బృహదీశ్వరాలయ వాస్తుగుణ వైభవము
శ్రీరాజరాజ చోళుడు బృహదీశ్వరాలయమును క్రీస్తుశకము 985_1010 సం॥లలో అత్యంత ప్రాచీన వాస్తు శిల్పములతో శాస్త్రాను కూలముగా నిర్మాణ కార్యక్రమము జరిపినట్లు విశదమగురచున్నది. ఆ దేవాలయమునకు పరమైశ్వర్యము నొసంగు పూర్వ సింహద్వారము తూర్పు 90 డిగ్రీలు సమాంతరము కలిగి పవిత్ర మైన ఈశాన్యము నీరు కలిగి, ఉత్తరము కావేరినది ప్రవహించుట, దక్షిణ పశ్చిమదిశ ఏ త్తైన కట్టడములతో వాస్తు కళా సంపద శోభిల్లు చున్న దేవాలయమున విమాన గోపురము నీడ క్రిందపడని విధముగా అత్యంతశోభతో విరాజిల్లుచు భారతీయ శిల్పశాస్త్రమునేగాక ప్రపంచ శిల్ప శాస్త్రములలో కూడ అత్యున్నతమైన పేరు ప్రతిష్ఠలు కలిగి, వాస్తుశాస్త్రమున ఘనత కెక్కిన దినదిన ప్రవర్ధమానమై వెలు గొంది వేయునోళ్ళకొనియాడబడుచున్నది. ఒకసారి ఆలోచించగా అనాదిగా రాజులు వాస్తుశాస్త్రము యొక్క ఆవశ్యకతను గుర్తించినటు విశదమగుచున్నది.

