banner 6 1

131

కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ తాలూకాలో ‘అహోబలం’ క్షేత్రముంది. దీన్నే యిటీవల వాడుకలో ‘అహోబిలం’ అంటూ పిలుస్తున్నారు.

ఎఱ్ఱాప్రెగడ వారి నృసింహ పురాణంలో హిరణ్యకశిపుని చంపిన నృసింహమూర్తి దగ్గరకు ప్రహ్లాదుడు చేరి స్తోత్రము చేసిన తర్వాత ఉగ్రమూర్తి ప్రసన్నమూర్తి అయ్యాడు.

దేవతలంతా ఆయన మూర్తిని దర్శించి ఆయనను ‘అహోబలా!’ అని స్తుతించారు. ఆ పదమే కాలక్రమేణ అహోబలంగా మారింది. ఇప్పుడు అహోబిలంగా పిలువబడుతూ వుంది.

ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వెలసివున్నారు. ఈ ఆలయానికి కూడా కొన్ని వాస్తుదోషాలు ఏర్పడ్డాయి. 1933లో ఈశాన్యంలో వాహనాలశాల నిర్మించి ఈశాన్యాన్ని మూసివేశారు. అలాగే ఆగ్నేయంకూడా మూతపడింది. ఆగ్నేయంలో కోనేరు వుంది. 1943లో వాయవ్యంలో ఒకబావి త్రవ్వబడింది. 1985లో ఆగ్నేయంలో మరొక బావి త్రవ్వబడింది.

1972 లో ఉత్తర వాయవ్యం ముట్టుకొని ఒక మందిరం నిర్మించారు. ఆ నిర్మాణ సమయంలో అనగా 1974లో భార్యాభర్తలిద్దరు ప్రొద్దుటూరు వాస్తవ్యులు ఆ వాయవ్యమూలలో పడుకొని వుండగా ఆ ప్రహరి కూలి దుర్మరణం పాలయ్యారు. 1986 జూలై 16వ తేదీన మందిర ప్రతిష్ఠ జరిగింది. ఈశాన్యంలో వుండవలసిన కోనేరు ఆగ్నేయంలో వుండటం, ఆగ్నేయ వాయవ్యాలలో బావులు, ఇలాంటి దోషాల వలన ఆలయ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే వుంది.

మార్పులు :-

1. దేవాలయ ఆవరణలో ఆగ్నేయదిశ వంటగదిలో నున్న బావిని పూర్తిగా పూడ్చివేయమన్నాము.

2. ఈశాన్యములో మరియొక బావిని తప్పక త్రవ్వమని చెప్పినాము.

3. గుడికి ఈశాన్య దిశలో దూరాన మొదటి నుండి వున్న కోనేరు పూడి వుండినది దానిని పూడిక తీసివేసి బాగుచేసి వాడుకోమని చెప్పినాము.

1. దక్షిణ నైరృతిలో వున్న ద్వారమును మూసివేయ మన్నాము.

2. ఉత్తర వాయవ్యం పెరిగి ఈశాన్యం తగ్గే విధంగా ప్రహరి నిర్మించబడినది. దానిని ఈశాన్యం పెరుగులాగున కట్టుకోమన్నాము.

3. తూర్పులో ఖాళీ స్థలముండి ప్రహరి లేకుండా వున్నది. దానిని పదునైదు అడుగులు స్థలము వచ్చునట్టు ప్రహరి నిర్మాణం చేయమని చెప్పినాము.

4. లెట్రిన్ తూర్పు ఆగ్నేయంలో తూర్పువైపు ప్రహరిగోడను, యింటి గోడను ముట్టుకోకుండా ప్లానువేసి యిచ్చినాము.