banner 6 1

59

శ్రీశైల పుణ్య క్షేత్ర వాస్తుకళా ప్రాభవము

శ్రీ శైలపుణ్యక్షేత్రము ఆంధ్ర ప్రదేశములోని పడమటి భాగమున గల కర్నూలు జిల్లాలోని ఎత్తైన నల్లమలకొండలపై శ్రీ భ్ర మ రాంబా సమేత మల్లి కార్జున స్వామి వారు యాదృచ్ఛికముగా వెలసి నారు. స్వామివారు నెలకొనియున్న దేవాలయ వాస్తువిధానము పరికించినచో, ఆహా! ఏమి? ఈ సిరులొలి కించు శ్రీశైలవాసుకళా వైభవము అన్నట్లున్నది. పుణ్యక్షేత్రము పరికించిన తూర్పు, ఉత్తర, ఈశాన్యము వాటము పల్లముగను, వాయవ్య, ఆగ్నేయములు సమానముగను, దక్షిణ, నైరృతి, పశ్చిమ దిశలు ఎత్తు ప్రదేశముస గల దేవాలయమునకు, నాలుగు ప్రక్కల వీధులుకల్గి, నాలుగుప్రక్కల ముఖమండపములు కలిగి, స్వయముగా వెలసిన మల్లికార్జున దేవాలయమునకు పేరు ప్రతిష్ఠల నాప్వాదించు ఇంద్రభాగమున ఇంద్రశూల, పరమైశ్వర్యమొసంగు పరమేశ్వరుని దిశ యాదృచ్ఛికముగా ఉద్భవించి ప్రవహించుచు, పాపములను పరిహరించు పాతాళగంగా పుణ్యతీర్థము, కుబేరదిశకు దిగువ భాగమున యాదృచ్ఛికముగా ఉద్భవించి, ప్రవహించు కుబేర తీర్థము ఇంకను దానికి దిగువభాగమున కర్మ హరేశ్వరుని తీర్థము. అక్కడనుండి తూర్పునకు ప్రవహించు కృష్ణ వేణి అమ్మ వారుగల ఆ పుణ్యక్షేత్రము వాస్తుకళా సంపదకు, నూటికి నూరు పాళ్లు అనుకూలమై ఉన్నది. ఈశాన్యమంతయు నీరు, నైరృతిభాగమున మెట్లు ఆగ్నేయభాగమున వంట, దక్షిణ పడమట భాగములు గవర్న మెంటు వారి కట్టడములు వాస్తువునకు అనుకూలముగానుండి శ్రీశైల పుణ్యక్షేత్రము కలియుగ కైలాసమువలె దిన దిన ప్రవర్ధమానమై వెలుగొందుచున్నది.