పరమ పవిత్రమైన కృష్ణానదీ తీరంలో ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ వారు నెలశారు. ఈమె స్వయంభువని స్థల పురాణంలో వుంది. దేశంలోని అష్టాదశ శక్తి వీఠాలలో ఇంద్రకీలాద్రి పీఠమొకటి. ఈ గిరి మీదనే అమ్మవారి గుడికి ఈశాన్యంలో శ్రీదుర్గామల్లేశ్వర స్వామివారు వెలసి వున్నారు. వీరిని పరమేష్ఠి ప్రతిష్ఠించాడని స్కాంధ పురాణం సాక్ష్యమిస్తోంది.
దుర్గాంబ పాదాంబుజ సన్నిధిని శ్రీ జగద్గురు శంకరాచార్యులవారు శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారనీ, అప్పటి నుండి అమ్మవారి రౌద్ర రూపం శాంతించి, ప్రసన్నత ప్రాప్తించిందనీ ఆ జగన్మాత శీతల దృష్టి ప్రసరించిన దిశలో విజయవాడ నగరం సువిశాలంగా, సౌభాగ్యవంతంగా విలసిల్లుతోందని జనశ్రుతి. లింగంబొట్లు వారు ఈ దేవస్థానం ప్రధాన అర్చకులు. నైజాం నవాబు ఖాజా అబ్దుల్ రహమాన్ ఖాన్ ఆసిఫ్హి ముస్తాఫా నగర్షా పాదూషా 1152 హిజరీలో లింగంబొట్ల గురుమూర్తి వేంకటభట్టు, నారాయణభట్టు అనువారలకు ఆచంద్ర తారార్కముగా, పుత్రపౌత్ర పారంపర్యముగా అర్చక హక్కులను కలిగిస్తూ సన్నద్ (శాసనం) చేశాడు.
1972 నుండి విజయవాడ వాస్తవ్యులు “వాస్తు సామ్రాట్ ” కీ.శే. శ్రీ ముద్రగడ రామారావుగారితో నాకు పరిచయ భాగ్యం ప్రాప్తించింది. 1979లో నేను వారిని సందర్శించిన సందర్భంలో వారు “తిరుపతిరెడ్డి గారూ! కనకదుర్గమ్మ వారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ కె. శేషారావు నా శిష్యుడు. నా సలహాననుసరించి ఆలయానికి కొన్ని వాస్తు మార్పులను చేయిస్తున్నారు చూస్తామురమ్మని” నన్ను అమ్మవారి ఆలయానికి పిలుచుకొని వెళ్ళారు. అప్పటికి శ్రీ కె. శేషారావు గారు కొన్ని మార్పులను చేసివుండినారు. గర్భగుడికి ముందున్న గోడలకు ఈశాన్యాన్ని పెంచి ద్వారాలను ఉచ్ఛంలో వుంచారు. అమ్మవారి గుడికి పశ్చిమాన చీకటి కోనేరు, పుష్కరిణి అనే రెండు కోనేర్లు వుండటం చూచిన నేను ” అవి వుండుట దోషం కాదాండీ”? అన్నాను. దానికి వారు ఇప్పుడు చేసిన మార్పులకే అనేక ఆటంకాల్ని అధిగమించవలసి వచ్చింది.
అయినా ఈ కోనేరులన్నీ కూడా త్వరలో పూడుస్తామని చెప్పారు. తర్వాత ఆ రెండింటినీ పూడ్పించడం జరిగింది. ఆ తరుణంలో ఈ మార్పులను చేసేందుకు
మార్పులను శ్రీ శేషారావు గారు చేయగలిగారు. 1980లో కేవలం 20 లక్షలు వుండిన ఆదాయం ఈ వాస్తు మార్పుల్ని చేసిన స్వల్పకాలంలోనే మెరుగైంది. నేటి అమ్మవారి వార్షిక ఆదాయం కోటి రూపాయలు దాటింది. ఎంతటి హర్షణీయమైన పరిణామం!
శ్రీ కె. శేషారావుగారు బదిలీ అయిన తరువాత కొన్ని పొరపాట్లు జరిగాయి. అమ్మవారి ప్రాకార మంటపానికి పశ్చిమ వాయవ్యాన, పశ్చిమం మధ్యన, పశ్చిమ నైరృతిలో ద్వారాలు వుంచారు. పశ్చిమ నైరృతిలోని ద్వారాన్ని తక్షణం మూసివేయడం మంచిది. మరియు దక్షిణ ప్రాకారానికి ద్వారం వున్నది. ఉత్తర ప్రాకారానికి ద్వారం లేదు శత్రుస్థానాలైన పశ్చిమ, దక్షిణాలలో ద్వారాలున్నాయి. మిత్రస్థానాలైన తూర్పు, ఉత్తరాలలో ద్వారాలు లేవు. దక్షిణ ప్రాకారం వెలుపల కాళీ కలిగి యున్నది. ఉత్తర ప్రాకారం మూతపడి యున్నది. 1997 దసరా ఉత్సవంనాటినుంచి ఆగ్నేయంలో ప్రతినెల పౌర్ణమిరోజు జరిగే హోమగుండాన్ని తీసుకెళ్ళి అమ్మవారి గుడికి ఈశాన్యంలో పెట్టారు. ఈ చోట నిత్యం హోమం చేస్తూ వున్నారు ఆ తరువాత 26-4-1998న అమ్మవారి మంగళ సూత్రంతో సహా 10 లక్షల రూపాయల విలువచేసే ఆభరణాలు, కిరీటం దొంగిలించబడినాయి.
ఇక దుర్గా మల్లేశ్వరస్వామివారి సన్నిధికి వెళ్ళి ఆయన గారి వాస్తు చూద్దాం. మల్లేశ్వరస్వామి వారి ఆలయానికి తూర్పు ఈశాన్యం వక్రగతి పట్టి ఈశాన్యాలను మూసివేశారు. ఆలయానికి తూర్పును హద్దుచేసి మూశారు. గుడికి తూర్పు మెరక అయింది. ఇవన్నీ వాస్తు వ్యతిరేకతలే స్వామి వారి రాబడికి కోతలే. అమ్మవారి ఆలయానికి ఉత్తర ఈశాన్యంలో ఉన్న నడక స్వామి వారికి ఉత్తర వాయవ్యం అయింది. “ఉత్తర ఈశాన్యం దారి – విత్తప్రాప్తికి, వనితల సౌఖ్యానికి రహదారి” అన్న సూక్తి ప్రకారం అమ్మవారికి అది అన్ని విధాల అమూల్యమైన సొమ్మయి అమరింది. మరి స్వామి వారికి “ఉత్తర వాయవ్యం దారి – స్థిరత్వానికి అపకారి” అన్నట్లు సిరులకు దూరం చేసింది. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారి సంవత్సరాదాయం కేవలం పదివేలు మాత్రమే.
అమ్మవారికి దక్షిణ ఆగ్నేయంగా సాగిన దారి స్వామివారికి దక్షిణ నైరృతి అయింది. ‘దక్షిణ ఆగ్నేయం దారి – స్త్రీలకు ఉపకారి’ అను సూక్తి ప్రకారం ఈ దారి అమ్మవారికి సిరుల ధారగా మారింది. ‘దక్షిణ నైరృతి గమనం ధనానికి తిరోగమనం’ అన్న సూక్తి ననుసరించి స్వామివారికి ధనశక్తి క్షీణించింది.
ఇంత గొప్ప మహిమ గల దుర్గాంబ గుడిని చేరేందుకు నిర్మించిన రహదారి అమ్మవారి గుడివద్ద నుండి దక్షిణంగా సాగి నైరృతిలో పల్లంలోనికి చేరుకొంటూ వుంది. “నైరృతి పల్లం – మృత్యువు చేతిలోని బల్లెం” అన్నట్లు ఈ దారి తరచుగా కొంత మంది యాత్రికుల్ని కైలాసపు దారి పట్టిస్తోంది. ఒక పర్యాయం వ్యాన్ ప్రమాదంలో1968కి పరిసమాప్తి అయింది. ఇదే నిర్మాణం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ కె. శేషారావు సాయాంలో తల పెట్టి చేపట్టి యుంటే ఈ దారి వేరు దిశలో అమరియుండేది. ఇప్పటికైనా ఈశాన్య దిశలో మరొక బసూటు వేసే అవకాశం వుంది. ఆలయ యశస్సును. వచ్చే యాత్రికుల శ్రేయస్సును పరమావధిగా భావించి ఈశాన్య దిశలో బసూటు నిర్మిస్తే ఈ క్షేత్రం నిరుపమానంగా భక్తులకు యోగ క్షేమాల్ని యొనగూర్చగలదు.

