ఈ ప్రకరణంలో గ్రహబలం గొప్పదా? గృహబలం గొప్పదా?
నాకు వాస్తు శాస్త్రం పరిచయం అయిన రోజుల్లో మరియు నేను వాస్తు శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్న తొలి రోజుల్లో వాస్తు శాస్త్రం తో మానవ జీవితానికి సంబందించిన ఎటువంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు అని అనుకునేవాడిని. క్రమంగా అర్థమయ్యింది ఏమిటంటే నా సమస్యలు కూడా నేను పరిష్కరించుకోలేకపోతున్నానని. నా సమస్యలు పరిష్కరించుకోలేక పోవడానికి ప్రధాన కారణం నేను, శాస్త్ర సమ్మతమైన గృహాన్ని పొందకపోవడం. ఇదే వాస్తు శాస్త్ర విషయంలో నన్ను బాగా నిరాశకు గురి చేసిన అంశం. అందుబాటులో ఉన్న గ్రంథాలెన్నిటినో పరిశీలించి మరియు నిపుణుల సలహా తీసుకొనినా ఇంటిని నిర్మించినా నాకున్న సమస్యలు అన్నీ పరిష్కారం కాలేదు. నిరాశ చెందినప్పటికీవాస్తు శాస్త్రం మీద నమ్మకం కోల్పోలేదు. ఇంటిలో ఇంకా ఏవైనా తెలియని దోషాలు ఉండవచ్చని భావించాను. తరువాతి కాలంలో మరింత లోతైన పరిశోధన చేసి ఆ దోషాలను కనుగొనడం జరిగింది. అది వేరే విషయం
అంతకుముందు మా కుటుంబం నివాసం ఉన్న గృహంలో కూడా వాస్తు దోషాలు సవరించడానికి ఎంతో ప్రయాస పడవలసి వచ్చింది. అలాగే నగరంలో నివాసం ఉన్నపుడు అద్దె ఇంటి కోసం వెదికే క్రమంలో దోషాలు లేని ఇంటి కోసం ఎంతో ప్రయత్నించేవాడిని. అయితే ఉన్న వాటిలో మెరుగైన ఇంటితో సంతృప్తి పడవలసి వచ్చేది. ఇంటినుంచి సరైన ఫలితం లేకపోతే వీలైనంత త్వరగా ఖాళీ చేసేవాళ్ళము. ఇంటిలో దిగిన రెండు నెలలకు ఖాళీ చేసిన సందర్భం కూడా వుంది. కొన్ని సార్లు కొంత మెరుగైన గృహం దొరికినప్పటికీ అనుకోకుండా ఖాళీ చేయవలసి వచ్చేది. ఇదంతా ఎందుకంటే మంచి ఇల్లు దొరకాలంటే గృహ యోగం ఉండాలి. కొందరికి ఎంత ప్రయత్నించినా మంచి ఇల్లు లభించదు. కొందరికి ఎటువంటి ప్రయాస లేకుండానే మంచి ఇల్లు లభిస్తుంది. దానినే గృహ యోగం అంటారు. జీవితంలో ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం వాస్తు శాస్త్రంలోనే కాక బయట కూడా అన్వేషించాను. దానిలో భాగంగా వివిధ మతాల గురించి కూడా కొంత అధ్యయనం చేశాను. చివరకు నా అన్వేషణ భగవద్గీత లో చెప్పబడ్డ కర్మసిద్ధాంతం వద్దకే చేరింది. భారత దేశం లో పుట్టిన వారికే కాక ప్రపంచంలో ఉన్న దాదాపు అందరికి కర్మ సిద్ధాంతం తెలిసే ఉంటుంది. మనిషి చేసిన పాప మరియు పుణ్యకర్మల ఆధారంగా అతనికి సుఖదుఃఖాలు మరియు మోక్షంకలుగుతుందని భగవద్గీత భోదిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే చాలా మంది ఎంత ప్రయత్నించినా తమ గృహాలలో ఉన్న వాస్తు దోషాలను సరిదిద్దలేక పోతున్నామంటారు. పరిస్థితులు అనుకూలించడం లేదంటారు. మరికొందరికి వాస్తు లోపాలు సరిదిద్దుకోవాలనే ఆలోచనే కలుగదు. ఇంకొందరికి వాస్తు లోపాల వల్ల కలిగే నష్టాలు మరియు వాటిని సరిదిద్దుకుంటే కలిగే లాభాల గురించి ఎంత వివరించినా తలకెక్కించుకోరు.
మీడియా మేధావులు మరియు హేతువాదులం అని చెప్పుకొనే వారు కూడా వాస్తు ఒక మూఢ నమ్మకం అని ప్రచారం చేస్తారు. వారిలో చాలామంది తాము వాస్తును పాటించం అని చెపుతారు కానీ ఉద్దేశ్య పూర్వకంగా తమ గృహాలలో ఎటువంటి వాస్తు నియమాలను ఉల్లంఘించరు. అది వేరే విషయం. వాస్తు శాస్త్రాన్ని పాటించే వివిధ రంగాలకు చెందిన వారు దాని వల్ల ప్రయోజనం పొంది కూడా బహిరంగంగా అంగీకరించరు.
వాస్తు శాస్త్రానికి వ్యతిరేకంగా జరిగే ప్రచారం నమ్మి కొందరు వాస్తు నియమాలకు విరుద్ధంగా ఇల్లు నిర్మించి దాని దుష్ఫలితాన్ని అనుభవించిన తరువాత మేల్కొని దిద్దుబాటు చర్యలు చేపడుతారు. ఈలోపు కొన్ని సార్లు సరిదిద్దలేని నష్టాలు జరుగవచ్చు. మరికొందరు పొరపాటున సరి చేయలేని దోషాలు కలిగేలా ఇల్లు నిర్మించుకొని తరువాత నిస్సహాయ స్థితిలో జీవితాన్ని వెళ్లబుచ్చుతుంటారు. వాస్తు దోషాల వల్ల నష్టాలు జరుగుతున్నా అలాగే జీవితాన్ని గడిపే వారు కూడా వుంటారు. నైపుణ్యం లేని సలహాదారుల వల్ల కూడా వాస్తు దోషాలు తలెత్తి కొందరు గృహస్తులు ఇబ్బంది పడుతుంటారు. మేస్త్రీలు చేసే పొరపాట్లు కూడా దోషాలకు కారణమవుతాయి, కొన్ని సార్లు నిపుణుడైన వాస్తు సలహాదారుని సలహా మేరకు ఇల్లు నిర్మించినా వాస్తు శాస్త్రంలో లేని దోషాలు (అప్పటికి తెలియని దోషాలు) తలెత్తవచ్చు. కారణం ఏదైనా దోషపూరితమైన ఇంటిలో నివసిస్తూ దాని దుష్ఫలితాన్ని అనుభవిస్తుంటారు. కొందరు మాత్రం ఎటువంటి ప్రయాస లేకుండానే మంచి గృహాన్ని పొంది ఆనందంగా జీవిస్తుంటారు. ఇవన్నీ పరిశీలించాక మనిషికి కర్మ ఫలం తోడైతేనే గృహయోగం కలుగుతుందన్నది ఒప్పుకోక తప్పలేదు. ప్రాచీన కాలంలో ఎన్నో వాస్తు శాస్త్రవిషయాలు తెలియచేసిన మహర్షులు కూడా కర్మఫలం మంచిదైతేనే గృహయోగం ఉంటుందని గృహయోగం ఉంటేనే మంచి ఇల్లు లభిస్తుందని మరియు మంచి ఇల్లు ఉంటేనే మనిషికి జీవితంలో ఉన్నత దశ ప్రాప్తిస్తుందని తమ గ్రంథాల ద్వారా చెప్పడం జరిగింది.
కర్మ ఫలం సనాతన ధర్మానికి చెందిన భావన అయినప్పుటికీ అది వాస్తు శాస్త్రానికి బాహ్యంగా ఉందని గ్రహించాలి. గృహ యోగం కూడా వాస్తు శాస్త్రానికి బాహ్యమైన విషయంగానే భావించాలి. సరళమైన భాషలో చెప్పాలంటే మీరు ఒక వాస్తు బద్ధమైన గృహాన్ని సాధిస్తే మీ జీవితం సాఫీగా సాగుతుంది. అయితే శాస్త్ర బద్దమైన ఇల్లు సాధించటం వాస్తు శాస్త్ర పరిదిలో లేని విషయం. అంబులెన్సులో ఆసుపత్రికి తీసుకుపోబడుతున్న రోగి అంబులెన్సు చెడిపోయి మార్గ మధ్యంలోనే చనిపోతే వైద్య శాస్త్రం ఏమి చెయ్యలేదు కదా ? రోగి సకాలంలో ఆసుపత్రికి చేరడం అన్నది వైద్య శాస్త్రానికి సంబందించిన విషయం కాదు. దానిని కొందరు పురాతన పండితులు మరో రకంగా ఉపయోగించుకుంటారు. వాస్తు పరంగా పరిష్కారం చూపించలేనపుడు ఇంటిలో ఏ దోషము లేకపోయినా కర్మ ఫలం వల్ల సమస్యలు తీరడం లేదని అంటారు. అయితే అది నిజం కాదు ఇంటిలో వాస్తు దోషం లేకుండా సమస్య రానేరాదు. ఇంటిలో ఏ దోషం లేకపోయినా చెడు కర్మ ఫలం వల్ల సమస్యలు వస్తాయన్నది తప్పు అలాగే మంచి కర్మఫలం వల్ల ఇంటిలో దోషాలు ఉన్నా సమస్యలు రావు అన్నది కూడా తప్పే.
కాబట్టి గ్రహబలం వేరు, గృహబలం వేరు అనేవారికి అరెండు బలాలు ఏవిధంగా ఏర్పడతాయో అవగాహన తక్కువ అనాలి (గ్రహబలానికి గృహబలానికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ రెండు శక్తుల పరస్పర సమ్మేళనమే మానవుని సుఖదుఃఖాలను నిర్ణయిస్తుంది. అయితే ఈ రెండు శక్తులను అధిగమించగల మరోశక్తి ఉంది. అదే మానవుని ఆత్మశక్తి అనే ఆధ్యాత్మిక శక్తి. అయితే అందరు అట్టి ఆత్మశక్తిని సంపాదించలేరుగదా. మనవేద శా(స్రాలలోని అనేక విషయాలకు ఈనాటి సైన్సు జవాబులు సాధించలేక పోతున్నదని బుజువగుచున్నది అంతమాత్రం చేత ఈనాటి వైజ్ఞానిక సత్యాలను కాదనగలమా? ఆ విధంగానే మన (ప్రాచీన శా స్త్రాలలోని వైజ్ఞానిక సత్యాలను కాదనరాదు ఉదాహరణకు మన ప్రాచీన కట్టుడాలలోని వైజ్ఞానిక రహస్యాలు ఈనాటికి సైన్సునకు సవాలు గానే నిలచియున్నాయి. గోల్కొండ కోట యందలి ధ్వని గ్రహణ యంత్రం, ఢిల్లీ అక్బరు కోటలోని ధ్వని ప్రసార యంత్రాలు ఇందుకు ఉదాహరణ. కాబట్టి గ్రహబలం చాలా శక్తివంతమైనదని మనం నమ్మి తీరాలి గృహబలం, (గ్రహబలం కంటె వేరు కాదు. గృహబలానికి, గ్రహబలానికి పరస్పరా ‘శ్రయం అవసరం గృహ శంకుస్థాపన లగాయతు, గృహ (ప్రవేశ సమయం వరకు అంతా(గ్రహబలం ఆధారంగా జరుగుతూ ఉంటుంది గదా గృహ నిర్మాణ శైలి కూడా (గ్రహరాజైన సూర్య గమనాన్ని అనుసరిస్తుంది ఇవి అన్నీ కూలంకషంగా పరిశీలిస్తే గృహ యజమాని యొక్క (గ్రహబలం ఆధారంగానే గృహ స్వరూపం రూపొందుతుందని పిండితార్దం మరో విషయం గమనించండి గృహ (ప్రవేశసమయంలో అష్ట దిక్సాలురకు, నవగ్రహములకు, వాస్తు పురుషునకు ఆవాహన ఎందుకు చేస్తాం? గృహక్షేత్రం, అష్టదిక్సాలురకు, నవగ్రహాలకు, వాస్తుపురుషుని శక్తికి (ప్రతీకలు గదాకాబట్టి ఆయా దేవతామూర్తుల అనుగ్రహం కోసమే నవగ్రహారాధన చేయడంజ్యోతిషశాస్త్ర ప్రభావమే

