స్థలం దిక్కుకు ఉండాలా?
చాలా మంది పండితులు స్థలం దిక్కుకు ఉంటే అనగా శుద్ధ ప్రాచి స్థలం అయితే అద్భుతమైన వాస్తు ను అందిస్తామని చెపుతుంటారు. మరికొందరైతే స్థలం దిక్కుకు లేనపుడు ఇంటిని స్థలం వృధా అయ్యేలా దిక్కుకు త్రిప్పి కడుతున్నారు. అది చూడడానికి కూడా వికృతంగా కనిపిస్తుంది. స్థలం నిజంగా దిక్కుకు ఉండటం అవసరమా ? దిక్కుకు ఉన్న స్థలాలే మంచి ఫలితాన్ని ఇస్తాయా ?
ఈ రెండు ప్రశ్నలకు రెండు దృశ్య కోణాలనుంచి సమాధానం చెప్పవలసి ఉంటుంది. మొదటిది వాస్తు శాస్త్ర నియమాల పరంగా అయితే రెండవది ఆచరణ పరంగా. శాస్త్ర నియమాల పరంగా చూస్తే స్థలం దిక్కుకు ఉండటం అంత ఆవశ్యకమైన విషయం ఏమి కాదు. ఎందుకంటే సరిగ్గా దిక్కుకు ఉండి చెడు ఫలితాలను ఇచ్చిన గృహాలు ఎన్నో వున్నాయి. దిక్కుకు లేకున్నా కూడా మంచి ఫలితాలను ఇచ్చిన గృహాలు ఎన్నో వున్నాయి. అంటే సరైన వాస్తు నిపుణుడు దిక్కుకు లేని స్థలం లో అయినా మంచి ఫలితాన్ని ఇచ్చే గృహాన్ని అందించగలడు. అయితే ఆచరణ పరంగా ఆలోచిస్తే దిక్కుకు లేని స్థలం లో ఇల్లు నిర్మించాలంటే కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది తగిన నైపుణ్యం ఉన్న సలహాదారులు లేకపోవడం. నైపుణ్యం లేని సలహాదారుడు దిక్కుకు లేని స్థలం విషయం లో పొరపాట్లు చేసే అవకాశం చాలా ఎక్కువ. ఉదాహరణకు దిక్కుకు లేని స్థలాల్లో ఎక్కువుగా ద్వారాలు తప్పుడు స్థానాల్లో కనపడుతుంటాయి. సలహాదారునికి నైపుణ్యం ఉన్నా చాలా పరిమితులు ఎదురవుతాయి. వాటిలో ఒకటి ఇంటి చుట్టూ ఉండే స్థల వినియోగం. ఉదాహరణకు స్థలానికి నైరుతి లో మాత్రమే వీధి ఉన్నపుడు ఈశాన్యం లో ఎక్కువ ఖాళీ ప్రదేశం వదిలినప్పుడు,ఇంటి వెనుక ఉన్న ఆ ఖాళీ స్థలాన్ని పార్కింగ్ లాంటి అవసరాలకు ఉపయోగించలేము. స్థలం దిక్కుకులేనపుడు వాస్తు సలహాదారునికి ద్వార నిర్ణయం లో మరియు ఇంటి చుట్టూ ఖాళీ ప్రదేశాలను ఏర్పాటు చేయడంలో తగిన వెసులుబాటు ఉండదు . ముఖ్యంగా స్థలం 22.5 డిగ్రీలకంటే ఎక్కువ తిరిగివుంటే గదుల యొక్క ద్వారాల స్థానాలను నిర్ణయించడం చాల కష్టం. దానివల్ల స్థలం దిక్కుకు లేనప్పుడు వాస్తు సలహాదారుని మెదడు చాలా శ్రమించాలి. గృహ యజమాని కూడా సౌకర్యాల విషయం లో గాని శాస్త్ర నియమాల విషయం లో గాని కొంత వరకు రాజి పడాలి. వాహన శాల(car parking) విషయం లో గృహ యజమాని రాజీ పడితే మరియు స్థలం తగినంత విశాలంగా ఉంటే స్థలం దిక్కుకు లేకపోయినా శాస్త్రపరంగా ఉన్నత మైన గృహాన్ని నిర్మించవచ్చు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
స్థలం దిక్కుకు లేనపుడు
స్థలం దిక్కుకు లేనపుడు వాస్తు సలహాదారుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. యజమాని కూడా ఈ జాగ్రత్తల గురించి తెలుసుకోవడం మంచిది.
1. ఇంటి లేదా ప్రాకార ద్వారాల యొక్క స్థానాలు దిక్కుతో పాటు మారిపోతాయని గుర్తుంచుకొండి. ఇతర బాహ్య ద్వారాలను ఉంచవల్సిన స్థానాలు కూడా మారిపోతాయి కనుక నడకలను ఏర్పాటు చేయవల్సిన విధానం కూడా మారిపోతుంది. గదుల యొక్క ద్వారాలు ఉంచవలసిన స్థానాలు కూడా మారుతాయి.
2. సెప్టిక్ ట్యాంక్ లేదా ఇతర గొయ్యిలకు సంబందించిన స్థానాలు కూడా మారిపోతాయి.
3. వీధి చూపులు కూడా దిక్కులో ఉన్న మార్పు వల్ల వీధి పోట్లుగా మరి పోయే అవకాశం ఉంది.
4. స్థలం దిక్కుకు లేనపుడు ఇంటిచుట్టూ ఉండే ఖాళీ ప్రదేశాలు కూడా అసమతుల్యతకు గురికావచ్చు. శాస్త్ర ప్రకారం ఖాళీ ప్రదేశాలను ఏర్పాటు చేసినప్పటికి వీధి లోనించి ఇంటి లోని ఖాళి ప్రదేశాలను చేరుకోవడానికి కావలసిన స్థానంలో ప్రాకార ద్వారం ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కార్ పార్కింగ్ విషయంలో రాజీపడడం మంచిది
5. గదుల యొక్క వినియోగ లక్ష్యం కూడా మారుతుంది.
6.ప్రహరీ యొక్క ఈశానాన్ని పెంచే విధానం కూడా దిక్కుతో పాటు మారిపోతుంది.
7. స్థలం దిక్కుకు లేనపుడు వాలుకు సంబందించిన సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఎందుకంటే మెరక గా ఉండవలసిన ప్రాంతాలు మరియు పల్లంగా ఉండవలసిన ప్రాంతాలు దిక్కుతోపాటు తమ స్థానాలను మార్చుకుంటాయి
8.వరండా /వసారాలు ఉండవలసిన స్థానాలు కూడా మారిపోతాయి.
9. మూత (మూలల ను కప్పుతో మూయడం గురించి మరో అధ్యాయం లో వివరించడం జరిగింది) వేయకూడని ప్రదేశాల స్థానం కూడా మారుతుంది.
పై జాగ్రత్తలని పాటిస్తే దిక్కుకు లేని గృహమైన అద్భుతమైన ఫలితాన్నే ఇస్తుంది.
ఎల్లపుడు గుర్తుంచుకోవలసిన విషయం. దిశ మరియు దశ అన్నవి వాస్తు శాస్త్రానికి రెండు కళ్ళ లాంటివి. దిశ తో పాటే దశ (స్థానం) అన్న విషయం

