banner 6 1

58

వాసుదేవుని వాస్తుశాస్త్ర ప్రావీణ్యము:

* శ్రీకృష్ణ పరమాత్ముదు ద్వాపర యుగమున కంస వధానంతరము మధురానగరమున ఉండెను. అంత కంసధ్వంసిపై మగధ రాజ్యాధిపతి జరాసంధ చక్ర వర్తి పలుసార్లు యుద్దమునకు తలపడెను. వాను దేవుడు కడుచాక చక్యముగ యుద్ధముల నుండి తప్పు కొనెను. అట్లుండగ మ్లేచ్ఛ దేశాధిపతి, బలగర్వితుడు కాలయవనుడు శ్రీకృష్ణ మూర్తికొఱకై మధుర పై దండెత్తెను. ఆ విషయము నెఱింగిన సందనందనుడు మధురా నగరము నుండి శత్రురాజులతో యుద్ధమునకు తలపడిన అపజయము కలుగుసని బలరామునితో ఆలోచించి, వాస్తుశాస్త్ర మర్మమెఱింగిన వాసు దేవుడు శత్రువులకు దుర్భేద్యమయినదుర్గములు నిర్మాణముగావించి, అందు ప్రవేశించికాని శత్రుచ్ఛేదనము కావించదగదని తలంచి, సముద్రరాజునడిగి సముద్రమధ్యమునగల సమచతుభ్రమైన 12 యోజన ముల దుర్గప్రదేశమును పొంది, వాస్తుశాస్త్ర ప్రవీణుడయిన కర్మనురావించి, భయంకరశత్రువుల చ్ఛేదనముకొఱకు ఈ ప్రదేశము అనువుగానున్నది. మీరుదయయుంచి, త్వరితగతితో నగర భవన నిర్మాణమునకు ఉపక్రమించి నిర్మాణము కావించవలసినదని కోరెను. అంతట విశ్వకర్మ తనవాస్తు శామ్ర నైపుణ్యముమాని, ద్వారకానగర నిర్మాణము గావింపజేసెను. ఆ రాజా అంతపుర భవనమునకు నాలుగుదిశల వీధులు కలిగి, నాలుగు అంతర్భవనములు, అయిదు అంతస్తులుకలిగి ఎటుమాచినను 12 ద్వారములు ఉండునట్లును పరమైశ్వర్యము నిచ్చు పూర్వ సింహద్వారమును, పూర్ణాయువు భాగ్యమునిచ్చు, నైరుతి భాగమునమెట్లు, లక్ష్మీ ప్రదమయిన – ఉత్తరమున మనోహర ఉద్యానవసము, అధైశ్వర్యములనిచ్చు ఈశాన్యమున సరస్సు, దక్షిణ నైరృతి పశ్చిమదిశల ఎత్తైనగోపురములు వజ్రవైదూర్య మాణిక్యములు పొదుగబడి పౌరుషప్రతాపములకును శత్రుచ్ఛేదనమునకు కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించుటకు వాస్తు పితామహుకు వాస్తుశాస్త్ర ప్రావీణ్యుడు అయిన విశ్వకర్మచే నిర్మితమైన ద్వారకా నగరమునగల ప్రాసాదమున శుభలగ్నమున మధురాపుర ప్రజలతో పురుషోత్తముడు ద్వారకా నగరమున ప్రవేశించెను.

జనార్దనుడు ద్వారకానగర అంతః పురమున ప్రవేశింపగా వాస్తుపురుషుడు పంచభూతములు అష్టదిక్పాలకులు, నవగ్రహములు పరస్పరము సహకరించగా అష్టైశ్వర్యభోగియై సకలసంపదలతో తుల తూగుచు పరిపాలనాదక్షుడై శత్రుచ్ఛేదనమునకు ఉపక్రమించదలచి కాలయవనుని కొరకు నిరాయుధుడై యవని నగరమునకు వెళ్ళెను. నిరాయుధుడై వచ్చుచున్న గోపాలుని చూచి కాలయవనుడు తన చేత చిక్కెవని సంతసించి కృష్ణుని వెంటబడెను. భగవంతునిదగ్గర కాలయ వనుడు వరములు పొంది యుండుట చేతను కృష్ణుడు కాలయవనుని సంహ రించుటకు వీలులేక మాయోపాయమున మాంధాత కుమారుడు ముచుకుందుడు నిద్రించుచున్న గుహలోనికి తీసికొనివెళ్ళి ముచుకుందుని దృష్టివలన కాలయవనుడు దగ్ధమానట్లు కావించెను, ఆ నగరమున నివాసముండి రుక్మిణిదేవిని పరిణయ మాడగోరి రుక్మిణి స్వయంవరమునకు ఏతెంచి శత్రురాజులు చూచుచుండగా రుక్మిణీదేవిని తోడ్కోని వచ్చి ద్వారకానగరమున పరిణయమాడి భోగ భాగ్యంములును, సుఖసంతోషములును పొందెను. అనంతరము లోకా వాద నివారణ నిమిత్తము శమంతకమణి అన్వేషణార్థమై జాంబవంతు నితో యుద్ధమునకు తలపడి రామావతారమున జాంబవంతునికిచ్చిన మాట చొప్పున జాంబవంతుని జయించి, జాంబవతిని పరిణయమాడి శమంతకమణిని సత్రాజిత్తుదగ్గరకు పంపి సుదర్శనుడు లోకాపవాదును నివృత్తి చేసికొనెను; అటుపిమ్మట సత్రాజిత్తు తనతప్పును మన్నించ వలసినదిగా కోరి సత్యభామనిచ్చి పరిణయము గావించెను. సత్యభామ వివాహానంతరము బలపరాక్రమోపేతుడైన నరకాసురుని సంహరించి శత్రువులపాలిట అరివీర భయంకరరుడై, అప్లైశ్వర్యభోగియై సుఖ సంతోషములతో ద్వారకానగర రాజాంతఃపుర భవనమునయుండెను,

ఆ ద్వారకావాసి తమ అంతర్గత ప్రాణమిత్రులైన పాండవులకు భాగలబ్ధమైవచ్చిన ఇంద్రప్రస్తవురమున రాజ ప్రాసాదములు నిర్మా ణముకొరకు విశ్వకర్మను రావించి తాను స్వయముగా కొలతల పరిమాణమిచ్చిన, అందులకు విశ్వకర్మ ఈ విధమైన సిద్దాంతీకర విధానమున నిర్మాణముగావించిన పరస్పరవివాదములు రాగలప్రమాదము పొడమాపగలదని తెలిపినారు. అందులకు జగన్నాటక సూత్రధారి ఒకింతనవ్వి అయినను ప్రమాదము లేదు అందులకొరకే ఏర్పాటుగావించుచున్నాను. అని చెప్పి నిర్మాణ కార్యక్రమము నిర్వ ర్తింపజేసి పాండు కుమారులతో ఇంద్రప్రస్త పురమునగల రాజ ప్రాసాదమున ఒక శుభలగ్నమున రాజ్యప్రవేశము గావించి రాజ్యవి స్తరణ గావించవలెనని తలంచి ధర్మరాజుచే రాజసూయయాగము చేయింపదలచెను.

ముందుగా బలగర్వితుడైన జరాసంధుని సంహరించవ లెనని ఆలోచించి భీమార్జునులను వెంటబెట్టుకొని మగధ రాజధాని గిరి ప్రజము చేరి వాస్తు శాస్త్ర మర్మమెఱిగిన వాసుదేవుడు ముందుగాఆ పట్టణమునకు నైరృతి మూలగల చైత్రగిరి శృంగమును కూల్చి వేయటానికి ఏర్పాటు గావించి, తదుపరి “పట్టణ ప్రాకారము పై యాంత్రిక ఏర్పాటువలన శత్రువులు పట్టణములో ప్రవేశింపగానే వాటంతట అవే అద్భుతముగా మ్రోగు భేరీ వాద్యములను” ఉపాయ ముగా ధ్వంసము కావించి జరాసంధుని రాజ ప్రాసాదమున గల అభేద్యమైన సింహ ద్వారము గుండా ప్రవేశించ కుండా దొడ్డి గుమ్మము నుండి బ్రాహ్మణవేనమున శ్రీకృష్ణ భీమా ర్ణములు శత్రువుల యింట ముందుగా వామపాదముంచి ప్రవేశించిరి. అట్లు వచ్చుచున్న వారిని చూచి నిత్యదానవ్రతుడు అయిన జరాసంధ చక్రవర్తి మీరుచూడ తేజస్వంతులునలె కనిపించుచున్నారు. ఎదుట వాకిటగుండా రాకుండా దొడ్డివాకిటగుండా ప్రవేశింప కారణముఏమి అని అడిగినాడు అందుకు వాస్తు చాతుర్యాధిపతి “ఎదుట వాకిట మిత్రులు దొడ్డివాకిట శత్రువులు ప్రవేశించుట పరిపాటి!” మేము రణా ర్థులము మేము మీతోరణమునకు నియ్యకొంటిమని తెలిపి యుద్ధమునకు ఆహ్వానించి భక్తవత్సలుడు బలవంతుడైన శత్రువును వాస్తుశాస్త్ర మర్మము ఉపయోగించి భీమునిచే ద్వంద్వయుద్దమున హతమార్పించి నాడు. తదుపరి మగధరాజ్యాధిపతి నిర్యాణానంతరము ధర్మరాజుచే రాజసూయయాగము నిరాటంకముగాజరిపించి రాజసూయయాగమున మయునిచే నిర్మింపబడిన మయసభా భవనము మధ్యమున నీరుండువిధముగా ఏర్పాటుగావించినాడు. వాస్తు శాస్త్రమున “మధ్యప్లవమువంశక్షయము” అట్టి మయసభా భవనమున రాజసూయార్ధమై విచ్చేసిన సుయోధన చక్రవరి మయసభలోని నీటిమడుగున కాలు ఇడుటయును అందువివాదమేర్పడి కాలాంతరమున వంశక్షయము ఏర్పడువిధముగా జగన్నాటక సూత్రధారి ఏర్పాటు గావించినట్లు విశదమగుచున్నది. ఇట్లు వాసుదేవుడు అనేక పర్యాయములు వాస్తు వాస్తవికతను  గుర్తెరిగినట్లు తెలియచున్నది. ధర్మరాజుచే రాజసూయయాగము నిరాటంకముగా జరిపించెను. అగ్రపూజనొందిన సమయమున, అధిక్షేపించిన అత్తకొడుకు చేది భూపాలుని సుదర్శనాయుధముతో సంహరించి అగ్రపూజనొంది మహర్షులచే కొనియాడబడెను.

ఒకసారి అవలోకించగా ద్వారకా నగరమున గల అంతఃపుర మున నివాసముండి భక్తవత్సలుడైన వాసుదేవుడు, వాస్తుశాస్త్రమ ప్రాబల్యమును గలిగి, అష్టభార్యలు, అప్లైశ్వర్యములును, మునులచే కొనియాడబడు కీర్తిని ఆర్జించినట్లు విశదమగుచున్నది. కాన సామాన్యుల విమర్శలకులోనుగాక వాస్తుశాస్త్ర పద్ధతులననుసరించి సుఖించసగును.