ప్రశాంతి నిలయము ప్రతిభా విశేషము
శ్రీ భగవాన్ సత్యసాయిబాబా అనుగ్రహముచే ప్రశాంతి నిలయము ఆంధ్ర ప్రదేశమునకు ఎత్తైన నైరృతి భాగమునగల అనంత పురం జిల్లాలోని పుట్టవుర్తి గ్రామమున కలియుగస్వర్గమువలె వాస్తు కళాగరిమ గలదై స్వదేశ విదేశములందు వేనోళ్ళ కొనియాడబడుచు వెలుగొందుచున్నది.
ప్రశాంతి నిలయ స్థలమును పరిశీలించిన నాలుగు ప్రక్కల వీధులు కలిగి, ఈశాన్యమున చిత్రానది తూర్పు అంతయు పల్లము కలిగి, దక్షిణ నైరృతదిశాభాగముల ఎత్తైన కొండ కలిగి, పడమర మెరక కలిగి, ఉత్తర మంతయు పల్లము కలిగి, ఆ స్థలమంతయు గొప్ప వాస్తు కళాసంపద కలదై, యున్నది.
అందు కట్టడములు పరిశీలించిన దక్షిణ పశ్చిమ దిశలవీధి అని యున్న ఎత్తైని కట్టడములు, తూర్పు ఉత్తరము విశాలమైన ఖాళీ ప్రదేశము ఆగ్నేయ భాగమున వంట శాలకలిగి, పవిత్ర సలముగా ప్రసిది కెక్కెను. అపారధనసంపదలు కల్గించు ఉత్తరకుటీర వీధిశూల పరమ ఐశ్వర్యమును కలిగించు పరమేశ్వరదిశను వీధిశూల అఖండకీర్తిప్రతిష్ఠలు ఆర్జించు ఇంద్ర వీధిశూలగల స్థలమునకు ప్రాకారములు కలిగి, వాస్తుశోభతో విరాజిల్లుచున్నది. అందు మధ్యభాగమున “శ్రీభగవాన్ సాయిరామ” నివాస మందిరము ఉత్తరపు వీధిశూలకు ఎదురుగా ఉత్తరసింహద్వారము కలిగి, కుబేరుని గృహమువలె అనంతశోభతో విరాజిల్లుచు, అట్టి భవనమున నివాసముండి ఉత్తర దిశగా శ్రీ సాయి రాముడు భక్తులకు దర్శన భాగ్యము ఒసంగు చున్నాడు.
సౌమ్య స్వభావులు నిర్మల హృదయములు నుండెడి దిశ ఉత్త రము, పాపాలను ఉ తరింపజేయు దిశ కావున ఈ దిశను ఉత్తరం అందురు. దిక్పాలకులు ఉభయ సంధ్యలలో ఈ దిశనే సమావేశమై తమ కర్తవ్యము చర్చించుకొందురు. అట్టి పవిత్రమైన ఉత్తరదిశగా ” శ్రీ సత్యసాయి ఉదయము, సాయంకాలము స్వదేశ విదేశముల నుండి విచ్చేసిన భక్తులకు దర్శన భాగ్యము కల్గించి, బోధామృతము అందజేయు చున్నారు.
కలియుగ స్వర్గమువలె వెలుగొందు ప్రశాంతి నిలయము దైవ బలము వలసను, శ్రీ సాయిబాబా తపోబలము వలనను స్వదేశ విదేశముల నుండి అన్ని మతములవారు, అన్ని కులములవారు ఎడతెజసి లేకుండ భక్తులు ప్రశాంతి నిలయములో అడుగు పెట్టగనే హస్తకళ కౌశలము వలన ” బొందితో కైలాసము జేరితిమని ” అనుభూతి పొందుచుండగా ప్రశాంతి నిలయము దినదిన ప్రవర్ధమానమై వెలు గొందుచున్నది.

