వాస్తు వాస్తవికత వేమనయోగి
మడులుదున్ని, మట్టివిసికి, మనుగడసాగించురైతన్న, తాళ్ళ నుండి రతనాలు పండించు రైతు మనదేశ వాసులకు జీవగర్భ. అట్టి సంపన్న రైతుకుటుంబములో జన్మించి కడపమండలమును పవిత్రము చేసినాడు వేమన. వేమన యోగిగా మాఱకమునువు జీవిత మును మధించి మర్మము నెఱిగిన మహాధీశాలి. ఉచ్చనీచములను వీక్షించిన ఉద్దండుడు. జీవన సమరములో కన్ను మిన్ను గానక వ్యవహరించిన సరణి ఫలితము లేకుండపోలేదు. ఇటునీతి వాక్యమును, వాస్తుఫలితాంశమును, తదుపరి యోగసిద్ధి వడసిని ద్రష్ట వేమన.
ప్రస్తుతము తడవి చూడబడుచున్న వాస్తుశాస్త్రము మాలిక విషయాలను అనుభవ పురస్సరముగా విశ్లేషించి తన ఆట వెలది పద్యాలతో ఆటలాడించినాడు. అలతి అలతి మాటలలో గంభీరమైన అర్థములను అందించిన కవీంద్రులు వాస్తుశాస్త్ర విషయాలు ముత్యములవంటి గ్రంథము పద్యములలో పొదిగియున్న విధానము అపూర్వము అనితర సాధ్యము, ఈ పుస్తకమునందనేక సందర్భము లలో వివిధ విషయాల ప్రస్తావనా వశమున ఆపద్యములు మనకు గోచరించగలవు.

