శ్రీరంగనాథ దేవాలయ వైభవము
మైసూర్ రాష్ట్రమునకు దక్షిణమున శ్రీరంగనాథ దేవాల యము శ్రీరంగపురమున స్వామివారు పడమట దిశగా దక్షిణము తలగడ పెట్టి, తూర్పును చూచు విధముగా శయనించి, దర్శనభాగ్యము కలిగించుచున్నాడు. అట్టి దేవాలయము వాస్తువునకు అనుకూలమై దక్షిణ, నైరృత పశ్చిమదిశా ప్రదేశములు మెరకగానుండి తూర్పు’ ఈశాన్య, ఉత్తరములు విశాలమైన ఖాళీస్థలము కలిగి, వాస్తు సంపదను కలిగించు ఉత్తర ఈశాన్యము ప్రవహించు కావేరీనది వలద శ్రీవారు వజ్ర వైడూర్య, మాణిక్యములు, సువర్ణ సంపదలుకలిగి, విరాజిల్లుచు, శ్రీస్వామివారు ఇప్పుడు కూడ పూరీజగన్నాథములో విందారగించి, శ్రీరంగములో శయనించును అనులోకో కికలదు. అటి వాస్తుకళావైభవముగల దేవాలయము భారతయాత్రా స్థలములలో ప్రసిద్ధిగాంచి, ఘనత కెక్కినది.
మైసూరు మహారాజభవన వాస్తు గుణసంపద
మైసూర్ రాష్ట్రమును పరిపాలించిన ఆ రాజ ప్రాసాదమును పరిశీలించిన వాస్తుకళావైభవము కొనియాడదగియున్నది. ఆ రాజ ప్రాసాదమునకు నాలుగుప్రక్కల వీధులు కలిగి, తూర్పు, ఉత్తర, ఈశాన్యములందు విస్తారమైన ఖాళీస్థలము కలిగి, దక్షిణ, పశ్చిమ నిరృతములు మెరక ప్రదేశములుగానుండి, ఆస్థలము చచ్ఛౌకంగా నుండి తూర్పు, ఈశాన్య, ఉత్తరములు పల్లమై వాస్తుశోభాయమానముగా నున్నందువలన నేటికి చెక్కు చెదరక, విశేష ప్రఖ్యాత యాత్రాస్థలముగా ప్రసిద్ధిగాంచి, వెయ్యినోళ్ళ కొనియాడుచున్నది.

