తూర్పుగోదావరి జిల్లాలో 1891 ఆగస్టు 6వ తేదిన నిర్మితమైన అన్నవరం శ్రీవీరవేంకట సత్యనారాయణస్వామి వారి ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ వుంది. ఆలయానికి ఈశాన్యంలో ప్రభుత్వం వారు నిర్మించిన పెద్ద జలాశయముంది. ఇదేగాక నైరృతిలో టి.టి.డి. వారి గెస్ట్ హౌస్ సమున్నతంగా నిర్మించబడింది. దారికూడా ఈశాన్యం నుండే ఏర్పడింది. కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి నైరృతి పల్లం మరియు నైరతిలో చెరువు వుంది ఈ ఆపారమైన పల్లమే స్వామిని ఆర్థిక పరమైన పల్లంలోకి దించింది. అన్నవరంలోని నైరృతియందు ఉన్నతంగా వున్న టి.టి.డి. భవనం ఆ స్వామిని ఉన్నతునిగా చేసింది.

