banner 6 1

35

వాస్తు శాస్త్రంలో ముందుగా తెలుసుకోవలసిన విషయాలు దిక్కులు మరియు మూలలు వాస్తు శాస్త్రంలో అత్యంత ప్రాధాన్యత సంపాదించుకున్నవి దిక్కులు. దిక్కులు నాలుగు.

  1. తూర్పు
  2. పడమర
  3. ఉత్తరం
  4. దక్షిణము

సూర్యోదయం సమయంలో సూర్యునికి మనం ఎదురుగా నిలబడి అనగా మనము సూర్యుణ్ణి చూస్తుండాలి. అప్పుడు మనము చూస్తునది తూర్పుదిక్కు అనగా సూర్యుడుదయించు స్థానాన్ని తూర్పు దిక్కుగా భావించుకోవాలి. మన వీపు భాగాన్ని అనగా మన వెనుక భాగాన్ని పశ్చిమ దిక్కుగా భావించాలి. మన ఎడమచేతివైపు భాగాన్ని ఉత్తర దిక్కు, కుడి చేతి వైపు భాగాన్ని దక్షిణ దిక్కుగా భావించాలి. ఇప్పుడు మూలల గురించి తెలుసుకుందాము.

ఈశాన్య మూల ఉత్తరము మరియు తూర్పు రెండూ కలిసిన ప్రాంతం.

ఆగ్నేయ మూల తూర్పు, దక్షిణ దిక్కులు రెండూ కలిసిన ప్రాంతం.

వాయువ్య మూల ఉత్తర, పశ్చిమ దిక్కులు రెండూ కలిసిన ప్రాంతం.

నైఋతి మూల పశ్చిమ, దక్షిణ దిక్కులు రెండూ కలిసిన ప్రాంతం.

చాలామంది అష్టదిక్కులను (8 దిక్కులు) మాత్రమే గుర్తిస్తారు. అయితే ఇక రెండు దిక్కులు ఉన్నాయి. దశదిశలు అంటారు. అవియే ఆకాశం, క్రింది భాగం భూమి.

ఆకాశం మరియు భూమి ఇవి రెండు దిక్కులు. మొత్తం పది దిక్కులు. దశదిశలు. అనగా ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైఋతి, పడమర (పశ్చిమం), వాయవ్యం, ఉత్తరం, భూమి, ఆకాశం.ఒక్కొక్క దిక్కును మరియు ఒక్కొక్క మూలను ఒక్కొక్క గ్రహము ఆక్రమిస్తుంది. మరియు ఆ గ్రహ ప్రభావము ఆ దిక్కుపై ఉంటుంది. నలు దిక్కులు, నాలుగు మూలలు కలిపి 8, అయితే గ్రహాలు 9. ఇక 1 గ్రహం మిగిలిపోవును. అదియే కేతువు. ఇది గురుగ్రహముతో పాటుగా ఈశాన్య భాగమునందు నిలుచును. అందుకే జ్యోతిష శాస్త్రరీత్యా కూడా ఈశాన్యమును పెంచమని తెలుపుతారు. గురువుతోపాటు కేతువు వున్నందువల్ల ఈశాన్యము పెంచవలెనని జ్యోతిష శాస్త్రములో వున్నది.

అలాగే వాస్తు శాస్త్రరీత్యా కూడా ఈశాన్యము తప్పనిసరిగా పెరగడం చాలా మంచిది.

 దిక్కుల ప్రాదాన్యత – దోషాలు

మనకు ఎనిమిది దిక్కులు ఉన్నాయి. వాటిని ‘అష్ట దిక్కులు’ అంటాము. వాటిని పాలించే వారిని ‘దిక్పాలకులు’ అంటారు.

 దిక్కులు: తూర్పు, పడమర, ఉత్త రము, దక్షిణములను ‘దిక్కులు’ అంటారు.

 విదిక్కులు: ఈ నాలుగింటితో పాటు ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము అను నాలుగు విదిక్కులు కూడ కలవు. అన్నింటిని కలిపి అష్టదిక్కులు అంటాము.

 1) తూర్పు: తూర్పు దిక్కును పాలించువాడు, అధిషాసన దేవత ఇంద్రాుడు. ఇంద్రాుని భార్య శచీదేవి. ఆయన వాహనము ఏనుగు. నివసించే పట్టణము ‘అమరావతి.’ ఇంద్రాుడు ధరించు ఆయుధం వజ్రాయుధాము. ఈయన పురుష సంతాన కారకుడు. అధికారం కలుగజేయువాడు. సూర్య గ్రహం ప్రాదాన్యత వహించే ఈ దిక్కు దోషం వలన అనారోగ్య సమస్యలు, అదికారుల బాధాలు ఉంటాయి.

 2) ఆగ్నేయ మూల:ఆగ్నేయ దిక్కును పాలించువాడు, అధిషాసన దేవత అగ్నిహోత్రుడు. అగ్ని భార్య స్వాహాదేవి. వాహనము పొట్టేలు. అగ్ని హోత్రుడు నివసించే పట్టణము జోవతి. ధరించు ఆయుధం శక్తి. ఈయన కోపం, అహంకారం ప్రసాదించేవాడు. ఆగ్నేయం శుక్రుడు ప్రాధా న్యత వహిస్తాడు. ఆగ్నేయం వంటకు సంబందించిన దిక్కు. వంట స్త్రీలకు సంభందించినది కాబట్టి ఈ దిక్కు దోషం వలన స్త్రీలకు అనారోగ్యాలు కలుగుతాయి.

 3) దక్షిణము: దక్షిణ దిక్కును పాలించువాడు, అధిషాసన దేవత యమ ధర్మరాజు. ఈయనకు దాండపాణి అని మరో నామధ ేయమున్నది. యముని భార్య శ్యామలాదేవి. యముని యొక్క వాహనము మహిషము (దాున్నపోతు). నివసించే పట్టణము సంయమని. యముడు ధారించే ఆయుధాము దాండము. దాండమును ఆయుధాముగా కలవాడు కాబట్టి ఈయనను ‘దాండపాణి’ అని కూడ అంటారు. యముడు వినాశనం, రోగం ప్రసాదించేవాడు. కుజుడు ఆదిపత్యం వహించే దక్షిణ దిక్కు లోపం వలన తరచు వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి.

 4) నైరుతి మూల: నైరుతి దిక్కును పాలించువాడు, అధిషాసన దేవత నివృత్తి అనే రాక్షసుడు. ఇతని భార్య దీరా…దేవి. వాహనము నరుడు. ఇతడు నివసించే పట్టణము కృష్ణాంగన. నైరుతి ధరించు ఆయుధం కుంతము. వంశ నాశకుడు నైరుతి. నైరుతి దిక్కు రాహుగ్రహ ప్రాదాన్యత ఉంటుంది కాబటి ఈ దిక్కుదోషం వలన కుటుంబంలో ఎప్పుడు మానసికమైన చికాకులు అధికం

 5) పడమర: పడమర దిక్కును పాలించువాడు, అధిషాసన దేవత వరుణుడు. వరుణుని భార్య కాళికాదేవి. వాహనము మకరము (మొసలి). ఇతడు నివసించే పట్టణము శ్రద్ధావతి. ధరించు ఆయుధం పాశము. సర్వ శుభములను ప్రసాదించేవాడు. పడమర దిక్కు శనిగ్రహ ప్రాదాన్యత వలన ఈ దిక్కు దోషం వలన పనులు జాప్యం కలుగుతాయి.

 6) వాయువ్య మూల: వాయువ్య దిక్కును పాలించువాడు, అధిషాసన దేవత వాయువు. అనగా వాయుదేవుడు. ఈయన భార్య అంజనాదేవి. వాహనము లేడి. నివసించే పట్టణము గంధావతి. ధారించే ఆయుధాము ధ్వాజము. పుత్ర సంతానమును ప్రసాదించువాడు. వాయువ్య దిక్కు చంద్రాుడు ఆదిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన ఒడిదాుడు కులు ఉంటాయి.

 7)ఉత్తరం : ఉత్తర దిక్కును పాలించువాడు, అధిషాసన దేవత కుబేరుడు. ఇతని భార్య చిత్రలేఖ. వాహనము గుర్రము. కుబేరుడు నివసించే పట్టణము అలకాపురి. కుబేరుడు ధరించు ఆయుధం ఖడ్గము. విద్యా, ఆదాయము, సంతానము, పలుకుబడి ప్రసాదించువాడు. బుధుడు ఉత్తర దిక్కు ఆదిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన వ్యాపారం, విద్యా సంబందా విషయాలలో ఇబ్బందాులు వస్తాయి.

 8) ఈశాన్య మూల : ఈశాన్య దిక్కును పాలించువాడు, అధిషాసన దేవత శివుడు. శివుని భార్య పార్వతీదేవి. శివుని వాహనము వృషభము (ఎద్దాు). నివసించు ప్రదేశం కైలాసం. శివుడు ధరించు ఆయుధం త్రిశాలం. గంగాధారుడు శివుడు అష్టైశ్వర్యాలు, భక్తి జ్ఞానములు, ఉన్నత ఉద్యోగ ములను ప్రసాదించేవాడు. ఈశాన్య దిక్కు గురుగ్రహ ఆదిపత్యం ఉంటుంది.ఈశాన్య దిక్కు లోపం ఉంటే సంతాన విషయంలో ఇబ్బందాులు ఎర్పడతాయి. ఈ విధాంగా ఎనిమిది దిక్కులలో ఎనిమిది మంది దిక్పాలురు ఉండి మానవులను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటారు.

 దిక్పాలకులకు కూడ సర్వాధికారి శ్రీ మహా విష్ణువు. అష్ట దిక్కులకు వారిని నియమించి, విధి విధానాలను, నియమాలను, ధార్మాలను ఆజ్ఞా పించు వాడు, నడిపించువాడు, అధి(పతి)కారి శ్రీ మహావిష్ణువే సకల దేవతల చక్రవర్తి శ్రీ మహావిష్ణువు.

 దిక్కులు – అధిదేవతలు

 ఇంటి నిర్మాణంలో దిక్కులకు చాలా ప్రాధాన్యం ఉంది. వాస్తును పాటించేవారు దిక్కులను అనుసరించే ఇంటి నిర్మాణాన్ని చేపడతారు. ఎనిమిది దిక్కుల్లో ఒక్కో దిక్కుకు ఒక్కో అధిదేవత ఉంటారని నమ్మకం. దీన్ని అనుసరించి ఎనిమిది దిక్కుల్లో ఒక్కోదాని ప్రభావం గురించి ఈ విధాంగా చెప్పవచ్చు.

 తూర్పు: తూర్పు దిక్కును ఇంద్రాుడు పాలిస్తుంటాడు. ఇంద్రాుడు సంతానం, ఐశ్వర్యాలను కలిగిస్తాడని ప్రతీతి. అందాుకే తూర్పు భాగంలో ఎక్కువ బరువు పెట్టడం మంచిది కాదాు. అందాుకే ఈ దిక్కులోని ఖాళీ స్థలంలో బావులు, బోర్లు నిర్మించటం వల్ల శుభం చేకూరుతుంది.

 పడమర: పడమర దిక్కుకు అధిష్టాన దేవత వరుణుడు. గృహ నిర్మాణ సమయంలో తూర్పు దిక్కు కంటే తక్కువ ఖాళీ స్థలం విడిచిపెట్టి ఈ దిశలో ఎత్తు ఉండేలా చేస్తే సర్వ శుభములు కలుగుతాయి. పడమర భాగంలో కూడ మంచి నీటి బావులు, బోరులు ఏర్పరచవచ్చు. అయితే ఇవి విదిశలకు తగలకుండ జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.

ఉత్తరం : ఈ దిక్కుకు అధిష్టాన దేవత కుబేరుడు. దక్షిణ దిక్కు కంటే పల్లంగానూ విశాలం గానూ ఉత్తరం ఉండేలా చూసు కోవాలి. ఈ దిక్కులో బోరులు, బావులు ఏర్పాటు చేసుకో వటం మంచిదే. దీనివల్ల విద్యా, ఆదాయం, సంతానం, పలుకు బడి పెరుగే అవకాశం ఉంది.

 దక్షిణము: దక్షిణము దిశకు అధిష్టాన దేవత యముడు. ఉత్తర దిశతో పోల్చినపుడు ఈ దిక్కులో తక్కువ ఖాళీ స్థలం ఉండేటట్లు చూసుకోవడం ఉత్తమం. దీనివల్ల సంతానం, ఆదాయం అభివృద్ధి చెందాుతుంది. దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే స్థిరాస్తుల అమ్మకం, అనారోగ్యాలు బారిన పడక తప్పదాు.

 ఈశాన్యం: ఈ దిక్కుకు అధిదేవత ఈశ్వరుడు. అన్ని దిక్కుల కన్నా ఈ దిశ విశాలంగాను, పల్లంగానూ ఉండలి. ఈశ్వరుడు గంగాధారుడు కాబట్టి ఈ దిశలో నీరు లేదా బావి ఉండటం వల్ల అష్టైశ్వర్యములు కలుగుతాయి. అంతేగాక భ కి ్త, జ్ఞానములు ఉన్నత ఉద్యోగాలు సమకూరతాయని వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది.

 ఆగ్నేయం: ఈ దిక్కుకు అధిదేవత అగ్నిదేవుడు. అందాువల్ల ఈ దిక్కున వంట ఏర్పాటు చేసుకోవటం శుభం. బావులు, గోతులు ఉండడం, ఇతర దిక్కులకంటే ఎక్కువ పల్లంగా ఉండడం ఎంత మాత్రం మంచిది కాదాు. దీనివల్ల వ్యసనాలు, ప్రమాదాలు, అనారోగ్యాల బారిన పడటం, స్థిరాస్తులు కోల్పోవటంలాంటి అపశకునాలు కలుగుతాయి.

 వాయువ్యం: వాయువ్యానికి అధిదేవత వాయువు. ఈ దిక్కు నైరుతి, ఆగ్నేయ దిశలకంటే పల్లంగానూ, ఈశాన్యం కంటే ఎత్తుగానూ ఉండలి. అలాగే ఈ దిశలో నూతులు, గోతులు ఉండకూడదాు. ఈ దిశ ఈశాన్యం కంటే ఎక్కువగా పెరిగి ఉండరాదాు. ఇలా ఉంటే పుత్ర సంతానానికి హాని, అభివృద్ధికి అవరోధాం కలిగే అవకాశం ఉంది.

 నైరుతి: ఈ దిక్కుకు అధిదేవత నివృత్తి అనే రాక్షసుడు. అన్ని దిక్కులకన్నా ఈ దిక్కు తక్కువ ఖాళీగా ఉండి ఎక్కువ ఎత్తు కలిగి ఉండలి. అలాగే  ఈ దిక్కులో ఎక్కువగా బరువు ఉండటం శుభం. ఈ దిక్కులో గోతులు, నూతులు ఉంటే ప్రమాదాలు, దీర… వ్యాధాులు, స్థిరాస్తులు కోల్పోవటం జరుగుతుంది.

 పైన చెప్పిన విధాంగా ఉన్న ఎనిమిది దిక్కుల అధిదేవతలను బట్టి, అందాుకు అనుగుణంగా నిర్మాణాలు చేపడితే ఆ గృహం సకల ఆనందా  లకు నెలవవుతుందాని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది.