banner 6 1

72

విక్రమార్క సింహాసనము భోజుని భూశోధన

ధారానగరమున భోదరాజు ప్రజలను కన్న బిడ్డలవలె చూచు కొనుచు, కలియుగ దేవేంద్రుడుగా విఖ్యాతి గడించి, రాజ్యము ఏలు చుండెను. ఒకనాడు ప్రజలయొక్క పైరు పంటలకు మృగముల వలన కలుగు చెఱువును తొలగింపదలచి, మంత్రి సామంత దండనాయకు లతో వేటకై పోవుచుండగా, మార్గమధ్యమున ఒకచోట జొన్న చేసు సమీపమున పోవుచున్న సమయమున చేను యజమానుడయిన విప్రుడు ఎత్తయిన ప్రదేశము నుండి పక్షులను తోలుచు, భోజ మహీపాలుని గాంచి, ఓ రాజశేఖరా ! నా చేలో గల వెన్నులు పశ్వములయి తినుటకు తగియున్నవి. కాన ఈ ఎండలో వెళ్ళుచున్న షూరు అందఱును తృప్తిగా విరుచుకొని, తిని, సేదతీర్చుకొనుడని మనస్ఫూర్తిగా ఆహ్వానించెను. ఆ భూసురోత్తముని మాటలు విని, భోజుడు తన పరివారమును కంకులు తినుటకు అనుజ్ఞ ఒసంగెను. అంత సైనికులు పోయి, పరిపక్వముగా గింజలు పట్టియున్న వెన్నులను తినుచుండిరి. వారు అట్లుతినుచుండగా, విప్రుడు మంచెదిగివచ్చెను’ మంచెదిగివచ్చినవిపుడు మనస్సు వ్యాకులత చెంది, ఓనృపశేఖరా! నీవు చూచుచుండియు, నీపరివారము అక్రమప్రవర్తకులై మా జొన్న చేలోగల వెన్నులను విఱుచుకొని తినుచుండగా, వారించకుండుట ఆశ్చర్యముగా ఉన్నది. అని కర్ణకఠోరముగా పలికెను ఆ విప్రుని మాటలకు విస్మయము చెందిన భోజుడు తన పరివారమును చేనిలో నుండి బయటకు రమ్మని ఆజ్ఞాపించి, మాపరివారము చేనికి కలిగించి నష్టమునకు పరిహారముగా కొంతధనము చెల్లిం చెదమని తెలిపెను. అంత వివ్రుడు మరల చేను నడుముగల మంచెపై నెక్కెను మంచెపై ఎక్కిన విప్రుడు చేనిలోగల పరివారము బయటకు వచ్చుట చూచి, శయార్ద్ర గుణము అతిశయింపగా, ఓ అయ్యలారా! ఏల పోయెదరుమీకు కావలసిన వరశు వెన్నులు భక్షింపుడు పరోపకారము చేయని జన్మము ఏమి జన్మము అని భోదమహీపాలుని తమ పరివారమును వెన్నులు తినుటకు ఆజ్ఞాపించవేడుకొనెను. రాజు అతని చర్యలు చూచి బాగుగా పరీక్షింపనెంచి, పరివారమును మరల చేనులోనికి చేరుటకు అనాజ్ఞ ఒసంగెను. యోచనాపరుడైన భోజుడు మంచెపై నున్నపుడు విప్రుడు సంతోషముగా ఉండుటయను మంచె దిగిన వెంటనే మఱి యొక రీతిగా ఉండుటయును గమనించి, సమయస్ఫూర్తి గల మంత్రితో సంప్రదించి మంచె కట్టిన స్థలమున ఏదో మహత్తు కలదని భూసురోత్తముని రావించి, తగిన ధనమిచ్చి, ఆ భూమి కొని, మంచె క్రింద త్రవ్వించగా, జగద్విఖ్యాత రాజేంద్రుడైన విక్రమార్కుని సింహాసనము బయల్పడెను. ఆ సింహాసనమును భోజుడు అధిష్ఠించి, పెక్కు సంవత్సరములు రాజ్యమును పరిపాలించి, మంచి పేరు ప్రఖ్యాతులు గడించి, ప్రపంచ జ్ఞానజ్యోతులైన, కాళిదాస, వరాహమిహిర, ఢక్కాచారి, జక్కా చారిలాంటి ఉద్దండులైన మహాకుభావులచే వాస్తు సర్వస్వము, ఉత్తర కాలామృతము, పంచ వాస్తు సారి కాతకము ఆగమశాస్త్ర, శిల్పశాస్త్రాది ఉద్గ్రంధ రచనలు గాలింపచేసెను. తాను స్వయంగా సరస్వతీకంఠాభరణము వంటి అపార శాస్త్రసంపద గల రచనను చేసి, భవిష్యత్ మానవాళి ప్రగతికై తన సర్వస్వమును ధారబోయుటకు ప్రధాన కారణము తన ధారానగర నిర్మాణ వాస్తు ప్రజ్ఞయని మేధావులు గుర్తించ గలరు.