banner 6 1

121

గోశాల విధానము

గృహభవన ఉత్పత్తి వ్యాపార సంస్థలయందు గోవులను పెంచుట, గోపూజ, గోదర్శనము వలన పూర్వజన్మపాపములు హరించి గృహస్థులకు వాస్తువున మంచి శుభఫలితములు కలుగ జేయును.

గోవులు, గేదెలు, ఎద్దులు, పశుపోషణ నిమిత్తము ఏర్పరచు పశుశాలలు గృహమునకు వాయవ్యభాగమున ఉ తరపు గోడానిన విధముగా ఏర్పాటు గావించుకొనుట ఉత్తమం,

వాయవ్య దిశాధిపతి అయిన వాయుదేవుడు పశువృద్ధిని కలుగ జేయును. దక్షిణమునుండి ప్రసరించు మంచి గాలి సావిడిలలో ప్రవే శించి ఆ పశువులను ఆరోగ్యకరముగా వుంచి మంచిపాలు యిచ్చి మంచి సంతానమును కలుగజేసి ఆ గృహము పొడి వంటలతో దిన దినాభివృద్ధి చెంది గృహస్థులు అభివృద్ధి గాంచును.