banner 6 1

53

వాస్తు పై బరువులు మరియు వాలు ప్రభావం

ఎత్తు పల్లాలు: భూతలం యొక్క ఎత్తు పల్లాలు మనిషిపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. ప్రాచీన కాలపు గ్రంథాలలో కూడా గృహాన్ని నిర్మించడానికి తగిన స్థలం యొక్క ఎత్తు పల్లాలు ఎలా వుండాలో చెప్పబడినది. దక్షిణం నుంచి ఉత్తరానికి మరియు పశ్చిమం నుంచి తూర్పుకు వాలుగా ఉన్న పరిసరాలు కలిగిన స్థలం గృహ నిర్మాణానికి ఉత్తమమైనదిగా చెప్పబడినది. ఇంటి ఆవరణ యొక్క వాలు కూడా అలాగే ఉండాలి. గృహంలో భాగమైన నిర్మాణాల యొక్క ఎత్తుపల్లాలు కూడా అలాగే ఉండాలి.

బరువులు : ఆధునిక వాస్తు శాస్త్రంలో ఎత్తుకు బరువును పర్యాయ పదంగా వాడుతాము. ఎందుకంటే ఏదైనా ఒక పెద్ద పరిమాణములో ఉన్న బరువైన పదార్థాన్ని ఒక చోట ఉంచితే ఆ ప్రాంతం ఎత్తుగా కూడా మారుతుంది. ఈశాన్యం తూర్పు మరియు ఉత్తర దిశలో బరువులను ఉంచితే ఆప్రాంతం ఎత్తుగా కూడ మారుతుంది. అందుకే దక్షిణం పడమర మరియు నైరుతి దిశలను బరువులను ఉంచడానికి అనువైన దిశలుగా చెబుతాము. ఈ సూక్ష్మం తెలియని కొందరు పండితులు ఈశాన్యం లో బరువులు ఉంచకూడదని ఏ శాస్త్రం లో ఉందని అడుగుతున్నారు.

1. పరిసరాల వాలు (slope)

తూర్పు ఉత్తరాలలో ఎత్తైన కొండలు లేదా పర్వతాలు కలిగిన ప్రాంతాన్ని గృహ నిర్మాణానికి ఎన్నుకోరాదు.. అలాగే దక్షిణం మరియు పడమర దిశలలో లోతైన చెరువులు, లోయలు ఉన్న ప్రాంతాన్ని కూడా గృహ నిర్మాణానికి ఎన్నుకోరాదు. ఒక లేఅవుట్ లో ఏర్పాటు చేసిన వీధులు దక్షిణం నుంచి ఉత్తరానికి మరియు పడమర నుంచి తూర్పుకు వాలును(slope) కలిగి ఉంటే అట్టి లేఅవుట్ లో గృహ నిర్మాణానికి కావలసిన స్థలాన్ని కొనుగోలు చేయవచ్చు.

2. స్థలం యొక్క వాలు

ప్రహరీ నిర్మాణం పూర్తి అవడంతో స్థలానికి వాస్తు పరంగా హద్దులు ఏర్పడుతాయి. బాహ్య పరిసరాలు ఎలా ఉన్ననూ గృహ ఆవరణలోని స్థలం యొక్క ఎత్తుపల్లాలు శాస్త్రానుసారంగా ఉంటే మెరుగైన ఫలితాలే ఉంటాయి. శాస్త్ర ప్రకారం ఇంటికి నాలుగు వైపులా ఖాళీప్రదేశం ఏర్పాటుచేస్తాము. అలా ఏర్పాటు చేసిన ఖాళీ ప్రదేశాలలో ఇంటికి దక్షిణం వైపున ఉన్న ఖాళీ ప్రదేశం ఎత్తుగాను ఉత్తరం వైపున ఉన్న ఖాళీప్రదేశం పల్లంగాను ఉండాలి మరియు పడమరలో ఉన్న ఖాళీ ప్రదేశం ఎత్తుగాను తూర్పున వైపున ఉన్న ఖాళీప్రదేశం పల్లంగాను ఉండాలి. అలాగే నైరుతి మూల అన్ని మూలల కంటే ఎత్తుగా ఈశాన్యం మూల అన్ని మూలల కంటే పల్లంగా ఉండాలి. ఆగ్నేయం మూల వాయవ్యం మూల కంటే ఎత్తుగా ఉండాలి. ఆవరణలోని ఖాళీప్రదేశాన్ని కేవలం మట్టితో నింపినపుడు పైన వివరించిన విధంగా వాలు ఏర్పడాలి. సిమెంట్ మరియు ఇసుకతో కూడిన గచ్చును లేదా టైల్స్ లేదా బండలతో కూడిన తలాన్ని (flooring) ఏర్పాటుచేయాలంటే లెవెల్ పైప్ ద్వారా ఎత్తు పల్లాలను నిర్ధారించి దానికి అనుగుణంగా వాలును ఏర్పటుచేయాలి. ఆవరణలో పచ్చిక (lawn)తో కూడిన తలాన్ని అయినా సరే పైన చెప్పిన విధానంగానే ఏర్పాటు చేయాలి.

53

Landscaping : ఈ రోజుల్లో ఇంటిని ఆధునికంగా నిర్మించి లోపలిభాగాన్ని అందంగా అలంకరిస్తున్నారు. అంతే కాక ఇంటి ఆవరణను కూడా ఇంపుగా కనపడేలా తీర్చిద్దిద్దుతున్నారు. దానిలో భాగంగా తమ అభిరుచులకు అనుగుణంగా ల్యాండ్ స్కేప్ కు రూపకల్పన(landscape design) చేస్తున్నారు. కొందరు ల్యాండ్ స్కేపింగ్ లో భాగంగా వాలుకు సంబంధించిన నియమాలను ఉల్లంఘిస్తారు. ఈశాన్యం, తూర్పు మరియు ఉత్తరాలలో ఎత్తైను అరుగులు నిర్మించరాదు. నైరుతి, దక్షిణం, ఆగ్నేయం,పడమర మరియు వాయవ్య భాగాలలో గొయ్యి లాంటి నిర్మాణాలను ఏర్పాటు చేయరాదు. ల్యాండ్ స్కేపింగ్ లో భాగంగా నిర్మించే కట్టడాలు ఎత్తుగా ఉండేవి(ఉదా: పూర్తిగా భూతలంపై నిర్మించే ఫౌంటెన్) అయితే ఆవరణ యొక్క దక్షిణం పడమర లేదా నైరుతి భాగం లో మాత్రమే నిర్మించాలి.. అంతే కాకా అట్టి నిర్మాణాలను ఇంటిని లేదా ప్రహరీని అంటకుండా నిర్మించాలి. లోహపు అరుగు (metal base)ల ఉంచే లేదా నేలపై ఉంచే భారీ మొక్కల కుండీలను కూడా దక్షిణం పడమర లేదా నైరుతి భాగం లో మాత్రమే ఏర్పటుచేసుకోవాలి.

పూర్తిగా భూతలానికి దిగువన నిర్మించే కట్టడాలు (ఉదా: చేపల కొలను లేదా fish pond ) అయితే తూరు ఉత్తరం లేదా ఈశాన్యం వైపున నిర్మించవచ్చు. ల్యాండ్ స్కేపింగ్ వృత్తిలో ఉన్నవారు వాస్తు శాస్త్రంలో ఉన్న వాలు కడు సంబంధించిన నియమాల పట్ల అవగాహన కలిగివుండాలి. ఇల్లు కేవలం అందంగా మరియు విలాసవంతంగా ఉంటే సరిపోదు. ఏ ఇల్లైనా వాస్తు నియమాలకు అనుకూలంగా ఉంటేనే అది మనిషికి ఆనందమయమైన జీవితాన్ని ఇస్తుందని గ్రహించాలి.

విదిక్కుల స్థలం లో వాలు : స్థలం దిక్కుకు ఉన్నపుడు పైన చెప్పిన విధంగా వాలును ఏర్పాటు చేయాలి. స్థలం దిక్కుకు లేనపుడు ఎత్తుగా ఉండవలసిన మరియు పల్లంగా ఉండవలసిన స్థానాలు కూడా మారిపోతాయి. స్థలం సుమారుగా 45 డిగ్రీలు తిరిగి కర్ణ ప్రాచీలో ఉంటే నైరుతి, పడమర మరియు దక్షిణాలు అన్ని దిశల కంటే ఎత్తుగాను. ఈశాన్యం, తూర్పు మరియు ఉత్తర భాగాలు అన్నిదిశల కంటే పల్లంగానూ ఉండాలి. ఆగ్నేయ దిశను వాయవ్యదిశ

54

3.వర్షపు /వాడకపు నీటిని బైటకు పంపడం

జీవుల మనుగడకు నీరు అవసరం. త్రాగడానికి మాత్రమే కాక శరీరాన్ని మరియు దుస్తులను శుభ్రపరుచు కోవడానికి ఇంకా మరెన్నో అవసరాలకు నీరు అవసరం. ప్రతి మనిషి బ్రతికే క్రమంలో కొంత నీటిని వ్యర్థంగా మార్చుతాడు. అలా వ్యర్థంగా మారిన నీటిని మరియు వర్షపు నీటిని ఎప్పటికప్పుడు బయటికి పంపవలసి వస్తుంది. నీరు ఎప్పుడూ పల్లానికి ప్రవహిస్తుంది కాబట్టి పైన చెప్పిన విధంగా స్థలం యొక్క వాలును ఏర్పటు చేస్తే వర్షపు నీరు అంతా తూర్పు, ఉత్తరం మరియు ఈశాన్యం వైపుకు ప్రవహిస్తుంది. కాబట్టి వర్షపు నీటిని ఆ మూడు దిశల ద్వారా బైటికి పంపేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. వంటగదిలోని వాడకపు నీరు మరియు స్నానపు నీరు మరే ఇతర అవసరాలకు వాడిన వ్యర్ధ జలాన్ని అయినా గొట్టపు వ్యవస్థ (pipeline)ను ఏర్పాటు చేసి పై మూడు దిశల ద్వారా బయటికి పంపవచ్చును. మరుగు వ్యర్ధాలను తూర్పులేదా ఉత్తర దిశ ద్వారా మాత్రమే బైటికి పంపాలి. ఎట్టి పరిస్థితిలో కూడా మరుగు వ్యర్థాలను ఈశాన్యం భాగం ద్వారా బయటికి పంపరాదు.

పూర్వము మనిషి కాలకృత్యాలను ఆరుబయట తీర్చుకొనేవాడు. ఇప్పుడు మరుగుదొడ్లను ఇంటిలోనే నిర్మించుకొని ఇంటిలోనే తన అవసరాలను తీర్చుకుంటున్నాడు. మొదట ఇంటి ఆవరణలోకి వచ్చిన మరుగుదొడ్లు ఇప్పుడు ఏకంగా పడకగదికి అనుబంధంగా మారినవి. మరుగు దొడ్డి ద్వారా ఉత్పన్నమైన వ్యర్థాలు గొట్టపు వ్యవస్థ ద్వారా బయటికి పంపబడతాయి. గొట్టపు వ్యవస్థలో వ్యర్థాల ప్రవాహం వాలుకు అనుగుణంగా పనిచేస్తుంది కాబట్టి వ్యర్థాలు ఉత్పత్తి అయిన చోటు నుంచి ఆవరణ నుంచి బయటికి పంపే స్థానం వరకు జాగ్రత్తగా గొట్టపు వ్యవస్థను ఏర్పాటు చేయాలి. వాస్తు నియమాల ప్రకారం మరుగుదొడ్లను దక్షిణం, పడమర, ఆగ్నేయం మరియు వాయవ్యదిశలలో మాత్రమే నిర్మించాలి. ఆగ్నేయ దిశలో మరుగుదొడ్డిని నిర్మిస్తే తూర్పు ద్వారా మరియు వాయవ్య దిశలో మరుగుదొడ్డిని నిర్మిస్తే ఉత్తరం ద్వారా వ్యర్థాలను సులభంగా బయటికి పంపవచ్చును. కానీ దక్షిణం లేదా పడమర భాగంలో మరుగుదొడ్లను నిర్మిస్తే పొడవైన గొట్టపు వ్యవస్థను ఏర్పాటుచేయవలసి వస్తుంది. గొట్టపు వ్యవస్థ లో భాగంగా మ్యాన్ హోల్ (manhole) లను ఏర్పాటు చేయవలసి వస్తే వాటిని వీలైనంత చిన్నగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మ్యాన్ హోల్ పెద్దగా ఉంటే అక్కడ గొయ్యి ఏర్పడుతుంది. అవసరమనుకుంటే మ్యాన్ హోల్ లను భూమికి దిగువన కాకుండా భూతలంపై ఏర్పాటు చేసుకోవచ్చును తద్వారా గొయ్యి ఏర్పడకుండా చూడవచ్చును.

4. ఇంటి తలం (flooring) యొక్క వాలు

ఏ ఇంటిలోకి అయిన ప్రవేశించగానే మనము పరిశీలించేది నేలను (flooring). పూర్వము మట్టితో నేలను అలికే వారు. తరువాత బండలను నేలపై పరచటం మొదలుపెట్టారు. ఇప్పుడు యంత్రాల ద్వారా నున్నగా చేయబడిన బండలతో (polished stones) పాటు కృత్రిమంగా తయారు చేయబడిన పలకలు (tiles) కూడా అందుబాటులో ఉన్నవి. నేల యొక్క తలాన్ని ఏ పదార్థంతో చేసినా వాలుకు సంబంధించిన నియమాలను పాటించాలి. స్థలం యొక్క ఎత్తు పల్లాలకు సంబంధించిన నియమాలు ఇంటియొక్క నేల వాలుకు కూడా వర్తిస్తాయి. ఇల్లు కడిగినపుడు ఈశాన్యం దిశగా నీరు బయటికే వెళ్లేలా స్వల్ప వాలును ఏర్పాటు చేయాలి. నైరుతి, దక్షిణం మరియు ఆగ్నేయం గదులు స్వల్పంగా మెరకగా వాయవ్యం ఉత్తరం మరియు ఈశాన్యం గదులు స్వల్పంగా పల్లంగా ఉండాలి.

5. పై కప్పు వాలు

ప్రకృతి వల్ల కలిగే వర్షం మరియు ఎండల నుంచి మనిషిని కాపాడేది ఇంటియొక్క పైకప్పు. వివిధ ప్రాంతాలలో అక్కడి వాతావరణానికి అనుకూలంగా ఇండ్లను మరియు ఇంటి కప్పులను నిర్మిచుకుంటారు. పూర్వము వాలుతో కూడిన కప్పులను ఎక్కువగా ఏర్పటుచేసేవారు. దానికోసం మట్టి పెంకులను, తాటి ఆకులు మరియు మొక్కల నుంచి లభించే గడ్డి లాంటి పదార్ధాలను ఉపయోగించేవారు. సాంకేతికత అభివృద్ధి చెంది కాంక్రిట్ అందుబాటులోకి వచ్చిన తరువాత సమతలంగా ఉండే కప్పులను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటి కప్పు నిర్మాణంలో కూడా వాస్తు పరంగా వాలుకు సంబందించిన తగు జాగ్రత్తలు తీసికోవాలి. ఇంటి కప్పు సమతలంగా ఉన్నపుడు బాహ్య పరిసరాలకు మరియు ఇంటి ఆవరణకు చెప్పబడిన ఎత్తుపల్లాల నియమాలే కప్పుకు కూడా వర్తిస్తాయి. కప్పు కంటికి సమతలంగా కనపడినప్పటికీ వర్షపు నీరు నిలబడకుండా స్వల్పంగా వాలును ఏర్పాటుచేస్తారు. శాస్త్ర పరంగా చూసినపుడు కప్పు మీద పడిన వర్షపు నీరు ఈశాన్యం వైపుకు ప్రవహించి అక్కడి నుంచి క్రిందకు వెళ్లేలా వాలును ఏర్పాటుచేయ వలసి ఉంటుంది.

6. రేకుల కప్పు వాలు

ఇనుప/సిమెంట్ (asbestos) రేకుల తో కూడిన కప్పును సాధారణంగా పరిశ్రమలకు, గోదాములకు, కల్యాణ మండపాలకు మరియు పశుశాలలకు ఏర్పాటు చేస్తాము. కొందరు పేదలు మరియు మధ్య తరగతి వర్గీయులు తక్కువ ఖర్చు కారణంగా తమ ఇళ్లకు రేకుల కప్పును ఏర్పాటుచేసుకుంటారు. మరికొందరు ఇంటి లో వరండా భాగాన్ని లేదా ఉపగృహాన్ని మాత్రమే రేకుల కప్పుతో నిర్మిస్తారు. రేకుల కప్పును దేని కోసం నిర్మిచినా సరే వాలుకు సంబందించిన నియమాలను పాటించాలి. రేకుల కప్పును వర్షపు నీరు జారుటకు వీలుగా అధిక వాలుతో నిర్మిస్తాము. అయితే ఏ దిశగా వాలును ఏర్పాటుచేయాలన్నది వాస్తు పరంగా ముఖ్యమైన విషయం. నిర్మాణం విశాలమైనది అయితే రెండువైపులా వాలు ఏర్పడేలా కప్పును నిర్మిస్తాము. చిన్న నిర్మాణాలకు ఒకే వైపు వాలు ఏర్పడేలా కప్పును నిర్మించవచ్చు. రేకుల కప్పుతో కూడిన మానవ గృహాన్ని ఎప్పుడు కూడా తూర్పు లేదా ఉత్తరం వాలు ఉండేలా నిర్మించాలి. కారణం మానవ గృహాన్ని గదులుగా విభజిస్తాం కనుక. ఉత్తర దక్షిణాలుగా (ఇరువైపులా) వాలు ఉండేలా గృహాన్ని నిర్మిస్తే దక్షిణం లో ఉన్న గదులకు వాలుకు సంబందించిన దోషం తలెత్తుతుంది. అలాగే తూర్పు పడమరలు (ఇరువైపులా) వాలు ఉండేలా గృహాన్ని నిర్మిస్తే పడమర లో ఉన్న గదులకు వాలుకు సంబందించిన దోషం తలెత్తుతుంది.

55

పరిశ్రమలకు సంబందించిన లేదా ఇతర విశాలమైన నిర్మాణాలకు ఇరువైపులా వాలు ఏర్పడేలా కప్పును ఏర్పరిచినపుడు మధ్యలో వెన్ను భాగం (శిఖరం) ఏర్పడుతుంది. ఉత్తరం మరియు దక్షిణం ఇరువైపులా వాలు ఉండేలా కప్పును నిర్మిస్తే వెన్ను భాగం సరిగ్గా మధ్యలో ఉండ వచ్చు. లేదా వెన్ను భాగాన్ని స్వల్పంగా దక్షిణం వైపుకు జరుప వచ్చును . వెన్ను భాగాన్ని మధ్యలో ఉండకుండా ఒక వైపుకు జరిపితే నిర్మాణం అసమరూపంగా (asymmetric) మారి అందంగా ఉంటుంది. అలా జరపాలంటే కేవలం దక్షిణం వైపుకు మాత్రమే జరపాలి. వెన్నును ఉత్తరం వైపుకు జరిపితే వాలుకు సంబందించిన దోషాలు కలుగుతాయి. దక్షిణం గోడను ఉత్తరం గోడ కంటే ఎత్తుగా నిర్మించడం ద్వారా కూడా అసమరూపాన్ని కలిగించి నిర్మాణాని అందంగా కనపడేలా చేయవచ్చు. ఎట్టి పరిస్థితిలో కూడా దక్షిణం గోడను ఉత్తరం గోడ కంటే పల్లంగా ఉండేలా నిర్మించకూడదు.

56

తూర్పు మరియు పడమర ఇరువైపులా వాలు ఉండేలా కప్పును నిర్మిస్తే వెన్ను భాగం సరిగ్గా మధ్యలో ఉండ వచ్చు. లేదా వెన్ను భాగాన్ని స్వల్పంగా పడమర వైపుకు జరుప వచ్చును అసమరూపం (asymmetry) కోసం వెన్ను భాగాన్ని మధ్యలో ఉండకుండా ఒక వైపుకు జరపాలంటే కేవలం పడమర వైపుకు మాత్రమే జరపాలి. అలా కాకుండా వెన్నును తూర్పు వైపుకు జరిపితే వాలుకు సంబందించిన దోషాలు కలుగుతాయి. పడమర గోడను తూర్పు గోడ కంటే ఎత్తుగా నిర్మించడం ద్వారా కూడా అసమరూపాన్ని కలిగించవచ్చు. ఎట్టి పరిస్థితిలో కూడా పడమర గోడను తూర్పు గోడ కంటే పల్లంగా ఉండేలా నిర్మించకూడదు. ఇరువైపులా వాలు కలిగిన నిర్మాణంలో విభజన చేయాలంటే వెన్నుకు అడ్డముగా గోడలు నిర్మించుకోవచ్చు. దాని వలన వాలుకు సంబంధించిన దోషము తలెత్తదు.

57

7. స్థలాన్ని ఎత్తు లేపడం

గృహ నిర్మాణంలో ఇంటియొక్క స్థలాన్ని కొందరు వీధి కంటే ఎత్తుగా మార్చితే మరికొందరు వీధి కంటే పల్లంగా మార్చి భూగృహాన్ని (cellar) నిర్మిస్తారు. గృహం నిర్మించబడే ప్రాంతం పల్లపు ప్రాంతం లేదా వరదలకు ఆస్కారం ఉన్న ప్రాంతం అయితే స్థలం యొక్క ఎత్తును పెంచి గృహ నిర్మాణము చేస్తారు. పట్టణాలలో కొందరు వాహనాల పార్కింగ్ కోసం స్థలాన్ని వీధి కంటే క్రిందకు దింపి భూగృహాన్ని నిర్మిస్తారు. స్థలాన్ని వీధి కంటే ఎత్తు లేపాలన్నా లేదా వీధి కంటే క్రిందకు దించాలన్నా కొన్ని నియమాలను పాటించాలి. తూర్పు లేదా ఉత్తరాలలో వీధి ఉన్నపుడు ఇంటి స్థలాన్ని వీధి స్థాయి కంటే కొంత ఎత్తుగా ఉంచడం మంచిది. అయితే పొరుగువారి ఇంటి స్థాయి కంటే మరీ ఎత్తుగా మార్చరాదు. దక్షిణం లేదా పడమర లో వీధి ఉన్నపుడు స్థలం యొక్క స్థాయిని వీధి స్థాయి కి సమానంగా లేదా తక్కువగా ఉంచడం ఉత్తమం. వర్షపు నీటిని మరియు వాడకపు నీటిని బయటకు పారించడానికి అవసరమైతే స్థలాన్ని స్వల్పంగా వీధి కంటే ఎత్తు చేయవచ్చును.

Car ramp : స్థలాన్ని వీధి కంటే మరీ ఎత్తుగా ఉంచడం వల్ల వాహనాల ప్రవేశానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. వాహనాల ప్రవేశానికి అనువుగా ఉండడానికి ఏటవాలుగా నిర్మించే ramp స్థలం యొక్క ఎత్తు పల్లాలు సమతుల్యతను దెబ్బతీయవచ్చును. దక్షిణం లేదా పడమర లో వీధి ఉంటే rampను స్థలం బయట ఉండేలా నిర్మిచాలి. దక్షిణంలో వీరి ఉన్నపుడు దక్షిణం లో కానీ లేక ఆగ్నేయంలో కానీ స్థలానికి లోపల ramp నిర్మిస్తే ramp నిర్మించబడిన ప్రాంతం పల్లంగా మారి దోషాన్ని కలిగిస్తుంది. అలాగే పడమరలో వీధి ఉన్నపుడు పడమరలో కానీ లేక వాయవ్యంలో కానీ స్థలానికి లోపల ramp నిర్మిస్తే ramp నిర్మించబడిన ప్రాంతం పల్లంగా మారి దోషాన్ని కలిగిస్తుంది

58a
58

8. భూగృహ నిర్మాణం

తూర్పు లేదా ఉత్తరం లో వీధి ఉన్నపుడు స్థలాన్ని వీధి కంటే క్రిందకు దించి భూగృహాన్ని నిర్మించరాదు. అలా నిర్మించడం వల్ల చెడు ఫలితాలే వస్తాయి. పడమర లేదా దక్షిణంలో వీధి ఉన్నపుడు వీధికంటే దిగువన భూగృహాన్ని నిర్మించవచ్చు. భూగృహాన్ని స్థలం యొక్క తూర్పు, ఉత్తరం మరియు ఈశాన్య భాగాలలో ఉండేలా నిర్మించాలి. అంటే భూగృహాన్ని నిర్మించినప్పటికీ స్థలం యొక్క పడమర, దక్షిణ మరియు నైరుతి భాగాలు ఎత్తుగానే ఉండాలి.

59

భూగృహం ఉన్నపుడు స్థలాన్ని కలుపుకోవడం : భూగృహం ఉన్న ఇంటికి తూర్పులో లేదా ఉత్తరం లో ఉన్న స్థలాన్ని కొని కలుపుకూడదు. అలా కలుపుకోవటం వల్ల తూర్పు ఉత్తరాలు ఎత్తుగా సూరి తీవ్రమైన దోషం ఏర్పడుతుంది.

9. చెట్లు -మొక్కలు

చెట్లు మొక్కలు ప్రకృతిలో భాగం. మనిషి మరియు ఇతర జంతు జాతులకు ప్రకృతే ఆధారం. ఇతర జీవులు ప్రకృతితో సహజీవనం చేసే మనిషి మాత్రం ప్రకృతిని నాశనం చేస్తూ బ్రతుకుతున్నాడు. జనాబా పెరుగుదల వల్ల అడవులు అంతరిచిపోయి పర్యావరణం దెబ్బతింటుంది. గ్రామాలలో కూడా పంట దిగుమతిని పెంచడానికి గట్లపై మరియు బావుల చుట్టూ వుండే చెట్లను కూడా నరికేస్తున్నారు. పొలాలలో అక్కడక్కడా సహజంగా ఉండే రాళ్ల గుట్టలను తొలగించడంతోపాటు వాటిపై ఉండే చెట్లను కూడా నరికేస్తున్నారు. పట్టణీకరణ అడవుల విస్తీర్ణము తగ్గడానికి మరోకారణం. ఎవరి ఇంటి దగ్గర వారు వీధుల వెంట చెట్లు నాటితే పర్యావరణ సమస్యకు కొంతైన పరిష్కారం దొరుకుతుంది. ఖాళీ ఇండ్ల స్థలాలు కలిగినవారు వాటిలో చెట్లను నాటితే కూడా ప్రకృతికి పర్యావరణానికి మేలు చేసిన వారవుతారు.

కొందరు మొక్కలు మరియు చెట్లను వాటిపై ఉన్న ప్రేమ వల్ల పెంచితే మరికొందరు తోటపని (gardening) పై ఆసక్తి తో పెంచుతారు. ఇంటర్నెట్ తో కూడిన మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక పెద్దలు కూడా తోటపని లాంటి ఆసక్తులను కోల్పోతున్నారు. పిల్లలకు కూడా అలాంటి విషయాల పట్ల ఆసక్తి పెంపొందడంలేదు.

ఏ మొక్కలు /చెట్లు పెంచాలి : కొంత మంది ఫలాని చెట్టు లేదా మొక్క ఇంటిలో ఉంటే అశుభం అని చెబుతుంటారు.

అది వాస్తు శాస్త్రానికి సంబంధం లేని విషయమే కాక మూఢ నమ్మకం కూడా. ధర్మం పేరుతొ ఉచిత సలహాలు ఇచ్చే రు ఎక్కువయ్యారు. అలాంటి వారు చెప్పే పిచ్చి కబుర్లలో ఇది ఒకటి. ముళ్ళు కలిగిన వృక్షాల వల్ల ఇబ్బంది పడతాం. పాలుగారే మొక్కల వల్ల అశుభ్రత కలుగుతుంది. కాబట్టి ముళ్ళు కలిగిన వృక్షాలు మరియు పాలుగారే మొక్కలను పెంచకపోవడమే మంచిది. తమ అభిరుచికి తగిన, మంచి అందాన్ని మరియు నీడను ఇచ్చే మొక్కలను పెంచవచ్చును. మామిడి మరియు జామ లాంటి పండ్లనిచే చెట్లను ఉసిరి లాంటి ఔషధ గుణాలు కలిగిన చెట్లను మరియు పూలమొక్కలను కూడా పెంచవచ్చును. వేప చెట్లు మంచి ఔషధ గుణాలు కలిగినప్పటికీ వర్షాకాలంలో పండ్లను రాల్చి ఈగలను ఆకర్షించి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అసౌకర్యాన్ని భరించటానికి సిద్దపడితే వేపచెట్లను పెంచవచ్చును. కొన్ని చెట్లు ప్రత్యేకమైన ఋతువులలో ఆకులను రాల్చుతాయి. ఆకురాలని చెట్లను పెంచితే సంవత్సరం పొడవునా నీడనిస్తాయి. టేకు మరియు ఎర్ర చందనం లాంటి చెట్లను పెంచితే నీడతో పాటు నాణ్యమైన కలపను కూడా ఇస్తాయి.

ప్రాంగణం లో మొక్కలు : ఇంటి ఆవరణలో చెట్లను నాటాలంటే దక్షిణం, పడమర మరియు నైరుతి భాగాలు అనువైనవి. పెద్ద మొక్కలను పశ్చిమ వాయవ్యం మరియు దక్షిణ ఆగ్నేయంలో పెంచవచ్చును. చిన్న చిన్న మొక్కలను ఉత్తర వాయవ్యం మరియు తూర్పు ఆగ్నేయంలో పెంచవచ్చును. తూర్పు ఉత్తరం మరియు ఈశాన్యాలను పూర్తి ఖాళీగా ఉంచుట మంచిది.

భారీ కుండీలలో పెంచే చెట్లను ఆవరణ యొక్క పడమర, దక్షిణం లేదా నైరుతి భాగంలో మాత్రమే ఉంచాలి. చిన్న కుండీలను ఆగ్నేయం మరియు వాయవ్యం లలో ఉంచవచ్చును land scaping పై అభిరుచికలవారికి ఇదే అధ్యాయము నందు వాస్తు నియమాలకు అనుగుణంగా ” landscaping ఎలా చేయాలో వివరించబడినది.

ఇంటి లోపల మొక్కలు : ఇంటిలోపల పెంచే మొక్కలను సాధారణంగా కుండీలలో పెంచుతాము. పూల కుండీలను

దక్షిణం, పడమర మరియు నైరుతిభాగాలలో ఉంచవచ్చు. చాలా చిన్న కుండీలలో పెంచే మనీ ప్లాంట్ (vanilla) లాంటి మొక్కలను ఎక్కడైనా ఉంచవచ్చు. మొక్కలను పెంచుటకు వీలుగా శాశ్వత నిర్మాణాలు చేయాలంటే కేవలం దక్షిణం, పడమర మరియు నైరుతిభాగాలలో మాత్రమే చేయాలి. చాలా మంది తూర్పు ఉత్తరం మరియు ఈశాన్యంలో ఉన్న బాల్కనీలలో స్టాండులు ఏర్పాటు చేసి లేదా చెయ్యకుండా కుండీలను ఉంచుతున్నారు. ఆ మూడు దిశలు కూడా బరువులు ఉంచకూడని దిశలని తెలుసుకోవాలి. మీ ఇంటిలో అలా పెట్టి ఉంటే వెంటనే వాటిని సరైన స్థానాలలోకి మార్చండి.

ఇంటి మిద్దె పై మొక్కలు : బయట సంతలో దొరికే కాయగూరలు మరియు ఆకుకూరలు పురుగుమందులు మరియు

రసాయనాలతో పండించేవి కావటంతో కొందరు సొంతముగా సేంద్రియ పద్ధతిలో వాటిని పండించుకోవటానికి మొగ్గుచూపుతున్నారు. దానిలో భాగంగా ఇంటి పై భాగాన్నే తోటగా మార్చుతున్నారు. కొన్ని కూరగాయల మొక్కలను పందిళ్లు వేసి మరి కొన్నిటిని పందిళ్లు వేయకుండా పెంచుతారు. మొక్కలకు కోసం వేయవలసిన పందిళ్లను కేవలం దక్షిణం,పడమర మరియు నైరుతి భాగాలలో మాత్రమే వేయాలి. మొక్కలు పెంచబడే బరువైన కుండీలను దక్షిణం ,పడమర మరియు నైరుతి భాగాలలో ఉంచాలి. చిన్నకుండీలను ఆగ్నేయం మరియు వాయవ్యాలలో ఉంచాలి. తూర్పు ఉత్తరం మరియు ఈశాన్యాలను పూర్తిగా ఖాళీగా ఉంచాలి.