banner 6 1

124

వీధిననుసరించి యిల్టుకట్లాలి :


గమనించవలసిన మరొక ముఖ్య విషయమేమనగా కొన్ని కొన్ని చోట్లగ్రామాల్లోను, నగరాల్టోను, నివేశన స్ట్రలాలు దిశలకు సరిగా తీర్చబడియుండవు. వీధులు దిశలకు తీర్చబడి ఉండని చోట స్టలాలు కూడా దిశలకు అనుకూలంగా లభించవు. ఆ విధమైన స్టలాలలో వీధిననుసరించి పరిసరాల యిండ్ల పారుల ననుసరించి మాత్రమే యిండ్లు నిర్మించాలి అంతే కాని తన ఒక్క యిల్బు మాత్రం దిశలకు సరిజేసి నిర్మించాలని, మూర్దంగా (ప్రక్క యిండ్ల పారులు వదలిపెట్టి *“పంక్తిశో భో? విచారించకయే, గృహ నిర్మాణం చేయరాదని
విశ్వకర్మ తన వాస్తు శాస్త్రంలో స్పష్టపరచియున్నాడు కాబట్టి, దిశలకు సరిగా అమరని ప్రలాలలో పంక్తిశో భచెడకుండా స్టలం యొక్క నాలుగు మూలలు మూలమలట్టానికి సవరించి, ఆ పిమ్మట నాలుగు వైపుల తగినంత ఖాళీ ప్రదేశం విడిచిపెట్టి గృహ నిర్మాణం చేపట్టాలి. పంక్తిశోభ అనగా ఆ వీధిలో యిండ్ల యొక్క వెన్నువాసం తూర్పు పడమరలుగా ఉన్నచో, మనం నిర్మించే యింటికి కూడ వెన్ను తూర్పు పడమరలుగానే వుండాలి. ఆ వీధిలో యిండ్లు ఉత్తర దక్షిణాలకు వెన్ను కలిగి ఉంటే, మన నిర్మాణం కూడా అటే వుండాలి. డాబా యిండ్ల కయితే పారులు సరిచేసుకొని కర్తకు తగిన ముఖద్వారం నిర్మించుకో వచ్చును.