జగద్ విఖ్యాత జగన్నాథ దేవాలయ వాస్తు సంపద
జగన్నాథ దేవాలయము ఒరిస్సాలోని పట్టణమున గల మధ్య భాగమున ఎత్తయిన ప్రదేశమున నాలుగుప్రక్కల వీధులు కలిగి, నాలుగు ప్రక్కల ద్వారములుకలిగి, ఈశాన్యము వీధిశూలకలిగి, తూర్పున సముద్రముకలిగి, వాస్తుప్రభావ గరిమగల ప్రదేశమున స్వామివారి దేవాలయమున్నందున భగవంతుడగు జగన్నాథుడేరోజు వచ్చి భోజనము చేయుచుండును అనులోకోక్తి కలదు. స్వామివారిని దర్శించవచ్చిన భక్తులకు నిరంతరము నిత్యాన్న వసతి సౌకర్యము విరాటంకముగాసాగి, అత్యున్నత దేవాలయముగా ఘనత కెక్కసాగి, వాస్తుకళాసంపదతో దివ దిన ప్రవర్ధమానమై వెలుగొందుచున్నది.

