banner 6 1

56

వైకుంఠపుర వాస్తు ప్రాభవము:

63

శ్రీమన్నా రాయణుని నివాసమును భక్తపోతనగారు “ఆంధ్ర మహాభాగవతమున గజేంద్రమోక్షములో” వివరించినారు.

పాల సముద్రమునందలి త్రికూట పర్వతారణ్యమునందు మహా బలవంతుడైన గజేంద్రుడు పెక్కేనుంగులకు రాజై యుండి ఒక నాడు ఆ చెంతనే ఉన్న సరస్సులో నీరుత్రాగుటకై గజేంద్ర బృంద సహితముగా విచ్చేసి కొలనిలో ప్రవేశించి నీరుత్రాగుచుండగా ఆ కొలనిలో నివాసమున్న మకరేంద్రుడు ఒడిసిపట్టగా గజేంద్రమకరములకుయుద్దము జరిగెను. గజేంద్రుడు తన బలమును కోల్పోయి భగ వంతుడైన శ్రీమన్నారాయణుని పాహి పాహి అని వేడుకొనెను. అప్పుడు దయార్ద్రహృదయుడు అయిన శ్రీమన్నారాయణుడు. గజేంద్రునికాపాడుటకు విచ్చేయునపుడు శ్రీమన్నా రాయణుని సౌధముయొక్క వాస్తుప్రభావము పోతనగారిట్లు తెలిపినారు.

సుప్రసిద్ధమగు వైకుంఠ పుర నగరమున రాజ గృహావరణ మందు నైరృతిదిశ మేడ కలదనియు దానికి ఉత్తరం నందు మందార వనంబు గలదనియును ఆ వర్షమునకు తూర్పు భాగమున అమృత సరస్సు కలదనియును ఆ సరస్సునకు దక్షిణపు టొడ్డున చంద్రకాంత శిలావేదిక పై నున్న కలువల పాన్పుపై రమా వినోదియై దీనజన ప్రసన్నుడయిన శ్రీమహావిష్ణువు ఉన్నట్లు విశదమగుచున్నది.

యుగయుగంబుల నుండి వాస్తు ప్రాముఖ్యము:

యుగారంభమునుండి దేవతలు మానవులు వాస్తుశాస్త్ర పద్ధ తులు అవలంబించినట్లు విశదమవుచున్నది. కృతయుగమున శ్రీమన్నా రాయణుని నివాసము త్రేతాయుగమువ కుబేరుడు, రావణుడు, రాముడు మొదలగు వారి నివాసములుసు, ద్వాపరయుగమున – శ్రీకృష్ణ కౌరవ పాండవ జరాసంధాదిచక్రవర్తి ప్రముఖులై నవారి నివాసములును, కలియుగమున అశోకుడు, యుగకరయైన క్రీస్తు ప్రభువు, భోజుడు శ్రీకృష్ణ దేవరాయలు మొదలగువారి నివాసము వాస్తుశాస్త్రానుసారియైన పద్ధతులతో నిర్మింపబడి శ్రేయోదాయకములై విరాజిల్లి నట్లు విశదమగుచున్నది.

వైకుంఠధామము వాస్తు వైభవము:

త్రేతాయుగమున శ్రీరామావతారము విరమించి, శ్రీమన్నారాయణుడు వైకుంఠధాముడైనప్పటి వైకుంఠ పురమునందలి వాస్తు విధానమును శ్రీకంకంటి పాపరాజుగారుతమ ఉత్తరరామాయణము సందిట్లు తెల్పినారు.

శ్రీ వైకుంఠుడు ప్రవేశించు వైకుంఠపురమునకు తూర్పు భాగమున స్వర్గపాలుడగు దేవేంద్రుని రాజధానియైన అమరావతీ పురమును, ఆగ్నేయభాగమున సర్వలోక పావనుడయిన అగ్ని దేవుని తేజోవతీపురమును, దక్షిణ భాగమున నరకపాలక డగు యమ ధర్మరాజుయొక్క సంయమునీ పురమును, నైరృతిభాగమున మృత్యు దేవతయగు నిరృతి యొక్క రమ్ సతీ పురమును, పశ్చిమభాగమున ప్రకృతినియమమును ప్రవర్తింప జేయు వరుణుని సింధుమతీ పురమును, వాయవ్య భాగము సజగత్ ప్రాణుడైన వాయు దేవుని గంధ నతీ పురమును, ఉతరభాగమున ధనాధిపతియైన కుబేరునిరాజధాని అలకాపురమును, ఈశాన్యభాగ మున మహాదేవుడైన పరమేశ్వ రుని వాసమైన కైలాసమును కలిగియున్నది. వీని మధ్యమభాగమందు. నుండుటవలన వాస్తు ప్రాధాన్యము కలిగిన ఎత్తైన ప్రదేశముగల వైకుంఠపురము విశాలమైన వీధులు ఎత్తైన గోపురములుగల హర్మ్య ములతో రమణీయమైన ఉద్యానవనములతో విలసిల్లుచున్నది. ఆ పురమధ్య భాగమున భగవంతుని ప్రాసాదము నాలుగుప్రక్కలవీధులుగలిగి చక్కని ప్రాకారములుగలిగి, శాస్త్రబద్ధములగు గోపు రములుకలిగి, ఎటుచూచినను 24 ద్వారములు 12 అంత స్తులు కలిగి పరమైశ్వర్యమొసంగు తూర్పు సింహద్వారముకలిగి, గోపురముల పై నవగ్రహములకు అనుగ్రహముకలిగించు నవరత్నములు పొదగబడి, స్ఫటికమయమై బంగారు తోరణములుగలిగి అనంతశోభతో విరజిల్లుతున్న ప్రాసాదమున వైకుంఠస్వామి ప్రవేశించినట్లు మహాకవి. కంకంటి పాపరాజుగారు తెలిపినారు.

విజ్ఞులగు చదువరులారా ఆ వైశుంఠ రాజు ప్రాసాదమునందు వాస్తు కళాప్రశస్తి పరిశీలించినచో, పరమైశ్వర్యమొసంగు పరమే శ్వర స్థానమున గంగాదేవి నిరంతరము ఉద్భవించి ప్రవహించుచు, వాస్తు పురుషునకు సంతృప్తిని గలిగి చుచున్నది. తూర్పుభాగమువ శుభప్రదాయినియైన స్వర్గము ఉండి తూర్పుదిశ పల్లముగనుండి వాస్తుశాస్త్ర బద్ధతగలిగియుండి, విశేషశుభఫలితములు చున్నవి. అగ్నేయభాగము నిరంతరము పవిత్రముచేయు అగ్ని హోత్రుని నివాసము, దక్షిణభాగమున చీకటితో ఖాలీ లేకుండ మూయబడిన సరకము వాసువునకు బలము కూర్చుచున్నది. కలుగు నైరృతిభాగమున ఉన్నతమగు రథోవతీపురము వాస్తుబల వేజోయతమై నెలయుచున్నది. వాయవ్య భాగము సమానము నుండి వాస్తవిక ప్రశాంతగకలిగించుచున్నది. లక్ష్మీప్రదమైన ఉత్తరస్థాన మంతయు పల్లముగానుండి ధనేశ్వరుని భవనము వాసుకో భనుకలిగి యుండి ఆరాజ ప్రాసాదమున ఉత్తరమున ఉద్యానవనము పచ్చిక బయిళ్ళు మధ్యభాగమున సభామండపము కలిగి ఆవైకుంఠ పురము శ్రీమన్నారాయణునికి నివాసమై, వాస్తుపురుషులకు అష్టదిక్పాలకులు పంచభూతములు నవగ్రహములు పరస్పరము ఒనగూడి, ఆదేవునకు ఆర్తలోక రక్షణ శరణా దాక్షిణ్యమును కలిగించి, ప్రశస్తి నావ హింపజేయుచున్నది.