నీటి తూములు వాని ఫలితములు
గృహభవస ఉత్పత్తి వ్యాపారసంస్థలయందు వాడుక నీరు గాని వర్షపునీరుగాని వెలుపలకు పోవు తూములు యేర్పాటు విషయములందు వాస్తుశాస్త్రానుకూలముగా యేర్పాటు గావించుకొనిన గృహస్థులకు మంచిశుభ ఫలితములు కల్గజేయును. ఈ శౌఖ్యము తూము యేర్పాటుగావించుకొనుట ఉత్తమము. ఈశాన్యభాగముఖ తూము ఉన్న ధనధాన్య పుత్రిపాత్రాభివృద్ధి కల్గును. తూర్పుదిశ తూము లుస్న సుఖసంతోషములు ఐశ్వర్యము కలుగజేయును.
అగ్నేయభాగమున అశాంతి అనారోగ్యము దుఃఖము క్రూర త్వము అధికవ్యయము నిర్వీర్యము కలుగును. దక్షిణ భాగమున తూములున్న అధిక శతృత్వము, అధిక వ్యయము. అనారోగ్యము, నిర్వీర్యము కలుగజేయును. నైరృతి భాగమున తూములున్న నిర్వీర్యము, పిరికితనము, దీర్ఘరోగము, అపఖ్యాతి పడమరభాగమున తూములున్న ధనసంపదల రాబడి వున్నా కష్టములు కలుగ జేయును. వాయువ్య భాగమున తూములున్న సుఖహీనత చిన్న చిన్న దొంగతనములు కలుగును. ఉత్తరము తూములున్న ధనధాన్యాభి వృద్ధి భోగభాగ్యములు కలుగ జేయును,
ఈశాన్యము తూము సకలైశ్వర్యములకు ఆలవాలము,
తూర్పు తూము సుఖశాంతులకు నిలయము,
ఆగ్నేయ తూము అనర్థములకు ఆలయము.
దక్షిణ తూము అనారోగ్యముల కందుబాటు,

