banner 6 1

138

1979 సంవత్సరం నవంబర్ నెలలో హైదరాబాద్లో సంభవించిన మతకలహాల్లో చార్మినార్ వద్ద నున్న భాగ్యలక్ష్మీ దేవి (మైసమ్మ) గుడి, మరియు ఒక శివాలయం మతోన్మాదుల దౌర్జన్యానికి గురియైనవి. మైసమ్మగుడి చార్మినార్ను ఆనుకొని ఆగ్నేయంలో తూర్పు ముఖంగా ఉంది. తూర్పు ఆగ్నేయం బలమైన వీధిపోటును కలిగివుంది. సూక్తి !- తూర్పు ఆగ్నేయం వీదిపోటు – ఆర్థిక ఆరోగ్యాలను అంతమొందించు అగ్నివేటు. మరియు గుడి ఆగ్నేయం తిరిగి వుంది. ఇక వాయవ్యంలో ఉన్న శివాలయం ఉత్తరపు గోడను అంటుకొని గర్భంలో ఈశాన్యం నుండి పైకి మెట్లు కలిగి వుంది. వాయవ్యంలో నుయ్యి వుంది. ఈవాస్తు వక్రతలే ఈ రెండు గుడుల దెబ్బలకు కారణాలయ్యాయి.