ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖీ నదీతీరాన వుంది. చుట్టూవున్న పర్వతాలతో ఎంతో సుందరంగా వుంటుంది.
శ్రీ కాళహస్తిలోని ఈశ్వరాలయం దక్షిణ ప్రహరి ముఖద్వారం కలిగి ప్రతిష్ఠామూర్తి శ్రీ కాళహస్తీశ్వర్వుడు పశ్చిమాభిముఖుడై ఉన్నాడు. దేవాలయం అద్భుత శిల్పమయం.
శ్రీ కాళహస్తీశ్వర దేవాలయంలోని శిల్పకళ సప్తగిరీశుని ఆలయం శిల్పకళ కన్నా ఎంతో ఆకర్షణీయంగా ఉండటం అందరికీ ఎరుకే. కానీ శ్రీ కాళహస్తీశ్వరునకు స్థలమహత్తులేదు.
శ్రీ ఆదిశంకరులు ఇక్కడ శ్రీ చక్రము ప్రతిష్ఠించినారు. అయినా సిరుల ఉరవడి ఈ క్షేత్రానికి కొరవడింది. తూర్పున, ఈశాన్యాన ఎత్తైన కొండలు ఉన్నాయి. అగస్త్య మహర్షి ఈక్షేత్రంలో తపస్సు చేస్తూ సృష్టించినాడని చెప్పబడే స్వర్ణముఖీ నది ఈ క్షేత్రానికి పశ్చిమాన వుంది. దీని పురోగమనాన్ని ఎలా నిరోధించిందో చూడండి.
ఈ ఆలయానికి ఎచ్చటెచ్చట ఏయే ఆస్తులున్నాయో తెలుసుకునేందుకు సరైన వివరాలు లేవు. వందల ఎకరాల పొలం ఉందని కొందరంటారు. శ్రీకాళహస్తికి సమీపంలోని కైలాసగిరి చుట్టూ ఉండే కొండలంతా ఈ ఆలయానికి చెందినవేనని కొందరు చెబుతుంటారు.
దేవస్థానం వద్ద లభ్యమయ్యే వివరాలను బట్టి దాదాపు వంద ఎకరాలు తరి భూమి ఉన్నట్టు తెలుస్తుంది. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ పొలిమేరల్లో దాదాపు 36ఎకరాల పొలం ఉంది.
విచారించవలసిన విషయమేమంటే మార్కెట్టు రేటు ఎకరా రెండున్నర లక్షల నుండి మూడు లక్షలుండగా ప్రభుత్వాధికారులు ఎకరా 60 వేలు నిర్ణయించి స్వాధీనం చేసుకునేందుకు సిద్ధపడితే దేవాలయ అధికారులు చేతులు ముడుచుకుని కూర్చోడం, ఆపైన ఆభూముల కౌలుదారుడు కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకొని పొలం తన ఆధీనంలోనే ఉంచుకొని దేవాలయానికి యధాప్రకారం కౌలు చెల్లిస్తూనే ఉన్నాడట.
ఇక్కడ గమనించవలసిన అంశాలేమంటే అంత విలువైన పొలంనుండి కేవలం సంవత్సరానికి ఎకరాకు 10 బస్తాలు కౌలు తీసుకుంటూ ఉండటం. గుడివాడలాంటి పట్టణ పొలిమేరల్లో ఉండే ఇలాంటి పొలాన్ని 30 సంవత్సరాలుగా ఒకే కౌలుదారుని వద్ద వుంచడం.
“అంగట్లో అన్నీ వున్నాయి, అల్లుని నోట్లో శని ఉంది” అన్న సామెత ఇచ్చట సార్థకమైంది. ఇంతకు ఇందుకు కారణమేమిటి ? వాస్తు బలం నాస్తి కావడమే.

