మూలల మూత : ప్రహరీ నిర్మాణంలో తీసుకోవలసిన మరో జాగ్రత్త మూలలు మూతపడకుండా చూడటం. పటం లో ఎడమ వైపున ఉన్న నమూనాలో ఆగ్నేయం మూలలో కప్పుతో కూడిన గదిని నిర్మించడం వల్ల ఆగ్నేయం మూల మూత పడింది. ఆగ్నేయం మూల మూతబడటాన్ని ఆగ్నేయ దిశకు చెందిన తీవ్రమైన దోషంగా చెబుతాము. అలాగే మధ్యన ఉన్న నమూనాలో వాయవ్యం మూలలో కప్పుతో కూడిన గదిని నిర్మించడం వల్ల వాయవ్యం మూల మూల మూత పడింది. వాయవ్యం మూల మూతబడటాన్ని వాయవ్యం దిశకు చెందిన తీవ్రమైన దోషంగా చెబుతాము. కుడి వైపున ఉన్న నమూనాలో ఈశాన్యం మూలలో కప్పుతో కూడిన గదిని నిర్మించడం వల్ల ఈశాన్యం మూత పడటమే కాక స్థలం యొక్క ఈశాన్యం కోయబడినది. ఈశాన్యం మూత/ కోతలను తీవ్రమైన ఈశాన్య దోషాలు గా చెబుతాము.

కొందరు ఆగ్నేయం మూలలో మరుగుదొడ్డి లేదా పార్కింగ్ లేదా మరేదైనా అవసరాల కోసం గదిని నిర్మిస్తారు. దాని వల్ల ఆగ్నేయం మూతపడి దోషం ఏర్పడుతుంది. అలాగే వాయవ్యం లేదా ఈశాన్యం మూలలో గదిని నిర్మిస్తే మూల మూతపడి దోషం ఏర్పడుతుంది. కాబట్టి ఇంటిలో అట్టి నిర్మాణాలు ఉంటే వెంటనే వాటిని తొలగించాలి.
దిశల మూత : మూలల పైనే కాక ప్రహరీ యొక్క మధ్యభాగం పై గదులు నిర్మించినా అది మూతలకు కారణమౌతుంది. తూర్పు దిశ యొక్క హద్దుపై కప్పు తో కూడిన నిర్మాణాలు ఉంటే తూర్పు మూత దోషం గా పిలుస్తాము మరియు ఉత్తర దిశ యొక్క హద్దుపై కప్పు తో కూడిన నిర్మాణాలు ఉంటే ఉత్తరం మూత దోషం గా పిలుస్తాము.
నైరుతి మూల మూతను దక్షిణం మరియు పడమర దిశలలో హద్దుపై గదుల నిర్మాణాల వల్ల ఏర్పడే మూతలను దోషాలుగా పరిగణించము. (అయితే స్థలం బయట దక్షిణం లేదా పడమర వైపున పల్లంగా ఉన్నపుడు ఆయా హద్దులపై నిర్మాణం చేయరాదు)

హద్దుల పై ఉన్న పొరుగువారి నిర్మాణాలు కూడా ఇంటిలోని వాస్తు దోషాలకు కారణం కావచ్చు. ఉదాహరణకు ఈశాన్యంలో హద్దుపై పొరుగువారి మరుగుదొడ్డి ఉంటే అది ఈశాన్యం మూత దోషాన్నే కాక ఈశాన్యం లో మరుగుదొడ్డి ఉంటే కలిగే దోషాన్ని కూడా కలిగిస్తుంది. తూర్పు హద్దుపై ఇతరుల నిర్మాణాలు ఉంటే తూర్పు మూత దోషం మరియు ఉత్తర హద్దుపై ఇతరుల నిర్మాణాలు ఉంటే ఉత్తర మూత దోషం కలుగుతుంది.

దక్షిణ ఆగ్నేయ భాగంలో లేదా తూర్పు ఆగ్నేయ భాగంలో హద్దుపై ఇతరుల నిర్మాణాలు ఉంటే ఆగ్నేయ మూతగా భావిస్తాము. పశ్చిమ వాయవ్య భాగంలో లేదా ఉత్తర వాయవ్య భాగంలో హద్దుపై ఇతరుల నిర్మాణాలు ఉంటే వాయవ్య మూతగా భావిస్తాము.

తూర్పు భాగంలో హద్దుపై ఇతరుల నిర్మాణాలు ఉంటే తూర్పు మూత గా భావిస్తాము. ఉత్తర భాగంలో హద్దు ఇతరుల నిర్మాణాలు ఉంటే ఉత్తరం మూతగా భావిస్తాము.
ఇంటిలో భాగంగా దుకాణాలను నిర్మించడం
గృహంలో భాగంగా నిర్మించిన దుకాణాలు (shutters) కూడా మూత దోషాలకు కారణం కావచ్చు. పటం లో చూపిన నమూనా లో ఉత్తరంభాగం లోని రెండు గదులకు shutters ఏర్పాటు చేయడం ద్వారా దుకాణాలు నిర్మించబడినవి. ప్రహరీని గమనిస్తే వాయవ్య భాగం మరియు ఉత్తర భాగాలలో ప్రహరీని నిర్మించకపోవడం వల్ల నిర్మాణమే హద్దుగా మారి ఉత్తరం మరియు వాయవ్యం లో ఖాళీ స్థలం లోపించి మూత దోషం ఏర్పడినది. అంతే కాక ఉత్తరభాగం లోపలికి నొక్కబడడం వల్ల ఉత్తరం కోతకు గురై మరో తీవ్ర దోషం కూడా కలిగింది.

అలాగే క్రింది పటం లో చూపిన మరో నమూనా లో తూర్పు భాగం లోని రెండు గదులకు shutters ఏర్పాటు చేయడం ద్వారా దుకాణాలు నిర్మించబడినవి. ఆగ్నేయ భాగం మరియు తూర్పు భాగాలలో ప్రహరీని నిర్మించకపోవడం వల్ల నిర్మాణమే హద్దుగా మారి తూర్పు మరియు ఆగ్నేయంలో ఖాళీ స్థలం లోపించి మూత దోషం ఏర్పడినది. అంతే కాక తూర్పు భాగం లోపలికి నొక్కబడడం వల్ల తూర్పు కోతకు గురై మరో తీవ్ర దోషం కూడా కలిగింది

కొత్తరకం మూలల మూత
ప్రధాన గృహం మరియు ఉపగృహం రెండు కూడా దక్షిణ హద్దుపై నిర్మించినపుడు ఉపగృహం దక్షిణ భాగాన్ని దాటి ఆగ్నేయ భాగమును ఆక్రమించరాదు. ఎందుకంటే దక్షిణ ఆగ్నేయ భాగంలో హద్దు పైనున్న ఉపగృహం కూడా ఆగ్నేయం మూతకు కారణమౌతుంది. ఇల్లు దక్షిణం హద్దుపై లేకున్నను ఉపగృహం పారు తప్పి దక్షిణ ఆగ్నేయు భాగంలో హద్దు పై ఉంటే కూడా ఆగ్నేయం మూత దోషం కలుగుతుంది. ఎనిమిది భాగాల పద్ధతిననుసరించి ఆగ్నేయం మూల నుంచి రెండు భాగాలలో దక్షిణ హద్దుపై నిర్మాణాలు ఉంటే వాటిని తొలగించాలి.

అలాగే ప్రధాన గృహం మరియు ఉపగృహం రెండు కూడా పడమర హద్దుపై నిర్మించినపుడు ఉపగృహం పడమర భాగాన్ని దాటి వాయవ్య భాగమును ఆక్రమించరాదు. ఎందుకంటే పశ్చిమ వాయవ్య భాగంలో హద్దు పైనున్న ఉపగృహం కూడా వాయవ్యం మూతకు కారణమౌతుంది. ఇల్లు పడమర హద్దుపై లేకున్నను ఉపగృహం పారు తప్పి పశ్చిమ వాయవ్య భాగంలో హద్దు పై ఉంటే కూడా వాయవ్యం మూత దోషం కలుగుతుంది. వాయవ్యం మూల నుంచి రెండు భాగాలలో పడమర హద్దుపై నిర్మాణాలు ఉంటే వాటిని తొలగించాలి.

దక్షిణంగా భావించి ఆగ్నేయాన్ని మూయకుండుట : దిశతో పాటు దశ అన్న నియమం మూతలు వేయకూడని స్థానాలకు కూడా వర్తిస్తుంది. ప్రధాన గృహం దక్షిణ హద్దుపై ఉండి స్థలం 10 డిగ్రీలు తిరిగి ఈశాన్య ప్రాచిలో ఉన్నపుడు దక్షిణ ఆగ్నేయం లో మూడు భాగాలను (ఎనిమిది భాగాల పద్దతి వదలి ఉపగృహాన్ని దక్షిణ హద్దు పై నిర్మించవచ్చును. స్థలం 20 డిగ్రీలు తిరిగి ఈశాన్య ప్రాచిలో ఉన్నపుడు దక్షిణ ఆగ్నేయంలో నాలుగు భాగాలను వదలి ఉపగృహాన్ని దక్షిణ హద్దు పై నిర్మించవచ్చును.
పశ్చిమంగా భావించి వాయవ్యాన్ని మూయకుండుట: ప్రధాన గృహం పశ్చిమ హద్దుపై ఉండి స్థలం 10 డిగ్రీలు తిరిగి ఆగ్నేయ ప్రాచిలో ఉన్నపుడు పశ్చిమ వాయవ్యం లో మూడు భాగాలను వదలి ఉపగృహాన్ని పశ్చిమ హద్దు పై నిర్మించవచ్చును. స్థలం 20 డిగ్రీలు తిరిగి ఆగ్నేయ ప్రాచిలో ఉన్నపుడు పశ్చిమ వాయవ్యం లో నాలుగు భాగాలను వదలి ఉపగృహాన్ని పశ్చిమ హద్దు పై నిర్మించవచ్చును. దిక్సాధన ద్వారా దిశల యొక్క స్థానాలు ఎలా మారుతాయో తెలుసుకుంటే స్థలం తిరిగి ఉన్నపుడు మూతల దోషాలు ఏర్పడకుండా చూడవచ్చు.
విదిక్కుల స్థలంలో మూలల మూత
స్థలం సరిగ్గా 45 డిగ్రీలు తిరిగి విదిక్కులలో ఉన్నపుడు దిశలు మూలాలలోను విదిశలు మధ్యలోను ఉంటాయి. కాబట్టి మూత వేయకూడని స్థానాలు కూడా అలాగే ఉంటాయి. స్థలం సరిగ్గా 45 డిగ్రీలు తిరగకుండా పాక్షికంగా విదిక్కులలో (ఉదా : 30 డిగ్రీలు) ఉన్నపుడు దానికి అనుగుణంగానే మూత వేయకూడని స్థానాలు మారుతాయని
తెలుకోవాలి. దిక్సాధన ద్వారా మూత వేయకూడని స్థానాలని గుర్తించవచ్చు. తూర్పు ఉత్తరం వాయవ్యం ఆగ్నేడు. మరియు ఈశాన్య భాగాలు స్థలం లో ఎక్కడ ఉంటాయో దిక్పాధన ద్వారా గుర్తించి ఆ భాగాలు మూత పడుకుంది చూడాలి.


