banner 6 1

57

రావణబ్రహ్మ రాజప్రాసాద ప్రాభవము – హనుమంతుని వాస్తుప్రజ్ఞ.

వులస్తబ్రహ్మ మనుమడు అయిన దశగ్రీవుడు బ్రహ్మ దేవుని గుఱించి ఘోర తపస్సు ఒనరించి పలువిధంబులయిన వరంబులను బడసి మహాబలవంతుడై దేవతలమీదకు దండెత్తి వారందరినీ జయించి పాఱద్రోలెను. పిదప బ్రహ్మదేవుని సందర్శించగా పితా మహుడు సమస్త సౌఖ్యంబులకు గృహము, గృహిణియు మూలము. కావున సత్వరమే గృహనిర్మాణమును కావింపచేసి, పరిణయమాడి సత్సంతానము బడసి, కీర్తిప్రతిష్ఠలను ఆర్జించవలసినదిగా రావణాసురునకు ఉపదేశించెను. దశకంఠుడు గృహనిర్మాణ విషయమై ఆలోచించుచుండగా బ్రహ్మ మానసపుత్రుడు అగు నారదమహర్షి అక్కడకు విచ్చేసెను. త్రిలోక సంచారియైన నారద మహర్షినిగాంచి “తాతా! నాకు మంచి గృహము కావలయును. గృహనిర్మాణము చేయుటకు ఏది అనుకూలమగు ప్రదేశమో” తెలుపుమనెను. వాస్తు శాస్త్ర ప్రవీణుడయిన నారద మహర్షి “రావణా! వేరే గృహనిర్మా ణమునకై యాలోచనలేల ? మీ నివాసము పూర్వులనుండి సమస్త వైభవములతో తులతూగుచున్న లంకానగరమే, నీకు అన్ని విధముల నివాసమునకు తగినదైయున్నది. ప్రస్తుతము ఆ నగరము కుబేరుని స్వాధీనములో ఉన్నదని తెలిపెను. విధాత హితోక్తి అనుసరించి రావణుడు కుబేరుని వద్దకు లంకానగరము తననశము చేయవలసినదని దూతను పంపెను. కుబేరుడు అందుకు అంగీకరించనందు వారిరువురకు యుద్ధము జరిగెను. అప్పుడు తండ్రి అయిన విశ్రవసుడు అచ్చటికి వేంచేసి కుబేరునితో “లంకాసగరమును వదలి కుబేరుని కైలాసమునందలి అలకా నగరమునకు తరలి వెళ్ళవలసినదిగా సలాహాయిచ్చెను. అంతట గుణశాలి అయిన కుబేరుడు కైలాసమున గల అలకా నగరమునకు తరలి వెళ్ళెను. అనంతరము రావణుడు విజయోత్సాహములో చతురంగ బలసమన్వితుడై ఒక శుభలగ్నమున లంకాపురియందలి రాజగృహమున ప్రవేశించెను, ఆ రాజ ప్రాసాదమునకు నాలుగు దిశలా వీధులు కలిగి తొమ్మిది అంతస్తులతో సభామండపములు కలిగి వజ్రవైదూర్య మాణిక్య ములు పొదుగబడి ఉ త్తర సింహద్వారము కలిగి ఉత్తరంన ఉద్యానవనము ఈశాన్య భాగమున సరోవరము కలిగి ఉండెను. ఆ భవనమును ప్రవేశించిన అనంతరము లంకాధీశునకు మయబ్రహ్మ తన కుమార్తె మందోదరినిచ్చి పరిణయము గావించెను. అంతట లంకేశుడు ఆ భవనమునందు నివసించుచు అప్లైశ్వర్య భోగియై పరిపాలన దక్షుడై మందోదరిని గూడి లోకోత్తరులైన కుమారద్వయమును బడసి మహోన్నతుడయ్యెను.

లంకాధీశుడు దిగ్విజయ కాంక్షా ప్రేరితుడై యమధర్మరాజు పై దండెత్తెను. యమునిచేత పరాజితుడై బందీకృతుడయ్యెను. ఆ విషయము నెఱిగిన పితామహుడు దశకంఠుని మన్నించి వదలవలసినదిగా సలాహా ఇచ్చెను. అంతట యమరాజు లంకేశుని వదలి పెట్టెను. రావణుడు అంతటితో ఆగక పాతాళమునందలి బలి చక్రవర్తి మీది కిని, కార్తవీర్యార్జునుని మీదికిని దండెత్తిపోయి వారిచేత పరాజితుడయ్యెను. అంతట ఈ అపజయ పరంపరను గూర్చి యోచింపసాగి నారదమహర్షితో ఆలోచించి సకలశాస్త్ర పారంగతుడయిన రావణ బ్రహ్మ తమ పూర్వులనుండియు అపజయమునకు కారణమయిన ఆ లంకాపురి రాజభవనమును పునర్నిర్మాణము గావింపదలచి వాస్తు శాస్త్ర ప్రవీణుడయిన మయబ్రహ్మను రావించి నూతనముగా రాజ ప్రాసాదమునకు ఎటు చూచినను పదునాఱు ద్వారములుందునటును తొమ్మిది అంతస్థులును, ఆయుర్భాగ్యము నొసంగు నైరృతి మెట్లు లక్ష్మీప్రదమైన ఉత్తరమున మనోహరమయిన ఉద్యానవనము పూరాయుస్సునొసంగు ఈశాన్యమున బ్రహ్మాండమయిన సరస్సును దక్షిణ నైరృతీ పడమర శత్రువులకు అభేద్యమయిన ఎ త్తైన దుర్గము లును దాతృత్వ పౌరుష ప్రతాపముల నొసంగు దక్షిణ సింహాద్వార మును విశ్వకర్మచే పునర్నిర్మాణము గావింప జేసిరి. అట్టి భవనమున వాస్తు పురుషుడు నివసింపగా అష్టదిక్పాలకులు పంచభూతములు నవగ్రహములు ఒనగూడి సకల సంపదలతో అలరారుచు అరివీర భయంకరుడై నిత్యదానవ్రతుడై నిరంతర శివార్చనపరుడై నిష్ణా గరిష్టుడై మాతృ సేవాతత్పరుడై నిఖిల రాజన్యుడై విరాజిల్లుచు, అనేక సహస్ర సంవత్సరములు పరిపాలన సాగించెను. కాలక్రమ మున లంకా ధీశుని రాజప్రాసాదమున ఉ త్తర ఉద్యానవనము విస్తారముగా ఎత్తు పెరిగి, ఉత్తర స్థానమంతయు కీకారణ్యమై బలము అగుట వలన ఉత్తర స్థానము వాస్తుశాస్త్రమున స్త్రీదగుట వలన (స్త్రీ) మూలమున (చెల్లెలు శూర్పణఖ) వివాదమేర్పడి అయోధ్యా ధీశుడై న శ్రీ రామచంద్రుని భార్య అతిలోక సౌందర్యవతియైన సీతా దేవిని అరణ్యవాసమున ఉండగా మాయా వేషధారియై తీసికొని వచ్చి అశోకవనమున బంధించెను. అంతట సీతాన్వేషణార్థమై శ్రీరామచంద్రుని దూత పవన పుత్రుడు లంకానగరము ప్రవేశించి, అశోకవనమున బందీ గావింపబడిన సీతాదేవిని ఎఱింగి ఆంజనేయుడు రామదూతగా తన రాకను మహా సాధ్వి సీతాదేవికి తెలిపి తన భుజ స్కంధములపై అధిరోహించిన, శతయోజనమయిన సముద్రమును దాటించి, శ్రీరాములవారి సన్నిధికి చేర్చెదను అని ఓదార్చి తెలిపెను అందులకు సీతాదేవి ఇష్టపడక తన మనోహరుడయిన శ్రీ రాముడు స్వయముగా విచ్చేసి రావాణాసురుని సంహరించి తన్ను తీసికొని వెళ్ళ వలసినదిగా సవినయముగా తెలిపెను. అంతట నిజభ కియుతుడయిన ఆంజవేయుడు రావణాసురుని సంహరించుట గుఱించి ఆలోచించు చుండగా దశకంఠుడు నివాసమున్న రాజభవనము వాస్తు ప్రాబల్య ముతో విరాజిల్లుట చూచిసర్వశాస్త్ర పారంగతుడు వాస్తుమర్మమును ఎఱింగిన ప్రజ్ఞాశాలియైన పవన పుత్రుడు ఈశాన్యభాగముననున్న సరోవరమును ముందుగా పూడ్చవలెనని తలంచి ఉత్తర వాయస్య మున ఉన్న ఉద్యానవనమును తన వాలంబున వృక్షజాలమును పెక లించి ఈశాన్యమున ఉన్న సరోవరమున పడవై చెను. అట్లు పడ వైచిన వెంటనే ఈశాన్యభాగము ఎత్తగుటయును వాయవ్య భాగము పల్లమగుటయు తటస్థించెను. వాయవ్య భాగమున నీరు నిండియండుట వలన లంకేశుని మనసు వ్యాకులత చెంది హనుమంతుని కోట లోనికి రావించి పరాభవించి తోకకు నిప్పంటించవలసినదిగా అజ్ఞపించెను.

అంతట సూర్య శిష్యుడు వాస్తుశాస్త్ర రహస్య మెఱిగిన గుణశాలి అంజనేయుడు లంకాధీశుని సౌధమున గల దక్షిణ సింహద్వారమును పడమర భాగమున గల శత్రు ఆగమద్వారము లను తగులబెట్టి వాయువేగమున కిష్కింధ కరిగెను. అమితోత్సాహముతో కిష్కింధ ప్రవేసించిన పవనపుత్రుడు లంకానగర వైభవమును లంకేశుని ప్రజ్ఞా పాఠపమును, మరియు సీతాదేవిని శాంతియును సుగ్రీవుల చెంతనున్న శ్రీ రామచంద్రునకు ఇట్లు వివరించెను. సీతమ్మ తల్లి తనమనోహరుడైన శ్రీరామచంద్రుడు స్వయముగా విచ్చేసి రావణాసురుని సంహరించి తన్ను తీసుకొని వెళ్ళవలెనని కోరినదియును, అంతట వాస్తుశాస్త్ర ప్రభావిత ప్రభావమున నూటికి నూరుభాగములు అనుకూలముగానున్న రాజప్రాసాదమును నివాసమున్న రావణబ్రహ్మను సంహరించుట కష్టమనితలంచి ఆలోచించి ముందుగా ఈశాన్య భాగమునగల సరోవరమును వాయవ్యమూలనున్న వృక్షజాలమును తనవాలముతో పెకలించి పూడ్చితిననియును తదుపరి తన వాలంబునకు నిప్పంటించిరనియును, అట్లంటించగా శత్రువులకు అభేద్యమైన దక్షిణ సింహద్వారమును, వాస్తు విఘ్నమగు విధముగా లంకానగరమును దహన మొనర్చితిన నియు లంకేశుని సంహరించుటకు తగిన సమయమని తెలిపి, రామ లక్ష్మణ సుగ్రీవులు, జాంబదాంగద ప్రముఖ వానర సైన్యమును తోడ్కొని శతయోజనమయిన సముద్రమునకు వారధి నిర్మించిలంకా నగరమున ప్రవేశించి రావణాసురుని జయించుటకుగాను లంకాపురికి పశ్చిమ నైరృతి భాగమున శిబిరములు ఏర్పాటు చేసికొని, రావణాసు రుని సంహరించి మహాపతివ్రత సీతాసాధ్విని తీసికొనివచ్చిరి. కాన ఎంతటి మహానీయులైనను, వాస్తుశాస్త్ర పద్ధతుల ఆచరించినట్లు విశదమగుచున్నది.

అందువలన మనము గూడ ప్రజ్ఞాశాలియైన ఆ పవనపుత్రుని వలెనే వాస్తుప్రాశస్త్యమును గమినించి సుఖములను బడయనగును.