banner 6 1

120

గృహమునకు గృహములు కలుపుకొనువాని ఫలితములు

గృహభవన ఉత్పత్తి వ్యాపార సంస్థలకు తూర్పుభాగమున గృహములుగాని స్థలములుగాని కలుపుకొనిన ఆ గృహములు దిన దినాభివృద్ధి గాంచుచూ స్వర్గతుల్యములగును,

ఆగ్నేయ భాగమున గృహములుగాని స్థలములుగాని గృహములో గాని గృహములో కలుపుకొనినయెడల అధికవ్యయము అపవాదులు ఆడపడుచుల అనారోగ్యములు కలుగ జేయును,

దక్షిణభాగమున గృహములుగాని, స్థలములుగాని గృహములో కలుపుకొని యడల ధననష్టము ధైర్య సాహనములకు భంగము ఆరోగ్య ఆయుష్ భంగము కల్గించి నరకల్యము జేయును.

నైరృతిభాగమున గృహములుగాని ఖాళీస్థలములు గాని గృహములో కలుపుకొనినయెడల నికృష్ట కార్యాచరణము క్రిమినల్ కోర్టు కేసులలో ఇరుక్కొనుట, నిందలు నిర్వీర్యము దీర్ఘ అనారోగ్యములు యాతనలు మొదలగు దుష్ఫలితములు కలుగ జేయును.

పడమర భాగమున గృహములుగాని ఖాళీస్థలములుగాని గృహములో కలుపుకొనినయెడల పనికిరాని పనులాచరించుట పౌరుష పరాక్రమము తగ్గించుట స్త్రీ) విద్యావివేక ఆటంకము మొదలగు దుష్ఫలితములు కలుగ జేయును.

వాయవ్య భాగమున గృహములుగాని స్థలములుగాని గృహములో కలుపుకొనివయడల అశాంతి, ఆర్థికనష్టము దూరప్రయాణములు తిరుగుట, ఋణగ్రస్తులగుట కోర్టువ్యవహారములలో ఇరుక్కొనుట మొదలగు దుష్ఫలితములు కలుగజేయును,

ఉత్తరభాగమున ఈశాన్యము తగ్గకుండ గృహములను ఖాళీ స్థలములను గృహములో కలుపుకొనినయెడల ధనధాన్యాభివృద్ధి మనోవికాసము మొదలగు శుభఫలితములు కలుగజేయును.

ఈ శాన్యభాగమున గృహములుగాని ఖాళీస్థలములుగాని గృహములో కలుపుకొనినయెడల కీర్తి ప్రతిష్ఠలు పుత్రపౌత్రాభివృద్ధి విద్యావివేకము పరమైశ్వర్యములు మొదలగు శుభఫలితములు కలుగజేయును.