కనకదుర్గ వైభవము విజయవాటి దేవాలయ వాస్తుప్రాముఖ్యము
విజయవాడకొండ పై నెలకొనియున్న శ్రీకనకదుర్గాంబను ఒక సారి వీక్షించిన యెడల మహా వైభవోపేతముగా విరాజిల్లుచున్న మహాతల్లి దేవాలయము వాస్తు శాస్త్రమునకు అనుకూలముగా వున్నట్లు గోచరమగుచున్నది. నైరృతి భాగమున ఎత్తయిన మెట్లు, దక్షిణ భాగమునవిశాలమయిన ఎత్తయిన పర్వతము, పడమర భాగమున విస్తారమైన బలమైన పర్వతశిఖరములు, తూర్పు ఉత్తర, ఈశాన్యముల యందు పల్లము, తూర్పున ఊరు పల్లముగానుండి వాస్తుశాస్త్ర ప్రావీణ్యానుకూలముగ ఉన్నది. ఎంత దిగ్విజయముగా విరాజిల్లుచున్నదో ఆలోచింపుదు. దేవాలయమున వాస్తు ప్రతిభ బాగుగా నుండుట వలస వెభవో పేతముగా విరాజిల్లుచున్నదని తెలియుచున్నది.

