పరిశుద్ధ బైబిలు వాస్తు ప్రాశస్త్యము
ప్రపంచము నందలి సమస్త దేవాలయములలో సతి ప్రశస్త మైనది అతి పురాతనమైనది జెరూషలెం నగరములోని యహోవా దేవాలయము.
సాలోమోను మహారాజు ఇస్రాయేలును ఏలిన నాలుగవ సంవత్సరమందు ‘జీప్’ అను రెండవ మాసమున యహోవా మందిర మును గట్టింపనారభిం చెను, ఆ దేవాలయము ఆదిలో యహోవాదేవుడు తాను ఎన్నుకొన్న మోషే ప్రవక్తకు నెఱుకపఱిచిన ప్రత్యక్ష కుటీరము ప్రణాళిక ననుసరించిన సిద్దాంతానుసారముగా మందిరము అరువదిమూరలు పొడవును, ఇరువది మూరల వెడల్పును ముప్పదిమూరల ఎత్తునుగలదై, క్షేత్రీకృత పిండపరిమాణము ఏకాదశ వర్గీకృతముకలిగి, వాస్తుశాస్త్ర క్రమానుసారమున నున్నది. మఱియు ఆమందిరము గోడచుట్టుగదులు కట్టించెను. ఆమందిరమునకుచిమ్మురాళ్ళు కట్టి, దేవదారు దూలములు అమర్చుట కాన నగును. నడిమి అంతస్తులకు నుండు తలుపులు కుడి పార్శ్వమున ఏర్పాటు గావించిరి.
ఈ ప్రకారమున నాతడు మందిరము గట్టుట ముగించి, దేవ దారువు పలకలతో ఆ మందిరము పై కప్పును గప్పించెను. యహోవా నిబంధన మందసమునుంచుటకై ఆ మందిరములోగర్భాలయము సిద్ధపరచేను. గర్భాలయము లోపలిభాగము ఇరునదిమూరల పొడవును ఇరువది మూరల వెడల్పును, ఇరువదిమూరల ఎత్తును సమచతురస్రము గలదై యున్నది. గర్భాలయమును మేలిమి బంగారముతో పొదిగించెను.
ఆ మందిర నిర్మాణమారంభించి, పదునొకండవ సంవత్సరము బూల్ అను నెనిమిదవ మాసమున ఆ మందిరనిర్మాణము యథావాస్తు శాస్త్రముగా సమాప్తి చేసినట్లు తెలియుచున్నది.
క్రీస్తుప్రభు జన్మస్థల వాస్తు ప్రాశ స్త్యము :-
క్రీస్తుప్రభుని, జన్మస్థలము వాస్తు ప్రాశస్త్యము గమనించిన ముఖ్య వాస్తు విషయములు కొన్ని తెలియుచున్నవి. క్రీస్తుప్రభువు బెత్లహేములోని పశువులశాలయందు జన్మించెను. జీససు జన్మ రహస్యము నెఱింగిన తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను దర్శించినపుడు ఆ శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి, ఒకతొట్టిలో యుండుటను చూచిరి. ఈ స్థలము పశుశాలకావున ఇది వాయవ్య దిశయందుండి పవిత్రమైన యీశాన్యభాగమున తొట్టియున్నట్లు తెలియుచున్నది. అట్టితొట్టి యందు పరుండ పెట్టబడి, తన భక్తులకు నిజదర్శనభాగ్యము కల్గించినట్లు విదితమగుచున్నది.
క్రీస్తుప్రభువు తన ప్రసంగములు వాస్తుశాస్త్రమునకు ప్రాధా వ్యతగల ఎత్తు ప్రదేశమైన కొండమీద కావించినట్లు పవిత్ర బైబులు గ్రంథమువలన విదితమగుచున్నది. అట్టి ఎత్తయినకొండలపై నుండి తూర్పుదిశ చూచుచు ప్రసంగము గావించిరి.
బైబిలునందు పరలోకమున యెరూషలెం అనుపవిత్ర పట్ట ణముకలదనియు ఆపట్టణమున కొకయున్నతప్రాకారమును పండ్రెండుగుమ్మములును కలవనియును తెలిపెను. ఆ పటణమును దానిగుమ్నము లను ప్రాకారములను కొలుచుటకె నాతో మాటలాడువాని యొద దెలిపెను. ఆపట్టణము చచ్ఛౌకమయినది. దాని పొడవు వెడల్పులు పరస్పరసమానములు, పట్టణము స్వచ్ఛమగు స్ఫటికములతో సమానమయిన శుద్ధ సువర్ణ మగుచున్నది. ఆపట్టణము ప్రాకారములు నానావిధరత్నములలో లంకరింపబడినవి. దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో నిర్మింప బడినది. ఆపట్టణపు రాజవీధి శుద్ధసువర్ణ మయమై, స్వచ్ఛమైనప్పటిక మును పోలియున్నదని బైబిలునందు విదితమగుచున్నది.
దీనినిబట్టి యూదులందఱు తమగృహదేవాలయాది నిర్మాణము వాస్తుశాస్త్రానుసారముగానే కావించినట్లు తెలియుచున్నది.
ఈ జగతకి శాంతి సౌఖ్యసంప్రాప్తి కారణ జీవ కారుణ్య పుణ్యసందేశామృత మదించిన యహోవాత్మజుండయిన శ్రీ జీససు వాస్తుశాస్త్రశ్రాద్ధుడై, తద్ విషయములు సందేశ మొసంగినాడు.
1. జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు.
2. వివేచన గలిగిన నరుడు ధన్యుడు.
3. వెండి పంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు.
4. అపరంజి సంపాదించుటకంటె జ్ఞానలాభము పొందుట మేలు.
5. విజమాడు పెదపులు నిత్యము స్థిరమై యుండును.
6. అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును.
7. గుజవతియగు భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యముకంటె ఆమూల్యమైనది.
8. రాయి నువు, ఇసుక భారము, మూడుని కోసము యీ రెంటికంటెన బరువు.

