banner 6 1

54

వసారాలు (పంచలు) ఫలితములు

తూర్పువసారాలు :

గృహ భవన వ్యాపార ఉత్పత్తి సంస్థలకు తూర్పు పంచలు తప్పనిసరిగా ఏర్పాటుగావించుకొనవలెను. అట్లు ఏర్పాటు గావించు కొనివ వాస్తుబలము చేకూరి సంతానములును విద్యా, వివేక, విజయ ములను, కార్యదీక్ష, కీర్తిప్రతిష్ఠలు, భోగభాగ్యములు వ్యాపారాభి వృద్ధిని కలుగ జేయును.

పంచకిందపంచ (డబుల్ వసారా) ఏర్పాటు గావించుకొనిక

ఎక్కువ శుభఫలితము కలుగజేయును,

దక్షిణపు వసారాలు :

గృహభవవ వ్యాపార ఉత్పత్తి సంస్థలకు దక్షిణపు వాలు పంచలు అనారోగ్యము, సుఖహీనత, ధనక్షయము, బలక్షయము జరుగును.

ఉత్తరపుప్రక్క ఎత్తి పెట్టి దక్షిణవువాలు పంచదించిన గృహ స్థులకు క్షయ, ఉబ్బసము, గుండెపెరుగుట, రక్తపోటు మొదలగు దీర్ఘ వ్యాధులు కలుగును. نتو

దక్షిణము డబుల్ వసారాలు నిర్శించుకొనివ గృహ భవన వ్యాపారసంసలు చేతులుమారుట, సొంతపె తనము లేక పరపెత నము కలిగి నష్టము వాటిల్లును.

విజ్ఞానశాస్త్రమును పరికించిన మానవునకు ప్రాణాధారమైన (మలయమారుతములు) గాలి నిరంతరము వీచుచుందును. దక్షిణవు పంచలు వానిని నిరోధించు. గాన అన్ని విధముల గృహస్థులకు దక్షి ణవు వాలుపంచలు శుభఫలితము తివ్వజాలవు.

పడమట వసారాలు :

గృహ భవన వ్యాపారసంస్థలకు పడమట వాలుపంచలున్న అష్టకష్టములు, అనారోగ్యము దుఃఖములుగలుగ జేయును. తూర్పుఏక ఏత్తు పెట్టి పడమటకు వాలుపంచదించిన పురుషులకు అనారోగ్యము ఆడపిల్లలకు వివాహము కాకుండుట జరుగును.

పడమట డబల్ వసారాలు నిర్మించుకొనిన ఆ గృహములు ఆడు వారి పేరనుండుట లేక భర్త చనిపోయి భార్య యుండుట, ఆడపిల్ల లు వివాహమైనను అత్తవారింటి కెళ్ళక పుట్టింటనుండుట కీర్తి నష్టము ఎంత చేసినను కలిసిరాకుండుట మొదలగు ఫలితములు కలుగును.

ఉత్పత్తి వ్యాపారసంస్థలయందు మిషన్లు విరిగిపోవుట నమ్మెలు గవర్న మెంటువారు వత్తిడులకు లోనగుట జరుగును. కాన పటమట పంచలున్న వెంటనే తొలగించవలయును.

ఉత్తరపు వసారా :

గృహభవన ఉత్పత్తివ్యాపారసంస్థలయందు ఉత్తరవు పంచలు వలన వాస్తుబలము చేకూరి ధనధాన్యాభివృద్ధి బంధువృద్ధి ఆయురా రోగ్యాభివృద్ధి సాధువర్తనము స్త్రీ. వికాసము ఆడపిల్లలు విద్యా నివేశాభివృద్ధి మొదలగు శుభఫలితములు కలుగును,

ఉత్త రమునడబల్ వసారా గావించుకొనిన ఎక్కువ వాస్తుబలము కూరి దినదినాభివృద్ధి చెందును. ఉత్పత్తి వ్యాపారసంస్థలయందు ఉత్తరపుపంచలు మంచి శుభఫలితము లిచ్చును.

పరికించిన ఉత్తరమునుండి ప్రసరించి విజ్ఞాన శాస్త్రము (మ్యాగ్నెట్ ఈవిస్) అనారోగ్యమును కలిగించు బొగ్గుపులుసు రాయువు గృహములో ప్రవేశించకుండా నిరోధించి గృహస్థులారో గ్యము కాపాడును.

ముప్పంచ ముప్పుతిప్పలు పెట్టును.

1. వరండా వాలు

వాహనాలు నిలుపు నిమిత్తము లేదా ఇతర అవసరాల నిమిత్తము వరండాను నిర్మించుకుంటాము. ఈ వరండాలను ఇంటి ఎత్తుకు సమమైన ఎత్తుతోను లేదా ఇంటి కప్పుకు దిగువను లేదా వాలుగా కూడా ఏర్పాటుచేస్తుంటారు. వరండాలను ఏర్పటుచేసేటప్పుడు ఎత్తు పల్లాలకు సంబందించిన దోషం కలుగకుండా చూడాలి. దోష పూరితమైన స్థానంలో ఉన్న వరండా చెడు నడకను (నడకల గురించి పుస్తకంలో మరో చోట వివరించబడినది ) కూడా కలిగిస్తుంది. ఆధునిక వాస్తు శాస్త్రం ప్రకారం అన్ని దిశలు వరండా ఏర్పాటుకు అనుకూలం కాదు. కొన్ని దిశలు మాత్రమే వరండా నిర్మాణానికి అనువైనవి. వరండాలను ఇంటి యొక్క మూలలో కానీ లేదా మూల నుంచి మూల వరకు మొత్తంగా గాని ఏర్పాటు చేస్తారు.

మూలలో వరండాను ఏర్పాటు చేయాలనుకుంటే కేవలం ఈశాన్యం మూలలో మాత్రమే ఏర్పాటుచేయాలి. ఈశాన్యం మూలలో ఏర్పాటుచేసిన వరండా స్తంభం తో కూడినదై ఉండాలి మరియు వరండా యొక్క కప్పు మిగతా ఇంటి కప్పులో భాగంగా కలసిపోయి ఉండాలి. ఈశాన్యంలో స్తంభం లేకుండా వరండా ఏర్పాటు చేసినా లేదా దాని కప్పు మిగతా ఇంటి కప్పు కంటే పల్లంగా ఉన్నా ఈశాన్యం కోతకు సంబందించిన దోషం ఏర్పడుతుంది.

003

ఉత్తర దిశలో పూర్తి (వాయవ్యం నుంచి ఈశాన్యం వరకు ) వరండాను నిర్మించాలంటే దాని కప్పు ఇంటి కప్పుతో సమానంగా లేదా ఇంటి కప్పుకు దిగువన లేదా వాలుగా ఉండవచ్చు.

004

కానీ తూర్పు దిశలో పూర్తి (ఆగ్నేయం నుంచి ఈశాన్యం వరకు) వరండాను నిర్మించాలంటే దాని కప్పు ఇంటి కప్పుతో సమానంగా ఉండటం మంచిది. ఆధునిక వాస్తు శాస్త్ర రచయితలు ఉత్తరంలో వలె తూర్పు లో కూడా వాలు వరండా ఏర్పాటుచేసుకోవచ్చని అభిప్రాయ పడినారు. కానీ తూర్పులో వాలు వరండా వల్ల కప్పు పైన వాయవ్యం కంటే ఆగ్నేయం పల్లం గా మారవచ్చు. దాని గురించి మరింత పరిశోధన జరిగే వరకు అలా నిర్మించకపోవడమే మంచిది.

001

ఉత్తరం లో వరండా లేకుండా దక్షిణంలోను తూర్పులో వరండా లేకుండా పడమరలోను వరండాను ఏర్పాటు చేయరాదని ఆధునిక వాస్తు శాస్త్ర నియమం. అంతే కాక ఉత్తరం లో ఉన్న వరండా దక్షిణంలో ఉన్న వరండా (కప్పు భాగం మరియు క్రింది భాగం) కంటే పల్లంగా మరియు విశాలంగా ఉండాలని తూర్పులో ఉన్న వరండా పడమర లో ఉన్న వరండా కంటే పల్లంగా మరియు విశాలంగా ఉండాలని కూడా గుర్తుంచుకోవాలి.

002

దక్షిణంలో లేదా పడమర లో ఉన్న వరండాల వల్ల చెడు నడకలు కూడా ఏర్పడవచ్చు. స్థలం దిక్కుకు లేనపుడు తూర్పు లేదా ఉత్తరంలో ఏర్పటుచేసిన వరండాల వల కూడా చెడు నడకలు ఏర్పడవచ్చును. నడకల గురించి ఒక ప్రత్యేకమైన అధ్యాయం నందు వివరించబడింది.

స్థలం విదిక్కుల్లో ఉన్నపుడు వరండా : స్థలం 22.5 డిగ్రీల కంటే ఎక్కువగా తిరిగి విదిక్కుల్లో ఉన్నపుడు ఒకే వరండాను ఏర్పాటు చేయవలసి వస్తే దానిని ఈశాన్యంలో మాత్రమే ఏర్పాటుచేయాలి. ఆగ్నేయం, వాయవ్యం మరియు ఈశాన్యాలలో వరండా లేకుండా నైరుతిలో వరండాను ఏర్పాటు చేయరాదు. నైరుతిలో ఉన్న వరండా మిగతా మూడు దిశలలో ఉన్న వరండాల కంటే వైశాల్యంలో చిన్నగా ఉండాలి. ఈశాన్యంలో ఉన్న వరండా మిగతా మూడు దిశలలో ఉన్న వరండాల కంటే వైశాల్యంలో పెద్దగా ఉండాలి.

స్థలం సరిగ్గా 45 డిగ్రీలు తిరిగి కర్ణ ప్రాచిలో ఉన్నపుడు ఆగ్నేయం మరియు వాయవ్యంలో ఉన్న వరండాలు వైశాల్యంలో సరిగ్గా సమానంగా ఉండాలి. స్థలం 22.5 డిగ్రీల కంటే ఎక్కువగా తిరిగి ఆగ్నేయ కర్ణ ప్రాచిలో ఉన్నపుడు ఆగ్నేయ దిశలో ఉన్న వరండా వాయవ్యంలో ఉన్న వరండా కంటే వైశాల్యంలో పెద్దదిగా ఉండాలి. స్థలం 22.5 డిగ్రీల కంటే ఎక్కువగా తిరిగి ఈశాన్య కర్ణ ప్రాచిలో ఉన్నపుడు వాయవ్యదిశలో ఉన్న వరండా ఆగ్నేయదిశలో ఉన్న వరండా కంటే వైశాల్యంలో పెద్దదిగా ఉండాలి. స్థలం విదిక్కుల్లో ఉన్నపుడు వరండాల వల్ల చెడు నడకలు ఏర్పడవచ్చు. వాటిని నివారించడమెలాగో ‘నడకలు’ అనబడు అధ్యాయమునందు వివరించడం జరిగింది.

2. పురాతన గ్రంథాలలో వరండా

వరండా: వరండా లేదా వసారా పురాతన గ్రంథాలలో ఆలిందముగా పిలువబడినది. ఇంటి యొక్క ముఖ భాగంలో ఉన్న వరండాను ముఖాలిందము అని అంటారు. ఇంటికి నాలుగు వైపులా వరండాలు ఉంటే దానిని పరితోలిందం అని అంటారు.

ముఖ భద్రం: వరండా ఇంటికి ఒక దిశలో మొత్తంగా కానీ, మూలలో కానీ కాకుండా మధ్యలో మాత్రమే ఉంటే అది ముఖభద్రంగా పిలువబడుతుంది. తూర్పు మరియు ఉత్తరంలో ఉన్న ముఖ భద్రం మంచి ఫలితం ఇస్తుంది. తూర్పులో ముఖ భద్రాన్ని ఏర్పాటు చేయాలంటే ఆగ్నేయం గదిని ఈశాన్యం గది కంటే స్వల్పముగా పెద్దదిగా ఉంచాలి. ఉత్తరంలో ముఖ భద్రాన్ని ఏర్పాటు చేయాలంటే వాయవ్యం గదిని ఈశాన్యం గది కంటే స్వల్పముగా పెద్దదిగా ఉంచాలి. పడమర లేదా దక్షిణంలో ఉన్న ముఖ భద్రాన్ని వీలైనంతగా చిన్నదిగా ఏర్పాటుచేయాలి.

006
005

ముఖ మండపం (పోర్టికో) : ముఖ ద్వారం ముందు ఉండు స్తంభాలతో కూడిన నిర్మాణాన్ని ముఖ మండపం అంటారు. ఆధునిక వాస్తు సలహాదారులు కేవలం ప్రధాన ద్వారం ముందు ఉన్న ముఖ మండపాన్ని అంగీకరించరు. ఉత్తరంలో ముఖ మండపం ఉంటే ఇంటికి ఉత్తరం పెరిగి ఈశాన్యం మరియు ఆగ్నేయాలు కోతకు గురవుతాయి. తూర్పులో ముఖ మండపం ఉంటే ఇంటికి తూర్పు పెరిగి ఈశాన్యం మరియు వాయవ్యాలు కోతకు గురవుతాయి.

వరండాకు పురాతన గ్రంథ కర్తలు చాలా ప్రాముఖ్యతనిచ్చారు. ఏ దిశలోనైనా బాహ్య ద్వారం ఏర్పాటు చేయాలంటే ఆ దిశలో వరండా ఉండి తీరాలని ప్రాచీన గ్రంథాలలో చెప్పబడినది. వరండా లేని గృహం అసలు గృహమే కాదని పురాతన గ్రంథ కర్తలు అభిప్రాయ పడినారు. నేడు పురాతన వాస్తు సలహాదారులుగా తమను తాము అభివర్ణించుకొనేవారు వరండా ఏర్పాటును పూర్తిగా విస్మరించారు. అదేమని ప్రశిస్తే వీలుకాదని తప్పించుకుంటున్నారు. అయితే వారు వరండా ఏర్పాటు చేయడం వల్ల మరియు చేయకపోతే కలిగే లాభ నష్టాల గురించి ఆలోచించడంలేదు. ఆధునిక వాస్తు శాస్త్రజ్ఞులు వరండాల ఏర్పాటు విషయంలో పరిశోధనలు చేసి కొన్ని నియమాలను ఏర్పాటు చేసారు. స్థలం దిక్కుకు లేనపుడు వరండాలు ఎలా ఏర్పాటుచేయాలి అన్న విషయం పై నేను కూడా పరిశోధనలు చేశాను.