మక్కామసీదు వాస్తుకళా కౌశలము
మక్కామసీదు ప్రపంచములోని ఆఱుఖండములలో భూగోళ మధ్యముననున్న మక్కా పట్టణమున వాస్తు ప్రభావిత పరమపవిత్ర స్థలమున దైవప్రేరణము కారణముగా దేవలోకమునుండి తీసికొని రాబడిన పావన ప్రతిమమూలముగా నిర్మితమయినది.
ఆపరమపుణ్యక్షేత్రమునందు గల అల్లాహ దర్శనము మానవునకు జన్మరాహిత్య కారణమై, ప్రపంచ ప్రఖ్యాతమగుటకు నందలి వాస్తుకళాసంపదయే ఆది కారణమని నిశ్చప్రచముగా వక్కాణింప వచ్చును.
అట్టి ప్రశ స్తవాస్తుకళా సంపద్ విశాలమైన మక్కామసీదును ఆస్తికుడయిన మానవుడు తనజన్మలో నొక్కసారి సందర్శించినచో, సమస్త పాపక్షయమై, మోక్షసంపద సంప్రాప్తించునుగదా !

