శ్రీనివాసుని వైభవము _ తిరుమల వాస్తు కళా ప్రాభవము
శ్రీ వేంకటేశ్వరుని దేవాలయము ఆంధ్రప్రదేశములోని ఎత్తైన నైరృతి ప్రాభవము భాగమున గల తిరుమల తిరుపతి కొండపై నున్నది. శ్రీ స్వామి వారి దేవాలయ వాస్తువు పరికించిన యెడల దక్షిణ నైరృత పశ్చిమ ఎత్తైనకొండలు, తూర్పు, ఉ త్తరములు ఎత్తు తక్కువ కొండలు ఈశాన్యమున తెఱప ప్రదే శము అందు సరోవరము నైరృతి మెట్లు కలిగి వాస్తు ప్రభావ గరిమిగల పవిత్రస్థలమున గల ఆలయ మందు పడమర దిక్కున ఆసీనుడై తూర్పుముఖముగా దర్శనీయమై నెలుగొందుచున్న శ్రీస్వామివారి వైభవమును తిలకించిన ఆహా! ఏమి ఈ దేవాలయ వాస్తుకళాసంపద అనునట్లున్న ది.
భగవంతుడగు శ్రీ వేంకటేశ్వరుని ఆలయమునకు నాలుగు ప్రక్కల వీధులు కలిగి, పరమైశ్వర్యమునిచ్చు పూర్వ సింహద్వారము కలిగి ఈశాన్యభాగమున యాదృచ్ఛికముగా నిరంతరము ఉద్భవించి, ప్రవహించు పుష్కరిణి, ఇంకను ఉత్తర ఈశాన్యమున సిరులొలి కించు “ఆకాశగంగ” అను నిరంతరము ప్రవహించు జలపాతము, ఇంకను దిగువ ఈశాన్యభాగమున వైకుంఠపురముసగల సరస్సును మఱపించు వెకుంఠ తీర్ధము, ఇంకను దిగువ భాగమున నిరంతరము ప్రవహించుచు, పాపములనుండి ఉద్ధరించు పాపనాశనము అనుజల పాతము ప్రవహించి, ఈశాన్య దిక్పాలకుడగు గంగాధరుడై, పరమేశ్వరుని తృప్తిపఱుచుచుండును. ఇంకను దిగువ ఈశాన్యభామున తుంబురతీర్థమను కొలనునుండి ఈశాన్యభాగమంతయు వాస్త శాస్త్రము మహ త్తర శోభతో వెలుగొందుచున్నది.
వాస్తు శాస్త్రమున ఈశాన్యము నీటికి, ధనము నిల్వలకుదగ్గర సంబంధము కాన, శ్రీ వేంకటేశ్వరస్వామి కలియుగ ధనేశ్వరుని వలే వెలుగొందుచున్నాడు.
శ్రీనివాసుని వైభవమునకు తిరుమల యందలి వాస్తు కళాసంపద నూటికి నూరుభాగములు అనుకూలముగనున్నది. తూర్పు విస్తారమైన పల్లము ఉన్నందువలన యావత్ ప్రపంచదేశములందు గొప్పకీర్తి ప్రతిష్ఠలు నార్జించి, సుప్రసిద్ధ దేవాలయముగా ఘనతకెక్కినది. ఆగ్నేయభాగము నిరంతరము అగ్ని ప్రజ్వరిల్లుటచే పవిత్ర పుణ్య క్షేత్రముగా పేరుగాంచినది. దక్షిణభాగమంతయు ఎత్తైన ప్రదేశము లుండుటచే దేశములోని అన్ని దేవాలయములకన్నను ఆధిక్యము కలిగి వెలయుచున్నది. నైరృతిభాగమున ఎత్తైన ప్రదేశము మెట్లు ఉన్నందువలన దేశములోని సర్వదేవాలయముల మీద పె తనము కలిగి ఎదురు లేని దేవాలయముగా పేరుగాంచినది. పడమర దిశ ఎత్తైన కొండ ప్రదేశముండుటవలన దక్షిణ పశ్చిమదిశల కొండ ‘అండ’ అను సిద్ధాంతమును అనుసరించి గవర్న మెంటులో ఆధిక్యము కలిగి, విలసిల్లు చున్నది. వాయవ్యభాగము సమానముగను, పరిశుభ్రముగానున్నందు వలన ఎవలేని కీర్తికలిగి జనాకర్షణ కలిగి దిన దిన ప్రవర్థమానమగు చున్నది. ఉత్తరదిశ అంతయు మిక్కిలి పల్లముగా నున్నందునఅపార న సంపదలు, ఆదాయముకలిగి ప్రపంచ దేవాలయములందు అన్నిటికంటెనుమిక్కిలి ఆదాయము కలిగి, కలియుగ కుబేరునినలె వజ్ర, వైడూర్య, మాణిక్య, ధన, కనకరాశులతో విలసిల్లి గవర్న మెంటు వారికిని పెట్టుబడి పెట్టుచున్నాడు. ఈశాన్యభాగమంతయు నీరుఉంచుట వలన జనాకర్షణ కలిగి, సర్వమానవులకు పూజనీయుడై శ్రీ వేంక టేశ్వరుడు వెలుగొందుచున్నాడు.
అట్టి వాస్తుశాస్త్రానుకూలముగానున్న తిరుమల పుణ్య క్షేత్రము కలియుగ వైకుంఠమువలె నిత్యకల్యాణము పచ్చతోరణమై దిన దిన ప్రవర్ధమానమై విరాజిల్లుచున్నది.

