banner 6 1

73

విజయనగర సామ్రాజ్యము-విఖ్యాత వాస్తు ప్రాభవము

దక్షిణాపథమున అనెగొంది పట్టణ ప్రభవులగు హరిహ బుక్కరాయలు మృగయార్థమై తుంగభద్రా సరికి దక్షిణమున గల కాఱడవిలో సోదరులిరువురు జనుచుండగా తమ వెంటగొని పోయిన ఆ విచిత్ర జాగిలములను ఆ ప్రదేశమున గల కుందేళ్ళు తరిమెను, సంఘటనకు వారెంతయో ఆశ్చర్యపడి, ఇట్టి అస్వాభావిక కార్యములకు హేతువు ఏమని తలపోయుచు ఆ చెంతనే ఉన్న విద్యారణ్య స్వామి చెంతకేగి జరిగిన విషయము తెలిపిరి. అంత విద్యారణ్య స్వామి ఆ ప్రదేశము ఒక వీరక్షేత్రమని అందు ఒక మహానగర నిర్మాణము కావించిన, అది దినదిన ప్రవర్థమానమై వెలుగొంది. పౌరుష ప్రతాపములుకీర్తిప్రతిష్ఠలుకలిగి, శత్రువులకు దుర్భేద్యమగు దుర్గము కాగలదని తెలిపెను. అందులకు హరిహర బుక్కరాయలు “స్వామీ! ప్రతిష్ఠాకరమైన నగర నిర్మాణము కొఱకు చాల కాలము నుండి ఆలోచించుచున్న వారము తమరు దయయుంచి విజయనగర సామ్రాజ్య స్థాపనలో మాకు తోడ్పడవలసినదని ప్రార్థించిరి. అందులకు విద్యారణ్యస్వామి అంగీకరించి, తపము ఒనర్చి, లక్ష్మీదేవివలన సువర్ణవృష్టిని, బడసి కృతార్థుడై, హరిహర బుక్కరాయలను రావించి, శా.శ. 1258 ధాతృనామ సం|| వైశాఖ శుక్ల సప్తమి తిథి పుష్యమి నక్షత్రసింహలగ్నమును ముహూర్తకాలముగా నిర్ణయించి ఘటికా యంత్రములు లేనందున కాశీనుండి వేదపండితుని రావించి ఎత్తయిన ప్రదేశమునుండి గ్రహసమయములను బట్టి ముహూర్తము ఘడియలకు శంఖ మూదవలసినదిగాను ఆ శంఖము ఊదిన శుభలగ్న సమయమున విజయనగర సామ్రాజ్య శంకుస్థాపనా కార్యక్రమము నిర్వర్తించులాగును ఏర్పాటు గావించుకొని, ఆ వేదపండితుని ఎత్తయిన ప్రదేశమునకు పంపి, శుభలగ్న సమయము కొఱకు ఎరురు చూచు చుండిరి.ఆ వేదపండితుడు శంఖము ఊదకముందే ఆపరిసర ప్రాంతమున ఒక భిక్షుకుడు శంఖముఊదెను. ఆ శంఖనాదము విని విజయనగర నిర్మాణమునకు శంకుస్థాపనా కార్యక్రమములు నిర్వర్తించిరి, తదుపరి కొంతసేపటికి కాశీ నుండి విచ్చేసిన వేదపండితుడు లగ్న సమయము ఆసన్నమగుటచే శంఖముఊడెను. అప్పుడు విద్యారణ్యస్వామి రెండవసారి ఊదివ శంఖమే నిజలగ్నమని తలచి వేదపండితునితో ముహూర్తము తప్పినందున వారెంతయో విచారించి, స్థలమెంతటి వీరక్షేత్రమయినప్పటికి శుభముహూర్తముతప్పినదిగాన కాలాంతరమున ప్రాబల్యము తగ్గి ఉండగలదని నిర్ణయించిరి.

విద్యారణ్యస్వామికి విజయనగర సామ్రాజ్య నిర్మాణమపుడు లగ్న సమయము తప్పట కారణముగా శ్రద్ధ తగ్గుట వలన అనేక విధములైన వాస్తు దోషములు కలిగినవి. విజయనగరము పరికించిన, తూర్పు పశ్చిమమున సమానమైనపర్వతములు దక్షిణమున దాతృత్వ మొసంగు ఎత్తయిన దుర్గములు ఉత్తరమున సిరిసంపదలు కలుగు తుంగభద్రానది అమరిఉండెను.

నిర్మాణ కార్యక్రమమునందు అనేక వాస్తు దోషములు ఏర్పడినవి. ఎంతటి బలపరాక్రమోపేతులయినను నిర్వీర్యము చెందు నైరృతి కూపము ఎంతటి పౌరుష ప్రతాపమును కలవారైనను శత్రు రీతిని కలిగించు దక్షిణ నైరృతి ద్వారము కలిగి ఉండుటవలన 225 సం॥లకే విజయనగర సామాజ్యము శత్రువశమయినది. ఈ విజయనగర పరిపాలకులలో శ్రీకృష్ణ దేవరాయలు ముఖ్యుడు. శాశ్రద్ధ లను, కవులను పోషించుటయేకాక తాను స్వయముగా కృతులను రచించి, పేరు ప్రతిష్ఠలు కలిగి రాజ్యము పరిపాలించెను. ఆ దుర్గము వీరక్షేత్రమగుటవలన విజయనగర వాసులు క్షాత్రము, కీర్తి, ప్రతిష్ఠలు దాతృత్వము కలవారై ఆ ప్లైశ్వర్యములు ఆయురారోగ్యములు, భోగభాగ్యములు, పాడిపంటలు, సుఖసం శోషములు గలిగి, నిరాజిల్లి నట్లు విశదమగుచున్నది.