banner 6 1

117

మెట్లు – ఫలితములు

గృహ భవన ఉత్పత్తి వ్యాపారసంస్థలయందు మెట్లు నైరృతి భాగము నేర్పాటుగావించుకొనుట శాస్త్రమున ప్రధానాంశము అట్లు యేర్పాటుగావించుకొనిన మనోధైర్యము ఆయుష్ బలము కీర్తి వాస్తు బలము చేకూరి ఆ గృహస్థులు దినదినాభివృద్ధి పొందుదురు.

పడమటి భాగమున మెట్లు ఏర్పాటు గావించుకొనవచ్చును. అయిననూ ఉమ్మడి వ్యాపారదారులకు విభేదము చిన్న చిన్నాటంకములు వ్యవహారసష్టము కలుగజేయును.

దక్షిణభాగమున మెట్లు యేర్పాటు గావించుకొనవచ్చును. ధైర్యసాహసములు బలమయినగుణములు ఖర్చు అధికము కించిత్త అనారోగ్యం కలుగజేయును.

ఆగ్నేయభాగము మెట్లు యేర్పాటు గావించుకొనవచ్చును. కించిత్తు పిరికితనము, బలహీనత, ఖర్చునధికము కలుగ జేయును.

వాయవ్య భాగమున మెట్లు యేర్పాటు గావించుకొనవచ్చును, కించిత్తు వ్యవహార నష్టము ఆర్థిక వొడుదుడుకులు సుఖహీనత కలుగ జేయును.

ఉత్తరభాగము మెట్లు ఏర్పాటు గావించుకొనరాదు. అట్లేర్పాటు గావించుకొనిన ఆ గృహభవనములు చేతులు మారుట, శ్రీ దుఃఖము, ఆరిక వొడుదుడుకులు అంగవైకల్యము (స్త్రీ) సంతానము మొదలగు దుష్ఫలితములు కలుగజేయును.

గృహమున ఉత్తరపుమెట్లు గృహిణుల గుండెలపై బండలు.

తూర్పుభాగమున మెట్లు ఏర్పాటు గావించుకొనరాదు. అట్లు ఏర్పాటుగావించుకొనిన విద్యావివేకశూన్యత సుఖహీనత అంగవైకల్యము గల పురుషసంతానము మొదలగు దుష్ఫలితములు కలుగజేయును.

తూర్పుసోపానములు విద్యా వివేకశూన్యం

ఈశాన్యభాగము మెట్లు ఎంతమాత్రము నిర్మింపరాదు. అట్లు ఏర్పాటుగావించుకొనిన ఆశాంతి ఆకస్మిక ప్రమాదములు ఆరోగ్యపష్టము సంసారభంగము సంతానము కలుగకుండుట, కలిగిననూ అంగవై కల్యము గల సంతానముకలుగుట ధన ధాన్యములు సంపదలు రాబడి క్రమేపి తగ్గి బీదవారగుట మొదలగు దుష్ఫలితములు కలుగ జేయును,

ఈశాన్య సోపానములు అభ్యున్నతికి నిరర్థకములు,

భారత దేశమునందు గల ప్రసిద్ధ దేవాలయములు, పరిశీలించి నెడల తిరుపతి, శబరిమలై, శ్రీశైలము, దేవాలయములు, పళని సుబ్రమణ్యేశ్వర దేవాలయము అన్ని ప్రసిద్ధ దేవాలయములకును నైరృతిభాగమున మెట్లు నిర్మించినట్లు విశదమగుచున్నది.

మెట్లు ఏ దిశయందై ననూ గృహభవనములకు అనకుండా వర్టికల్ జాయింట్ వుంచి యేర్పాటుగావించుకొనవలయును.

మెట్లు తూర్పు ఉత్తరములకు దిగుట దక్షిణ పడమట ఎక్కుట వుండవలయును.

భవనములోభాగమున మెట్లు అధిక వాస్తుబలము చేకూర్చగలవు. తూర్పు, ఉత్తర ప్రాకారములకు మెట్లు అనిన దుష్ఫలితములు కలుగ జేయును.