమాత్రము వీలుకాదని దీని అర్థము. ఎంత మంచి విషయమైనా దాన్ని కూడా వ్వతిరేకించే వాడొకడుంటాడని దీని భావము.

అందరూ అందలమెక్కితే మోసేవారెవ్వరు?

అందరూ ఒక ఎత్తు – అగస్త్యుడు ఒక్కడూ ఒక ఎత్తు

అందానికి పెట్టిన సొమ్ము ఆపదకు అడ్డం వస్తుంది

అందాల గంధాలు, అధరాల మధువులు కౌగిలింతల పాలన్నట్లు

అందాల విందులు, అధరాల మధువులు నీకే అన్నదట

అందాలు నావి – సంబరాలు నీవి అందిట

అందితే సిగ అందకపోతే కాళ్ళు

అవకాశాన్ని బట్టి ఎదిరించడమో, కాళ్ల బేరానికి రావడమో చేసె వారిగురించిన సామెత ఇది. ఇదే సమానార్థంలో మరొక సామెత…. ఏ ఎండకాగొడుగు పట్టినట్టు. అంకెకు రాని ఆలిని ఆరుగురు బిడ్డల తల్లయినా విడవాలి/ ఏ ఎండకు ఆ గొడుగు పట్టి నట్టు సమానర్థంలో మరొక సామెత 53 అందితే తియ్యన అందకుంటే పుల్లన

[అందని ద్రాక్ష పళ్ళు పుల్లన ] అనే సామెతకు సమానర్థంలో ఈ సామెతను వాడుతారు. ఎంత ప్రయత్నించినా ద్రాక్ష పళ్ళు అందక పోతే….. తన ప్రయత్నము విపలమైనదని ఒప్పుకోక ఆ ద్రాక్ష పళ్ళు పుల్లనివి అని తన ఓటమిని కప్పి పుచ్చుకునే ప్రయత్నం ఇది.

అందీ అందని పరువాలు ఉసికొలిపే కాముని కవ్వింతలు

అంధుడికి అద్దం చూపించినట్లు

కొంతమంది ఎంత వివరంగా విషయాన్నంతా చెప్పినా గ్రహించలేరు. అలాంటి వారి జ్ఞానాన్ని సూచించడానికి ఈ సామెత ఉపకరిస్తుంది. అలాగే మరికొన్ని సందర్భాల్లో ఎంత శ్రమపడినా శ్రమను ఎదుటివారు గుర్తించక నిర్లిప్తంగా, నిరాసక్తంగా తోసివేసినప్పుడు కూడా ఈ సామెతను సందర్భానుసారం చెప్పటానికి ఉపయోగపడుతుంది. అంధుడికి ఎంత మాత్రమూ ఎదుటి వస్తువులు కనిపించక పోవటం సర్వసాధారణం. అటువంటిది అందాన్ని ఒకటికి పది సార్లు చూసుకోడానికి నేత్ర దృష్టి బాగా ఉన్నవారు ఉపయోగించే అద్దాన్ని అంధుడి ముందు పెట్టి చూసుకోమంటే దానివల్ల అంధుడికి కలిగే ఆనందం శూన్యం. అతడి ముందు అద్దాన్ని ఉంచడం వల్ల పడిన శ్రమ కూడా వృథా అవుతుంది. ఈ సామెతలో అద్దం విజ్ఞానంతోను, పాండిత్యంతోనూ కొంతమంది పోల్చి చెబుతుంటారు. అంధత్వమనేది అజ్ఞానానికి, పామరత్వానికి నిదర్శనం. అద్దంల్లాంటి పాండిత్యం కలిగిన వారు, అంధుడిలాంటి అజ్ఞాని ముందు తన పాండిత్యాన్ని ప్రదర్శించడం వల్ల ఫలితం శూన్యమనేది సామెత భావన. 56 అంధుడికి అద్దం చూపించినట్లు

అంధుడి ముందు పెట్టి చూసుకోమంటే దానివల్ల అంధుడికి కలిగే ఆనందం శూన్యం. అతడి ముందు అద్దాన్ని ఉంచడం వల్ల పడిన శ్రమ కూడా వృథా అవుతుంది. ఈ సామెతలో అద్దం విజ్ఞానంతోను, పాండిత్యంతోనూ కొంతమంది పోల్చి చెబుతుంటారు. అంధత్వమనేది అజ్ఞానానికి, పామరత్వానికి నిదర్శనం. అద్దంల్లాంటి పాండిత్యం కలిగిన వారు, అంధుడిలాంటి అజ్ఞాని ముందు తన పాండిత్యాన్ని ప్రదర్శించడం వల్ల ఫలితం శూన్యమనేది సామెత భావన..

అంబటిలోకి ఉప్పే లేకుంటే పిండి వంటల మీదకు పోయిందట మనసు

తాను తాగే అంబలిలో ఉప్పు తక్కువైనందున అందులో ఉప్పు కూడా తెచ్చి వేసుకోలేని వాడు పిండి వంటలు కోరుకున్నట్లు…… అని దీనికి అర్థము.

అంబలా అంటే ముఖాలే చెప్తాయి అన్నట్లు

అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు

గంజి తాగేవానికి మీసాలు ఎగబట్టేవాడొకడన్నట్టు వంటిదే ఈ సామెత. తన స్థాయికి మించి పనులు చేసే వారినుద్దేశించి ఈ సామెతను వాడుతారు.

అంబరాన బిడ్డ పుడితే ఆముదం పెట్టి ముడ్డి కడిగిందట

లేక లేక పుట్టిన పిల్లలను గారాబంగా పెంచినప్పుడు ఈ సామెత వాడతారు

సంచీ లాభం చిల్లు కూడదీసిందిట!

గాయాలన్నిటికీ కాలమే మందు.

అంబలి తాగేవాడికి మీసాలెత్తే వాడొకడా!

గొరగడం చేతకాక, బుర్ర వంకరన్నాడుట!

కక్కుర్తి తిండి తిన్నా కడుపు నిండాలి …

విధవరాలికి దండంపెడితే, వెయ్యేళ్ళు తనలాగే వర్దిల్లమందిట!

పెట్టిన వాళ్లకి పుట్టిందే సాక్షి.

కూర్చుని లేవలేనమ్మ ఒంగుని తీర్థం వెడతానందిట!

పెళ్ళికి వెడుతూ పిల్లిని వెంట తీసుకెళ్ళినట్లు. …

పాటిమీది గంగానమ్మకి కూటిమీదే లోకం.

విత్తనం ఒకటైతే చెట్టు మరొకటి ఎలాగౌతుంది?

రాయిపైన విత్తితే రాజనాలు పండవు.

కర్ణుని చావుకు కారణాలు అనేకం…

కోకిల పంట పెరిగేది కాకి ఇంట…

౭౦౫. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనౌతుంది.

ఉన్నకర్మకు ఉపాకర్మ తోడయ్యింది.

అర్ధరాత్రి మద్దెల దరువు…

పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు!

తులసి వనంలో గంజాయి మొక్కలా …

ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖ మెరుగదు.

చిడుము సిగ్గెరుగదు.

నలుగురూ ఏకమై, నల్లమేకను నల్లకుక్క అని ఒప్పించగలరు.

అన్నప్రాసన నాడే ఆవకాయ తినిపించ కూడదు.

సమయానికి లేని బాజా ఎందుకు, చంక నాకనా?

పిట్టని కొట్ట – పొయ్యిలో పెట్ట…

యధార్థవాదీ, లోక విరోధీ  …

ఆ ఇంటికీ, ఈ ఇంటికీ మధ్య పచ్చగడ్డివేస్తే చాలు భగ్గుమంటుంది.

ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటిమీద వాలదు.

ఎంత చెట్టుకి అంత గాలి ..