banner 6 1

122

ఈశాన్య దిశా బాగ ఫలితములు

  1. గృహభవస ఉత్పత్తి. వ్యాపార సంస్థలయందు ఈశాన్య భాగము పల్లముగా ఉన్న యెడల సౌభాగ్యము, సౌశీల్యము సర్వత్రసుఖము ధనధాన్యాభివృద్ధి, వంశవృద్ధి, కీర్తి ప్రతిష్టలు మొ ॥ శుభ ఫలితములు కలుగచేయును.
  2. ఈశాన్య భాగమునుంచి వర్షపునీరు, వాడుకనీరు వెలుపలికి పోవుచున్న యెడల వంశవృద్ధి, ధనధాన్యాదుల వృద్ధి, బలమూ సౌఖ్యము కలుగును.
  3. ఈశాన్యభాగంలో పెంటకుప్పలు పెడపోగులు, రాళ్ళగుట్టలు మున్నగునవి వేయుచుండిన ధనహాని, విరోధములు, సుఖ హీనత, నీచప్రవర్తన ఆయుక్షణము కలుగును.
  4. ఈశాన్యభాగంలో వంటఇల్లు ఉన్న యెడల కుటుంబ కలహ ములు, దీర దీర్ఘ వ్యాధులు, అధికవ్యయము వంశమువణ కీడు ధన హాని కలుగును.
  5. ఈ శాన్య భాగంలో పాయిఖానా దొడ్లు వున్న యెడల కుటుంబ కలహములు ద్రవ్యహాని, సంతానముపకు కీడు కలుగును.
  6. ఈశాన్యమునగృహమునకు సమీపములో కోనేరు, తటాకము నీటిబోదెలు వున్న యెడల కుటుంబ వృద్ధి ధనధాన్యాదుల అభివృద్ధి కలుగును,
  7. ఈశాభ్యభాగము తక్కువగావున్న సంతానము లేనివారు ఆగుట సంశనాశనము అగుటయు దరిద్రులుగానుండుట మొదలయినా చెడు ఫలితములు ఎన్నో కలుగును.
  8. ఈ శాన్యభాగములో గల స్థలములో ఏ విధమైన కట్టడములు కట్టినా, అందులో నివసించు వారలకు వంశనాశనము, ధననాశనము, ఋణగ్రస్టు లగుట, రోగములతో బాధపడుత “మొదలై న చెడు ఫలితములు కలుగును.
  9. ఈశాన్యభాగము ఖాళీగా నుండి విశాలముగా నుండి, అందు నూయి గాని, కోనేరు గాని వుంటే ఆ గృహస్థులు సిరిసందలతో పుత్రపౌత్రాభివృద్ధిగా వర్ధిల్లెదరు. ఇంటిలోని ఖాళీ ప్రదేశములుగాని, గదులుగాని ఈశాన్యభాగము పల్లముగా గాని, తేలికగా గాని వుంటే సర్వత్రా శ్రేయస్కరము,
  10. ఇల్లునకు ఈశాన్య భాగములో ఖాళీస్థలములు దొడ్లు ఉన్న థన ధాన్యాభివృద్ధి, సంతాసవృద్ధి కలుగును. ఈశాన్య భాగములో ఎత్తైన అరుగులున్న క్రమక్రమముగా ధననాశనము వంశనాశనము కలిగించును.
  11. ఇంటికిగల ఈశాన్యభాగమందు ఖాళీస్థలములను తనయింటిలో కలుపుకొనిన అది తన ఇంటిలో ఉన్న ఖాళీస్థలముల కంటె వల్లముగా నున్న ఐశ్వర్యప్రదము, ఎత్తుగా ఉన్న అధిక వ్యయము, నష్టము కలిగించును. అట్లు కలుపుకొనవలసివచ్చిన తన ఇంటియందలి ప్రదేశముతో సమాంతరముగా గాక పల్లముగా చేసి కలుపుకొనిన సర్వశుభములు కలుగును,
  12. ప్రతి ఇంటినందు తమ ఇంటికి ఈశాన్యభాగము నందుగల స్థలము ఎంత ఎక్కువగా పెంచుకొనిన అంత అధికముగా ధన ధాన్య సంపదలు అభివృద్ధి కలుగును,
  13. ఈశాన్యమదలి హెచ్చుస్థ మున్నింటికి అనగా స్థలమునకు ఆ స్థలమే ఈశాన్యభాగము తక్కువ గాకుండా పెరిగి ఉండు పట్లు చూచుకొనివ సర్వత్ర జయప్రదముగా నుండును.
  14. ఈశాన్యభాగ మందలి ఖాళీస్థలములుగాని, దొడ్లుగాని, ఇల్లుగాని ఎన్నడు అమ్మివేయకూడదు. అమ్మి వేసిన ధననష్టముకలుగును,
  15. ఇంటికి గల ఈశాన్యభాగములో ఎత్తైన బలమైన కట్టడములు కట్టకూడదు. అట్లు కట్టిన దీర్ఘవ్యాధులు అనగా క్షయ, ఉబ్బసము, పిచ్చి మొదలైనవ్యాధులు కలుగుటగాని సంతాన నష్టము, వివాహము మొదలైన శుభకార్యములు జరగకుండుట, ధనమునకు హాని, ఇత్యాది చెడు ఫలితములు అనేకము కలుగును. ఈశాన్యభాగము వంకరగా ఉన్న అంగవైక ల్యము గల సంతానము కలుగును. ఈశాన్యము పూర్తిగా లోపించిన త్వరగా దారిద్ర్యము సంభవించుట కలుగును.
  16. గృహభవస, ఉత్పత్తి వ్యాపార సంస్థలుయందుగాని, ఖాళీ స్థలములయందు గాని, తూర్పు ఈశాన్యము పెరిగి అందు నివసించు గృహస్థులకు సుఖసంతోషములు, ధర్మబుద్ధి, పురుష సంకానాధిక్యత, గౌరవమర్యాదలు గల పదవి ఉద్యోగములు మొదలగు శుభ ఫలితములు కలుగును.
  17. ఉత్తరముతో కలసి ఈశాన్యము పెరిగిన స్థలములయందు గల గృహభవన ఉత్పత్తి, వ్యాపారసంస్థలయందు నివసించు గృహస్థులకు ధనధాన్యాభివృద్ధి భోగభాగ్యములు, స్త్రీ సంతావ సౌఖ్యము, ప్రశాంతత, భక్తిశ్రద్ధలు, గౌరవమర్యాదలు మొదలగు శుభ ఫలితములు కలుగుసు.
  18. తూర్పు, ఉత్తర ఈశాన్యము రెండు దిశలతో కలసి పెరిగిన స్థలములయందు కల గృహ, భవన, ఉత్పత్తి వ్యాపార సంస్థలందు నివసించుగృహస్థులకు కీర్తి ప్రతిష్టలు, పుత్రపౌత్రాభి వృద్ధి, ధనాభివృద్ధి, ఆయుర్వృద్ధి, గౌరవప్రదమైన పదవి ఉద్యోగములు మొదలగు శుభఫలితములు కలుగజేయును.
  19. కోణాకృతిగా సగమునుండి తూర్పు ఈశాన్యము పెరిగిన గృహ భవస, ఉత్పత్తి వ్యాపార సంస్థలందుగాని, స్థలమునగాని, నివసించువారలకు సంతానసౌభాగ్యము కలిగినను పిరికితనము, చిన్నచిన్న యాక్సిడెంటులు, పదవి ఉద్యోగ భంగము మొదలగు ఫలితములు కలుగజేయును,
  20. సగమునుండి కోణాకృతిగా ఉత్తర ఈశాన్యము పెరిగిన స్థలములందు నివసించు గృహస్థులకు అపార ధననంపదలు, భోగభాగ్యములు కలుగ జేసినను ధనవ్యయమునకు ఇష్టపడని పిసినారితథము కలుగజేయును.
  21. ఈశాన్య భాగమున ఫలాఫలములు చిన్నపిల్లలపై చూపును,

తూర్పు దిశా భాగము ఫలితములు

  1. గృహ భవన ఉత్పత్తి, వ్యాపార సంస్థలకు తూర్పుభాగము ఖాళీ విస్తారముగను, పల్లముగను ఉండవలెను. అట్లు ఉన్న ధనధాన్య సంపదలతో వంశాభివృద్ధి, రాజపూజిత, సకల సంపదలతో దినదినాభివృద్ధి గల్గును.
  2. తూర్పుభాగములో పేడకుప్పలు, పెంటపోగులు, రాళ్ళగుట్టలు ఉన్న యెడల ధననష్టము, సంతానమునకు హాని కలిగించును. తూర్పుభాగములో పాకిదొడ్లు ఉన్న యెడల సంతానమునకు హాని సుఖహీనత కలుగును.
  3. తూర్పుభాగమున సింహద్వారముకాని తదితర ద్వారములు కేవలము తూర్పుదిశను చూచుచున్నట్లు నిర్మించుకొనినయెడల సామాన్యమైన శుభఫలితములను కలిగించును.
  4. తూర్పుభాగమున యున్న సింహద్వారములు గాని తదితర ద్వారములు గాని ఆగ్నేయమున చూచుచున్నట్లు నిర్మించిన యెడల దారిద్ర్యము వంశక్షయము కలిగించును.
  5. తూర్పుభాగములో యున్న సింహద్వారములుగాని తదితర ద్వారములుగాని ఈశాన్యమును చూచుచున్నట్లు నిర్మించు కొనినయెడల సర్వత్ర సుఖ సంతోషములు వంశ అభివృద్ధి కలిగించును. తూర్పు భాగములో యున్న అరుగులు గర్భము కంటె మిఱ్ఱుగా ఉన్న యెడల అశాంతి అనవసరమైన ఖర్చులు అధికవ్యయము కలిగించును, ఋణగ్రస్తులుగా చేయును,
  6. తూర్పుభాగమును ఆక్రమించిన సరిహద్దు గోడపై నుంచి ఏక ఎత్తు పెట్టి మేడ కట్టిన యెడల క్రమక్రమముగా ద్రవ్యహాని వ్యవహారవు చిక్కులు కలిగించును. భర్తపోయి భార్య యజ మానురాలగును,
  7. తూర్పు సరిహద్దుగోడలపై ఏ విధమైన కట్టుబడులు కట్టిన ఆ ఇంటి పురుషులకు పురుషసంతానమునకు హాని కలుగును
  8. తూర్పున ఏక ఎత్తున పెట్టి పశ్చిమమున వసారా దించి గృహము కట్టిన యెడల వాతసంబంధీయమగు వ్యాధులుగాని పక్షవాతముగాని వచ్చును. లేదా గృహయజమాని శ్రీఘ్ర ముగా మరణించును.
  9. తూర్పు ఏక ఎత్తు పెట్టి కట్టడములు కట్టిన నేత్ర సంబంధమైన అనారోగ్యములు స్త్రీ సంతానాధిక్యత, పదవి ఉద్యోగ భంగములు మొదలగు దుష్ఫలితములు కలుగును.
  10. తూర్పుభాగములోని అరుగులు గర్భముకన్నా మిర్రుగా నున్న అశాంతి పురుషులకు దురభ్యానములు అనవసరపు ఖర్చులు అవసరము లేకుండానే ఋణము చేయవలసి వచ్చును.
  11. తూర్పుభాగమున పెంచి పెద్ద పెద్దగదులు కట్టినయెడల బంధు మిత్రవిరోధము, చిన్న వారికి పెద్ద పెత్తనము వచ్చుట అధికవ్యయము మొదలగు దుష్ఫలితములు కల్గును.
  12. తూర్పుభాగమున వాలువసారాలు వుంచి కట్టిన యెడల ధన ధాన్యాభివృద్ధి కీర్తి ప్రతిష్టలు, పదవి ఉద్యోగవిజయములు మొదలగు శుభలక్షణములు కలుగును,
  13. తూర్పుదిశాఫలితములు పురుపసంతానముపై ప్రభావిత మగును.

ఆగ్నేయ దిశ ఫలితాలు

  1. గృహభవన, ఉత్పత్తి, వ్యాపారసంస్థలయందుగాని ఖాళీస్థలము లందుగాని ఆగ్నేయభాగము పల్లముగా నున్న అగ్నిభయము, శత్రుభీతి, పాపకార్యములందు ప్రలోభపడుట మొదలగు దుష్ఫలితములు కలుగ చేయును.
  2. ఆగ్నేయభాగమునందు వంటిల్లు యున్న సర్వశుభములు, సౌఖ్యములు కలుగచేయును,
  3. ఆగ్నేయభాగమున ఇతరుల కాలిస్థలమును మన స్థలములో కలుపుకున్న యెడల అధికవ్యయము, అనారోగ్యము అనేక కష్టనష్టములు కలిగించును.
  4. ఆగ్నేయభాగములో నీటికుండీలు, నీటితూములున్న స్త్రీకి అనారోగ్యము, ధనక్షయము కలుగును,
  5. ఆగ్నేయ భాగంలో నూతులు, గోతులు ఉన్న యెడల స్త్రీకి అనారోగ్యము అధిక శతృత్వము కలుగును.
  6. అగ్నేయభాగమున అనిన కట్టడములు ఉన్న యెడల ఆర్థిక సష్టము జరుగును.
  7. తూర్పుతో కలసి ఆగ్నేయము పెరిగిన గృహభవన ఉత్పత్తి, వ్యాపార సంస్థ లందు నివసించు గృహస్థులకు సంతానము లేకుండుట, ఒక్కో చోట, స్త్రీ సంతానము కల్గుట, ఒక తరములో సంతానముకలుగుట, మరోతరములో సంతానము లేకుండుట పురుషులకు దురభ్యాసములు, స్త్రీలకు అనారో గ్యము మొదలగు దుష్ఫలితములు కలుగును,
  8. దక్షిణ ఆగ్నేయము పెరిగిన గృహభవన, ఉత్పత్తి, వ్యాపార సంస్థలయందు నివసించు గృహస్తులకు ధననష్టము, దురభ్యాసములు , దుబారా ఖర్చులు, కుటుంబ కలహములు మొదలగు దుర్గుణములు కలిగి ధనము అంతయు నసించి దరిద్రుని చేయును.
  9. తూర్పు దక్షిణముతో కలిసి ఆగ్నేయభాగము పెరిగిన గృహ భవన ఉత్పత్తి, వ్యాపార సంస్థలందు నివసించు గృహస్థులకు ధన నష్టము, సంతానమునకు దురలవాట్లు ఆడపిల్లల సంసారములో అశాంతి మొదలగు దుష్ఫలితములు కలుగును.
  10. తూర్పు ఆగ్నేయము కోణాకృతిగా సగమునుండి పెరిగిన గృహస్థులకు దీర్ఘ వ్యాధులు, నీచప్రవర్తన, ఆకస్మిక మరణములు, సంతాన నష్టము, స్త్రీ) సంతానమునకు భర్త సౌఖ్యము లేకపోవుట మొదలగు దుష్ఫలితములు కలుగును.
  11. దక్షిణ ఆగ్నేయము కోణాకృతిగా సగమునుండి పెరిగిన గృహస్థులకు భార్యా భర్తలకు పరస్పర విరోధము, భార్య ఉండగా ఇంకొక స్త్రీతో అక్రమ సంబంధము, రెండవ వివా హము చేసుకొనుట, కొర్టువ్యవహారములు, బలమైనగుణములు కలిగి ఒకరికి అడ్డంపోవుట, నీచప్రవర్తన, పురుషసంతానమునకు మనస్సుచాంచల్యము మొదలగు దుర్గుణములు కలుగును.
  12. ఆగ్నేయభాగమున అగ్గి పుల్ల ప్రమాణము పెరిగినను అనర్ధదాయకమగును.
  13. ఆగ్నేయ భాగంలో ఫలాఫలాలు రెండవ సంతానం పైన చూపును,

దక్షిణ దిశా ఫలితములు

  1. గృహభవన ఉత్పత్తివ్యాపార సంస్థలయందుగాని ఖాళీస్థలము యందు గాని వసారాలలోగాని వంటయింట్లోగాని దక్షిణ, భాగము పల్లముగా ఉన్న యెడల గౌరవ ప్రతిష్టలకు భంగము అనారోగ్యము, ఆయుక్షీణత, ధన ధైర్య సాహసములు తగ్గుట, పురుషులకు దీర్ఘ అనారోగ్యములు మొదలగు దుష్ఫలి తములు కలుగును.
  2. దక్షిణభాగము ఖాళీదొడ్డి విశేషముగా ఉన్న యెడల పలు విధములైన కష్టనష్టములు సంభవించును.
  3. దక్షిణభాగమున పోయిఖానాదొడ్లు వున్న యడల ధనహాని కలుగును.
  4. దక్షిణ భాగములో వంటఇల్లు ఉన్న యెడల ధనహాని కలిగించును.
  5. దక్షిణ భాగములో నీళ్ళుపోసుకొను కుండీలు ఉన్నయడల దీర్ఘ వ్యాధులు, ధనక్షయము కలుగును, భార్యావియోగము లేక వ్యాధిగ్రస్తురాలై ఉండుటగాని జరుగును,
  6. గృహములోని వాడుకనీరు, వర్షపునీరు దక్షిణ భాగమునుంచి వెలుపలకు పోవుచున్న యడల స్త్రీలకు వ్యాధులు, కుటుంబ కలహములు అధిక వ్యయములు కలుగుచుండును.
  7. దక్షిణభాగమున యున్న సింహద్వారముగాని తదితర ద్వారములు గాని కేవలము దక్షిణదిక్కును జూచుచున్నట్లు నిర్మించు కొనిపయెడల ఐశ్వర్యము, సర్వశుభములు కలుగును,
  8. దక్షిణభాగమున యున్న సింహద్వారముగాని తదితర ద్వార ములు గాని ఆగ్నేయమునకు తిరిగి ఆగ్నేయమును చూచుచు న్నట్లు నిర్మించుకొనినయడల అగ్నిప్రమాదములు, వంశమునకు కీడు కలుగును.
  9. దక్షిణభాగమున ఉన్న సింహద్వారముగాని తదితర ద్వారములు గాని నైఋతిని జూచుచున్నట్లు నిర్మించుకొనినయడల శతృభయములు, అపమృత్యుదోషము, వంశక్షయముకలుగును, దక్షిణ భాగములో సరిహద్దుచేరి గృహనిర్మాణము చేసికొనిన యడల మేలు కలుగును.
  10. దక్షిణభాగమున ఎత్తుపెట్టి మేడలు కట్టుకొనినయడల ఐశ్వర్య ప్రదముగా యుండును.
  11. దక్షిణభాగములోగల అరుగులు గృహమునకు గల గర్భము కంటె పల్లముగా ఉన్న యెడల ఆదాయము మించినవ్యయము కలిగి ఋణగ్రస్తులగుదురు. దక్షిణభాగములో గల అరుగులు గృహమునకు గల గర్భముకంటె మిఱ్ఱుగా వున్న యడల ఆదాయాభి వృద్ధి కలుగును.
  12. ఆ దక్షిణమున వసారా ఉన్న యడల ధన నష్టములు కలుగును.
  13. ఆ దక్షిణభాగమున గల ప్రహరిగోడలు యితర గోడలకంటె మిర్రుగా నుండవలెను,
  14. దక్షిణభాగము యందుగల గృహమునకు గల వెన్ను యితర భాగముకంటె ఎత్తుగా ఉన్నయెడల ఐశ్వర్యప్రదముగా ఉండును.

నైఋతి దిశా ఫలితములు

  1. గృహభవన ఉత్పత్తి వ్యాపార సంస్థలయందుగాని ఖాళీస్థలము యందుగాని గదులందుగాని గర్భమందుగాని వసారాలుగాని వంటిల్లుగాని నై ఋతిభాగము పల్లముగా ఉన్న యెడల ధన హాని, ప్రాణహాని, కలహములు, రోగ బాధలు కలుగును,
  2. నైఋతి భాగము అన్ని భాగములకంటె ఎత్తుగా ఉన్న యెడల ఐశ్వర్యము, ఆరోగ్యము, అధిశారము, అంతస్థులు దినదినాభి వృద్ధి చెందును,
  3. నైఋతి భాగము ఎత్తుగా ఉండి అందులో పాకలు, పందిళ్ళు మొదలైనవి ఉన్నయెడల గౌరవాభివృద్ధి, ధనాదాయము, సౌఖ్యము కలుగును.
  4. నైఋతి భాగములో పాయిఖానా వున్న యడల శతృభయము ఆరోగ్యభంగము, ఆర్థికస్తోమతు తగ్గుట, సుఖహీనత వుండును.
  5. నైఋతిభాగములో నీళ్ళకుండీలు వున్న యెడల కుటుంబ కల హములు, ధనహాని, రోగ బాధలు, అవమానములు కల్గును.
  6. గృహభవన, ఉత్పత్తి, వ్యాపార సంస్థలకు ప్రహరీగోడలకు అన్ని కట్టడములకు నైఋతి మూలమట్టమునకు సరిచూచి నిర్మించుకోవాలి.
  7. నైఋతి విభాగములో ద్వారములుంచిన రోగబాధలు అధిక వ్యయముకలుగును, ఇంకనూ అనేక విధములుగా కష్టనష్టములు సంభవించును.
  8. నైఋతి భాగమున గల ఖాళీదొడ్లు, స్థలములు తన గృహములో కలుపుకున్న చో దానివల్ల రోగ బాధలు, అకాల మరణములు కలుగును,
  9. నైఋతి భాగములో ఎత్తయిన వృక్షములు ఉప్నచో తీసి వేయరాదు,
  10. నైఋతి భాగము ఫలితములు గృహ యజమానికి గాని, జ్యేష్ట కుమారునిపై గాని చూవును,
  11. నైఋతి భాగములో ఉన్న గృహములుగాని ఉపగృహములు గాని శిధిలావస్థలో ఉన్నప్పుడు పునర్నిర్మాణము కావించ వలసినప్పుడు సామాన్లన్ని చేరదీసి త్వరితగతిన ఆలస్యము జరగనీయక పని పూర్తి చేసుకోవాలి. లేనియెడల యాక్సి డెంట్లు, అకాలమృత్యువులు సంభవించును.

నైరృతిభాగము పెరిగిన కలుగు ఫలితములు

  1. దక్షిణ నైరృతి పెరిగిన గృహభవన, ఉత్పత్తి, వ్యాపార సంస్థలయందు నివసించు గృహస్థులకు దీర్ఘ వ్యాధులు, అపమృత్యు దోషములు, అధిక ధనవ్యయము, ఎంతచేసినను కలసిరాకుండుట మొదలగు దుష్ఫలితములు కలుగజేయును.
  2. పశ్చిమ నైరృతి పెరిగిన గృహభవన, ఉత్పత్తి. వ్యాపార సంస్థలయందు నివసించు గృహస్థులకు శత్రుబాధలు, దుష్ట స్వభావములు, ఎంతచేసినా కలసిరాకుండుట, దుర్మార్గ ప్రవర్తన, మానము, అధికవ్యయము మొదలగు దుష్ఫలితములు కలుగును.
  3. దక్షిణ, పశ్చిమ నై ఋతి కోణాకృతిగా పెరిగిన గృహభవన ఉత్పత్తి వ్యాపార సంస్థలయందు నివసించుగృహస్థులకు, పెద్ద సంతానము యొక్క భార్యాభర్తలకు విభేదము, పెద్దసంతానమునకు దీర్ఘరోగము, అపమృత్యు దోషము సంభవించును. కౄరస్వభావము, యాక్సిడెంట్లు మొదలగు దుష్ఫలితములు కలుగ జేయును.
  4. పడమట నైరృతి, కోణాకృతిగా పెరిగినస్థలములందు నివసించు గృహస్థులకు ఎంతచేసినను కలసిరాకుండుట, విశేష ధననష్టము, దుర్మా ర్గపు ఆలోచనలు, క్రిమినల్ కేసులయందు ఇరుక్కొనుట అధిక శత్రింత్వములు క్రూరకృత్యములు అలవడుట మొదలగు దుష్ఫలి తములు కలుగ జేయును.

పశ్చిమ దిశా ఫలితములు

  1. గృహభవస ఉత్పత్తి వ్యాపౌర సంస్థలయందుగాని ఖాళీస్థలము యందు గాని పశ్చిమభాగము పల్లముగా ఉన్నయెడల అప కీర్తి, పనులయందు అనాసక్తి, కార్యనిర్వహణయందు అజా గ్రత్త ; స్త్రీకి, అనారోగ్యము మొ॥ కలుగును.
  2. పశ్చిమ భాగమున విశాలమైన ఖాళీదొడ్లు ఉన్న యెడల ధన నష్టము కలుగును.
  3. పశ్చిమభాగంలో సాయిఖానాదొడ్లు ఉన్న యెడల సుఖహీనత ధనవ్యయము కలుగును.
  4. నీళ్ళు పోసుకొను కుండీలు ఉన్న ఎడల కుటుంబ కలహములు సంతానమునకును, కీడు కలుగును, దూరప్రయాణములుకూడ కలుగుచుండును.
  5. పశ్చిమభాగంలో యున్న సింహద్వారముగాని తదితర ద్వారముల గాని కేవలము పశ్చిమదిక్కునే చూచుకొనునట్లు నిర్మించుకొనినయెడల సర్వశుభములు కలుగును.
  6. పశ్చిమభాగంలోయున్న సింహద్వారములుగాని, నైఋతి దిశను చూచునట్లు ఉన్న యెడల దీర్ఘవ్యాధులు, ధనక్షయము అపమృత్యువులు కలుగును.
  7. పశ్చిమభాగములో నున్న సింహద్వారములుగాని వాయవ్య దిశను జూచునట్లు ఉన్న యెడల శతృవృద్ధి, అవకీర్తి, ధనక్షయము కలుగును.
  8. పశ్చిమభాగములో ఉన్న అరుగులు గర్భముకంటె పల్లముగా ఉన్న యెడల అధికవ్యయము కలుగును,
  9. పశ్చిమభాగములో విశేషము వాలుపెట్టి పంచలుదించి కట్టిన యెడల పలువిధములగు కష్టనష్టములు సంభవించును.

వాయవ్య దిశా ఫలితములు

  1. గృహభవన ఉత్పత్తి వ్యాపార సంస్థయందుగాని వాయవ్య భాగము వల్లముగా ఉన్న యెడల అధికశతృత్వము వ్యాజ్య ములు, వ్యాధులు మొ॥ దుష్ఫలితములు కలుగును.
  2. వాయవ్యము మూసిన కట్టడము వలస లోకవ్యవహారము ఆసక్తి తక్కువ ఆర్థిక నష్టము మొదలగు దుష్ఫలితములు కలుగ చేయును.
  3. వాయవ్యభాగంలో నీళ్ళుపోసుకొను కుండీలు ఉన్నయెడల కుటుంబ కలహములు, సంతాన నష్టములు కలుగును.
  4. వాయవ్యభాగము నమానముగా ఉన్నయెడల రాజకీయ చతురత మనోల్లాసము కలుగును,
  5. వాయవ్యభాగంలో పశువులశాలలు, గడ్డిమేటలు వేసుకొనిన యెడల పళు ధనధాన్యాభివృద్ధి సర్వసుఖములు కలుగును.
  6. వాయువ్యభాగం పెరిగి అందులో నూతులు గోతులు ఉండి ఇతర వాస్తుదోషములు ఏకీభవించినయెడల ఇంటి యజమాని సంతానములో మూడవవాడు ఇంటిని విడిచి అన్యప్రదేశములలో తిరుగుచూ జీవించుచుండును.
  7. వాయవ్య భాగము మూడవ సంతానముపైన ఫలితములను చూవును.
  8. వాయవ్యము విస్తారముగా పెరిగియున్నయడల ఋణాధిక్యత అకాలమరణము ఐ.పీ. పెట్టుట మొదలగు దుష్ఫలితములు కలుగును.

వాయవ్యభాగము పెరిగిన కలుగు ఫలితములు

  1. ఉ త్తర వాయవ్యము పెరిగిన గృహభవన, ఉత్పత్తి వ్యాపార సంస్థలయందు నివసించు గృహస్థులకు ధననష్టము, అవమానము, అప్రదిష్ట సుఖహీనత, భార్యాభర్తల సంబంధము సక్రమముగా లేకుండుట “వాటు దిబ్బెడు వూస్తే ఊళక్కి” అనే విధముగా ధన చంపద రాబడితగ్గి క్రమేపి బీదవారగుదురు.
  2. పడమటి వాయవ్యము పెరిగిన గృహభవన వ్యాపారసంస్థల యందు నివసించు గృహస్థులకు అశాంతి, అధికవ్యయము, దూర ప్రయాణములు చేయట, రాబడికన్నా ఖర్చు అధికము, మొదలగు దుష్ఫలితములు కలుగ జేయును,
  3. పడమట, ఉత్తర వాయవ్యము పెరిగిన గృహభవన, ఉత్పత్తి వ్యాపారసంస్థలయందు నివసించు గృహస్థులకు దురభ్యాసములు, దూరప్రయాణములు, దుష్టసాంగత్యము, దురాలోచనలు, కోర్టు వ్యవహారములు, అధిక ఋణగ్రస్తులగుట, అశాంతి, శత్రువృద్ధి మొదలగు ఫలితములు కలిగి మూడవ సంతానమునకు భార్యా భర్తల అన్యోన్యత లేకుండుట జరుగును.
  4. ఉత్తర వాయవ్యము కోణాకృతిగా పెరిగిన గృహభవన ఉత్పత్తి వ్యాపారసంస్థలయందు నివసించు గృహస్థులకు భార్యా భర్తలకు విభేదము, కోర్టువ్యవహారము, పేకాట మొదలగు దురభ్యాన ములకు లోనగుట జరుగును.
  5. పడమట వాయవ్యము, కోణాకృతిగా పెరిగిన గృహభవన, ఉత్పత్తి వ్యాపార సంస్థలయందు నివసించు గృహస్థులకు దూరప్రయా ణములు, అశాంతి, అధిక ఖర్చు, మంచి పేరు ప్రఖ్యాతులు, ధైర్య సాహనములు మొదలగు ఫలికములు కలుగజేయును.

ఉత్తర దిశా భాగ ఫలితములు

  1. గృహభవన ఉత్పత్తి వ్యాపారసంస్థలయందు ఖాళీస్థలములందు గాని పల్లముగా ఉన్న యెడల అందరిమన్ననలు, పుత్రపౌత్రాభి వృద్ధి, ధనధాన్యములందు అభివృద్ధి సర్వతా సుఖశాంతులు కలుగ జేయును.
  2. ఉత్తరభాగం ఎత్తుగా ఉన్న యెడల గౌరవభంగము ఐశ్వర్య నాశనము సంతానమునకు అరిష్టము కలిగించును.
  3. ఉత్తరభాగము విశేషముగా ఖాళీదొడ్లు వున్న యెడల పుత్ర పౌత్రాభివృద్ధి, ఐశ్వర్యము, ఆదాయము కలిగించును.
  4. ఉత్తరభాగమున పెంటపోగులు మొదలగునవి వేసిన యెడల ధననాశనము, సంతానమునకు అరిష్టము మొదలుగాగల దుష్ట ఫలితములు కలుగును.
  5. ఉత్తరభాగంలో వంట ఇల్లు వున్న యెడల ధనధాన్యాదులకు హాని, వంశనాశనము అధికవ్యయమువలన క్రమక్రమముగా దద్రమును కలిగించును.
  6. ఉత్తరభాగములో పాయిఖానాదొడ్డి వున్న యెడల అసాధ్యమైన వ్యాధులు, శతృభయము, ధననష్టము కలిగించును.
  7. ఉత్తర భాగములో ఇల్లుకు సమీపములో కోనేరు మొదలైనవి వున్న యెడల ధనధాన్యముల అభివృద్ధి కలిగించును.
  8. ఉత్తర భాగములో సింహద్వారముగాని తదితర ద్వారములు గాని ఉత్తరమును చూచుచున్నట్లు వున్న యెడల ధనధాన్యా దుల యందు అభివృద్ధి కలుగును,
  9. ఉత్తరమునందుగల సింహద్వారములు గాని ఈశాన్యమును జూచుచున్నట్లువున్న యెడల ఐశ్వర్యాభివృద్ధి, నిత్యాభివృద్ధి కలుగును.
  10. ఉత్తరభాగమునందుగల సింహద్వారముగాని తదితర ద్వారములుగాని వాయవ్యమును చూచుచున్నట్లువున్న యెడల వంశ హాని, ధనహాని కలిగించును. 
  11. ఉత్తరభాగమునందుగల అరుగులు గృహమునకు గల గర్భము కంటె ఎత్తుగా ఉన్న యెడల అధిక ధనవ్యయము, ధననష్టము కలిగించుచు ఋణగ్రస్థులనుగా చేయుచూ అశాంతి కలిగించును
  12. ఉత్తర సరిహద్దుగోడలపై ఏ విధమైన కట్టుబడులు కట్టినను ఆ ఇంటిస్త్రీలకును స్త్రీ సంతానమునకును హాని కలుగును.
  13. తన గృహమునకు గల ఉత్తర భాగమునందుగల ఖాళీ దొడ్లు తన ఇంటిలో కలుపుకొనినయెడల నర్వవిధములుగా అభివృద్ధి చెందుదురు.
  14. ఉత్తరభాగమునందు గల ఖాళీదొడ్లు వల్లముగానున్న సర్వత్ర అభివృద్ధి చెందుదురు.
  15. ఉత్తరభాగమునందుగల ఖాళీదొడ్లు ఎత్తుగా ఉన్నయెడల అధిక వ్యయము, అశాంతి కలిగించును.
  16. ఉత్తరభాగమున ఫలాఫలములు స్త్రీపైన, సిరిపైన చూవును,

వివిధ విషయములు

  1. గృహ ఉత్పత్తి వ్యాపారసంస్థ యొక్క నిర్మాణములను, ప్రవేశములను ముహూర్తబలము లేకుండా ఏర్పాటుకావించరాదు. అట్లు ఏర్పాటుగావించిన శుభఫలితములు ఇవ్వజాలవు
  2. గృహభవన ఉత్పత్తి వ్యాపార సంస్థలు ఆది, మంగళ, శని వారములు (మంచివి కావు) ప్రారంభించుటగాని, కప్పు వేయుట గాని ప్రవేశించుటకుగాని మంచివికావు.
  3. గృహ ఉత్పత్తి వ్యాపారసంస్థలు నిర్మాణానంతరము 1, 2, 3 భాగములు విభజించి పంచుకొనరాదు. అట్లు విభజించి వంచుకొనిన శుభఫలితములు ఇవ్వజాలవు,
  4. గృహభవన, ఉత్పత్తి వ్యాపారసంస్థలు నిర్మాణముల యందు మొండిగోడలు కోణములుగా గోడలు అగుట పనికిరాదు. అట్లు గోడలు ప్రయాణము ఆగినయడల అపమృత్యు దోష ములు, యాక్సిడెంట్లు మొదలగు దుష్ఫలితములు కలుగ చేయును.
  5. గృహమునకు ఆయము, జాతకము కలదు. గృహస్థునకు జాత కము కలదు, శాస గృహస్థుని నక్షత్రము గృహ నిర్మాణ నక్షత్రము గృహనిర్మాణ నక్షత్రము శాస్త్ర సమ్మతముగా గృహనిర్మాణము గావించిన మహోన్నత వాస్తుబలము చేకూరి ఆ గృహజాతకము మహోన్నతమయిన శుభఫలితములతో అలరారుచుండును.
  6. గృహభవన ఉత్పత్తి వ్యాపార సంస్థలకు ఆయాశాస్త్రములనకునంచి కొలతలు ఏర్పాటు గావించిన వాస్తుపురుషాకృతి సమముగా నుండి వా సుపురుషుడు వాస్తుబలములను పెంచి – గృహస్తులకు శుభ ప్రదము గావించుచుండును.
  7. గృహభవన ఉత్పత్తి వ్యాపార సంస్థలనిర్మాణమునందు గోడ లకు ప్రాణముండునుగాన కొలతలు మూలమట్టమునకు సమానముగాను తూర్పు, పడమరలు, ఉత్తర, దక్షిణములు సమానముగాను మూలకొణముల కొలతలు ఈశాన్యము పెరుగు విధముగను జాగ్రత్తగా కొలతలు తీసుకొనవలెను. కొలతలు సమాంతరముగా లేనియడల వాయవ్య ఆగ్నేయములు పెరిగిన యెడల ఆ గృహ భవనములయందు నివసించు గృహస్థులకు ఆవేదన, ఆక్రందన, మాటపట్టింపులు, తగాదాలు ధన నష్టము కలుగును.
  8. గృహభవన ఉత్పత్తి వ్యాపారసంస్థల నిర్మాణముల యందు ఉత్తరపు, తూర్పుగోడల పెంచి మచ్చుబల్లలు గాని అరమరలు గాని బేసుమట్టములుగాని గోడలకు పెంచి ఏర్పాటుగావించరాదు. అట్లు ఏర్పాటు గావించిన తూర్పుగోడ వలన పురుష సంతానము ఎదురుచెప్పుట, పదవి, ఉద్యోగభంగము, తలపై బరువు ఉన్నట్లు బాధపడుట మొదలగు అశుభఫలితములు కలుగచేయును.
  9. ఉత్తరపుగోడ పెంచుటవలన డబ్బుసరిగా రాకుండుట, ఆడ పిల్లల విద్యావివేక వివాహ ఆటంకములు మొదలగు దుష్ఫలితములు కలుగచేయును.
  10. గృహభవన ఉత్పత్తి వ్యాపారసంస్థలు పొడుగంత వెడల్పు కలిగి సమ చతుర్బుజముగా ఉండుట మంచిది కాదు.
  11. గృహభవన ఉత్పత్తి వ్యాపారసంస్థలు ఎత్తులు తక్కువగా ఉన్నయెడల కూరూవులు, కఠినమనస్కులైన సంతానము కలిగియుండుట, ఎత్తు ఎక్కువగా ఉన్న యెడల మూగసంతానం కలుగుట, ఏపని తొందరగా సాగకుండుట, గృహస్థు విలాసములకు ఖర్చు పెట్టుట జరుగును. కాన గృహము సమమైన ఎత్తు వెడల్పు ఏర్పాటుగావించిన మంచి శుభములు జరుగును.
  12. గృహభవన ఉత్పత్తి వ్యాపారసంస్థలు వీధికన్నా నేలమట్టము పల్లముగా ఉన్న యెడల అనారోగ్యము, ఆర్ధిక ఇబ్బందులు సంతానష్టము కలుగును.
  13. గృహ భవన ఉత్పత్తి వ్యాపారసంస్థలు యందు దక్షిణ పడమర దిశలయందు ఇతరుల చూరునీళ్ళు పడుటవలన జ్ఞాతుల యొక్క వివాదము, పరస్పర వైరములు కలుగుచుండును, ఉత్తరపుప్రక్కన ఇతరుల చూరునీరు మన గృహమున పడుట వలన ఆడపిల్లల సంసారమున అశాంతి, ఇచ్చినధనము సరిగా రాకుండా జగడము జరుగుట, తూర్పు ప్రక్కన ఇతరుల చూరునీరు మన గృహముఖ పడుటవలన పిల్లల చదువు సరిగా రాకుండుట సుఖము తక్కువగుట, పురుష సంతానము మాట వినకపోవుట మొదలగునవి జరుగును.
  14. ఒక గృహభవనములు వేడల్పుకన్నా మూడుభాగములు మించి పొడవు ఉండరాదు. గృహభవనములు నిర్మాణము స్థలములో 3/4 వంతు గృహనిర్మాణము 1/4 వంతు ఖాళీ స్థలము ఉండుటవల పై ఆ గృహమునందు 1/4 వంతు కిటికీలు ద్వారములు ఉండుటవలన మంచి శుభములు జరుగును. గృహ భవనము యొక్క కొలతలకు ద్వార గవాక్షముల యొక్క కొలతలు హెచ్చుతగ్గులు ఉన్న యెడల అధిక ధనవ్యయము అనారోగ్యములు కలుగును. గృహద్వారములు యొక్క మండి గములు నేలలో బూడినయెడల వింత మరణములు, దుఃఖ ములు కలుగును.
  15. గృహములో మొండిగోడలు ఉండుటవలన గర్భస్రావము జరుగును. గృహభవనములు పొడుగులేకున్న యెడల మూఢులు మూగసంతతి కలుగును.
  16. గృహ భవనములలో ఒక గోడపైన ఇరుపార్శ్వముల కట్ట రాదు. అట్లు కట్టినయెడల వివాదము, మాటపట్టింపులు
  17. జ్ఞాతులయొక్క గృహములకు సారు దప్పించి గృహములు నిర్మించరాదు. అట్లు నిర్మించిన మాటపట్టింపులు, గర్భస్రావములు జరుగును.
  18. దేవాలయముయొక్క పారును కలిపి గృహభవన ఉత్పత్తి నిర్మాణము కావించరాదు, ప్రాకారములకుగాని గృహభవతములకు గాని మూలకోణములుయందు ద్వారములు నెలకొల్ప రాదు. అట్లు నిలిపిన అపమృత్యు దోషములు, ధననష్టము కల్గును.
  19. గృహభవన ఉత్పత్తి వ్యాపార సంస్థలయొక్క గోడలుగాని దూలములుగాని పైకప్వులుగాని తూర్పు ఉత్తరములు ఎత్తు దక్షిణ, పడమరలు పల్లముగా ఉన్న యెడల అనారోగ్యము, దుఃఖము ధననిష్టము కల్గును.
  20. గృహభవన ఉత్పత్తి వ్యాపారసంస్థల మూలకోణములయందు నూతులు, గోతులు ఉన్న యెడల అపమృత్యు దోషములు; ఆర్థికనష్టములు కలుగును,
  21. ఉత్తర, ఈశాన్యములందు కిటికీలు లేకుండా దక్షిణ నైఋతి భాగములందు కిటికీలు పెట్టరాదు.
  22. గృహభవనములయందుగాని గృహ ఆవరణయందుగాని నీరు ఉబికి తేమగా ఉన్న యెడల రోగ బాధలు కలిగించు ఆ గృహము అన్యులపాలగును.
  23. గృహము యొక్క వెన్నుగాడికిందను దూలముకిందను ద్వారము పెట్టిన కలహము, ధననష్టము కలుగును.
  24. సింహద్వారము గృహపరిణామమునకు మించియున్న గృహమునందు సంతాననష్టము ఎక్కువ ఖర్చు అగును.
  25. సింహద్వారము తదితర ద్వారములు లోపలకు వంగి ఉన్న యెడల వ్యాధి దీర్ఘ వ్యాధులు ధననష్టము కలుగును.
  26. సింహద్వారము వెలుపలకు వంగిఉన్న యెడల యజమాని ఇంటియందు నివాసము చేయక అన్య ప్రదేశములందు తిరుగును.
  27. గృహభవనములయందు పాముపుట్టలు ఉన్న యెడల దువ్వప్న ములు, అనారోగ్యములు, సంతాన నాశనము కలుగును,
  28. గృహమును తగులబడిన కర్రలతో నిర్మించిన యెడల దరిద్రము.
  29. గోడలమీద దారువులు వేయక కట్టిన ఇంటి యందుండువారికి పీడకలలు, గర్భస్రావములు జరుగును.
  30. విదిక్కులు చూచుచూ గృహనిర్మాణము కావించిన అవి సాగక మూతపడను. నిరంతరము తగాదాలు వ్యాజ్జ్యములు.
  31. స్థంభములు లేకుండా గృహ నిర్మాణం కావించరాదు. కావిం చిన కురూపులు వంటి సంతానము కలుగును.
  32. ఇతరుల గృహముయొక్క వెన్ను మన గృహమునకు పొడిచి నచో వెన్ను శూల అగును. అట్టి వెన్ను ళూలవలన సంసార భంగము, మాట విబేధము, ధననష్టము కలుగును,
  33. గృహభవన ఉత్పత్తి వ్యాపారసంస్థలకు ఖాళీస్థలము నాలుగు ప్రక్కలగాని రెండు ప్రక్కలగాని ఉండపలెను. ఒకప్రక్క మూడు ప్రక్కల ఖాళీస్థలము మంచిది కాదు.
  34. భవనమునకు క్రిందిభాగము గర్భగోడ ఎత్తుకన్నా మేడమీద గోడలు ఎత్తుగా ఉన్న యెడల వ్యవహార చిక్కులు కలుగును,
  35. గృహభవన ఉత్పత్తి వ్యాపార సంస్థలను నిర్మాణానంతరము దక్షిణ పడమరలు కలాపుకొని పెంచరాదు. అట్లు పెంచుట మహాదోషము, అనారోగ్యము అపమృత్యుదోషము కలుగ చేయును.
  36. గృహభవనములయొక్క గర్భము ఉలిలోపు వెడల్పు కొలత కంటె ముందుహాలు యొక్క ఉలిలోపు కొలత ఎక్కువుగ ఉండరాదు. అట్లుండిన యెడల అధికమైన ఖర్చు జరుగును.
  37. గృహభవన ఉత్పత్తి వ్యాపార సంస్థలు నిర్మాణానంతరము తూర్పు ఉత్తరములు పంచలు, పందిళ్ళు చూరుపై భాగమున ఏర్పాటు గావించుట దోషము. అట్లు ఏర్పాటుగావించిన ఋణాధిక్యత, ధనవ్యయము, కష్టనష్టములు కలుగును.
  38. వెన్నును కోసిన ఇంట్లో కాపుర ముండుట మహాదోషము ఇంటిలో కొంతభాగము అమ్ముటవలనగాని కప్పుపై ని వెన్నును కోసివేసినచో ఆ ఇంటికి మహాదోషము కలుగును. అవగాడి పొట్ట చీల్చినట్లగును.

లక్ష దీపముల కాంతి

వాస్తుశాస్త్రమున లక్షద్వీపములు వెలిగించుచోట వాస్తు ఎట్లా కట్టినను ఫరవాలేదనువాక్యము మూఢులు అగుకొందరు పెద్దలు నుడువుచున్నారు. అది యదార్థము కాదు. వాస్తుశాస్త్రమువ కుల మత, వర్గ వైషమ్యములుగాని 10 ఇండ్లు, 100 ఇండ్లు, 1000 ఇండ్లు * అనిగాని మరియేపద్ధతులుగానిలేవు. కోటిదీపములతో ఉన్న కలకత్తా ఢిల్లీ పట్టణములయందును వాస్తు సరిసమానముగా పనిచేయుచున్నట్లు విశదమగుచున్నది. కాన వాస్తు శాస్త్రమున ఈ గృహదీప ప్రదాన్యత లేదని గృహస్థు లెరుగవలెను.

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే