banner 6 1

38

గ్రహబలం అంటే ఏమిటో వెనుకటి (ప్రకరణంలో చాలా వరకు విశదీ కరింపబడింది. గృహబలం ఇక్కడ విశదీకరింపబడుతుంది. గృహం పంచ భూతాత్మకమైన స్వరూపం అని గతంలో వివరించబడింది పంచ భూతాలు అనగా భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాళం అని కదామనకు తెలుసు (ప్రతి యిల్లు ఈ పంచ భూతాలకు చెందిన తత్వములతో
రూపొందుతుంది అయితే, అన్ని యిండ్లలోనుఈ పంచ భూతాలకు చెందినతత్వాలు సమపాళ్ళలో మేళవింపబడినవా? అయా నిర్మాణ శైలి, అయా క్షేత్రమునకుగల భౌతిక స్టితి, అయా నిర్మాణాలకు అధిపత్యం వహించిన స్టపతి,సిద్దాంతి యొక్క మేధా సంపత్తి అనేవాటి మీద, అయా తత్వాల కూడికఆధారపడి వుంటుంది. కొన్ని యిండ్లకు వాయు తత్వం అధికమైతే కొన్నియిండ్లకు అకొళతత్వం కావలిసిన దాని కంటే అధికమౌతుంది. మరి కొన్నినిర్మాణాలకు పృధివీ తత్వ సంబంధిత పదార్దాలు ఆధిక్యత-కలిగి ఉంటాయి.
ఈ విధంగా అయా నిర్మాణాలు ఆయా తత్వ సమ్మేళనానికి అనుగుణంగాఫలితాలనిస్తాయి గృహ నిర్మాణక్షే(త్రంలో ప్రాకార పరివేష్టితమైన జ్షేత్రమంతా ఒక యూనిటగా హింపబడి, ఈ పాంచభౌతిక తత్వాల విమర్శచేయబడుతుంది. ఇటుకలు, సున్నం, రాళ్ళు, కలప,మొదలైన వస్తుసముదాయం పృధివీ తత్వానికి చెందినవి. నుయ్యి, నీటి కుండీలు, ళాయిలు, నీటి పారుదల యేర్చాట్టుమొదలైనవి జల తత్వానికి చెందినవి. వంట శాలలు, దేవస్టలాలు, మొదలైనవి అగ్ని తత్వానికి చెందినవి. ద్వారములు, కిటికీలు గవాత్లాలు మొదలైన వాయు ప్రసార సాధనాలు వాయుతత్వానికి చెందినవి యింటికి, (ప్రహరీ గోడకు మధ్య గల ఖాళీ ప్రదేశము, గర్భంలో గదుల విస్తారము, వరండాలు గది గోడల యెత్తు ఆకాశతత్వా
నికి చెందినవి. ఈ విధంగా పంచ భూతాత్మకమైన ఇంటికి వాస్తుబలం ఏ విధంగా పరిరక్షించుకోవాలో ఈ క్రింద వివరింపబడుతున్నది. పంచ భూతములకు సంబంధించిన తత్వాలు ఏయే మేరకు గృహ నిర్మాణంలో చోటుచేసుకుంచాయో ఆయా మేరకు గృహ సంబంధమైన తాత్వికబలం ఇంచికి సమకూరుతుంది వాస్తు పద విన్యాస (ప్రణాళిక ననుసరించి పై నుదహరించిన పాంచ భౌతికతత్వాల కలయికతో రూపొందింపబడిన ఇల్టు సంపూర్ణ వాస్తు బల సమన్వితమగును. వాస్తు పద ప్రణాళికా విరుద్రమైన నిర్మాణం నిర్వీర్యమగును. అనేక కష్టనష్టాలను కలుగజేస్తుంది.ఆరోగ్యవంతమైన సర్వశుభలక్షణ సమన్వితమైన, సజీవ పూర్ణ పురుషస్వరూపానికి ప్రతీకగా గృహ పురుష స్వరూపం సమర్థుడైన స్ట్రపతి చేత ఆవిష్కరింప బడుతుంది. అరోగ్యవంతుడైన పురుషుడు తన జీవితాన్ని యే విధంగాఆనందమయం చేసుకొంటాడో, ఆ విధంగానే ఆరోగ్యవంతమైన గృహ పురుషుడు కూడ ఆ గృహంలో మసలే జనాలకు ఆయురారోగ్య సౌభాగ్యాలనుఅందించగలడు. “సర్వేషు అరగేషు శిర ప్రధానం”? అన్న సూత్రాన్ని అనుసరించి మానవుని అన్ని అంగాలలోను శిరస్సు (ప్రధానమైనది గదా! అవయవాలన్నీఆరోగ్యంగా ఉన్నా శిరస్సు అనే ముఖం లేనిదే యే అవయవం పనిచేయలేదు. ఆవిధంగానే గృహ పురుషుని ముఖంగా భావింపబడే ముఖద్వారం ఆ పరిసరాలుకళ కళలాడుతూ చూడముచ్చటగా ఉండాలి యింటిలోని పరిస్టితి యిల్లాలిముఖమే చెబుతుంది అనే సోమెత ఆధారంగా యింటి ముఖద్వారం ఆ పరిసరంచూడగానే ఆ యింటి పరీస్థితులు అవగాహనకు వస్తాయిఇంటీ ముఖద్వారమందు గల ఖాళీ స్థలము గృహ పురుషునికి ఊపిరితిత్తులుగా శాస్త్రం చెపుతుంది. ఊపిరితిత్తులు వాయుతత్వానికి చెందినవికదామానవ జీవితానికి ఊపిరితిత్తుల (ప్రాముఖ్యత ఎట్టిదో గృహ పురుషుని జీవితానికి ఇంటి ముంగిలి అనగా, హద్వాంము ముందు గల ఖాళీ (ప్రదేశము అంతముఖ్యమైనది. ముఖద్వారము ముందు వాకిలి లేకుండా ఎంత మాత్రము గృహనిర్మాణము చేయరాదు అట్టు చేసినచో ఆ ఇంటియందు నివసించువారు శ్వాసరోగాలచే పీడింపబడుచుందురు. ఊపిరితిత్తులు చెడిపోయిన మనిషి వలె ఆఇల్లు తయారగును. వాయుతళత్స్వానికి చెందిన కిటికీలు గవావ్షాలు, శాస్ర, నియమాల (ప్రారం నియమించ బడనిచో ఆ ఇంటియందున్నవారికి-వాయు సంబంధ రోగములు కలిగి ఆనారోగ్యములతోనూ మానసిక అశాంతితోనూ బాధపడుచుందురు.
ఆకాళతత్వానికి చెందిన ఇంటి చుట్టూరూ గల ఖాళీ (ప్రదేశాలు చక్కని గాలీవెలుతురు (ప్రసారం చేసే సాధనాలు. ఆయా ఖాళీ (ప్రదేశాలలో ఎత్తైనచెట్టు ‘పెంచరాదు. ఇంటికి తూర్పు ఉత్తరం, ఈశాన్య దిశలయందు రెండు మీటర్ల ఎత్తు కంటె ఎక్కువగా పెర చెట్లను పెంచరాదు. సూర్య కిరణ (ప్రసారమునకుఆటంకము కారాదు. ఈ నియమాన్ని పాటింపనిచో ఆ ఇంటనుండే వారుఎప్పుడూ రోగాల పాలవుతారు.


  • అవసరానికి అనుకూలమైన విధంగా గృహావరణలో ఎక్కడ బడితేఅక్కడ ఉపషగ్భహాలు నిర్మించరాదు. ఆ విధంగా నిర్మాణాలు చేస్తే ఆయా దిక్సుతుల బలం తగ్గిపోతుంది. వాస్తుబలం తగ్గిపోయి అనేక కష్ట నష్టాలకు గురియగుదురు. మా అనుభవంలో కూడా ఆ విధంగా నిర్మాణాలు చేపట్టిన చోట అనేక అనర్జాలు జరుగుతున్నట్టుగా మనిస్తున్నాం.
    పృధివీ తత్వానికి చెందిన కలప, ఇటుక, సున్నం నాణ్యమైనవి నిర్మాణంలో వినియోగించాలి. వాస్తు శాస్త్రాలు నిషేధించిన చెట్ల కలపను వినియోగించరాదు. ముందుగా మనం స్టపతి చేత నిర్దారింపచేసికొని స్థానునకు విరుద్దంగా మన ఇష్టం వచ్చినట్టు గుమ్మాలు, కిటికీలు మార్చరాదు. జలతత్వానికి చెందిన నూయి, కుళాయి, నీటి కుండీలు మొదలైనవి ఈశాన్యదిశయందే నిర్మించుట (శ్రేయోదాయకము. మనము గృహ నిర్మాణ సమయాలలో ఈ పై నియమాలు పొటించినచో గృహబలాన్ని పెంపొందించు
    కొన్నవారమగుదుము.మరో ముఖ్య గనునిక :- గృహ నిర్మాణానికి ప్రారంభంలో వాస్తు సిద్దాంతి ఇచ్చిన గ్రౌండు ఫ్లానును యజమానుడు భద్రంగా దాచి ఉంచాలి. ఆ పత్రిక మంచి శుభ ఫలితాన్నిఇస్తుందని శాన వచనము.