శబరిమల దేవాలయ వాస్తు ప్రాశస్త్యము
హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి దేవాలయము కేరళ లోని పంపానదీ తీరమున శబరీ పర్వతము పైన భగవంతుని కోరిక పై నిర్మించి నారని తెలియుచున్నది. అన్న దాన ప్రభువుగా వెలుగొందుఅయ్యప్ప స్వామి వాస్తుశాస్త్రమున కెంత ప్రాముఖ్యమిచ్చినాడో ఒక్కసారి ద ర్శించిన విశదమగును.
దక్షిణ భాగమున ఎత్తైన పర్వతమును ఉత్తర భాగమున ఎత్తు తక్కువగా నుండు పర్వతమును, ఆగ్నేయ వాయవ్య భాగములలో సమానమైన ఎత్తుగల పర్వతములును, ఈశాన్య భాగమున విస్తార ముగా ఖాళీవున్న స్థలమును, నైఋతి భాగమున బలమైన మెట్లుఉన్న పర్వతముల మధ్య దేవాలయమునకు అనువైన స్థలముగా నిర్మించి నారు. భగవంతుడైన అయ్యప్పస్వామికి నిర్ణయించిన స్థలము వాస్తు శాస్త్రానుకూలముగా లేకుండా మరేట్లుండును.
వాస్తు శాస్త్రమును పరిశీలించిన యెడల అయ్యప్పస్వామి తూర్పుదిక్కునకు చూచులాగును, దేవాలయ ముఖద్వారము తూర్పు గాను కలిగి చుట్టు ఎత్తున నిర్మించబడిన ప్రాకారములు కలిగి, దక్షిణము, పడమరల రెండంతసుల గదులు కలిగి, తూర్పు ఉత్తరముల యందు వాటమైన పల్లములు కల్గి, ఆగ్నేయ భాగమున నిరంతరము వెలుగొందు కర్పూరదీపము ఆవునె య్యితో వెలుగుచు పవిత్రు డైన అగ్ని దేవుని తృప్తిపఱుచుచుండును. అయ్యప్పస్వామి దేవాల యము మధ్య భాగమున నిర్మించబడిన దేవుని విగ్రహము, అభిషేక జలము నిరంతరము ఈశ్వరుని తృప్తిపఱుచుచుండును. ఉత్తరభాగ మున విశాలమైన వనముతో దేవాలయము ప్రేక్షకులను అలరించు చుండును. కొన్ని వేల సంవత్సరముల వెనుక నిర్మించబడిన దేవాలయము యొక్క వాస్తు ప్రాబల్యము ఇట్లు విరాజిల్లు చున్నది.

