banner 6 1

126

వాస్తు దోషాలు

వాస్తు దోషాలనేవి ఈ విధంగా ఉంటాయి. అప్పులు చేయడం, అప్పులు అధికం కావడం, అప్పులు తీర్చడం. కోసమై కొత్త అప్పులు చేయడం, జీవిత పర్యంతము సంపాదన చేసినా తీరని అప్పులు, క్రుంగిపోవడాలు, ఆత్మహత్యలు, ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించడం, టెన్షన్లు, మానసిక క్షోభ, తీరని వ్యధ, గలాటాలు, కొట్లాటలు, కుటుంబంలో బేజారెత్తించే కలహాలు, భార్యాభర్తల జగడములు, పిల్లలకు విద్య సరిగా రాకపోవడం, పిల్లలు ఎదగకపోవడం, పిల్లలు. పుట్టక పోవడం, మరణించడం లేదా అంగవైకల్య జననం, రోగాలు, వ్యాపారాలు సరిగా జరగక పోవడం, పెట్టుబడిపై కనీస వడ్డీ కూడా గిట్టకపోవడం, మానసిక వ్యాకులత, భాగస్థుల సమస్యలు, వ్యవహారాలు, భయంకరమైన రోగాలు, అనారోగ్యాలు, క్యాన్సరు, ఎయిడ్స్, పక్షవాతం, గుండె పోటు, రక్తహీనత, భయం భయంగా ఉండడం, అవమానాలు, బికారి కావడం, సన్యాసం పుచ్చుకోవడం, పిచ్చి పట్టడం, కాని పనుల కోసం పోరాడటం, చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, తప్పుడు పనులు చేయడం, దొరికి పోవడం, వ్యభిచరించడం, ఇతర స్త్రీలపై విపరీతమైన కామా ప్రకోపాలు, ఇంటి ఇల్లాలిపై విసుగు – కోపం, అసహ్యం, కుటుంబ సభ్యుల మధ్యలో ఒకరిపై ఒకరు కీడు చేసుకోవాలని తలచడం, దాడులు చేసుకోవడం, చంపుకోవడాలు, హత్య కావింప బడటం, హత్యలు చేయడం.

దొంగతనాలు, అగ్ని ప్రమాదాలు, అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు, చర్మ వ్యాధులు, ఉద్యోగం లభించకపోవడం, విదేశాలకు వెళ్ళాలన్నా వెళ్ళలేక పోవడం, ఇతరత్రా.

ఆడపిల్లల విషయంలో : ఇతరులను ప్రేమించడం, లేచిపోవడం, పెళ్ళి అయిన తరువాత పూర్వ ప్రేమికునితో కులకడం, పుట్టింటికి చేరుకోవడం, పుట్టింటి వారికి బరువు కావడం, మెట్టినింట కష్టాలు ఎదుర్కొని, భర్త బలవంతంచే పుట్టినింటి వారిని పీడించడం.

నమ్మండి నమ్మకపొండి, ఇలాంటివి ప్రపంచంలో జరుగుతాయా అనే సంఘటనలు కూడా నా అనుభవములో చూడటమైనది. అక్షర రూపంగా వాటిని వ్రాయలేను. అసహ్య కరమైన సంఘటనలను వ్రాయడం మంచిది కాదనే ఉద్దేశ్యంతో అక్షర రూపం చేయలేదు. అయితే వారింట వాస్తు దోషాలు సవరించిన తరువాత అటువంటివి భవిష్యత్తులో జరుగకపోవడం నిజంగా వాస్తు గొప్పతనమే. భగవంతుడు మనకిచ్చిన ఈ వాస్తు సవరణల అవకాశానికి మనస్ఫూర్తిగా,హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.రెండవది పరిశోధనలు చేసి ఎన్నో సమస్యలకు పరిష్కారాలు సూచించిన వాస్తు శాస్త్రవేత్తలకు కూడా మనస్ఫూర్తిగా, హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను. ఈ పరిశోధనలు ఇంతటితో ఆగక బాగా ఎక్కువగా చేసి

ప్రజలకు వాటి ఫలములను ఇంతకు ముందులాగే అందించాల్సిందిగా నా హృదయ పూర్వక ప్రార్ధన. ప్రజలకు ఓ ముఖ్య గమనిక ఏమంటే వాస్తు పనిచేస్తుందా లేదా అనే విషయం ప్రక్కన పెట్టి ఏ నిర్మాణమునైనా వాస్తురీత్యా నిర్మించుకోవాలని, తద్వారా అందరూ ఆనందంగా ఉండాలని నా అభిమతము.